పరమశివుడి గురించి పది రహస్యాలు🙏 #santoshghanapathi #hindudharmakshetram #shivaratri
https://www.youtube.com/watch?v=nPuoBaJFbys
Transcript:
(00:00) ఓం సక్తుమివతిత ఉనాపునంతోయత్రీరామనసావాచమక్రత ఓం నమో గణపతయే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఎంతో పుణ్యప్రదమైనటువంటి మహాశివరాత్రి వచ్చేసిందండి ఈసారి ఆదివారం కూడా వచ్చింది ఎంతో విశేషము అని ముందుగానే చెప్పడం జరిగింది. ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా పరమశివుడి గురించి 10 రహస్యాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం.
(00:36) ఇందులో కొన్ని విషయాలు మీకు తెలిసినవే కావచ్చు అయినప్పటికీ కూడా మళ్ళీ మనం స్మరించడంలో తప్పు లేదు దృష్టిలో పెట్టుకోండి మొట్టమొదటి విషయం ఏమిటి అంటే శివః అనే శబ్దానికి అర్థం ఏమిటండి మంగళము శుభము అని అర్థం శివ అని మనం అన్నామఅంటే కనుక శుభాన్ని మనం కోరాము అని అర్థం శివ శబ్దం మంగళవాచకం ఆ విధంగా శివుడు అంటే మంగళడు శంకరుడు అన్నా కూడా అదే అర్థం అండి శంకరోతి శంకరః శంక శంకరః అన్నా కూడా అదే అర్థం వస్తుంది.
(01:07) కావున శివ అన్నా శంకర అన్నా కూడా అర్థం ఒకటే శంకర శబ్దానికి సంబంధించి మరొక అంశం కూడా చెబుతానండి భగవద్గీతలో భగవానుడు అంటాడు రుద్రాణం శంకరస్చాస్మి అంటాడు ఏకాదశ రుద్రుల్లో నేను శంకరుని అని అంటే నేనే పరమశివుడిని అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెబుతున్నాడా అనిఅంటే కనుక కాదు దృష్టిలో పెట్టుకోండి. వృష్ణీనాం వాసుదేవోస్మి అంటాడు ఆయన అంటే యాదవులలో నేను వాసుదేవుని అని స్వయంగా వాసుదేవుడే ఆ మాట చెప్పడం ఏమిటి అలా ఉండదు కదా కావున శివుడు మరియు విష్ణువు వీళ్ళద్దరి కంటే కూడా మించినటువంటి శుద్ధ చైతన్యం ఉంటుంది చూసారా నేను మొన్న
(01:52) చెప్పినట్లుగా ఆ యొక్క శుద్ధ చైతన్య స్వరూప పరబ్రహ్మ మాట్లాడుతూ ఉన్నది శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి భగవానుడు చెబుతూ ఉన్నాడు ఆ భగవానుడు విష్ణువు కాదు శివుడు కాదు ఇద్దరిలోనూ అంతర్లీనంగా ఉన్నటువంటి పరమాత్మ ఆ పరమాత్మ చెప్పిందే భగవద్గీత ఆ పరమాత్మ అంటాడు రుద్రాణం శంకరస్చాస్మి అంటాడు అదేవిధంగా వృష్ణీనాం వాసుదేవోస్మి అంటాడండి ఆ విధంగా శివకేశవులకు భేదం లేనే లేదు ఎవ్వరు ఎన్ని కబుర్లు చెప్పినా అబద్ధం వేద విరుద్ధం దృష్టిలో పెట్టుకోండి అలా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే శంకరుడు శివుడు అనేటటువంటి పదం మనం పటించినా కూడా మనకు శుభాలు కలుగు లుగుతాయి శంకర శివ
(02:35) అన్నా కూడా మనకు అద్భుతమైనటువంటి పుణ్యం లభిస్తుంది శుభాలు కలుగుతాయి. ఆ విధంగా మన ఇష్ట దైవానికి సంబంధించినటువంటి ఆ పదానికి అర్థం ఏమిటి అని మీకు చెప్పే ప్రయత్నం చేశాను ఇక రెండవ అంశం పరమశివుడికి సంబంధించి పరమశివుడికి ఎంతమంది భార్యలు చాలామంది తెగ చర్చ చేసేస్తూ ఉంటారండి పరమశివుడికి ఎంతమంది భార్యలు స్త్రీలోలుడు అబద్ధాలు పచ్చి అబద్ధాలు సత్యం జనంలోకి వెళ్ళడం అనేది కొంత ఆలస్యం ఉంటుంది అసత్యం ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటుంది.
