శనగపిండి లేకుండా కరకరలాడే "జంతికలు" - ఇలా చేస్తే గుల్లగా, క్రిస్పీగా - నూనె పీల్చవు! - SNACK RECIPE JANTHIKALU
- మినప్పప్పుతో ఇలా మురుకులు చేసుకోండి - భలే టేస్టీగా ఉంటాయి
Snack Recipe Janthikalu: "జంతికలు" చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వీటిని మురుకులు అని కూడా పిలుస్తుంటారు. పండగలప్పుడు, శుభకార్యాలప్పుడు చాలా మంది ప్రిపేర్ చేస్తుంటారు. అంతేకాకుండా పిల్లలకు స్నాక్స్‌గా పెట్టడానికి కూడా ఇంట్లో అమ్మలు అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తుంటారు. అయితే వీటిని చేయడానికి మెజార్టీ పీపుల్ శనగపిండి ఉపయోగిస్తారు. ఇది అందరికీ సరిపడదు. గ్యాస్ట్రబుల్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి శనగపిండి లేకుండా కూడా మురుకులు చేసుకోవచ్చు. పైగా ఇవి క్రిస్పీగా, గుల్లగా వస్తాయి. ఇక ఈ టిప్స్ పాటిస్తూ చేస్తే నూనె కూడా ఎక్కువ పీల్చుకోవు. మరి కరకరలాడే కమ్మని మురుకులు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
మినప్పప్పు - 1 కప్పు
బియ్యప్పిండి - 3 కప్పులు
వాము - 1 టేబుల్‌స్పూన్
నువ్వులు - అర టీస్పూన్
ఉప్పు - సరిపడా
బటర్ - 3 టేబుల్‌స్పూన్లు
పచ్చిమిర్చి - 6
జీలకర్ర - 1 టీస్పూన్
తయారీ విధానం:
ప్రెషర్ కుక్కర్లోకి మినప్పప్పు తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి 2 కప్పుల నీరు పోసి మూత పెట్టి విజిల్ ఉంచాలి.
స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్ పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఆవిరి పోయే లోపు ఓ పెద్ద వెడల్పాటి ప్లేట్లోకి బియ్యప్పిండి, వాము, నువ్వులు, ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత బటర్ వేసి అది మొత్తం పిండికి పట్టేలా మిక్స్ చేసుకోవాలి.
ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి. మిక్సీజార్‌లోకి పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర వేసి ఓ సారి గ్రైండ్ చేసుకోవాలి.
అనంతరం అందులోకి ఉడికించిన మినప్పప్పు వేసి వీలైనంత మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మినప్పప్పు మిశ్రమాన్ని బియ్యప్పిండిలో వేసి కలుపుకోవాలి.
పిండిని బాగా కలుపుకోవాలి. ఒకవేళ నీళ్లు ఏమైనా అవసరమైతే లైట్‌గా చిలకరించుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి.
పిండిని కలుపుకున్న తర్వాత తడి క్లాత్ కప్పి కొద్దిసేపు పక్కన పెట్టాలి.
ఈలోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్‌ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె కాగేలోపు జంతికల గొట్టం తీసుకుని లోపల మీకు నచ్చిన షేప్‌లో బిళ్లను సెట్ చేసుకుని లైట్‌గా ఆయిల్ అప్లై చేయాలి.
ఇప్పుడు అందులోకి కొంచెం బియ్యప్పిండిని ఉంచి క్లోజ్ చేసుకోవాలి. తడి కాటన్ క్లాత్ మీద జంతికల గొట్టంతో పిండిని ఒత్తుకోవాలి.
ఇలా ప్రిపేర్ చేసుకున్న జంతికలను నిధానంగా కాగుతున్న నూనెలో వేసుకోవాలి. కడాయికి సరిపడా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి రెండువైపులా ఫ్రై చేసుకోవాలి.
జంతికలు వేగి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఓ ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని జంతికలుగా ఒత్తుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.
ఇవి కాస్త చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేస్తే సరి. కరకరలాడే జంతికలు రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి
మినప్పప్పు ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో బియ్యప్పిండి తీసుకోవాలి.
బియ్యప్పిండిలో వెన్న కలిపిన తర్వాత కొంచెం పిండి తీసుకుని ముద్దలాగా చేసినప్పుడు విరగకుండా పర్ఫెక్ట్గా వస్తే బటర్ సరిపోయినట్లు. అలా కాకుండా ఉంటే మరికొంచెం బటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి.
మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టి వేయిస్తే నూనె పీల్చడం, హై ఫ్లేమ్‌లో అయితే రంగు మారతాయి, కానీ లోపల పిండి ఉడకదు.
పిల్లలకు బలాన్నిచ్చే "రాగి చిమ్మిలి లడ్డూలు" - పావుగంటలో రెడీ - టేస్ట్ సూపర్!
బియ్యప్పిండితో క్రిస్పీ "వడలు" - నూనె పీల్చవు, పప్పు రుబ్బేపని లేదు! - అప్పటికప్పుడు చేసుకోవచ్చు!
No comments:
Post a Comment