ఆత్మీయ బంధుమిత్రులకు ఆదివారపు శుభోదయ శుభాకాంక్షలు🌹🌅🌼
ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుని అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందం గా జీవించాలని కోరుకుంటూ.. *ఈ రోజు పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నా ఆత్మీయులకు శుభాభినందనలు 🍭🍭🪷👑🍇🍇🍫🍫🥭🥭*
. ఏ పని చేస్తే మీకు సంతోషం కలిగి మరొకరికి ఎటువంటి హాని కలగదో ఆ పని చేయటానికి ఆలోచించనవసరం లేదు.. ఇంకొకరిని సంప్రదించాల్సిన పని లేదు.
. మన మంచి కోసం ఆలోచించే వారుంటే ఆది మన అదృష్టం గా భావించాలి..మనల్ని చూసి ఏడ్చే వారుంటే వారిలో లేని గొప్పతనం మనలో ఎదో ఉందని సంతోషించాలి.
. చిన్నప్పుడు చిన్న బాధ కలిగిన గుక్కపెట్టి ఏడ్చేవాళ్ళం..పెద్దయ్యాక తట్టుకోలేని బాధ నైనా పంటికింద బిగబట్టి నవ్వుతూ నటిస్తూ బతికేస్తున్నాం.. ఇదేనేమో మెచ్యూరిటీ అంటే..🥰
అమ్మ లోని *అ* నాన్న లోని *నా* మామయ్య లోని *య్య..* లతో *అన్నయ్య ..* ఆత్మీయత లేని పెదాలమీద నుంచి వచ్చే *బ్రో* అని కాకుండా.. హృదయాంతరాలలో నుంచి వచ్చే *అన్నయ్య* అనే పిలుపే ఎంతో ఆప్యాయత ఉంటుంది తెలుగు కమ్మదనం తో *అన్నయ్య అని* పిలుద్దాం
ఏ *సంభందమో* అర్థం కాని *పెదవుల* మీద నుంచి వచ్చే పిలుపులు మానేద్దాం అంటి అంకుల్ అని పిలుపు *అంటి* అంటే నువ్వు నాకు *యాంటీ* అని *అంకుల్* అంటే *నువ్వు* నాకు *పెంకుల్* అని కాకుండా *అత్తయ్య* , పెద్దమ్మ చిన్నమ్మ మామయ్య, చిన్నాన్న పెదనాన్న అని హృదయంతరాలలోంచి వచ్చే పిలుపుతో పిలుద్దాం.. ఆత్మీయతలను బంధాలను అనుబంధాలను గౌరవిద్దాం
మమ్మీ డాడీ అని ముద్దు గా పిలిపంచుకొని మురిసిపోయే తల్లి తండ్రులారా పిల్లలకి అమ్మ అనే పిలుపు లోని ఆప్యాయత, నాన్నా అనే పిలుపు లోని మాధుర్యం,నా స్వంతం అనే భావనలు దూరం చేయకండి... అమ్మని *మమ్మి* లా *నాన్నా* ను *డ్యూడ్* గా మార్చకండి, *ఆప్యాయత* లను దూరం చేయకండి
🙏🕉️🙏
No comments:
Post a Comment