ఇతరులు మిమ్మల్ని అవమానిస్తే ఏం చేయాలి? What should you do if others insult you
https://youtube.com/shorts/SRQO92A_6t4?si=aeFADCl4QxRwxknh
https://www.youtube.com/watch?v=SRQO92A_6t4
Transcript:
(00:00) మిమ్మల్ని ఎవరైనా కావాలని అవమానించి ఏడిపిస్తుంటే ఏం చేస్తారు? అయ్యో అవమానించడానికి ఏముంది నన్ను అనని మాటలు లేవు అన్ని రకాలుగా అంటారు. కానీ అవమాన పడాలా వద్దా అన్నది మీ చేతుల్లోనే ఉంది కదా ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి మీ వీధిలో కుక్క ఉంది అది మొరిగింది. అది మిమ్మల్ని ఏం తిడుతుందో మీకు అర్థం అవుతుందా? లేదు [నవ్వు] అది ఏమేం తిడుతోందో దాని భాషలో ఓ అని ఏదేదో అంటుంది.
(00:29) [నవ్వు] ఎన్ని బూతులు తిడుతుందో మీకు తెలియదు. మీ దారిని మీరు వెళ్తారు కరవడానికి వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తారు. ఇది కూడా అంతే ఏమంటున్నా అలాగే ఉండాలి. కరవడానికి వస్తే మాత్రం స్పందించాలి. ఇంకో విషయం ప్రపంచంలోన అందరి నోళ్ళు మూయించడం అయ్యే పని కాదు ఎంతెంతో పెద్ద నియంతలే వచ్చారు. అందరినోళ్ళు మూయించాలని చూశారు వాళ్ళ వల్లే కాలేదు మీరు ప్రయత్నించకండి.
(00:56) ఇగ్నోర్ పండర బెస్ట్ పట్టించుకోకపోవడం కాదు గమనించాలి ఎవరేమంటున్నారో ఎందుకంటే గమనించకపోతే రేపు కరుస్తారు. [నవ్వు] ఎవరెవరు ఏమంటున్నారో గమనిస్తూ ఉండాలి. తనకి తెలిసిందే తను వాగుతున్నాడు. అది నా గురించి కాదు దాని ద్వారా తన మానసిక స్థితినే బయట పెట్టుకుంటున్నాడు.
No comments:
Post a Comment