*ఆత్మీయ బంధుమిత్రులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు*
సర్వేశ్వరుడు పరమేశ్వరుని అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. ఆత్మీయులందరికి పరమేశ్వరుని అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని పరమేశ్వరుని ప్రాదిస్తున్నాను 🙏.
*ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న ఆత్మీయులకు శుభాకాంక్షలు*
🌹💐🥭🍇
ఆణిముత్యాలు.
*వదిలేస్తే జారిపోయే వాటిని పట్టుకోవడం కన్నా....*
*పట్టుకుంటే మనతో ఉండిపోయే... వాటితో.... నిలిచి పోవడం.. ఉత్తమం.....*
*అది జీవితమైనా... బంధమైనా....*
*మనిషి జీవితంలో ఆశ అనేచిన్న దీపం ఉంటె చాలు...*
*ఎలాంటి పరిస్తితులు అయినా ఎదుర్కోవచ్చు.*
*వినిపించుకునే మనసుండాలి కాని మాట కన్నా మౌనం 10 రెట్లు ఎక్కువ శబ్దం చేస్తుంది.......*
*అహంకారులను ప్రశ్నలు అడగవద్దు*
*మూర్ఖులకు సమాధానం చెప్పవద్దు*
*రెండూ ప్రమాదమే మౌనమే .....ఇద్దరికి సమాధానం..*
*రోజులో కాసేపు అయిన మౌనంగా ఉండడం అలవాటు చేసుకుంటే.....*
*ఆ సమయంలో మన లోపల దాగి వున్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.......*
*అర్ధం లేని మాటలకన్నా అర్ధవంతమైన మౌనం మంచిది.......*
*బాధ అంటే బయటకు చూపించేదే కాదు.. మౌనంగా భరించేది కూడా..*
*పైకి కనిపించినంత అందంగా మనిషి జీవితాలు, మనిషి మాటలు ఉండవు......*
*కొందరు నటిస్తారు.. కొందరు నెట్టుకొస్తారు.. కొందరు మౌనంగా వుంటారు.......*
*మనల్ని ఎవరైనా పొగుడుతూ ఉంటే....*
*అది మనల్ని కాదు,*
*మనం సాధిస్తున్న విజయాలను అని గుర్తించాలి......*
*మనల్ని ఎవరైనా విమర్శిస్తుంటే...*
*అది మనల్ని కాదు మన వైఫల్యాలను అని......*
*గుర్తించాలి....*
*పుణ్యం -*
*నీవు ఇతరులకు సహాయం చేయడం*
*పాపం -*
*నీవు ఇతరులకు కీడు చేయడం.*
*మనం చెప్పవలసింది ఏమైనా ఉంటే గాని*
*మన పెదవులు విప్పవద్దు......,*
*మనకేమైనా గౌరవం ఉన్నదంటే అందువల్లనే....*
*ఎవరిని చులకనగా చూడకు.*
*ఎవరికి తెలుసు*
*ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా*
*రేపు శిలాగా మారి గుడిలో దైవంగా మారవచ్చు.*
*మనిషి జీవితం కూడా అంతే.....*
*వెనక్కి వెళ్ళి మన గతాన్ని*
*మార్చుకోలేక పోవచ్చు*
కానీ
*ముందుకు వెళ్ళి మన భవిష్యత్తు మార్చుకోవచ్చు....*
*ఈ సాంకేతిక యుగంలో వాయువేగంతో దూసుకుపోతున్న నేటి తరానికి 'ఆలస్యం అమృతం విషం' అనే నానుడి కన్నా 'నిదానమే ప్రధానం' అనే నానుడి ఎక్కువ వర్తిస్తుంది*.
*మనం ఉద్రేకంలో తీసుకున్న నిర్ణయాల వల్ల*,
*మనలో భావోద్వేగాలను నియంత్రించుకునే శక్తి లేకపోవడం వల్ల ఎన్నో ఘోరాలు జరుగుతూ ఉంటాయి...*
*తొందరపాటు నిర్ణయాల వలన జరిగే మేలు కన్నా కీడే అధికంగా ఉందని తెలిపే ఉదంతాలు నేటి సమాజంలో అనేకం*.
*మనం ఎప్పుడైనా ఉద్రేకంతో తీసుకున్న నిర్ణయాలను వెంటనే ఆచరణలో పెట్టకూడదు*.
*ఒక కాగితంపై వాటిని వ్రాసుకుని మన తలగడ క్రింద పెట్టుకోవాలి*.
*మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ కాగితాన్ని తీసి చదువుకోవాలి*.
*అప్పుడు మన సమస్యకు సరైన పరిష్కారం లభిస్తుంది....*
🙏🙏🙏
No comments:
Post a Comment