*యుక్త వయస్సులో ఉన్న ప్రతి వ్యక్తీ ఆర్థిక వెసులుబాటు కల్పించే దారి వెదుక్కోవడానికి ఎవరిస్థాయికి తగ్గ ప్రణాళికలు వారు వేస్తూ తలమునలయ్యే ఈ రోజుల్లో...*
*"పూజా శర్మ" అనే ఈ ఢిల్లీ యువతి మాత్రం అనాథల శవ దహనం చేసే వెసులుబాటు నాకు చాలు అంటూ 2022 నుండి ఇప్పటికి సుమారు 4000 మంది అనాథల శవ దహనం చేసి మరల తిరిగి వాటి అస్థికలు సైతం ప్రతీ అమావాస్యకు నిమజ్జనం చేస్తూ ప్రపంచంలోనే ఎనలేని గొప్ప కీర్తిని సొంతం చేసుకుంది.*
*మన సొంత వారి దహన సంస్కారాలు చేయడానికి వెనకడుగు వేసే మనం... ఈ పిన్న వయస్కురాలిని చూసి మనమంతా కన్నీటి పర్యంతం కావలసిందే. బహుశా ఆ సర్వేశ్వరుడే ఈమెలో ప్రవేశించి ఇన్ని పనులు చేయిస్తున్నారు కాబోలు.*
*ఇంత పిన్న వయస్సులో ఎంతటి ఘనతను సాధించావు తల్లీ... నీ స్ఫూర్తి దశదిశలా వ్యాపించాలి. మన హిందూ ధర్మం యొక్క విశాలత, గొప్పదనం లోకమంతా తెలియాలి.*
*ప్రియ చదువరులారా...*
*భవభాంధవ్యాలను సైతం లెక్కచేయని మాయాంధకారంలో మునిగి తేలుతున్న సాంకేతికతతో కూడిన మన నవ్య సమాజానికి కనువిప్పు కలగాలని మనఃస్ఫూర్తిగా ఆశిస్తూ...*
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
*┈┉━❀꧁మాత్రేనమః꧂❀━┉┈*
*SPIRITUAL SEEKERS*
🍁🪷🍁 🙇🏻♂️🕉️🙇🏻♀️ 🍁🪷🍁
No comments:
Post a Comment