Sunday, February 15, 2026

Part-2 ఫ్రెండ్ మాట నమ్మావా? నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నట్టే | Karma Truth..

Part-2 ఫ్రెండ్ మాట నమ్మావా? నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నట్టే | Karma Truth..

https://www.youtube.com/watch?v=RcEvS_uCmuQ



Transcript:
(00:00) కామం నీ ఇంటి గడప దాటగానే కర్మ నీ జీవితంలోకి ఎలా అడుగు పెడుతుందో తెలుసుకుందామా ఇది పార్ట్ట ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చూడండి. నువ్వు నీ కోరికకి లొంగిపోయిన రాత్రి నీ ఇంట్లో దీపం వెలక్కపోవచ్చు. నీ భార్య తినకుండా పడుకున్న ప్రతి రాత్రి నీకు తెలియకపోవచ్చు కానీ కర్మకి మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. నీ బిడ్డ ఆకలితో ఏడ్చిన ప్రతి కన్నీటి చుక్క నీ ఖాతాలో పడుతుంది.
(00:31) ఆ కన్నీరు నీ జీవితంలో ఏదో ఒక రోజు అప్పుగా తిరిగి వస్తుంది. ఒక రాత్రి పిల్లవాడికి తీవ్రమైన జ్వరం అయితే వచ్చింది. ఒళ్ళు కాలిపోతాంది కళ్ళు తిరిగిపోతున్నాయి. తల్లి చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. భర్త సంపాదించిన డబ్బు ఎక్కడికి వెళ్ళిందో తెలుసా ఆమెకు కూడా తెలీదు కానీ ఆ డబ్బు అక్రమ సంబంధానికి తగలేసినట్టు కర్మకి మాత్రం తెలుసు ఆ తల్లి పిల్లవాడిని ఒడిలో పెట్టుకొని ప్రతి ఇల్లు తిరిగింది అమ్మ కొంచెం డబ్బు ఇవ్వమ్మ హాస్పిటల్ కి వెళ్ళాలి అని అడిగింది.
(01:00) ఒకరైతే తలుపు మూసేసారు ఇంకొకరు లేవని చెప్పారు. ప్రతి తిరస్కారం ఒక గాయం ఆ తల్లి ఏడుపు శబ్దంగా బయటికి రాలేదు కానీ ఆమె లోపల చేసిన ప్రార్థన దేవుడికి కాదు కర్మకి ఆ ప్రార్థనలో శాపం లేదు కేవలం అసహాయం అదే అత్యంత ప్రమాదం ఇది నీకు తెలియకపోవచ్చు నువ్వు ఆ రాత్రి హ్యాపీగా రాసలీలా చేస్తూ ఉండొచ్చు కానీ ఆ పిల్లవాడి జ్వరం డిగ్రీలు నీ జీవితంలో రేపు వచ్చే సమస్యలు కూడా డిగ్రీలే సమానంగా లెక్కించబడతాయి.
(01:33) ఒకరోజు స్కూల్ నుంచి నోటీస్ వచ్చింది ఫీస్ కట్టకపోతే పరీక్ష రాయించము అని పిల్లవాడు తల్లిని చూసి ఏమి అడగలేదు ఆ చూపే ఆ తల్లిని చంపేసింది. తల్లి ఒక ఇంటికి వెళ్ళింది డబ్బులు కావాలి అని వాళ్ళు నవ్వారు సహాయం చేయలేదు. అవమానం మాటల్లో కాదు చూపులో ఉంది. అదే సమయంలో నువ్వు నీ కోరిక కోసం డబ్బు ఖర్చు చేశవు. ఆ డబ్బు ఒక పరీక్ష ఫీజు ఆ డబ్బు ఒక పిల్లవాడి భవిష్యత్తు నువ్వు చూడలేదు ఆ తల్లి ఆ రాత్రి ఏం మాట్లాడలేదు పిల్లవాడి ముందు నవ్వింది.
(02:09) లోపల మాత్రం తన ఆత్మ ముక్కలైంది ఆ మౌనం కూడా కర్మలో లెక్కే శబ్దం లేని బాధకి వడ్డీ ఎక్కువ కర్మకి శబ్దం అవసరం లేదు కన్నీళ్లు సరిపోతాయి. వాళ్ళు విడిచిన ప్రతి కన్నీటి చుక్క నీ జీవితంలో ఒక మార్పుకి విత్తనం అవుతుంది. మొదట అది చిన్నగా మొదలవుతుంది. నీ మనసులో శాంతి తగ్గుతుంది నీ నిద్రలో భయం పెరుగుతుంది నీ దగ్గర డబ్బు ఉన్నా సంతృప్తి ఉండదు నీ నవ్వులో భారం అనిపిస్తుంది.
(02:35) ఇది శిక్ష కాదు హెచ్చరిక. కర్మ ఇప్పుడు ఒక్కసారిగా దాడి చేయదు. నెమ్మదిగా నీ జీవితాన్ని చుట్టుముడుతుంది. నీ పని కుదరదు నీ మాటకి విలువ తగ్గుతుంది నీ దగ్గర ఉన్నవాళ్ళు నిదానంగా మాయమైపోయే రోజు దగ్గరలోనే ఉంటుంది. నువ్వు కారణం వెతుకుతావు కానీ కారణం నీ ఇంటి మూలలో మౌనంగా కూర్చొని ఉంటుంది. వాళ్ళు ఆకలితో పడుకున్న ఆ రాత్రులు నీ నిర్ణయాలను బలహీన పరుస్తాయి.
