*సంగ్రహించబడిన వ్యాసము*
గ్రహములు - అహోరాత్రమునందలి హోరలు
అహెూరాత్రములందు , గంటలను విలోమ క్రమమున లెక్కింపుము . ప్రతిసారి , అంతకుముందలి గ్రహమును , తర్వాతిగ్రహమును విడిచిపెట్టుము . గ్రహముల ననుసరించి , ఈ విధముగా గంటలను విభజించినచో , మనము పూర్వముచేసికొన్న కర్మఫలముయొక్క నిలువనుబట్టి , జరుగు మంచిగాని , చెడుగాని తెలియును . ” - వరాహమిహిరుని బృహజ్జాతకము 1-3 వరాహమిహిరుడు తెలిసిన ఈ యంశమునగల చిక్కును ఇట్లు ముడి విప్పను . i ) ఏడుదినముల కధిపతులయిన గ్రహములను వరుసలో గుర్తించుడు .
1 )ఆదివారము--సూర్యుడు 2 )సోమవారము-చంద్రుడు 3 )మంగళవారము-కుజుడు 4 )బుధవారము- బుధుడు
5 )గురువారము- బృహస్పతి 6 )శుక్రవారము-శుక్రుడు
7 ) శనివారము
ii ) గ్రహముల వరుసను ఈ క్రంది విధముగా అవరోహణ క్రమము
లో పరిగణలోకి
తీసుకోగ
1 ) శని 2 ) శుక్రుడు
3 ) బృహస్పతి
4 ) బుధుడు
5 ) కుజుడు
6 ) చంద్రుడు
7 ) సూర్యుడు
iii ) ఈ వరుసలోన
పర్యాయములుగా
తీసుకోని ముందువెనుక విడిచిపెట్టుము .
మరల గ్రహములను ఈ విధముగా కూర్పు
చేయవలెను.
1 ) శని 2 ) బృహస్పతి
3 ) కుజుడు 4 ) సూర్యుడు 5 ) శుక్రుడు 6 ) బుధుడు
7 ) చంద్రుడు అహెూరాత్రములందు , గ్రహములు గంటలకు ఈ వరుసలో ఆధిపత్యము వహించును . ప్రతిదినమును ఆ వారాధిపతితో గణనము ప్రారంభమగును . ఆదివారమునాడు మొదటి గంటకు అధిపతి సూర్యుడు . అట్లే సోమవారమునాడు మొదటి గంటకు అధిపతి చంద్రుడు . మంగళవారమునాడు కుజుడు , బుధవారమునాడు బుధుడు , గురువారమునాడు గురువు , శుక్రవారమునాడు శుక్రుడు , శనివారమునాడు శని .
ఈ గణనము సూర్యోదయముతో ప్రారంభింపవలెను . నిమిషమునకు సరిగా , సూర్యోదయ సమయమును కచ్చితముగా గుర్తింపవలెను గ్రహముల వరుసనుబట్టి ప్రతిగంటను లెక్కింపవలెను . ఉదాహరణకు ఒకానొక ప్రదేశమున ఒకానొక ఆదివారమున సూర్యుడు
ఉదయము 6 గంటల 10 నిమిషములకు ఉదయించెననుకొనుడు . ఆదినము ఆదివారము కావున మొదటిగంటకు అధిపతి సూర్యుడు . రెండవగంటకు శుక్రుడు .
ఈ వరుస క్రమము ఇట్లుండును .
