అది అంతే..!
”హృదయం’లో ఎక్కడో మూలన,
ప్రారంభంలో చిన్న ”నిప్పురవ్వ’లా
మొదలవుతుంది.
దినదిన ”ప్రవర్తమానం’ అన్నట్లు..
ఆ ”నిప్పురవ్వ’ రోజు రోజుకు పెరిగి..
మీకు ”నిద్రాహారాలు’ లేకుండా చేస్తుంది.
ఆ చిన్న "నిప్పు రవ్వ’
చివరికి ”అగ్నికీల’గా మారి,
ఒక చిన్న ”నిప్పు తునక’
”భయంకరమైన అడవి’ని కాల్చివేసినట్లు,
అది...
”మీరు కానీ మిమ్మల్ని’
పూర్తిగా కాల్చి వేస్తుంది.
’మీరు కానీ మీరు’ దహించ బడ్డాక..
మిగిలేది అసలైన మీరు.
ఆ ”శుభ పరిణామం’ కొరకే..
మన ”జన్మ' ఉద్దేశించబడింది.
No comments:
Post a Comment