Sunday, July 13, 2025

 🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

*🚩ఓం శ్రీ జగన్నాథ స్వామినే నమః🚩*

*🌾"జగన్నాథ_రథయాత్ర"🌾*

*🍃‘త్వయి సుప్తే జగన్నాథ! జగత్సుపం భవేదిదం*
*విబుద్ధే త్వయి బుధ్యేత తత్సర్యం స చరాచరమ్‌’*

*🏵️ఓ జగన్నాథ..! జగమును పాలించే విష్ణు భగవానుడా! అంటూ పై శ్లోకముతో శ్రీహరిని స్తుతించి, ప్రతి నిత్యం తమకు వీలైన నైవేద్యంతో పూజించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు*.

*🏵️హిందూ పంచాంగం ప్రకారం "జగన్నాథ రథయాత్ర" ఆషాఢ మాసం శుక్ల పక్షం రెండవ రోజు నుంచి ప్రారంభమవుతుంది*

*🏵️జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణ పరమాత్మ కలియుగంలో శ్రీజగన్నాథునిగా... సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి కొలువు తీరిన క్షేత్రం ఒడిశా రాష్ట్రంలోని పూరి (పురి). ఇది పురుషోత్తమపురంగా పురాణాలలో ప్రస్తావితమయింది.*

*🏵️ఈ క్షేత్రంలో ఏటా ఆషాఢ శుద్ధ విదియ రోజున జరిగే జగన్నాథ రథయాత్ర జగత్ప్రసిద్ధమైనది. అంగరంగ వైభవంగా సాగే ఈ యాత్రను కనులారా దర్శించడాన్ని మించిన మహాభాగ్యం మరొకటి లేదంటారు భక్తజనులు*.

*🏵️పూరి సప్త మోక్ష పురాలలో ఒకటి. సంస్కృత శబ్దమైన ‘పు’ అనే అక్షరానికి ‘శరీరం’ అని అర్థం*.

*🏵️జగన్నాథుడు అంటే జగత్తుకు ప్రభువు. ‘జ’ అంటే జన్మించడం. ‘గ’ అంటే గతించడం. ఈ రెండు లక్షణాలతో నిండిన ప్రాణికోటి నివసించేదే పురం. ఆ పుర ప్రజల పాలన, పోషణ నిర్వహించేవాడు జగన్నాథుడు*.
https://chat.whatsapp.com/DhZBkR4z4pB8E7asGxgjkj
 
*🏵️మన శరీరం కూడా కొయ్య దుంగలతో చేసిన రథం వంటిదే. రథంలో దైవం ఉన్నంత సేపూ రథానికి గౌరవ ప్రతిష్ఠలు ఉంటాయి. పూజా పునస్కారాలూ జరుగుతాయి. అలాగే శరీరంలో ప్రాణ శక్తి (ఆత్మ) రూపంలో భగవంతుడు ఉన్నంతవరకే పలకరింపులు, ప్రశంసలు, నిత్య చైతన్యం*.

*🏵️‘జగన్నాథ రథయాత్ర’ అంటే మన శరీరంలో ఆత్మ రూపంలో భగవంతుడు చైతన్య శక్తిగా ఉన్నాడనీ, అతని వల్లనే మన ‘శరీరం’ అనే ‘రథం’ నడుస్తోందనీ అర్థం చేసుకోవాలి*.
 
*🏵️మూడు రథాలు మూడు తత్త్వాల ప్రతీకలు. జగన్నాథ స్వామి రథయాత్ర సంరంభం అక్షయ తృతీయ (వైశాఖ శుద్ధ తదియ) రోజున లాంఛనంగా మొదలవుతుంది. ఆ రోజు నుంచీ రథాల నిర్మాణం జరుగుతుంది. పూర్తిగా కలపతోనే వాటిని తయారు చేస్తారు*.

*🏵️జగన్నాథుడి రథానికి 16 చక్రాలు, బలభద్రుడి రథానికి 14చక్రాలు, సుభద్ర రథానికి 12 చక్రాలు ఉంటాయి. అన్నిటికీ ముందు నాలుగేసి అశ్వాలు ఉంటాయి*.

*🏵️రథాల నిర్మాణ సమయంలో ముఖ్యమైన భాగాలను అమర్చే ముందు, మంత్రాలతో దేవతలను ఆహ్వానించి, రథంలో నిక్షిప్తం చేస్తారు. జగన్నాథుడి రథం పేరు ‘నంది ఘోష’. దీన్ని ‘గరుడధ్వజ’ అని కూడా అంటారు. సుభద్ర రథం పేరు ‘దేవదళన’. బలభద్రుడి రథం ‘తాళధ్వజ’. జగన్నాథుడి రథంలో సుదర్శనుడు ఉంటాడు*.

