*_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_♻️ ధ్యానము - విచారణ ♻️_*
*_✨ రెండూ ఒక్కటే !! ✨_*
*_🦚 భగవాన్ మరొక ముఖ్య విషయం కూడా సాధకులకు తెలియచెప్పారు. అదేమనగా ధ్యానము మరియు విచారణ రెండూ ఒక్కటేనని, వాటి మధ్య తారతమ్యములు లేవని, విచారణ చేసేవారు నేనెవరిని అని ప్రశ్నించుకుంటూ వుంటే చివరికి ఆత్మ అంటే తెలుస్తుంది. నేను అంటే శరీరము కాదని లోనున్న ఆత్మయే నేనని తెలుస్తుంది. ఈ విచారణ చేయలేని వారు ధ్యానము చేసుకోమన్నారు. ధ్యానము చేసేవారు తనను తాను మరచి అనగా నేను చేస్తున్నాను అని కూడా మరచి,"నేను బ్రహ్మాన్ని లేక నేను ఈశ్వరుడను"అని తలుస్తూ సాధకుడు ధ్యానించాలి. ఈ పద్ధతిని విడవకుండా చేస్తూ పోతే చివరికి బ్రహ్మము లేక ఈశ్వరుడు అనే ఎరుక కలుగుతుంది. అదే ఆత్మ. కావున ధ్యానము చూపుతాయి._*
*_ఆత్మ అంటే ఏమిటో తెలుపుతాయి. భగవాన్ చెప్పినది ఒక భావమును పట్టుకొని ఉంటే ఆ భావం ఇతర ఆలోచనలను_*
*_రానీయకుండా మనసుని ఎటు పోనీయకుండా ఉండటానికి ధ్యానం చేసే శక్తి కలుగుతుందని ఆ భావాన్ని విడవకుండా ఉండటమే ధ్యానమని దానివల్ల ఆలోచనలన్నీ పోయి ఒక్క ఆత్మే మిగులుతుంది. ఆత్మలో లీనమై చివరకు తాను ధ్యానము చేస్తున్నాననే భావము కూడా లేకుండా ఉండాలని భగవాన్ చెప్పేవారు._*
*_ధ్యానం అంటే ఆత్మ నిష్టే అని మన మనసులోని భావాలన్నీ తొలగించటానికి చేసే ప్రయత్నాన్ని ధ్యానము అందరు. ఆ ఆలోచనలన్నీ పోగా స్థిర మనసు ఏర్పడును. అటువంటి మనసే ఆత్మ అనగా మిగిలినదే ఆత్మ. కొందరు భక్తులు ధ్యానము చేస్తున్నప్పుడు నిద్ర వస్తున్నదని ఆ నిద్రను ఆపుటకు ప్రయత్నిస్తున్నామని భగవాన్ కు చెప్పేవారు. దానికి భగవాన్ నిద్రను ఆపటానికి ప్రయత్నిస్తున్నావు అంటే ధ్యానములో కూడా ఆలోచన కొనసాగుతున్నదని భగవాన్ హెచ్చరించేవారు._*
*_భగవంతుడు ఆత్మ రూపేనా నేనున్నానని ఎరుక ఉన్నంతవరకు భగవత్ సాక్షాత్కారము కలిగినట్లే. ఆ ఎరుక లేని వారు మాత్రమే భగవంతుని అన్నిచోట్ల వెతుకుట ఆరంభిస్తారు. కొందరు కనుబొమ్మల మధ్య భగవంతుడు ఉన్నాడనే భావనతో ధ్యానము చేసేవారు ఉన్నారు. అవన్నీ కూడా ఏకాగ్రతను మాత్రమే పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది. భగవాన్ భగవంతుని నామము మరియు ఆత్మ ఒక్కటేనని చెప్పేవారు. ఆత్మసాక్షాత్కారము కలిగిన వారికి వారి హృదయములో భగవాన్ స్మరణము అనుకోకుండానే సాగిపోతుందని చెప్పేవారు. కొందరు భక్తులు ఆత్మసాక్షాత్కారము లేదా ఆత్మ గురించి తెలుసుకోవటానికి ఏ శాస్త్రాలు ఉపయోగపడుతుందని భగవాన్ ని ప్రశ్నించినప్పుడు భగవాన్ దానికి జవాబుగా ఏ శాస్త్రాలను కూడా చదవవలసిన పనిలేదు అన్నారు._*
