Friday, August 1, 2025

 


🙏🏻  *రమణోదయం* 🙏🏻

*తనను కోశాలతో కూడిన దేహమని కాకుండా కేవలం చేతనా మాత్రంగా చూచేవాడు ఆత్మయైన శివస్వరూపంలో సంస్థితుడై ఉంటాడు.*

ఏదైనా ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలంటే,ఎంత
ప్రయత్నించినా అది జ్ఞాపకం రాక, ప్రశాంతంగా
ఉన్నప్పుడు మనస్సులో తళుక్కున మెరియడం
సామాన్యంగా అందరికీ అనుభవంలో ఉండేదే..
ఎంతటి గూఢ సంస్కారాలైనా మనస్సు ప్రశాంతంగా
నిశ్చలంగా ఉన్నప్పుడే అభివ్యక్తమవుతాయి.

కళ్ళు తెరిస్తే అనేకం..కళ్ళు మూస్తే ఏకం
కళ్ళు తెరిస్తే ప్రపంచం..కళ్ళు మూస్తే స్వరూపం🙏🏻

ఉన్నదే దైవం.
నెరవేరేదే దైవ సంకల్పం.
స్వప్రయత్నముగా కనిపించినా కూడా
అది దైవ సంకల్పమే!

అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణాచలా!🌹🙏🏻

🌹🙏🏻ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🏻🌹 

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో -సం.742)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
 *స్మరణ మాత్రముననె 
పరముక్తి ఫలద* |
 *కరుణామృత జలధి యరుణాచలమిది*|| 
          
🌹🌹🙏🙏 🌹🌹

No comments:

Post a Comment