గంట అధిపతియయిన గ్రహము
గం6-10 ని॥ల నుండి గం ॥ 7-10 ని॥ల వరకు సూర్యుడు
7:10 -8:10 శుక్రుడు 8:10- 9:10 బుధుడు
9:10 -10:10 చంద్రుడు 10:10 -11:10 శని
11:10 -12:10గుర
12:10-1:10 కుజుడు మధ్యాహ్నము 1-10 నుండి మరల ఇదే వరుస వర్తించును . మరల మొదటి గంటకు అధిపతి సూర్యుడే . ఈ విధముగా రాత్రి చివరివరకు ఈ వరుస వర్తించును . మరుసటిదినమున మొదటిగంటకు అధిపతి చంద్రుడు.జీవుని పూర్వకర్మనుబట్టి నిలువయున్న దానిని ప్రతిగంటయు ఉత్ప్రేరణ గావించును. పూర్వకర్మలు మన మనస్సులందు అలవాట్లను , సంస్కారములను ముద్రించును . ఇవి అనుకూలసమయము , వాతావరణము లభించువరకు లోపల వేచియుండును. వ్యక్తిగత స్వభావము నందు మంచి చెడు సంస్కారముల రూపమున పూర్వకర్మ నిలువయుండును. మంచి సంస్కారములు మంచిపనులు చేయుటకు మనలను పురికొల్పును. చెడుసంస్కారములు చెడుపనులే మరల చేయునట్లుగా మనస్సును బద్ధము గావించును . పుణ్యకర్మల ఫలముగా శుభము జరుగును. చెడుపనులు ఫలముగా , పతనము,అశుభము సంభవించును . ఉదాహరణకు ఒకడు ప్రతిదినము నల్లమందు స్వీకరించుటకు అలవాటుపడినచో, ప్రతిదినము అదే గంటకు నల్ల మందు మరల మరల అతడు భక్షించునట్లుగా , అతని మనస్సు బద్ధమగును ఒకడు పెందలకడనే స్నాన మాచరించి చాలసేపు యోగాభ్యాసము చేయుటకు అలవాటుపడినచో, మరుసటిదినమున కూడ , వేకువ కాగానే అతనికి దానినే ఆచరింపవలెనని అనిపించును . దీనినే
" అలవాటు ”
( అభ్యాసము ) అందురు . ప్రాచీనులు దీనినే
" కర్మబంధము ” అని పేర్కొనిరి. ఈ కర్మబంధము మన యందు సహవసించును . తర్కమునకును, మనకు ఎంత తెలిసినను, దానికి అతీతముగా ఇది పనిచేయును.
కర్మ బంధ ప్రభావముననే మానవుడొక పనిని చేయును తనకెంత తెలిసినను
దాని ననుష్ఠింపడు . మనయందు మంచి సంస్కారములును చెడు సంస్కారములును విత్తనములుగా దాగియుండి మొలకెత్తుటకై వేచియుండును. ప్రతిగంటయందు మనలోన దాగిన ఎట్టి సంస్కారములు మొలకెత్తుచున్నవో,
ఆ గంటకధిపతియగు గ్రహము సూచించును .
కొన్ని గ్రహముల ఆధిపత్యమున వర్తించు గంటలు మన పుణ్యకర్మను కొన్ని పాపకర్మను కొన్ని ఉత్ప్రేరితము గావించును . సూర్యుడు , గురుడు , బుధుడు , శుక్రుడు జనులలోని మంచి సంస్కారములను ఉద్బుద్ధము గావించును . చంద్రుడు , కుజుడు , శని మనలో దాగియున్న చెడు సంస్కారముల సద్బుద్ధము గావించును .
దీని ఫలితముగా శుభగ్రహముల ఆధిపత్యమున వర్తించును గంటలందు,జనులు పరస్పర సామరస్యముతో వర్తించుచు ఇతరులయందు మంచిని చూడగలిగిన స్థితిలో సంసిద్ధులై యుందురు . ఇతరుల తప్పుల యెడల సానుభూతితో వర్తించి,తమ స్వభావమునుబట్టి సహాయము సంబంధములు ఏర్పడును
పాపగ్రహాధిపత్యముగల గంటలందు జనులు ఇతరులను గూర్చి చికాకుగా భావించుదురు . ఇతరులలోని లోపములను చీకటి కోణములను చూచుటకు ప్రయత్నించెదరు ఎట్టి హేతు బద్ధత లేకుండనే మూఢముగా ఇతరులలో దోషములను చూచెదరు . అపుడు ఇతరులలో లోపములను, ఎత్తిచూపి ఖండించు దృష్టి తప్ప , సానుభూతి కలుగదు . ఒకడు ఇతరులతో ప్రవర్తించునపుడు,
ఈ రెండురకములైన ఉత్ప్రేరణలు మనస్సులను బంధించును . అంతమాత్రముచేత ఈ ఉత్ప్రేరణలను బట్టియే మానవుడు ఆచరించునని తెలుపలేము .