(03:07) ఎవరు చెప్పారండి పరమశివుడికి ఎక్కువమంది భార్యలు అని చెప్పేసి శ్రీరాముడు ఏ విధంగా ఏకపత్నీవ్రతుడో పరమశివుడు కూడా అదే విధంగా ఏకపత్నీవ్రతుడు దృష్టిలో పెట్టుకోండి. పరమశివుడికి ఉన్నటువంటి ఏకైక భార్య పార్వతీదేవి పార్వతీదేవే పూర్వజన్మలో సతీదేవి గంగాదేవి పరమశివుడి భార్య కాదు గంగావతరణ కోసం భగీరథుడు తపస్సు చేసినప్పుడు రామాయణంలో చూసుకుంటే మనం గంగ దేవలోకం నుండి ఉదృతంగా వచ్చేస్తుంది.
(03:39) ఆవిడ అంత ఉదృతంగా నేరుగా భూమిమీదకు వచ్చేస్తే కనుక ప్రమాదము అని గ్రహించినటువంటి దేవతలు గంగను ధరించమని పరమశివుని కోరమని భగీరథుడికి చెప్పారు. భగీరథుడు పరమశివుడు గురించి మళ్ళీ తపస్సు చేశాడు గంగ కోసం ఒక తపస్సు బ్రహ్మగారు గంగను అనుగ్రహిస్తాడు ఆ తర్వాత మళ్ళీ గంగను ధరించమని పరమశివుడు గురించి తపస్సు చేస్తాడు. పరమశివుడు వస్తాడు గంగను శిరస్సు మీద ధరిస్తాడు అంతే శిరస్సు మీద మోసాడు దృష్టిలో పెట్టుకోండి భరించాడు కాబట్టి భర్త అన్నారు ఆ అర్థాన్ని మనం ఇక్కడ స్పష్టంగా తీసుకోవాలి మీ అందరికీ తెలుసు కదండీ శివపార్వతుల కళ్యాణం చేస్తారు కానీ ఎక్కడైనా శివ గంగల
(04:19) కళ్యాణం చేయడం చూశారా చెయ్యరు అవకాశమే లేదు ఆ విధంగా పరమశివుడికి ఒకే ఒక్కరు భార్య పార్వతీ దేవి మాత్రమే పార్వతీదేవే పూర్వజన్మలో సతీదేవి సతీదేవే అగ్నికి తన దేహాన్ని సమర్పించుకొని మళ్ళీ పార్వతీదేవిగా హిమవంతుడికి పుట్టిందండి. అలాగ పరమశివుడు ఏకపత్నీవ్రతుడు దృష్టిలో పెట్టుకోండి ఇదే రెండవ రహస్యం ఇక మూడవ రహస్యం చూసుకుంటే శివుడు ఏ రంగులో ఉంటాడు చాలా తక్కువ మందికి తెలుసండి ఏ శివుడి చిత్రం చూసినా కూడా మనం నీలంగానో పచ్చ రంగులోనో లేకపోతే వాళ్ళకి నచ్చిన రంగులోనో వేస్తూ ఉంటారు.
