Sunday, February 15, 2026

Shivaratri Nadu Jagarana Enduku Cheyali? | Garikapati Narasimha Rao Pravachan | Mahashivratri Power

Shivaratri Nadu Jagarana Enduku Cheyali? | Garikapati Narasimha Rao Pravachan | Mahashivratri Power

https://www.youtube.com/watch?v=ACgLkAyQrFk



Transcript:
(00:00) యక్ష స్వరూపాయ జటాధరాయ శివుడు ఎందుకు జటలు ధరించి ఉంటాడు నిత్యము తపస్సులో ఉంటాడు శివుడికి రెండే భంగ్యములు ఉంటే లింగ రూపం లేదా తపోరూపం అంతేగాని శివుడు హీరో చిరంజీవి లాగా కాలు ముందు కెట్టి నడుమిచ్చి చేసి నిలబడ్డం ఈ మధ్య వేస్తున్నారు పోస్టర్లు సినిమా యాక్టర్లు చేశారు శివుడు కూడా ఇలా నిలబడడం అలా నిలబడడం ఇవన్నీ ఉండవు ఆయనకి ఉంటే శివలింగ రూపం మానవ రూపంలో కరచరణాలతో ఉంటే రెండే రూపాలు ఒకటి నటరాజస్వామి నాట్యం చేస్తాడు లేదా తపోభంగ్యంలో ఉంటాడు అంతకు మంచి శివుడు క్యాలెండర్ ఉంది అంటే వేసినవాడి ఓవర్యక్షన్ అది శివుడు అలా ఉండడు.
(00:35) నిత్యం తపస్సులో ఉండం కారణంగా జుట్టుకు నూనె రాసుకో అందుకే జటాధరాయ ఆ జడలు కట్టేసి ఉంటుంది ఆయన పట్టించుకోడు వాటిని మన పిల్లలు కూడా యువకులు చాలామంది యువతులు ఈ మధ్య నూనె రాయట్లే వాళ్ళంతా శివ స్వరూపాలుగా మనం భావించాలి. వారిని ఏమి అనద్దు మీరు ఏమనా అంటే అది ఆ నూనె మనకి రాస్తాడు ఆమదు ఎందుకు వచ్చింది ఆయన శివుణని చూసిన పుణ్యంరా అంటే అయిపోయాయి.
(00:57) వారు తపస్సు చేయడం వల్ల నూనె రాసుకోలేదు వీరు మన తపస్సు కోసం మన పాపం వల్ల వాళ్ళు నూనె రాసుకోవట్లేదు ఏం చేస్తాం భరించడమే జటాధరాయ అంటే తపోభంగ్యములో ఉన్నప్పుడు తపస్సులో ఉన్నప్పుడు ఈ అలంకరణలన్నీ పట్టించుకుంటే నీకు తపస్సు సాగదు నిరంతరం మనం జపం చేయాలి అంటే ఈ భౌతిక వ్యామోహాలు తగ్గించుకోవాలి అందుకే జటాధరాయ పినాక హస్తాయ సనాతనాయ శివుడి చేతిలో ఉండేటువంటి ధనుస్సుని పినాకం అంటారు అంతే కాదు ధనుర్విద్యకు ఆద్యుడు శివుడు పరశురాముడికి ధనుర్ విద్యను ఏర్పాడ ఆయన విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడికి ధనుర్విద్య నేర్పింది శివుడు ఆ పరశురాముడే
(01:31) తర్వాత భీష్ముడు మొదలైన వాళ్ళందరికీ నేర్పాడు అంటే ధనుర్విద్యకే కాదు సంగీత విద్యకు ఆజ్యుడు శివుడు సంగీతాన్ని గురించిన ప్రసిద్ధమైన శ్లోకం ఉంట శిశువేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పనిహి అంతవరకు చెబుతారు తర్వాత చెప్పరు చాలామంది సయేవ శంకరో వేత్తి నారదో వేత్తివా నవ అది రెండవ భాగం శిశుర్వేత్తి వశుర్వేత్తి వేత్తి గానరసం పణకి సయేవ శంకరోవేత్తి నారదో వేత్తివా నవ శిశువుకు తెలుసు సంగీతం తలలోపుతుంది శిశువు అంటారు పశువు తలలోపుతుంది అలాగే పాము తలలోపుతుంది కదా నిజానికి ఈ మూడు కైలాసానికి సంబంధించినవి శిశువు అంటే కుమారస్వామి పశువు అంటే నందీశ్వరుడు పాము అంటే శివుడి
