Thursday, December 11, 2025

  1.*సలహా అనేది ఎవరికి అవసరమో, వారికే రుచించదు.*

2.*తనను తాను సంస్కరించుకున్న వ్యక్తికే ఇతరులను సంస్కరించే అధికారం అందుతుంది.*

3.*మన సంతోషం మన తెలివితేటలపై అధారపడి వుంటుంది.*

4.*కఠోర పరిశ్రమ అనంతరం వరించే విజయం తియ్యగా వుంటుంది.*

5.*థైర్యసాహసాలు, ప్రతిభ - ఇవి ప్రతి మానవుడి విజయసాధనకు సోపానాలు.*

6.*బాధ్యతా నిర్వహణలో మనిషిలో శౌర్యం వెలికివస్తుంది.*

7.మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే, మన పని అంత ఉత్తమంగా వుంటుంది.

8.మనిషి జీవితంలో ముందడుగు వేయడానికి రెండు కారణాలు-ఒకటి భయం, రెండు శ్రద్ధ.

9.అఙ్నానం భిన్నత్వానికి, జ్ఞానం అభిన్నత్వానికి దారి చూపుతుంది.

10.వైఫల్యం నిరాశకు కారణం కాకుడదు. కొత్తప్రేరణకు పునాది కావాలి.

11.నిరాడంబరత స్నేహితుల్ని పెంచుతుంది. గర్వం శత్రువుల్ని పెంచుతుంది.

12.సత్యమార్గంలో నడిచేవాడే సంపన్నుడు.

13.ఆనందాన్ని మించిన అందాన్నిచ్చే సౌందర్యసాధనం మరొకటి లేదు.

14.దుఃఖం అనేది శిక్ష కాదు.సంతోషం అనేది వరమూ కాదు. రెండూ ఫలితాలే .

15.స్వర్గాన్ని నరకంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా చేసేదీ మన మనసే.

16.నిర్ణయం తీసుకోవడానికి అనుభవం, జ్ఞానం, వ్యక్తపరిచే సామర్ధ్యం అవసరం.

17.సర్వమానవ శ్రేయస్సుకు దోహదం చేసేదే నిజమైన సంస్కృతి

18.మనం ఇతరులకు ఎన్ని సలహాలైనా ఇవ్వవచ్చు. కానీ ప్రవర్తన నేర్పలేం.

19.ధైర్యం, కాలం, ప్రకృతి,....ఈ మూడూ ఉత్తమమైన గొప్ప వైద్యులు .

20.పరిస్థితులు కాదు మానవుణ్ణి సృష్టించింది. మానవుడే పరిస్థితుల్ని సృష్టించుకున్నాడు.

21.సంతోషం ఉంటే అన్ని నిధులు ఉన్నట్టే. సంతోషం లేకుంటే ఎన్ని నిధులు ఉన్నా వ్యర్థం.

22. మనలను తప్పులు పట్టేవారే మనకు గురువులు.

23. లక్ష్యం లేని జీవితం ఎందుకూ కొరగాదు

24. ఇతరులలో ఎప్పుడూ మంచినే చూస్తూంటే, దు:ఖం మన దరి చేరదు.

25.బద్దకం మనకు శత్రువే కాదు, పాతకం కూడా

26.మొదట మనం పరివర్తన చెంది, ఇతరులు పరివర్తన చెందడానికి స్పూర్తి అవ్వాలి

27.చితి నిర్జీవులను కాలుస్తుంది…చింత సజీవులను దహిస్తుంది

28.కష్టాలు ఒంటరిగా రావు…అవి అవకాశాలను వెంట తీసుకు వస్తాయి

29.*సంసార సాగరం దాటాలంటే…సంస్కారముల పరివర్తన కావాలి*.          

30.*కోరికలు పెరిగేకొద్దీ ఆనందం తగ్గుతుంది.*

No comments:

Post a Comment