ఇవి బంధించుట మాత్రమే చేయగలవు . వీనిని అనుసరించి ప్రవర్తించుటయా లేక వీనిని అడ్డుకొనుటయా అనునది వ్యక్తిపై ఆధారపడియుండును . ఒక వ్యక్తి యొక్క దైనందిన జీవితమునకు సంబంధించినంత వరకు , ఆచరణ అనునది వ్యక్తిపై ఆధారపడి యుండునుగాని , గ్రహములపై కాదు . మానవుడు వివేకమును పొందినవాడై , గ్రహములనుండి అనుచితమైన ప్రేరణ కలిగిన గంటలందు ,ఆచరణలోనికి దిగకుండ స్తబ్ధముగ నుండును . సముచిత ప్రేరణ కలిగిన గంటలో మరల ఆచరణ కుపక్రమించును . గ్రహములు పనిచేయుటయు ఉత్ప్రేరణ కలిగించుటయు , పరిశుద్ధతను ఇచ్చుటయు , కర్మఫలము నందించుటయు సరిదిద్దుటయు చేయుచుండును .
ఇట్లు చేయుటలో వాని లక్ష్యము మనము మంచిపనులు మాత్రమే చేయుచు,చెడుపనులు విడిచిపెట్టుటయందు శిక్షణ ఇచ్చుటయు , మనలోని చెడు సంస్కారములను ప్రక్షాళనము గావించుటయును. గ్రహముల నుండి ప్రయోజనము పొందుటయు వాని మార్గదర్శనము నందు ఉండటము ఒక కళ .
ఈ కళను మానవునికి తెలియచేయునది జ్యోతిశ్శాస్త్రము .
ఈ విధముగా ఆయా గ్రహముల ఆధిపత్యమున వర్దిల్లు గంటలను మనము సద్వినియోగపరచుకొనవలెను . జ్యోతిశ్శాస్త్రము అనుసరించి ఏడు ప్రధాన గ్రహములును రెండు వర్గములుగా విభజింప బడుచున్నారు .
1 ) శుభగ్రహములు
2 ) అశుభగ్రహములు . శుభగ్రహములు మనము గతమున ఆచరించిన పుణ్యకర్మలకు సంబంధించిన సంస్కారములను ఉత్ప్రేరితము గావించును . పాపగ్రహములు మన పూర్వ పాపకర్మకు సంబంధించిన సంస్కారములకు ఉత్ప్రేరణ నిచ్చును .
మంచి సంస్కారములు ప్రేరణ పొందినపుడు మనము పరిసరముల నెడల అనుకూలముగా స్పందించి , మనకు ప్రయోజనము కలిగించు పనులను చేయుదుము . ఇతరులలోని మంచిని గుర్తించి , వారిని గూర్చి చక్కని అవగాహన పొందెదము . మన ఆలోచన మన పలుకు , మన చేష్టలు ఆ సమయమున మంచిగా వర్తించును . అందువలన రవి హోర , బుధ హోర , గురుహోర , శుక్రహోర శుభములనియు , చంద్రహోర , కుజ హోర శనిహోర అశుభములనియు తెలుపబడినది . అంతమాత్రము చేత అశుభగ్రహములన్నియు నిజముగానే చెడ్డవి యనితలంచరాదు .. మనలో దాగిన చెడును అవి ఉత్ప్రేరితము గావించును . అట్లగుట వలన చెడు వ్యక్తమై వ్యయమైపోవును . కావున గ్రహములు ఎంత మాత్రము చెడ్డవి కావు . సోమవారమునాడు జన్మించినవారికి చంద్రుడు శుభగ్రహమే .అట్టివారికి చంద్ర హెూర లందు శుభఫలితములే కలుగును . వృద్ధి చంద్రుని దినములందు ( శుక్లపక్షము ) మంచి ఫలితములు కలుగుట యథార్థము . పౌర్ణమి సమీపించున కొలది ప్రయాణమునకు గాని , ప్రదేశము మార్పునకుగాని , నివాసము మార్పునకుగాని చంద్రూహోరను ఎన్నుకొనవచ్చును . ముఖ్యముగా సోమవారము లందును , శుక్రవారము లందును చంద్రహోర శుభప్రదమైనది .
అట్లే మంగళవారమునాడు పుట్టినవారికి ఒక సవాలును పోటీని చేపట్టుటకు కుజహోర మంచిది .