(02:10) మెడలో నాగరాజు వేత్తి గానరసం పనికి అందుకే సంగీతం గురించిన సర్వ పరిజ్ఞానం సర్వజ్ఞుడు ఎవరంటే శివుడు ఒక్కడే సయేవ శంకరో వేత్తి నారదో వేత్తివా నవ నారదుడికి తెలుసో తెలియదో అనుమానం అన్నారు నారదుడికి అనుమానం అంటే ఇక మనక ఏ పాట తెలుసో అంగీకరించాలి నేను ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ నేనే బి గ్రేడ్ ఆర్టిస్ట్ నారదుడికే తెలియదని చెప్తున్నారు సంగీతం నీకు ఏ పాట తెలుసో ఆలోచించు ఇదే ప్రశ్న నేను అవధానం చేస్తుంటే ఓచోట వచ్చింది శివుడికే సర్వజ్ఞుడు సంగీతం అంతా శంకరుడికే తెలుసును అంటే బాలమురళీ కృష్ణ గారికి కూడా బాగా తెలుసు కదండీ అన్నారు నేను వెంటనే
(02:42) చమత్కారంగా చెప్పా ఆయన పుట్టిన ఊరు శంకర గుప్తం అయ్యా అందుకని తెలుసును అని చెప్పా [నవ్వు] ఆయన పుట్టిన ఊరు కోనసీమలో శంకర గుప్తం అది ఎంత అదృష్టం అండి అంటే ఈ సంగీత నిధిని శంకరుడు గుప్తంగా అక్కడ దాచాడు అక్కడ పుట్టాడు కాబట్టి ఆ మహానుభావుడికి తెలిసింది అనుమానం ఏమలే ఆయన ఊరే శంకరగుప్తం అది మనకు స్ఫురించాలి కదా సమయస్ఫూర్తి అంటే అర్థం అది ఆయన పుట్టిన ఊరు కోనసీమలో శంకర గుప్తం ఇప్పటికే అమలాపురం దగ్గర ఉంది ఆ ఊరు ఆయన ఎప్పుడో చెబుతుంటారు శంకరగుప్తం మా ఊరు అని ఆ పేరు చూడండి ఎంత శంకరుడు గుప్తంగా ఏదో దాచాడు ఏం దాచాడు సంగీతం దాచాడు అది
(03:13) ఈయన అందుకున్నాడు అక్కడ అక్కడ పుట్టాడు కాబట్టి అందుకని ఆయనకు తోచిందయ్యా అన్నో అవధానాల్లో చమత్కారాలు అలా ఉంటాయి అవధానాల పుస్తకంలో ఇలాంటివే ఉన్నాయి మొత్తం అని రకరకాలుగా అవధానాల్లో చెప్పినవన్న అందుచేత సంగీతాన్న ఆజ్యుడు శివుడు ధనుర్విద్యకు ఆజ్యుడు శివుడు అక్షరాభ్యాసానికి ఆజ్యుడు శివుడు శివ ప్రసాదం వలనే కవిత్వం వస్తుంది సరస్వతీ దేవి నిలబడుతుంది ఇవ్వదు కవిత్వం ఇవ్వదు సరస్వతి నిలబడుతుంది ఇచ్చేది శివుడే మల్ల విద్యకు ఆజ్యుడు శివుడు అనేక విద్యలకు ఆజ్యుడు శివుడు అందుకే మనం అక్షరాభ్యాసంలో విష్ణువు పేరు రాజం ఇంద్రుడు పేరు రాజం ఏ దేవుడు పేరు రాజం ఓం
(03:45) నమఃశివాయ అది బీజాక్షరాలతో సహా రాస్తే యధావిధిగా రాస్తే పిల్లలు తప్పు పలికితే ఇబ్బంది కాబట్టి మన వాళ్ళు ఇంకో విధానం కనిపెట్టారు ఓ నామః శివాయః అని య తర్వాత కూడా విసర్గలు పెడతారు సి కి కూడా దీర్ఘం పెట్టేస్తారు నమః అన్న చూడ నామః అని రాసేస్తారు ఎందుకంటే కొన్ని అక్షరాల తేడా రాస్తే అవి బీజాక్షరాల ఉచ్చారణ దెబ్బ తినకుండా ఉంటుంది.