*🏵️ఈ విగ్రహ మూర్తులు నారాయణతత్త్వం కలిగినవి. అనంతత్త్వానికి ప్రతీకగా జగన్నాథుడి వర్చస్సు నలుపు వర్ణంలో, శుద్ధ సత్త్వాన్ని ప్రతిబింబించే బలభద్రుని ముఖం తెలుపు వర్ణంలో, ఐశ్వర్య శక్తికి ప్రతీకగా సుభద్ర ముఖం పసుపు ఛాయతో కనువిందు చేస్తాయి. రథాల పైభాగంలోనూ ఆ రంగుల వస్త్రాలకు ప్రాధాన్యం ఉంటుంది*.
 
*🏵️జ్యేష్ఠ పౌర్ణమికి ముందు 42 రోజులు మూలవిరాట్టులకు రెండు విడతలుగా చందనయాత్ర నిర్వహిస్తారు. మొదటి 21 రోజులు ఆలయం నుంచి మందిరం కోనేరు వరకూ వాటిని తీసుకువెళ్ళి, తెప్పోత్సవం జరుపుతారు. దీన్ని ‘బాహర్‌ చందన్‌’ అని పిలుస్తారు*.

*🏵️అనంతరం 21 రోజులు ఆలయ ప్రాంగణంలోనే ఊరేగింపు ఉంటుంది. దీన్ని ‘భిత్తర్‌ చందన్‌’గా పిలుస్తారు.*

*🏵️జ్యేష్ఠ పౌర్ణమి రోజున ముగ్గురు మూర్తులనూ రత్నవేదికగా వ్యవహరించే గర్భాలయంలో వారి స్థానం నుంచి స్నాన వేదికకు చేర్చి, అభిషేకం నిర్వహిస్తారు. తరువాత తిరిగి రత్నవేదికపై ఉంచి, గర్భాలయాన్ని 15 రోజుల పాటు మూసివేస్తారు. ఆ సమయంలో భక్తులకు దర్శనం ఉండదు. వారి కోసం గర్భాలయం ముందు చిత్ర పటాలను ఏర్పాటు చేస్తారు*.

*🏵️ఆషాఢ శుద్ధ పాడ్యమి నాడు పూజాదికాలు నిర్వహించి, విగ్రహాలను సర్వాభరణాలతో అలంకరించి, గర్భాలయం తలుపులు తెరిచి, భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. దీన్ని ‘నవ యవ్వన దర్శనం’గా పేర్కొంటారు*.
 
*🏵️ఆ మరునాడు ప్రపంచ విఖ్యాతమైన రథయాత్ర మహోత్సవం జరుగుతుంది. సాధారణంగా ఏ ఆలయంలోనైనా రథయాత్రకు ఉత్సవమూర్తులను రథాలలో అధిష్ఠింపజేస్తారు. కానీ, పూరీ క్షేత్రంలో మూల విరాట్టులే రథాలను అధిరోహిస్తారు*.

*🏵️ఆషాఢ శుద్ధ విదియ రోజున గర్భాలయంలో అర్చనల అనంతరం దయితపతులు దారు విగ్రహాలను రత్న వేదిక నుంచి కిందికి దింపి, ఊయలలు ఊపుతున్న రీతిలో కదిలిస్తూ రథాలపైకి చేరుస్తారు. ఈ ప్రక్రియను ‘పహుండీ’ అంటారు*.
 
*🏵️రథాలపైకి విగ్రహాలను చేర్చిన తరువాత, జగన్నాథ క్షేత్ర పారంపరిక ధర్మకర్త పూరీ రాజు వచ్చి, తన కిరీటాన్ని నేల మీద ఉంచి, బంగారు చీపురుతో రథాలనూ, రథాలు పయనించే మార్గంలో కొంతమేరా ఊడ్చి, సుగంధ ద్రవ్యాలు కలిపిన ఆలయంలోని అయిదు కోనేర్ల నీటితో కల్లాపి చల్లి, ముగ్గు పెడతాడు. దీన్ని ‘బేరా పహన్‌రా’ అంటారు. ఈ తంతు ముగియగానే రథాలు కదులుతాయి.*

*🏵️రాజవీధిలో ముందు ‘తాళధ్వజ’, తరువాత ‘దేవదళన’, చివరగా "నంది ఘోష" రథాలను భక్తులు వాటికి కట్టిన తాళ్ళతో మెల్లగా లాగుతూ, సాయంత్రానికి గుడించా మందిరానికి చేరుస్తారు. ఈ యాత్రను ‘ఘోషయాత్ర’ అనీ, ‘బడాదండా’ అనీ పేర్కొంటారు*.