ఈ హెూర మంగళవారములందు ఇంకను దృఢముగా శుభము నిచ్చును . శనివారమునాడు పుట్టినవారికి శని హోర శుభప్రదమైనది అట్టివారికి శనిహోర ప్రత్యేకముగా శనివారము నందు శుభకరమైనది . నిదానముగను , నిశ్చలముగను పనిచేయుచు ఒక ప్రత్యేకలక్ష్యమును ఏకాగ్రతతో సాధించుటకై నిర్వర్తించు కార్యక్రమమును ఈ హెూరయందు చేపట్టుట మంచిది . ఒకేప్రదేశమున నిలిచి చేయుచు వెలుపలకు వెళ్ళవలసిన ఆవశ్యకత లేని పనులకు శని హోర మంచిది. శనివారములందు రవి హోరయు,
మంగళ , శనివారము లందు చంద్రహెూరయు ;
సోమ , శనివారములందు కుజ హోరయు ;
సోమ , మంగళవారము లందు శని హెూరయు పనికిరావు . ఇచ్చట చెప్పబడిన ఆయా దినములందు ఆయా హెూరలలో పనులు చేపట్టినచో అడ్డంకులేర్పడి తీవ్రములగు చిక్కులేర్పడును .
ఏ శుభగ్రహ హోర అయినను ఒకనెలలో 20 వ తేదీనుండి తరువాతి నెలలో 14 వ తేదీవరకు ఉత్తమఫలితము నిచ్చును . ఏనెలయైనను 14 నుండి 20 తేదీల మధ్య శుభ గ్రహ హెూరలు కూడ పూర్తి శుభము నీయజాలవు . సూర్యుడు ఈ రెండు తేదీలనడుమ ఒకరాశినుండి వేరొకరాశిలోనికి సంక్రమణము చెందుచుండుటయే దీనికి కారణము .అదేవిధముగా అశుభగ్రహ హెూరలు కల్గించు అశుభ ఫలితములు ఏ నెలయందైనను(చాంద్ర మానము అనుసరించి తెలుపబడిన తేదిలు) మిగిలిన దినములకన్న 16, 20 తేదీల మధ్య శక్తిమంతములై యుండును . ఎక్కువ ఒక నెలలో 20వ తేదీకిని , తరువాతి నెలలో 15 వ తేదీకిని నడుమ శుభగ్రహ హోరలందు మంచిపని తలపెట్టినచో , వేగముగా పూర్తియగును . అట్లే 15 , 20తేదీల నడుమ పైనచెప్పిన విధముగనే జరుగును .
ఈ రెండు సమయములందు |పని జరిగి ఫలితములు వేగముగా లభించును . మిగిలిన దినములందు నిదానముగా జరుగును . గ్రహ హోరల ననుసరించి మనము పనులను కూర్పుచేసికొనుట ప్రారంభింపవలెను .
ఇట్లు చేయుటకు ముందు , మన దినచర్య ఒక క్రమ పద్ధతిలో నుండక విచ్చలవిడిగా నుండునని గమనింపదగును . గ్రహ హోరలను అనుసరించి మన పనులను అమర్చుకొనుట మొదలు పెట్టినప్పటి నుండి మన జీవితాంశము లన్నియు ఒక క్రమములోనికి వచ్చుట మొదలైనట్లు గుర్తింపవచ్చును .