(04:09) అవి బీజాక్షరాలుగా పలకూడదు పసిపిల్లడు పలకూడదు వాడికి ఉపనయనం కావాలి కొన్ని సంస్కారాలు కావాలి అందుకోసం అలా చేస్తారు తర్వాత చెప్పాలి చెప్పకపోతే వాడు శివాయః అని య పక్కన విసర్గలు పెడతారు తప్పు అవుతుంది తర్వాత శివాయ చతుర్థి విభక్తి నమః దగ్గర విసర్గలు ఉంటాయి కానీ శివాయక ఉండవు కానీ ఇందులో కూడా జాగ్రత్త తీసుకున్నారు మనవాళ్ళు లౌకికం వేరు మరి వైదికం వేరు కదా అందుకని యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ ధనుర్విద్యుడు కాబట్టి సనాతనాయ అంతకుమించినటువంటి సనాతనుడైన భగవంతుడే లేడు వినాకహస్తాయ సనాతనాయ చూ దివ్య దేహాయ దిగంబరాయ తస్మై యకారాయ నమఃశివాయ దివ్యమైన దేహాన్ని
(04:46) ధరించడం దిక్కులన్నీ ఆక్రమించడం అంటే సిర్గ శివరాత్రి కథ శివరాత్రి కథలో విషయాన్ని గమనించండి మీరు విష్ణువు బ్రహ్మ ఇద్దరు ఎదురయ్యారు మేము నేను ముందు అంటే నేను ముందు అని దెబ్బలాడుకున్నారు ఎందుకంటే శరీర వ్యామోహం కలిగింది అంతకంటే లేకపోతే నేనేమిటి విష్ణువుకి నేనేమిటండి విశ్వమంతా వ్యాపించినవాడు విష్ణువు అని చెబుతున్నారు మళ్ళీ చతుర్ముఖాలు కలిగినవాడు నేను అనుకోవడం ఏమిటి అదో అజ్ఞానం లేతే చతుర్భుజాలు కలిగినవాడు నేను అంటే నేను అనే భావన వచ్చేసరికి బ్రహ్మాండం అంతా వ్యాపించిన విష్ణువు చతుర్భుజుడు అయిపోయాడు పరిమితమ అయిపోయాడు.
(05:18) విశ్వనాథ సత్యనాయణ గారు చెబుతాడు వేయ పడగలలో యాచన అనే దీనావస్థ వచ్చేసరికి త్రివిక్రముడు వామనుడు అయ్యాడు అంటాడు ఆయన [నవ్వు] వామనావతారం ఎందుకు ధరించాడు అంతవాడు ఇంతవాడు యాచన అడుక్కోవడం అంటే అంతేనయ్యా మనం తగ్గించుకుంటే గాని అడుక్కోలేమయ్యా అని వెయి పడగల్లో రాస్తాడు మహానుభావుడు ఒకడ యాచన ఎంత దీనము అంటే ఆ అవస్థ వచ్చేసరికి మహావిష్ణువు లాంటివాడు వామనుడు అయిపోయాడురా జీవితంలో ఆ అవస్థ రాకుండా చూసుకో డబ్బు పొదుపు చేసుకో నాయన అని చెప్పాడు అంత వస్తే విష్ణువైనా వామనుడు కాక తప్పదు ఎందుకంటే ఈయన ముందే త్రివిక్రముడుగా వస్తే బలి ఏమఇస్తాడు
(05:51) నువ్వే ఇంత లావు ఉన్నావు అంటాడు. అందుకనే అడుక్కోవలసి వస్తే ఆ బాధ తప్పదు అలాగా శివుడు కూడా అలా అవుతాడు అందుకని విష్ణుమూర్తి అంతర వాడికి నేను అనే అహంకారం వచ్చేసింది అందుకనే ఆయన చతుర్భుజుడుగానే అదే అనుకుంటున్నాడు ఆయన లేక అంతా వ్యాపించింది ఆయనే కదా బ్రహ్మంతగానే చతుర్ముఖాలతో ఉండి నేనే అనుకుంటున్నాడు ఈ ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటే దెబ్బలాడంత తెమలకపోతే మధ్యలోనుంచి ఆవిర్భవించాడు నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమఃశివాయ అప్పుడు వీళ్ళద్దరికీ జ్ఞానం రావాలి మనఇద్దరం దెబ్బలాడుకుంట ంటే మధ్యలో 12 గంటలక ఈ
