*బంధాలు*
సాలెగూడు వంటిదేనోయ్ బంధము
ఇరుక్కొపోయావా బయటకు రాలేవు
ఇడుములు కన్నీళ్ల
తప్పవు తప్పవు
మమకార పాశాలు ఎండమావులేనోయ్
ఎంత వెంపర్లాడినా దక్కినట్టనపిస్తాయి
మనోవ్యధ అశాంతి
తప్పదు తప్పదు
ఆశించడము మూతేసిన ఖాళీపాత్రేనోయ్
ఆశ కలిగించేసి
మోసం చేస్తుంది
నైరాశ్యము విచారము
తప్పదు తప్పదు
బంధాలకు కాస్త ఎడంగా ఉంటే..
తాపత్రయాలు తగ్గించుకొంటే..
ఆశించడం మానుకొంటే..
నొప్పి ఉండదు హృదికి
ఆరని గాయమౌతూ...!!
No comments:
Post a Comment