*🏵️యాత్ర సమయంలో శంఖనాదాలూ, బాజాభంజత్రీలూ, భక్తుల భజన ఘోషలూ అంబరాన్ని చుంబించేలా ప్రతిధ్వనిస్తాయి. దిక్కులు పిక్కటిల్లుతాయి*.
 
*🏵️రథాలను మందిరానికి ఒక పక్క నిలిపి ఉంచి, విగ్రహాలను భక్తుల దర్శనార్థం దశమి వరకూ గుడించా మందిరంలో ఉంచుతారు. ఇంద్రద్యుమ్నుడి భార్య గుడించా దేవి పేరిట నిర్మించిన మందిరం ఇది*.

*🏵️దశమి నాడు మూల విరాట్టులు ప్రధాన దేవాలయానికి తిరుగు ప్రయాణమవుతారు. దీన్ని ‘బహుదా యాత్ర’ అని పిలుస్తారు. తెలుగు ప్రాంతాలలో ‘మారు రథయాత్ర’గా ఇది ప్రసిద్ధి. ఆ సాయంత్రం రథాలను దేవాలయానికి ఎదురుగా నిలుపుతారు*.
 
*🏵️మరునాడు, తొలి ఏకాదశి రోజున తొలి పూజాదికాలు నిర్వహించాక, మూల విరాట్టులను సుమారు 210 కిలోల బరువైన స్వర్ణాభరణాలతో అలంకరిస్తారు. జగన్నాథుడి కిరీటం 681 తులాలు, బలభద్రుడి కిరీటం 434, సుభద్ర కిరీటం 224 తులాలు బరువు ఉంటాయి. ఈ అలంకార క్రతువును ‘సునావేష’ అంటారు*.

*🏵️సునావేష ఉత్సవ సమయంలో జగన్నాథుడికి ప్రత్యేకంగా పాదాలూ, హస్తాలూ ఏర్పాటు చేస్తారు. తొలి ఏకాదశి నాటి సాయంత్రం మూల విరాట్టులను రత్న వేదికపైకి దయితపతులు తిరిగి చేరుస్తారు. ఆ తరువాత రోజు ఉదయం మూల విరాట్టులకు నివేదనలో పాలు, చక్కెర, మిరియాల పొడి, సుగంధ ద్రవ్యాలు కలిగిన పానీయాన్ని సమర్పిస్తారు. ఈ ప్రసాదాన్ని ‘అధరషాణా భోగ్‌’ అని పిలుస్తారు. దాన్ని భక్తులు స్వీకరిస్తారు. ఈ భోగం పూర్తి కాగానే పదిరోజుల శ్రీ జగన్నాథ రథోత్సవాలు పరిసమాప్తమవుతాయి*.
 
*🏵️జగన్నాథ క్షేత్రంలో ఆది శంకరాచార్యులు నెలకొల్పిన చతురామ్నాయాలలో ఒకటైన ‘గోవర్ధన పీఠం’ ఉంది. స్వామిని దర్శించిన శ్రీ శంకర భగత్పాదులు ‘జగన్నాథ స్వామీ! నయనపథగామీ’ అనే మకుటంతో చెప్పిన జగన్నాథాష్టకాన్ని నేటికీ సుప్రభాత సమయంలో గానం చేస్తూ ఉండడం విశేషం*.
 
*🏵️పూరీలో 12 రోజుల పాటు జరిగే జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథయాత్ర సమయంలో ఆ యాత్రలో పాల్గొనే భక్తులు గానీ, లేదా పూరీకి వెళ్లలేని భక్తులు తమ గృహమందే ప్రతి నిత్యం విష్ణుమూర్తినిపై మంత్రముతో కొలిస్తే ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం*.

*🏵️రథయాత్ర జరిగే 12 రోజులు, లేదా 7, 9 రోజుల పాటు ఒంటి పూట భోజనం చేసి, శుచిగా స్వామివారిని స్తుతిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.*

*🏵️అలాగే రథయాత్ర జరిగే 12 రోజుల్లో మీకు అనుకూలించే 3, 5, 7, 9 రోజుల్లో.. ప్రతినిత్యం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సమీపంలోని నారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించుకుని నేతితో రెండు దీపాలు వెలిగిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి*.

*🏵️ఇంకా నేతితో ప్రతిరోజూ దీపం వెలిగించి చివరి రోజు స్వామివారికి అర్చన చేసి, ఐదుగురికి లేదా తొమ్మిది మందికి పసుపు, కుంకుమ, చక్కెర పొంగలిని దానం చేస్తే ఆర్థిక సమస్యలు, ఈతిబాధలు తొలగిపోయి, సుఖసంతోషాలు చేకూరుతాయి.*
🍃🏵️🍃🏵️🍃🏵️🍃🏵️🍃

No comments:

Post a Comment