మనము ఆవశ్యకమైన దిశలో , విషయములను రూపొందించుకొని పరిస్థితులలో నియంత్రణతో కూడివ్యవహరింపగలము . ఈ మార్పుక్రమముగా వాటిల్లును . ఇది అద్భుతమేమియు కాదు . ఈ మార్పు ఒక్కదినమున సంభవింపదు . మొదట మనము కొంత ఓటమి చవిచూడవలసి వచ్చును . దీనికి కారణము మన సంస్కారములను వ్యక్తము చేయుటలో , మనము గతము నందు పొందుచున్న గందరగోళమే . గ్రహ హోరల ననుసరించి మన పనులను తీర్చిదిద్దుటకు శ్రద్ధతో , నిరంతరాయమైన కృషిసాగింపవలెను . అప్పుడు మన మనస్తత్వము పూర్వముకంటె భిన్నమైన ఒక చక్కనికూర్పును పొందును . మనకుగా మనము తయారుచేసికొన్న వక్రములైన అభిప్రాయముల తోడి అంచనాలు తొలగిపోవుటకు ఇప్పుడు వివిధములయిన మన మానసిక వికార పద్ధతులతోను ఇతరుల యభిప్రాయములతోను సంబంధములేని గ్రహ ప్రభావ తరంగములకు మన మనస్సులు స్పందించును . అభిప్రాయములు ఊహలు మనము కల్పించుకొన్నవే కాని గ్రహములచే కల్పింపబడినవికావు . కావున వీని ఫలితముగా మనము అపజయము లందుకొనుట తప్పదు . గ్రహములు మన సంస్కారములను వర్గీకరించును . మన అభిప్రాయముల వలన కలిగిన అన్యములను తొలగించి , మన సంస్కారములను పరిశుద్ధము గావించును . అంతయేకాక , గ్రహములు తమ ప్రణాళిక ననుసరించి , మనసంస్కారములను చక్కగా , క్రొత్తదయిన కూర్పు చెందించును . మన అభిప్రాయముల విలువ వ్యక్తిగతమైనది . గ్రహముల విలువ విశ్వజనీయము అయినది . వ్యక్తిగతములయిన విలువలు ఈ భూమియొక్కయు ,ఇతర గ్రహములయొక్కయు ప్రణాళికను ఎదిరించినచో అవి ఓడిపోక తప్పదు అపజయములే మన అనుభవమునకు వచ్చును గ్రహ హోరల ననుసరించుటవలన , తోటి జీవులను గూర్చిన మన అభిప్రాయముల రహితములగుటతో ,
మన వ్యక్తిగతములయిన విలువలు గ్రహముల విలువల నెదుర్కొనుట ఆగిపోవును . అభిప్రాయములు మానవ శరీర నిర్మాణమునందు సామ్యమును చెడగొట్టి , అస్వస్థతను కల్గించును , మనది అయిన పద్ధతిలో మనము అవగాహన గావించుకొను లక్షణమువలన ,
మన దేహమునందు అనావశ్యకములగు రసములుత్పత్తి యగును . గ్రహ హోరల అనుసరించుట వలన ఇట్టివాని ఉత్పత్తి నిరోధింపబడును . దానితో మన ఆరోగ్యము మెరుగు పడును . మానవ జీవితము వివిధ కార్యరంగ పరిధుల కూడలి . కుటుంబము సమాజము ,తాను పనిచేయు కార్యాలయము మానవుని జీవన కార్య రంగముల పరిధులు . పౌర విధులు , బాధ్యతలు కూడ ఇట్టివే . గ్రహాధిపత్యమున వర్తించు హెూరలను అనుసరించుటవలన ఈ వివిధ కార్య రంగముల కూడలి బంధవిముక్త మగును ఇందలి చిక్కు ముడులు విడిపోవును. వీనిలో ప్రతి కార్య రంగ పరిధియు ,నూతనము అయిన చక్కని కూర్పును పొందుటయే కాక , ఇతర కార్య రంగ పరిధులతోను సరి అయిన సంబంధమున అమరిక నందును మన కార్యకలాపములు అన్నియును సక్రమమయిన కూర్పునందితీరును . అంతట ప్రతి అంశము గూడ ఎట్టి వక్రములయిన అభిప్రాయములతో అంచనాలు లేకుండ , ఒక పథకము ప్రకారము గణింపబడును . మన దినచర్య , సంవత్సరము మొత్తమున నిర్వహించు కార్యక్రమములు , చివరకు ఆయుష్షు ఉన్నంత కాలము బ్రతుకు అంత శ్రుతి లయ బద్ధమగు గానముగను , భావ పుష్టిగల కావ్యముగను మలచబడును .
ఇక పుణ్య పాప కర్మ ఫలములు అయిన శుభాశుభముల ప్రసక్తియెక్కడ ? పర్యవసానముగా ఆనందము సిద్ధించును .
ఇక అనుభవమునకు వచ్చునదేది ? బ్రతుకు ధన్యమగుటయే .