(04:59) పరమశివుడు నీలంగా ఉండడు పరమశివుడు పచ్చగా ఉండడు పరమశివుడు తెల్లగా ఉంటాడు దృష్టిలో పెట్టుకోండి కర్పూర గౌరం కరుణావతారం కర్పూరం వంటి తెలుపులో ఉంటాడు పరమశివుడు ఇది కూడా చాలామందికి తెలియదు ఆయన తెల్లగా ఉంటాడు కంఠం మాత్రం నల్లగా ఉంటుంది ఆయనే నల్లగా ఉంటే కనుక లేకపోతే నీలంగా ఉంటే కనుక నీల మేఘశ్యామ అని విష్ణువు అన్నా లేకపోతే రాముణ అన్నా కృష్ణుడిని అన్నా కూడా వాళ్ళందరూ నల్లగా ఉంటారని అర్థం అర్థంఅండి వ్యక్తే నల్లగా ఉన్నప్పుడు మళ్ళీ కంఠం ప్రత్యేకంగా నల్లగా ఎందుకు కనిపిస్తుంది నీలకంఠుడు అని ఎందుకు చెబుతారు అవకాశం లేదు కదా కావున శివుడు తెల్లగా ఉంటాడు
(05:40) శివుడు కంఠం మాత్రం నల్లగా ఉంటుంది దృష్టిలో పెట్టుకోండి కావున కర్పూర గౌరం కరుణావతారము మొదలైనటువంటి శ్లోకాల ఆధారంగా మనం చూసుకున్నా కూడా శివుడు తెల్లగా ఉంటాడు అని మనకు అర్థమవుతున్నదండి. చాలామంది మహావిష్ణువునేమో ఆర్యుల దైవం అంటారు. పరమశివుడినేమో ద్రావిడుల దైవం అంటారు. చిత్రంగా వీళ్ళఏమంటారు ఆర్యులు తెల్లగా ఉంటారు అంటారు ద్రావిడులు నల్లగా ఉంటారు అంటారు.
(06:08) మరి మహావిష్ణువు నల్లగా ఎలా ఉంటాడండి ఆర్యుల దేవుడేమో నల్లగా ఉంటాడట. ద్రావిడుల దేవుడేమో తెల్లగా ఉంటాడట. ఈ విధంగా అబద్ధాల మీద అబద్ధాలు చరిత్రకారులు చేసేసారన్నమాట అండి. దృష్టిలో పెట్టుకోండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి రహస్యం. ఇక నాలుగవ విషయం అండి పరమశివుడు ఎక్కడ ఉంటాడు పరమశివుడు ఎక్కడ నివసిస్తాడు కైలాసంలో ఉంటాడు అని అందరికీ తెలుసు ఆ కైలాసం అంటే ఏమిటి మనం కైలాస మానస సరోవర యాత్ర చేస్తాం చూసారా ఉత్తరాన హిమాలయ పర్వతాల్లో అదే కైలాసం ఆ కైలాసం మీదనే పరమశివుడు ఉంటాడు సందేహం లేదు భూమి మీద భరత ఖండంలో మనతో పాటు నివసించేటటువంటి ఏకైక దైవము పరమశివుడు ఆ
(06:47) విధంగా మానవజాతి మీద పరమశివుడికి ఎంత అనుగ్రహమో చూడండి మానవులు ఉన్నటువంటి భూమి మీదే అదేవిధంగా పశుపక్ష్యాదులు జంతువులు ఉన్నటువంటి భూమి మీదే ఆయన ఉన్నాడు. అందుకే కైలాస పర్వతాన్ని అధిరోహించడం అనేది అందరికీ సాధ్యం కాదు పూర్వకాలంలో యోగులు మాత్రం సందర్శించగలిగేవారు చిట్టచివరగా నాకు తెలిసి శంకరాచార్యుల వారు మాత్రమే కైలాసానికి వెళ్లారు శశిరంగా వెళ్లి మళ్ళి వచ్చేశారు మధ్యలో వెళ్తారు సౌందర్య లహరి సందర్భం అదే ఆ విధంగా ఆయన కైలాసానికి సశరీరంగా వెళ్లి మళ్ళి వచ్చారు కావున కైలాసానికి మహా యోగులు మాత్రమే వెళ్ళగలరు మీరు చరిత్రలో కూడా చూసుకుంటే
