Sunday, July 13, 2025

 *మనుష్యునకు జ్ఞానం కలిగిన వెనుక ఈ శరీరం మీద లక్ష్యం ఉండదు. ఎంత చక్కని విస్తరిగానీ, భోజనాంతరం విసరిపారవేసినట్లు ఈ భౌతిక శరీరం జ్ఞానోదయానంతరం ఎప్పుడు పారవేద్దామా అని చూస్తాడు!*

*చిత్తవృత్తులను నేరుగా నిరోధించలేని వారికోసం ప్రాణాయామం ఉద్దేశించబడింది. మోటారుకారుకు బ్రేకు వంటిది ప్రాణాయామం. కాని సాధకుడు ప్రాణాయామంతోనే ఆగిపోరాదు. ప్రత్యాహారం, ధారణ, ధ్యానం కూడా సాధించాలి. ధ్యానం కుదిరినప్పుడు, ప్రాణాయామం లేకపోయినా చిత్తము వశమౌతుంది. ధ్యానసిద్ది వలన కలిగేది మనసుకు శాంతి.*

 *ఓం నమో భగవతే శ్రీ రమణాయ!👏*

No comments:

Post a Comment