(02:59) బాలు దాచుకున్న ఆ కన్నీళ్లు నీ అదృష్టాన్ని చెక్కేస్తాయి. ఇది దేవుడు చేసిన పని కాదు నీ చేతులతో నువ్వే రాసుకున్న కర్మ. నువ్వు ఆనందం కోసం ఇల్లు మర్చిపోయిన రోజున ఇల్లు కూడా నిన్ను మర్చిపోతుంది. నీ భార్య ముఖంలో నవ్వు మాయమయ్యే రోజు నీ జీవితంలో ఆశ కూడా మాయమైపోతుంది. నీ బిడ్డ నీ వైపు చూసి ఏమి అడగకుండా తిరిగిపోయిన రోజు నీ ఆత్మలో ఒక గాయం పడుతుంది.
(03:24) కానీ అది నయం కాదు కర్మ అప్పుడు నీ జీవితంలోకి పూర్తిగా అడుగు పెడుతుంది. నీ ఆరోగ్యం దెబ్బ తింటుంది. నీ పేరు మీద మచ్చలు పడతాయి. నీ దగ్గర ఉన్న వాళ్లే నీ గురించి చెడ్డగా మాట్లాడడం మొదలు పెడతారు నువ్వు అప్పుడు అర్థం చేసుకుంటావు నేను తప్పు ఎక్కడైనా చేశానేమో అని కానీ కర్మ పశ్చాత్తాపాన్ని కాదు లెక్కను మాత్రమే చూస్తుంది.
(03:46) ఎన్ని రాత్రులు వాళ్ళు పస్తుతో పడుకున్నారు ఎన్నిసార్లు వాళ్ళు ఏడ్చారు ఎన్ని సార్లు వాళ్ళు నిన్ను ఆశగా చూశారు అంతే లెక్క కర్మ ఎప్పుడూ వదలదు. కర్మ నీకు బోధన ఇవ్వడానికి వస్తుంది కానీ ఆ బోధకి ఖరీదు ఎక్కువ ఇదే కారణం పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఒక్కసారిగా కింద పడిపోవడానికి ఇదే కారణం డబ్బు ఉన్నా శాంతి లేకపోవడానికి నీ జీవితం ఒక మలుపు తీరిగిందంటే అది కచ్చితంగా యాదృచ్చికం అయితే కాదు.
(04:10) వాళ్ళు విడిచిన కన్నీటి బొట్టే ఆ మలుపు ఇప్పుడు ప్రశ్న ఒకటి నువ్వు ఇంకా అదే దారిలో నడుస్తావా లేదా ఇక్కడే ఆగిపోతావా ఎందుకంటే కర్మ రెండో అవకాశం అయితే ఇవ్వదు మూడోసారి అస్సలు ఇవ్వదు. ఇందులో ఫ్రెండ్స్ పాత్ర చాలా ఉంటుంది. వాడు నవ్వుతూ అంటాడు రేయ్ ఏమైంది లేరా నీ భార్యకి తెలియకుండా మెయింటైన్ చేసుకో ఎవరికి తెలుస్తుంది చెప్పు అని కానీ అది సలహా అయితే కాదు వాడు తన జీవితాన్ని ఇప్పటికే పాడు చేసేసుకున్నాడు కానీ నీ జీవితాన్ని తన స్థాయికి లాగాలనుకుంటాడు.
(04:39) నీ పాపానికి వాడు శిక్ష అనుభవించడు నీ కర్మకి నువ్వే శిక్ష అనుభవించాలి. నువ్వు నమ్మిన ప్రతి మాట నీ జీవితంలో ఒక ముక్క తిరిగి రాయబడుతుంది. ఫ్రెండ్ అన్న పేడు వెనుక అతడి బాధ్యత ఉండదు వాడు చెప్పింది ఎవరికీ తెలియదన్న మాట కర్మకి చిరునామ కర్మకి కచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే నీ ఇంట్లో మౌనం ఉంటే చాలు ఇలాంటి మాటల వల్లే సగం జీవితాలు సంకనాకి పోతున్నాయి.
(05:05) బయట నవ్వు లోపల నాశనం ఫ్రెండ్ నవ్వుతాడు నీ భార్య మౌనంగా ఏడుస్తుంటుంది. నీ బిడ్డ నిన్ను చూసి ఏమి అడకుండా తలవంచుకుంటాడు అప్పుడు గుర్తొస్తుంది నేను నా గొయ్యి నేనే తవ్వుకున్నానా అని గుర్తుంచుకో ఫ్రెండ్ అయితే వాడు కచ్చితంగా ఇలాంటి సజెషన్స్ అయితే ఇవ్వడు నిన్ను తప్పుదారిలోకి నెట్టేవాడు అసలు ఫ్రెండే కాదు నీ పతనాన్ని ఎంటర్టైన్మెంట్ లాగా చూసేవాడే శత్రువు కన్నా ప్రమాదం అందుకే నీ జీవితంలో ఎవరి మాట వినాలో కాదు ఎవరి మాట వినకూడదో అదే నిజమైన విజ్ఞానం అదే తెలివి పార్ట్ త్రీ కోసం వెయిట్ చెయ్ ఇంకా ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే ఇప్పుడే మన
(05:43) ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.

No comments:

Post a Comment