(07:26) కైలాస పర్వతాన్ని ఎవరు పెడితే వాళ్ళు అధిరోహించలేదు ఎవరెస్ట్ పర్వతాన్ని ఎవరు పెడితే వాళ్ళు అధిరోహించి ఉండవచ్చు కానీ కైలాస పర్వతాన్ని ఇప్పటిదాకా ఒక్కడే అధిరోహించాట ఆధారాలతో సహా మనం చూసుకుంటే కనుక చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత సాంకేతికత వచ్చిన తర్వాత కూడా కైలాస పర్వతాన్ని ఎందుకు అధిరోహించలేకపోతున్నారు. పరమశివుడు అక్కడ ఉన్నాడు యోగులు మాత్రమే చేరగలిగేటటువంటి ప్రదేశం అది నాకు తెలిసి ఆ ఒక్కడు కూడా కైలాస పర్వతం పూర్తిగా పైకి వెళ్లి ఉండడు దృష్టిలో పెట్టుకోండి కావున కైలాస పర్వతం అనేటటువంటిది భూమి మీద ఉన్నది భరత ఖండంలో ఉన్నది భరత ఖండంలో
(08:07) మనమంతా కూడా శివుడితో కలిసి నివసిస్తూ ఉన్నాం అంటే భగవంతుడు మనతోనే ఉంటాడు కానీ మనం భగవంతుని చూడాలి దర్శించాలి అనిఅంటే గనుక మన మనసు పరిశుద్ధంగా ఉండాలి ఒక యోగిలాగా ఇది మనకు శివుడు చెప్పేటటువంటి విషయం. ఇక శివ క్షేత్రాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే కనుక దక్షిణ భారతదేశంలోనే పంచభూత క్షేత్రాలు ఉన్నాయి పంచభూత శైవ క్షేత్రాలు అందులో ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో నుండి శ్రీకాళహస్తి వాయులింగం పంచభూతాల్లో వాయులింగ క్షేత్రం ఏది అని అంటే శ్రీకాళహస్తి ఆకాశలింగం ఉన్నటువంటి క్షేత్రం ఏమిటి చిదంబరం తమిళనాడులో అగ్నిలింగం ఉన్నటువంటి క్షేత్రం అరుణాచలము జలలింగం ఉన్నటువంటి
(08:52) క్షేత్రము శమజపురం అంటారు తిరుచిరాపల్లి పృథివీ లింగం అంటే భూమిలింగం ఉన్నటువంటి క్షేత్రం కాంచీపురం ఈ ఐదు కూడా పంచభూత శైవ క్షేత్రాలు కాంచీపురంలో ఏకామేశ్వరుడు శమయపురంలో జంబుకేశ్వరుడు శ్రీకాళహస్తిలో కాళహస్తీశ్వరుడు అరుణాచలంలో అరుణాచలేశ్వరుడు చిదంబరంలో నటరాజస్వామి ఈ విధంగా పంచభూత శైవ క్షేత్రాలు మనం తెలుసుకోవాలి ఇక ద్వాదశ జ్యోతిర్లింగాలు మీ అందరికీ రికీ తెలిసినటువంటివే సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం సౌరాష్ట్రము అనిఅంటే గుజరాత్లో ఉంటుంది సోమనాథ జ్యోతిర్లింగం అదే మొట్టమొదటి జ్యోతిర్లింగం అండి రెండవ జ్యోతిర్లింగం
(09:34) శ్రీశైలం మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. శ్రీశైల క్షేత్రానికి మనం వెళ్ళడం మానేసి ఎక్కడో దూరాభారాలు వెళ్లి కష్టపడిపోతూ ఉంటాం. శ్రీశైల క్షేత్రం మనకు దగ్గరలో ఉన్నటువంటి రెండవ జ్యోతిర్లింగం అత్యంత మహనీయమైనటువంటి క్షేత్రం ఉజ్జయన్ మహాకాళం ఓంకారం అమరేశ్వరం ఉజ్జయిని క్షేత్రం అంటే మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్ రాజధాని అయినటువంటి భోపాలకు దగ్గరలో ఇండోరుకు దగ్గరలో ఉన్నటువంటి ఉజ్జయిని ఏదైతే ఉందో ఉజ్జైని మహాకాళ జ్యోతిర్లింగం ఎంతో శక్తివంతమైనదండి భస్మహారతి ప్రత్యేకం తప్పక సందర్శించాలి మధ్యప్రదేశ్ ఇండోరు దగ్గరలో ఉజ్జయిని ఓంకా ఓంకార మమరేశ్వరం
