మనస్సు స్వరూపమును
తెలిసికొను మార్గం ఏది ?
ఈ శరీరంలో "నేను" అని తోచేదే మనస్సు.
నేను అనే తలపు దేహంలో ఎక్కడ మున్ముందుగా స్ఫురిస్తుందని విచారిస్తే హృదయంలో అని తెలుస్తుంది.
అదే మనస్సు పుట్టుచోటు. "నేను నేను" అంటూ స్మరణ చేసినా అక్కడికే చేర్చుతుంది.
మనస్సుకు తోచే తలపులన్నింటిలో 'నేను' అనే తలపే మొదటిది. ఇది లేచిన తరువాతే ఇతరమైన తలపులు పుడుతుంటాయి.
అంటే మనం నిద్ర నుండి లేచాం అంటే
మనసు మేలుకొంటేనే నిద్ర నుండి లేస్తాం
మనసు మేలుకున్న తర్వాతే ఇంద్రియాలు కూడా మేలుకుంటాయి వెంటనే
మనం నిద్రలోకి జారుతున్నాము అంటే మనసు అంతర్ముఖం అవుతుంది అని గుర్తు
దానితోపాటు ఇంద్రియాలు కూడా సర్దుమనుకుతాయి
.
మనసు మూడు పాత్రలు పోషిస్తుంది
.
మానవుడికి మూడు శరీరాలు ఉన్నాయని
స్థూల శరీరం (భౌతిక శరీరం),
సూక్ష్మ శరీరంమరియు
కారణ శరీరం (చివరి శరీరం).
స్థూల శరీరం (భౌతిక శరీరం):
ఇది మనందరికీ తెలిసిన భౌతిక శరీరం, ఐదు మూలకాలతో తయారైంది: భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశం.
సూక్ష్మ శరీరం :
ఇది మన భావోద్వేగాలు, ఆలోచనలు మరియు ఇంద్రియాలకు సంబంధించినది. ఇది మన భౌతిక శరీరం కంటే సూక్ష్మమైనది మరియు
మనస్సు, పంచ ఇంద్రియాలు మరియు
పంచ ప్రాణశక్తితో కూడి ఉంటుంది.
కారణ శరీరం:
ఇది మన స్వభావం, మన కర్మలు మరియు మన అంతర్గత వ్యక్తిత్వం యొక్క మూలం. ఇది మన ఉనికి యొక్క మూలం మరియు ఎప్పటికీ మారదు.
ఈ మూడు శరీరాలు కలిసి మన మొత్తం అనుభవాన్ని ఏర్పరుస్తాయి. ఆధ్యాత్మిక అభ్యాసం ద్వారా, ఈ మూడు శరీరాలను అర్థం చేసుకోవడం మరియు సమతుల్యం చేసుకోవడం ద్వారా, మనం జ్ఞానోదయం మరియు ఆనందాన్ని పొందవచ్చు.
.
No comments:
Post a Comment