@ కోపం వస్తుందా...@31
తేది:15/07/2025
""""""""""""""""""""""""""""""""""
"కోపం ఎందుకు రాదండీ..! మడిసన్నాక
కోపం వచ్చుద్ది"అంటుంది 'అత్తారింటికి దారేది' సినిమాలో ఓపాత్ర నిజమే కోపం
ఒక ఉద్వేగం మనలో చాలామందికి
పిలవకుండానే కోపం వచ్చేస్తూ ఉంటుంది...
మనిషికి కోపంతో పని పడుతుందా...?
అంటే - పడుతుంది.
ధర్మానికి హాని జరిగినప్పుడు, కళ్లకు
ఎదురుగా అన్యాయం జరుగుతున్న
ప్పుడు కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అలా
వచ్చే కోపాన్ని 'ధర్మాగ్రహం' అంటారు. పిలవని పేరంటంలా
వచ్చిపడే సందర్భాల్లో అయితే అది
శత్రు కూటమిలో ఒక
టైన కోపం అవుతుంది. మనలో చాలామందికి ఆరెండో
తరహా కోపంతోనే పరిచయం ఎక్కువ
తన కోపమే తన
శత్రువు అన్న మాట నిజమయ్యే సందర్భాలవే.
'కారణంలేకుండా ఎవరికీ కోపం రాదు.. అయితే
ఎప్పుడో గాని కోపానికి సరైన కారణం ఉండదు" అన్నారు
బెంజమిన్ ఫ్రాంక్లిన్. 'సరైన కారణం' అనేదే కీలకం.
కాబట్టి కోపం ముంచుకొచ్చినప్పుడల్లా ఒక్కక్షణం ఆగి మన
కోపానికి తగిన కారణం ఉందో లేదో చూసుకుంటే చాలు.
అది కేవలం ఉద్వేగానికి చెందిందో, ధర్మానికి చెందిందో
మనకే తెలిసిపోతుంది దాన్నిబట్టి ఆగ్రహించాలో -
నిగ్రహించాలో తేల్చుకోవచ్చు.
కోపం, దుఃఖం, భయం.. వంటి ఆరింటిని ప్రాథమిక
భావోద్వేగాలుగా చెబుతుంది మనస్తత్వ శాస్త్రం. వాటికి
తక్షణమే స్పందించేది మెదడులోని 'లింబిక్ లోబ్. అప్పుడు
'ఎడ్రినలిన్' అనే రసాయనం విడుదల అవుతుంది. అది
మనిషిని అసంకల్పిత చర్యలకు ప్రేరేపిస్తుంది.ఆమధ్య ఒక
బాలిక తన తల్లిపైకి దూసుకొచ్చిన ఆటోను అమాంతం
ఎత్తేసి అమ్మను రక్షించుకొన్న సంఘటనను సామాజిక
మాధ్యమాల్లో చూశాం. అంటే భయమనే భావోద్వేగాన్ని
అంతర్గత శక్తిగా ఆవిష్కరించిందామె. నేనెత్తగలనా అన్న
ఆలోచనే లేకుండా అంత బరువునూ ఎత్తిపడేసింది. అలా
మనిషిలో కోపాన్నీ ఆయుధంగా, శక్తిగా మార్చుకోవడం
సాధ్యమే- అంటారు మనస్తత్వ నిపుణులు.
అలా కోపాన్ని నిగ్రహించుకోవడంగాని, ఒక ఆయుధంగా
మార్చుకోవడం గాని ఎప్పుడు సాధ్యమవుతుందంటే- భావో
ద్వేగ సంయమనాన్ని (ఎమోషనల్ బ్యాలెన్సింగ్) సాధన చేసిన
ప్పుడు. దానికి మనిషిలోని వివేకం ఆధారం. నిగ్రహానికి
పునాది భావోద్వేగ వివేకం (ఎమోషనల్,ఇంటెలిజెన్స్).
కోపాన్ని ఒక ఆయుధంగా ప్రయోగించడంకోసం పనిగట్టుకొని
దాన్ని పిలవడమే ఫ్రాంక్లిన్ చెప్పిన 'సరైన కారణం',
భయంలో, దుఃఖంలో, కోపంలో మునిగిపోయినప్పుడు మనిషి
దేహంలో వణుకు రావడానికి కారణమయ్యే ఎడ్రినలినే
ధర్మాగ్రహం విషయంలో శక్తిగా మారుతుందని అర్థం. కోపం
తనంతట తానే వచ్చినప్పుడు అదే మనిషిని శాసిస్తుంది ప్రతీకారానికి ప్రేరేపిస్తుంది. కానీ, కోపాన్ని మనం పిలిచినప్పుడు
అదే ఎడ్రినలిన్ మన చేతిలో ఆయుధం అవుతుంది.
కోపంరావడమా...
తెచ్చుకోవమా...
ఏదిమేలంటారు...?
No comments:
Post a Comment