Thursday, December 11, 2025

 సమయ పాలన

కాలం పరమాత్మ స్వరూపం. పరమాత్మకు ఆదిమధ్యాంతాలు లేనట్టే కాలానికీ లేవు. కాలం కలిసి రాలేదంటే అదృష్టం బాగా లేదని అర్థం. నిత్య వ్యవహారంలో ఈ మాటను ఎలా ఉపయోగించుకున్నా కాలం తాత్వికమైన అంశం. అది గొప్ప ప్రజా స్వామికవాది. ఎవరిపట్ల ఏవిధమైన హెచ్చుతగ్గులు లేకుండా అందరికీ సమానంగా వర్తిస్తుంది. గొప్ప జ్ఞాని... అందరికీ అన్నీ అవుతుంది కానీ, ఎవరికీ ఏమీ కాదు. కాలతత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆ ఎరుక కొంచెమైనా ఉంటే జీవితంలో విజయాలు సాధించగలం. కాలం అనే మాటను విశాల భావనలో ప్రయోగిస్తాం. నిర్దిష్టమైన వేళను సమయమని వ్యవహరిస్తుంటాం.

కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం, సమయపాలన అనే రెండూ మనిషి జీవితంలో అత్యంత విలువైనవి. ఎందుకంటే కాలమే జీవితం గనక. ఒక కోటీశ్వరుణ్ని పేదకుటుం బంలో జన్మించిన మీరు ఇంత సంపన్నులెలా అయ్యారని ప్రశ్నిస్తే 'కాలం ఇచ్చే అవకా శాలను ఉపయోగించుకునే కళ తెలిసినవాణ్ని' అని బదులిచ్చాడట. కాలం ఒక ప్రవాహం వంటిది. దాన్ని నిలువరించలేం. చాలామంది గతాన్ని తలచుకుంటూ వర్తమానాన్ని పట్టించుకోరు. కాలాన్ని దాచుకోవడం సాధ్యంకాదు కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉపయోగించుకోవాలి. కాలాన్ని నియంత అన్నాడొక తాత్వికుడు. నిజమే. కాలపురుషుడు ఎప్పుడు ఎవరికి ఆనందం పంచుతాడో, విషాదం కలి గిస్తాడో ఊహించలేం. అందుకే 'రేపటి పని ఈరోజే చేయండి. నేటి పని ఈ క్షణమే ప్రారంభించండి, రేవేమవుతుందో ఎవరికి తెలుసు' అంటాడు కబీర్.
సమయపాలన వ్యక్తిత్వంలో ముఖ్యమైన భాగం. సమయపాలన లేకపోవడానికి సంకల్పం కొరవడటం, యాంత్రిక జీవితానికి అలవాటుపడటం, చేయాల్సిన పనిపై ఏకాగ్రత లేకపోవడం మొదలైనవన్నీ కార ణాలు. ఆటంకాలు ఎదురైనప్పుడు వేరే మార్గంలో ప్రయత్నించకుండా పని వాయిదా వేస్తుంటారు చాలా మంది. ఎవరికైనా ఉండేవి రోజుకు 24 గంటలే. లోకంలో పొద్దు చాలనివాళ్లూ ఉంటారు, పొద్దుపోని వాళ్లూ ఉంటారు. బద్ధకం వల్ల మనిషి ఏ పనీ సాధిం చలేడు. కుటుంబ పోషణకోసం వృత్తిని సాగిస్తూనే వారి వారి ప్రవృత్తికి అనుగుణంగా సంఘసేవ, సాహిత్యం, కళలు వంటివాటిల్లో పాల్గొనే వారికి సమయం చాలదు. అయినా ఒక ప్రణాళిక ప్రకారం దైనందిన జీవితం గడుపుతూ సమయాన్ని ఆయా పనులకోసం విభజించుకుంటూ లక్ష్య సాధనకోసం శ్రమించేవారు ఎప్పుడూ సమాజానికి ఆదర్శమే. వృద్ధాప్యంలోనూ ఉత్సాహంతో క్రియాశీలంగా ఉండేవా రిని చూస్తుంటాం. యవ్వనంలో ఆరోగ్యంగా ఉండీ తమకూ సమాజానికీ ఉపయోగడని నిష్క్రియాపరుల్నీ చూస్తుంటాం. శంకరాచార్యులు, వివేకానందుడు వంటివారు కొద్దికాలమే జీవించినా ప్రతి క్షణాన్నీ తమ ధ్యేయం కోసం వినియోగించి చరితార్థులయ్యారు. يكور

కొంతమంది తమ కాలాన్ని వ్యర్థం చేసుకోవడమేగాక ఇతరుల సమయాన్నీ హరి స్తుంటారు. సభలు సమావేశాలకు వెళ్లినప్పుడు ఇది తరచూ చూస్తుంటాం. ధనం పోతే మళ్లీ సంపాదించుకోగలం. కాలం విషయంలో అది సాధ్యం కాదు కాబట్టి క్రమ శిక్షణతో ప్రతి క్షణాన్నీ ఉపయోగించుకోవడం మన చేతిలోనే ఉంది.

డాక్టర్ దామెర వేంకట సూర్యారావు

No comments:

Post a Comment