*_ఆత్మను గురించి తెలుసుకోవటానికి ఏ పనులు అడ్డు రావని కూడా చెప్పేవారు. నీలో నీవు నేను అని అనుకున్నట్టు అయితే అలా కొనసాగగా ఆత్మస్థితికి నీవే చేరుతావు. ఏ పని చేస్తున్నా కూడా అట్లాగే అనుకుంటూ ఉండమని ఆ నేను అనేదే భగవంతుని నామమని చెప్పేవారు. ఏ పని చేసినా ఆ పనిలోనున్న నేను చేస్తుందని కానీ ఆ పని చేసేది నీవేనని (నేను శరీరము) అని అనుకోవద్దని భగవాన్ చెప్పేవారు. నేను చేస్తున్నాను అనే ఆలోచన కర్తత్వ భావము కలిగి అదే మనలో ఎన్నో భావాలకు కారణమై ఉంటుంది. దాని వలన మనసు ఏ విషయంలపై తలంపు ఉంటుందో దానికి సంబంధమైన ఆలోచనలు బయటకి తెస్తాయి._*
*_ఇన్ని తలంపులకు ఆలోచించు వాడే మూలము. అనేది తప్ప మిగిలినవన్నీ అనగా వచ్చి పోయే ఆలోచనలు మారుతూ ఉంటాయి. కానీ నేను అనే ఆలోచన స్థిరం. ఆ నేను అనే తలంపు మీదే శ్రద్ధను ఉంచినట్లయితే ఇతర ఆలోచనలన్నీ వాటంతట అవే వెళ్లిపోతాయి అని భగవాన్ చెప్పేవారు. భగవాన్ మరొక ముఖ్య విషయం కూడా చెప్పారు. ఈశ్వరార్పణముతో చేసిన పనులు నిచ్చలత్వము పొంది సరైన ధ్యానానికి శక్తిని చేకూరుస్తుందని అదే ఫలాపేక్షతో చేసే పని మాత్రము భారం అనిపిస్తుందని నేను చేస్తున్నాను అనే భావము కూడా కలిగి దాని వలన ఆ చేసే పని కూడా ఎలా చేయాలో అనే సంకోచం, భయము కలుగుతుందని ఆ భయం వలన ఫలితం ఏ విధంగా ఉంటుందో అనే తపన తప్ప ఆత్మవిచారము దూరమైపోతుంది._*
*_కావున భగవాన్ చెప్పేది ఏమనగా మనము చేసే పనులు విసుగుతో లేదా యాంత్రికంగా కానీ చేయకూడదని పూర్తి శ్రద్ధా భక్తులతో ధ్యాస పెట్టి ఎరుకతో పని చేయవలెనని భగవాన్ చెప్పేవారు. కాబట్టి భగవాన్ ధ్యానము గురించి చెప్పిన ఆణిముత్యముల వంటి బోధనలను గ్రహించిన సాధకులు ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలరు. వారి బోధనలను మనకు అవగాహన కలగాలని భగవాన్ కృప మనపై ఉండాలని ఆ భగవానున్ని శరణు వేడుకుంటూ మనము కూడా ధ్యానాన్ని ప్రారంభిద్దాం. రమణుని అనన్య శరణాగతి వేడుదాం. ఓ భగవాన్ రమణ నీవే మాకు శరణాగతి !!"_*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచలా...!_*
No comments:
Post a Comment