Monday, July 14, 2025

 నా ఒక్కగానొక్క భార్య : ఏవండీ ..! నా కోరిక ఒకటి తీరుస్తారా ..!?

నేను : హా ..! చెప్పు అమ్ములు . నీకోసం నేనేదైనా చేస్తాను ...

నా ఒక్కగానొక్క భార్య : నాకొక *సింహం*పిల్ల*  కావాలి. 

నేను : ఏంటీ ..!? 

నా ఒక్కగానొక్క భార్య : మీరు విన్నది నిజమే ..! పెంచుకోవాలనిపిస్తోంది ‌...

నేను : నీకమన్నా పిచ్చా ..! ఎవరైనా కుక్కని పెంచుకుంటారు. మొక్కలని పెంచుకుంటారు. పావురాలని పెంచుకుంటారు. సింహాన్ని పెంచుకోవడమేమిటి ... నీ కోరిక రీజనబుల్ గా లేదు ...

నా ఒక్కగానొక్క భార్య : సరే ..! ఈసారి రీజనబుల్ గా అడుగుతాను. మీ వాట్సాప్, మెసెంజర్ మెసెజ్ లు నేను చదువుతాను. ఒకసారి మీ ఫోన్ పాస్ వర్డ్ తీసి ఇవ్వండి ..!

నేను : రేపే అడవికి బయలుదేరుతాను. ప్రయాణానికి సిధ్దం చెయ్యి 
😏😞

Satyakumar Chodavarapu 

😊💐

No comments:

Post a Comment