(06:25) లింగోద్భవ కాలంలో లింగం ఆవిర్భవించింది అంటే ఇదే మనని మించింది కదా అని తెలియాలిగా దాన్ని చూడాలిగా దివ్య దేహము అంటే అర్థం అదే కదా దిగంబరాయ దిక్కులన్నీ వ్యాపించింది అంటే అర్థం అదే కదా ఈ అజ్ఞానులు ఇద్దరూ చూడడం మానేసి ఏం చేశారు ఎదురుగా ఉన్న శివుణని నమస్కరించడం తెలుసుకోవడం అహంకారం పోగొట్టుకోవడం మానేసి బ్రహ్మ ఆకాశం హంస రూపంలో ఆకాశంలోకి వెళ్ళాడు పైన దీని అంతు ఎక్కడఉందో కనుక్కుందాం అక్కడ మందార పువ్వో మల్లె పువ్వో పెడదాం అని పూల మార్కెట్ కి వెళ్ళాడు ఈయన ఈయన బుద్ధి అలా ఉంది అక్కడ అహంకారం ఉన్నప్పుడు అలాగే ఉంటది విష్ణుమూర్తి అయనా పోని జ్ఞానంతో
(06:57) వ్యవహరించాడా ఆయన అంతు కనుక్కుంటే నేను మూలం ఏమిటో కనుక్కుంటాని భూమిని తవ్వాలంటే కోరలుఉన్న ఆకారం కావాలి కాబట్టి ఈయన కర్మ కాలిపోయి వరాహ రూపం ధరించాడు విష్ణువు వరాహం అయ్యాడు అంతే గనక ఆలోచనలు మారితే మన బతుకులు ఇలాగే అవుతాయి విష్ణుమూర్తి వరాహం అవుతాడు. అయి మరి తవ్వాలంటే అంతే కదా తవ్వుకుంటూ కిందకి వెళ్ళాడు ఎంత కిందకి వెళ్ళినా ఏం దొరకలేదు.
(07:17) ఆయనకి పైకి వెళ్ళిన ఏం దొరకలేదు ఇప్పుడు ఆలోచించండి శివుడు ఎప్పుడు దొరుకుతాడు కిందకి తవ్వుకుంటూ వెళ్ళిన విష్ణుమూర్తికి దొరకలేదు పైకి ఎగురుకుంటూ వెళ్ళిన విష్ణుమూర్తికి దొరకలేదు ఇద్దరు ఈ పనులు మానేసి ఎదురుగా ఉన్న శివలింగానికి నమస్కరిస్తే దొరుకుండేవాడు కచ్చితంగా అంటే మనం కూడా జీవితంలో ఆలోచించాలి కిందకి తవ్వుకుంటూ వెళ్ళడం అంటే గత జ్ఞాపకాలు తవ్వుకుంటూ ఉండం అస్తమా 10 ఏళ్ళ క్రితం ఎంత బాధపడ్డా నిన్ను ఇప్పుడు ఎవడు అడిగాడమ్మా విషయాలని ఎందుకు ఏడుస్తున్నావ్ శివరాత్రి పూట నిన్నటివి మొన్న అన్నటివి కాదండి పాతికేళ్ళకి కతనాటివి కూడా
(07:49) తవ్వుకోవడమే ఎవడు తవ్వుకోమన్నాడు ఎవరైనా అడిగే అవసరమా అవసరమై నీ జీవిత చరిత్ర రాయవే అంటే రాద్దాం అదేం లేదు కదా అలాగే కొంతమంది ఊహలు ఇప్పుడు ఎలా ఉన్నావ్ రెండేళ్ళు పోయాక ధరలు ఎలా ఉంటా రెండేళ్ళు పోయాక నువ్వు ఉండవమ్మా నీకు ఎందుకు ఆ గొడవ ధరలు ఎలా ఉంటాయి నీకే నువ్వు ఉండవుగా అది మళ్ళీ భయం నేను ఉండకపోవడం ఏమిటి ఉంటా నువ్వు నీ ఇష్టమేనా పైకి ఎగురుకుంటూ వెళ్ళడం అంటే భవిష్యత్తు గురించి భయం భయపడుతూ ఉండడం కిందకి తవ్వుకుంటూ వెళ్ళమంటే గత జ్ఞాపకాలు తెచ్చుకుంటూ ఉండం తవ్వుకుంటూ ఉండడం ఈ రెండిటి వల్ల శివుడు దొరకడు అదే శంకరాచార్య స్వామి చెప్తాడు దేహో
