*"దైవానికి' కాదు 'కర్మకు' 'భయపడు"*
*"దైవం' క్షమించినా 'కర్మ' అనుభవించి తీరాల్సిందే!!!*
*పాప-పుణ్యాలు నిర్ణయించేది శివ చైతన్య శక్తి... అది ఏ సన్నివేశాన్ని, ఏ కర్మణి మర్చిపోదు... శివ చైతన్య శక్తికి అనంతమైన జ్ఞాపకశక్తి ఉన్నది... కాలం నీ కర్మని వడ్డీతో సహా నీకే తిరిగి ఇచ్చేస్తుంది. చిన్న విత్తనం పెరిగి మహా వృక్షం అవుతుంది. అదే విధంగా మనం చేసిన కర్మలకు ఫలితంగా కాలక్రమంలో విధిని అనుసరించి కర్మఫలం(కర్మ ఫలితం) లభిస్తుంది.*
*ఆ కర్మఫలాన్ని సరైన సమయంలో, తగిన విధంగా అందించే ఏకైక స్వాభావిక శక్తి ఈశ్వరుడు (భగవంతుడు శివ పరమాత్మ) సకల జగత్తుకూ తండ్రి అయిన ఆయనకు ఒకరి మీద ఇష్టం, మరొకరి మీద ద్వేషం ఉండవు.*
*ప్రతి కర్మకు కర్మానుగుణంగా ఫలాన్ని ఇచ్చేదే భగవంతుని శక్తి, దీన్ని మనం ఈశ్వర శక్తి - శివశక్తిగా భావిస్తాం.*
*శాస్త్రాల్లో దీన్ని విధి లేదా కాలం అని పేర్కొన్నారు. ఏది* *ఎప్పుడు జరగాలో దాన్ని నిర్ణయించేది నియతి లేదా విధి... దీన్ని నియమబద్ధంగా నడిపించేది కాలం.*
*┈┉┅━❀꧁హరే కృష్ణ꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🦚📿🦚 🙏🕉️🙏 🦚📿🦚
No comments:
Post a Comment