ఏడు దినములందు గ్రహములను బట్టి కార్యక్రమ విభజనము :
వారములోని ఏడుదినములకును అధిపతులైన ఏడుగ్రహముల స్వభావము ననుసరించి , మనము చేపట్టు కార్యక్రమములను విభజించి వర్గీకరణము చేయవచ్చును దినాధిపతులైన గ్రహములు ఇట్లు తెలుపబడుచున్నవి
దినము గ్రహము ఆదివారము సూర్యుడు సోమవారము చంద్రుడు మంగళవారము కుజుడు బుధవారమ బుధుడు గురువారము గురుడు శుక్రవారము శుక్రుడు
శనివారము శని
ఈ క్రమము విశ్వజనీయము అయినది . వేలకొలది సంవత్సరములుగా ప్రతి జాతి యందును , ప్రతిదేశము నందును ఇది పాటింపబడుచున్నది .
ఈ పద్ధతిని ఎవరియినను సూచింపవచ్చును . కాలక్రమమున ఇంతకంటే తెలివైన పద్ధతి ఎవరైనను సూచింపవచ్చును . కాని ఈ పద్ధతి కాలాతీతమైన నిత్య సత్యమని , నిరూపణకు నిలబడినది .
పైన చెప్పబడిన దినములపై ఆయా గ్రహముల ప్రభావముండునని నిస్సంశయముగా చెప్పవలెను . దీనికి అపవాదము ఎవరనగా సంశయాత్ములు మాత్రమే . ప్రాచీన భారతీయ పవిత్రగ్రంథములందు , మనము చేపట్టు భిన్న భిన్న క్రియా కలాపములకు , వారములోని దినములకు ఆనుగుణ్యము వర్ణింపబడినది . వారమునందు కొన్నిదినములు శుభములనియు , కొన్ని దినముల అశుభములు అనియు భావించుట అశాస్త్రీయము .
బుధ , గురు , శుక్రవారములు శుభగ్రహాధిపత్యము కలిగియుండుటచే మంచివనియు ,
మిగిలిన దినములు పాపగ్రహాధిపత్యము కలిగియుండుటచే , చెడ్డవనియు నమ్ముట కొందరికిష్టము .
కాని యిది వాస్తవము కాదు . ప్రతిదినమును దానికి అనుగుణము అయిన పనిని చేపట్టుటకు అనుకూలమే . పనియొక్క స్వభావమునుబట్టి దానికి వలయు సామగ్రినిబట్టి , మనము ఆయా పనులను నిర్వర్తించుటకు ఆయా దినములను కేటాయింపవలెను . జ్యోతిశ్శాస్త్ర గ్రంథకర్తలలో ప్రాచీనుడగు వశిష్ఠుడు ఈ విధముగా వర్గీకరణ విధానమును ప్రసాదించెను . 1. ఆదివారమునందు చేపట్టదగిన కార్యక్రమములు : వైభవోపేతములగు సమావేశములు ; పండుగలు ; గొప్పకార్యములను నిర్వహించుటకు పెద్దలను ఒప్పించుట ; శుభములైన సమావేశములు ; సేవాదృక్పథముతో కార్యము నారంభించుట ; యుద్ధ ఆరంభము , వైద్యసహాయము మొదలు పెట్టుట,వైద్యాలయములను ఆరంభించుట,చేతిపనులు, లోహములతో పనులు నగల తయారీ,ప్లాస్టిక్ లు చెప్పులు, జిగురు, ధాన్యము కార్మికులు వీనికి సంబంధించిన పనులు దేనికైనను పాకలను ఏర్పరచుట .
2. సోమవారమునకు అనుకూలమైన పనులు : నీటికి సంబంధించిన పనులు ముత్యములు , గాజు , చెఱకు ,వెండి సామగ్రి పాల సరఫరా,మూలికలు,తోట పెంపకము,వ్యవసాయము, నాట్యము , సంగీతము , గృహనిర్మాణ పథకములు, స్త్రీల ద్వారమున జరుగు పనులు, వారు చేయుపనులు,గవ్వలు , శంఖములు .