(08:25) దేవాలయప్రక్తః జీవో దేవస్సనాతనః తజేద అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ గుడిలోకి వెళ్ళినప్పుడు మీరు గమనించండి శివలింగానికి పొద్దున్నే దర్శించుకొని రేపు వెళ్ళామండి ఇవాళ కాదు రేపు వెళ్ళాం శివరాత్రి పూజలు చేశారు ఎవరో అభిషేకాలు చేశారు మారేడాకులు పెట్టారు పువ్వులు పెట్టారు పొద్దున్నే అర్చక స్వామికి ఏదైనా ఇబ్బంది నిద్రాహారాల వల్ల కావచ్చు లేదు ఇంట్లో ఏదైనా ఇబ్బంది రావచ్చు ఆ నిర్మాల్యం తొలగించలేదు అనుకోండి శివలింగం మీద మారేడాకులు పువ్వులు అన్ని అలాగే ఉండిపోయాయి అనుకోండి మనం పొద్దున్నే దర్శనానికి పెడితే శివుడు కనపడ్డగా
(08:55) నిర్మాల్యం తొలగిస్తే గాని శివుడు కనపడ్డగా నిర్మాల్యం అంటే నిన్నటి పూజా ద్రవ్యాలు కదా మన జీవితం అనేటువంటి శివక్షేత్రంలో నిర్మాల్యం అంటే నిన్నటి జ్ఞాపకాలు నిన్నటి జ్ఞాపకాలు తొలగిస్తే గాని చూడు నిన్న ఏం జరిగింది మొన్న ఏం జరిగింది 10 ఏళ్ల క్రితం ఏం జరిగింది వదిలేయవయ్యా ఎందుకు వచ్చిన గొడవ అది అయిపోయింది కదా అయిపోయింది కదా మళ్ళీ మళ్ళీ దాన్ని తవ్వుకొని తవ్వుకొని తుక్కపడితే బీపి వస్తుంది పరిష్కారం కాదు అది అప్పుడు ఇలా జరగకుండా ఉంటే నేను గవర్నమెంట్ ఉద్యోగంలో సెటిల్ అయిపోయి ఉంటే సెటిల్ అయిపోయిన వెంటనే ప్రాణం పోయేదేమో ఇప్పుడు ఆ లెక్కలన్నీ వేస్తాడు దాని వల్ల
(09:28) గుండెపోటు వస్తుంది. ఇప్పుడు ఎక్కడో అక్కడ సెటిల్ అయ్యావు కదా ఆ ఉద్యోగంలో సెటిల్ అయినవాడు కూడా అంత క్షేమంగా ఏం లేడు వాడు ఏడుస్తున్నాడు ఎందుకు వచ్చిన ఏడుపు ఇది ఈ సంబంధం కాకుండా ఆ సంబంధం అయి ఉంటే ఆవిడ ఇక్కడే ఉంది అక్కడ ఎదురుగా ఒళ్ళు మండిపోదా అట్టగాడు ఎటు కొట్టదు చేసుకున్న అమ్మాయిని అలా మాట్లాడుతున్నావ్ ఆ సంబంధం ఈ సంబంధం అని ఆవిడ కూడా అదే మాట అంటే నాకు వచ్చిన మూడో పెళ్లి కొడుకు అంటే ఈ 36వ వాడు ఏమవుతాడు ఇక్కడ ఇవే మనం చేసే పనులన్నీ పెంట పనులు అంటే ఇవే తగాదాలు అంటే ఇవే అదేదో బాగుండేది ఇదేదో బాగుండేది ఆ గతమంతా తవ్వు కోవడమే విష్ణుమూర్తి చేసిన
(10:00) పిచ్చి పని పైకి భవిష్యత్తు గురించి భయపడడం ఉందే అది బ్రహ్మదేవుడు చేసిన పిచ్చి పని ఈ రెండిటి వల్ల శివుడు దొరకడు నిన్నటి జ్ఞాపకాలు నిన్నటి పూజా ద్రవ్యాలు తొలగిస్తే గాని శివలింగం కనపడనట్టే నిన్నటి జ్ఞాపకాలన్నీ తొలగించుకుంటే గాని ఆత్మజ్ఞానం కలగదు మనకి అది శివరాత్రి కథ రహస్యం అందుకే సుదివ్య దేహాయ దిగంబరాయ అది దివ్యమైన దేహం అది దిక్కులన్నీ వ్యాపించినటువంటి దేహం అది కనపడాలంటే ఏ క్షణంలో లో ఉన్నావో ఆ క్షణం గురించి ఆలోచించు ఈ క్షణం ఈ క్షణం దానికి ఇంకో అర్థం అండి ఈ క్షణం అంటే చూపు ఈ క్షణం అంటే దిస్ మూమెంట్ అని ఒక అర్థం మళ్ళీ ఈ
(10:39) క్షణం అంటే చూపు నీ చూపు దిస్ మూమెంట్ ఈ క్షణం మీద ఉండాలి ఆ క్షణం ప్రతిక్షణం మనకి శివరక్షణమే అటువంటి జ్ఞానాన్ని మనం పొందేటువంటి ప్రయత్నం చేద్దాం తస్మై యకారాయ నమఃశివాయ

No comments:

Post a Comment