Friday, August 1, 2025

 *భర్తతో గొడవపడి నప్పుడల్లా నేను మా పుట్టింటికి వెళ్లిపోతాను. అని చెప్పే భార్యలకు.....*
*భార్యతో గొడవపడి నప్పుడల్లా నీవ్వు నాకు అవసరం లేదు .మీ పుట్టింటికి వెళ్లిపో అని చెప్పే భర్తలకు....*
*ఓ చిన్న సలహా....*

*భార్యలకు భర్త వెళ్లిపో అనగానే నేను ఎందుకు వెళ్ళాలి. ఇది నా ఇల్లు నా హక్కు అని ఒక్కసారి అని చూడండి.... మా తల్లిదండ్రులు పెళ్లి సమయంలో నన్ను ఎంత  పవిత్రంగా అయితే నీకు అప్పగించారో అలానే తిరిగి నన్ను నా తల్లిదండ్రులకు నువ్వు అప్పగించే పనైతే తప్పకుండా వెళ్లిపోతాను.*
*అని ఒక్కసారి చెప్పి చూడండి....ఇలా అడిగితే ఏ భర్త వెళ్ళిపొమ్మని అనే ధైర్యం చేయాడుగా...*
*భర్తలకు.... చిన్న చిన్న గొడవలు లేని కాపురమే ఉండదు.... భార్యలకు చాలా విషయంలో సహాయం చేసే భర్తలు కూడా ఉంటారు...భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న  పెద్దల వద్దకు వెళ్లి రెండు కుటుంబాల మధ్య గొడవలుగా మారకుండా జాగ్రత్త  పడండి....భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలను మూడో వక్తి వచ్చి  రాజీ కుదిర్చే అంతవరకు తెచ్చుకోకండి..*
*భార్యాభర్తల బంధం అంటే  అంత తేలికగా విడిపోయేది కాదు కదా...*

No comments:

Post a Comment