ఎక్స్ పైరీ!
********
మతం ఊహ
సైన్స్ ఋజువు!
మతం నమ్మకం
సైన్స్ శాస్త్రం!
ఊహలు,నమ్మకాలతో
సుదీర్ఘ కాలం
మనిషి ప్రయాణం!
సైన్స్ తో జీవనం
కొంతకాలం గానే!
మతం కాలం
ముగిసిపోయింది!
సైన్స్ తో మొదలైంది!
నూనెదీపం అప్పటికి
అది గొప్ప సైన్స్!
ఎలక్ట్రిక్ బల్బ్ వచ్చాక
నూనెదీపాన్ని వదిలేసాం!
మతం స్థానంలో
సైన్స్ వచ్చింది!
మతాన్ని వదిలేయాలి!
వదలకపోవటంవల్లే
బాధలుపెరిగాయి!
దోపిడీదొంగలు
మతాన్ని వదలరు!
ఇన్నాళ్లు దాని నీడలో
బతికారు వాళ్లు!
దాన్ని వదిలేస్తే వాళ్ల
బతుకుతెరువు సంగతి?
వాళ్లువదలరు-మిమ్మల్ని
ముందుకు వెళ్లనివ్వరు!
ఆ దోపిడీదొంగలెవరో
మీరే గ్రహించాలి!
నేనుచెపితే -వాళ్ళ'మనో భావాలు'దెబ్బతింటాయి!
పైగా పెద్దమనుషులు
మనం తిట్టగలమా?
సత్యం చెప్పటం కష్టం
నిజం నిప్పులాంటిది!
నిజం చెప్పి ఓసినిమాలో
హీరోకు చచ్చేపనైంది!
మీరే ఆలోచించండి
నిజం బోధపడుతుంది!
కాలపరిణామంలోకొన్ని హరించుకుపోతాయ్!
వాటిని వదిలేయాలి
వదలకపోతే ప్రమాదం!
మాత్రలు వేసుకుంటే
రోగంతగ్గుతుంది!
ఎక్స్ పైరీమాత్రలువేస్తే
ప్రాణాలే పోతాయి!
మతంకూడా అంతే
ఎక్స్ పైరీ ఐపోయింది!
మతమాంత్రికులున్నారు
జాగ్రత్త పదండి!
ఎక్స్ పైరీ మందులిచ్చి
మిమ్మల్నినాశనంచేస్తారు
*******
-తమ్మినేని అక్కిరాజు
హైదరాబాద్
7-12-2025
No comments:
Post a Comment