Pasupula Pullarao...8919291603... ప్రతి సందేశం,సమాచారం వినేవారికి చదివే వారికి ఎంతో కొంత జ్ఞానాన్ని అందించే విధంగా ఉండాలి... అపుడే కొత్త పాత సాధకులకు ఉపయోగ కరంగా గైడెన్స్ గా ఉంటుంది... దాని ద్వారా అవగాహన కలిగి వారు కూడా ధ్యానం యొక్క గొప్పతనాన్ని, దాని ద్వారా వ్యక్తి గతంగా ఎదుగుదలకు, అన్ని రకాల సమస్యల నుండి విడుదలకు దోహద పడుతుంది.. సాధన లో మెళుకువలు, దానియొక్క విశిష్టత తెలుసుకుంటారు... మిడి మిడి జ్ఞానంతో ఊకదంపుడు ఉపన్యాసాలు,ప్రసంగాలు కొత్తగా వచ్చే సాదకులలో అయోమయానికి గురి చెసే విధంగా ఉండకూడదు... పత్రిజీ గురువు గారు చెప్పిన అధ్యాత్మిక సత్యం ధ్యానం సులభమైనది, సరళ మైనది, ముక్కు ఉన్న ప్రతి వారు చేయవలసినది అని చెప్పారు వివరంగా విపులంగా... ముందుగా సాధకులు అందరూ సరైన సాధన మార్గాన్ని తెలుసుకొని సాధన చేయడం మొదలు పెట్టాలి... సాధన చేస్తూ చేస్తూ ఉంటే ధ్యాన ఫలాలు అందడం కూడా మొదలు అవుతాయి.. తినగ తినగ వేము తీయగా ఉంటుంది, చేయగా చేయగా ధ్యానం అధ్బుతంగా ఉంటుంది... ఎవరికి వారు అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలి.
No comments:
Post a Comment