3. మంగళవారమునకు అనుకూలమైన పనులు : ప్రేలుడు సామగ్రి,అగ్నికి సంబంధించిన పనులు, విషపదార్థములు, ఆయుధములు,పదునైన పనిముట్లు , యుద్ధ పరికరములు,భయపెట్టుట, ఇద్దరు వ్యక్తులమధ్యగాని , పక్షముల మధ్యగాని భేదములను సృష్టించుట, బందిపోటు, దొంగతనము, మోసము చేయుట, మనుష్యులను అపహరించుట, చంపుట, సొరంగములు త్రవ్వుట, విస్ఫోటనము,కోయుట, లోహ సామగ్రి తయారుచేయుట, పోటీపరిశ్రమలు, క్షుద్రతంత్ర ప్రయోగము.
4. బుధవారమునకు అనుకూలమైన పనులు :
నైపుణ్య మావశ్యకమైన పనులు ,సమాచారము, రవాణా,చేతికఱ్ఱలు, ఒప్పందములు చేయుట కళాప్రాంగణములు, వ్యాయామ కేంద్రములు, సర్కస్, క్రయవిక్రయములు, సరకులు కొనుట, వైద్యసేవ , లేఖలు,మిశ్రమలోహములు, నగలు,కత్తులు మొదలగువానితో వాణిజ్యము, గణితశాస్త్రము గణాంకశాస్త్రముల అధ్యయనము .
5. గురువారమున కనుకూలమైన పనులు :
క్రతువులు , అర్చనము , దైవబంధమయిన విధులను నిర్వహించుట,కొందరు సమావేశమగునట్టి వివాహము మున్నగు శుభకలాపములు పోషకాహారములను తయారుచేసి స్వీకరించుట, అక్షరాభ్యాసము, బంగారు నగలు,విలువైన వస్త్రముల వాణిజ్యము,
తోటల పెంపకము ; రోగచికిత్సను ప్రారంభించుట శాస్త్రపరిశోధనలు, పోటీ పడిచేయు ప్రయత్నములు, సంగీతము,నాట్యము, స్థిరచరాస్తుల,ఆర్జనము .
6. శుక్రవారమునకు అనుకూలము అయిన పనులు:
స్త్రీలు చేయుపనులు, స్త్రీల ద్వార జరుగుపనులు , సంగీతము,ముత్యములు , వజ్రములు , పండ్లు , వెండిసామగ్రి,సుగంధ ద్రవ్యములు,గృహసామగ్రి, శయ్యా,నగలు,విలాస వస్త్రములు ధరించుటకు సిద్ధముగా చేయబడిన దుస్తులు - వీనితో వ్యవహరించుట,తోటలు పెంపకము,వ్యవసాయము, వీనికి సంబంధించినపనులు, అందముగా చేయుటకై అంచులు కత్తిరించ బడినట్టి తీగలు , పూలమొక్కల వ్యాపారము ; పూలపరిశ్రమ శుభములైన సమావేశములు
7. శనివారమున కనుకూలమయిన పనులు :
ఇంటి సామానులకొరకై దేనినైనను స్వీకరించుట, తాళ్ళపని,కట్టుబడి, ఇటుకలు,సీసము, మొదలైన లోహములు,తపస్సులను చేపట్టుట,స్థిరాస్తులు , గృహనిర్మాణ ప్రారంభములు చిరకాలము నిలుచు సంస్థలు నెలకొల్పుట,గాడిదలు , ఒంటెలు , పశువులు చేయుపనులు లేదా వానికి సంబంధించిన పనులు, విలువను నిర్ణయించుట, తూనికలు,కొలతలు, అక్కౌంట్ చేయుట ,
ఆడిట్ చేయుట,
కష్టముతో, శ్రమతో కూడిన కూలీపని,చెడునుగాని , ఆవాస్తవమును గాని , నేరస్థుని గాని,
తాము వానిచేతిలో చిక్కుకొనక అతిక్రమించుట, లేదా వానిని ఎదుర్కొనుట . ఆదివారము , మంగళవారము , గురువారము , శుక్రవారములందు నూనె పూసికొని స్నానము ఆచరించుట నిషేధింపబడినది .
మిగిలిన దినములందు ఇట్టి స్నానమాచరించినచో మంచిది . సోమవారమునాడు ఇట్టి స్నానము చేసిన ఆరోగ్యము మెరుగగును . బుధవారము నాడు ఆచరించిన అదృష్టము అభివృద్ధి అగును శనివారము నాడు ఆచరించిన యెడల ఆరోగ్యము , సంపద వర్ధిల్లును .
No comments:
Post a Comment