Sunday, February 15, 2026

 62c4;148C6;262d4;162f5;5
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀


*నమశ్శివాయ.. సాంబాయ..*
            *శాంతాయ.. పరమాత్మనే.*
                  ➖➖➖✍️

*సాంబా... అని పిలిస్తే  చాలు...  శివుడు వెంటనే కరిగిపోతాడు.* 

*మహాభారతంలో ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకి  శివదీక్ష ఇస్తూ...*

*”నమశ్శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే...*
*య ఇదం కీర్తయేన్నిత్యం* *శివసాయుజ్యమాప్నుయాత్”* 

*అనే మంత్రాన్ని ఉపదేశించారు.*

*ఇది శివపురాణంలో కూడా  వస్తుంది.*

*ఇది చాలా గొప్ప మంత్రం.* 

*నమశ్శివాయ..                       సాంబాయ.. శాంతాయ.. పరమాత్మనే.*

*నాలుగు నామాలలో అత్యద్భుతమైన శక్తి ఉంది.*


*1). నమశ్శివాయ...*

*(శివాయనమః) మహాపంచాక్షరీ మంత్రం.*
*శివభక్తులకు నిరంతర జప్యమైన పంచాక్షరీ మంత్ర మహిమను శాస్త్రాలు పలు విధాలుగా వర్ణించాయి.*

*అ, ఉ, మ, బిందు, నాద అనే పంచ అవయవాలతో కూడిన ఓంకారం సూక్ష్మప్రణవం.. న, మ, శి, వా, య అనే ఐదు అక్షరాల శివమంత్రం స్ధూలప్రణవం. పంచాక్షరీని పఠిస్తే పరమేశ్వర అనుగ్రహం సిద్ధం.*


*2). సాంబాయ...*

*అమ్మతో ఉన్నవాడు. ఇలా పిలిస్తే చాలు శివుడు వెంటనే కరిగిపోతాడు. అమ్మతో ఉన్నవాడు అనగానే పరమేశ్వరుని దయ వేరు. అమ్మ అయ్యలతో కలిపి భావిస్తే  కావలసినవి అన్ని సమృద్ధిగా పొందవచ్చును.*

*3). శాంతాయ...*

*ఆయనని తలంచుకొంటే వచ్చేది శాంతం.*
*జీవితానికి కావలసింది కూడా శాంతమే.*
*"ప్రపంచోప శమం శాంతం అద్వైతం మన్యంతే"*
*అని ఉపనిషత్తు చెప్పింది. అలజడులు అన్నీ అణగిన తరువాత వచ్చే శాంతం అది.*

*4). పరమాత్మనే నమః...*

*చిట్ట చివరికి పొందవలసినది పరమాత్మ తత్త్వమే... అన్నిటిని కలిపి నాలుగు నామాలతో పొదిగిన మంత్రరాజం  ఈ శ్లోకం..!*
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...8712184465. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

No comments:

Post a Comment