(10:13) ఉజ్జైనికి వెళ్ళారంటే దగ్గరలోనే ఉంటుంది ఓంకారం అక్కడి నుంచి ఒక గంటలో వెళ్ళిపోతారు మీరు ఓంకారేశ్వర జ్యోతిర్లింగం నర్మదా నది తీరంలో ఉంటుంది అది నాలుగవ జ్యోతిర్లింగం పరాల్యాం వైద్యనాథంచ డాకిన్యం భీమశంకరం వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం అండి జార్ఖండ్లో ఉంటుంది జార్ఖండ్ లోని దేవగర్ అని కొంతమంది మహారాష్ట్రలో ఉన్నటువంటి పరాలి అది వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం అంటారు రెండు సందర్శించొచ్చు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు దాకిన్యం భీమశంకరం భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో పూణే సమీపంలో ఉంటుందండి సేతు బంధేతు రామేశం తమిళనాడులో ఉన్నటువంటి
(10:53) రామేశ్వర క్షేత్రం మనందరికీ తెలుసు సముద్ర తీరంలో ఉంటుంది రామేశ్వర జ్యోతిర్లింగం నాగేశం దారుకావనే దారుకావనం ద్వారకకి దగ్గరలో ఉంటుందండి ద్వారక మహాక్షేత్రం మనందరికీ తెలుసు గుజరాత్లో ఉంటుంది. ద్వారకకు దగ్గరలోనే ఉంటుంది నాగేశ్వర జ్యోతిర్లింగం వారాణస్యాంతు విశ్వేశం వారణాసిలో అంటే కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వర ఆలయం జ్యోతిర్లింగ మహాక్షేత్రం అది మీ అందరికీ తెలిసిందే త్రయంబకం గౌతమీతటే త్రయంబక జ్యోతిర్లింగం గౌతమీ తటంలో అంటే గోదావరి తీరంలో ఉంటుంది ఎక్కడ మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలో ఉంటుంది త్రయంబక జ్యోతిర్లింగం హిమాలయేతు కేదారం
(11:33) కేదార్నాథ్ మీ అందరికీ తెలుసు కేదార్నాథో బద్రీనాథో ప్రత్యేకమైనటువంటి యాత్ర మనమంతా కూడా చేస్తాం కేదార్నాథ జ్యోతిర్లింగం 11వదండి కృష్ణేశంచ శివాలయే ఇది కూడా మహారాష్ట్రలో శంభాజీ నగరికి దగ్గరలో ఉంటుందండి ఆ యొక్క గృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఈ విధంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే 12 జ్యోతిర్లింగాలు ఐదు పంచభూత మహాక్షేత్రాలు మీకు చెప్పే ప్రయత్నం చేశాను.
(12:00) అలాగే శివుడికి ఇష్టమైనటువంటి పువ్వులు ఏమిటి ఈ అంశం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు బిల్వములు ఆ తర్వాత తుమ్మ పువ్వులు ఎర్రటి గన్నేరు కరవీరం అంటారు ఎర్రటి గన్నేరు పువ్వులు ఇవి శివుడికి ఇష్టంఅండి బిల్వదళాలు ఎర్రగన్నేరు పువ్వులు తుమ్మ పువ్వులు ఉమ్మెత్త పువ్వులు కూడా చాలా ఇష్టం ఆయనకి కాడ ఎర్రగా ఉండాలి పువ్వు తెల్లగా ఉండాలి ఆ ఉమ్మెత్త పువ్వు అని అంటే పరమశివుడికి చాలా ఇష్టం ఇవి మాత్రమే కాకుండా మల్లె పువ్వులతో కూడా శివుణని పూజించవచ్చు మల్లికార్జున జ్యోతిర్లింగంలో మనం చూస్తాం ఇవి మాత్రమే కాకుండా భారతదేశానికే
(12:37) సంబంధించినటువంటి సువాసన కలిగినటువంటి పువ్వుల్ని పరమశివుడికి సమర్పించవచ్చు పూర్తిగా భారతీయ పుష్పాలు వాటితోనే పూజించాలి. మొగలి పువ్వుల్ని పూజించకూడదు మొగలి పువ్వులతో శివుణని పూజించకూడదు సంపెంగ పువ్వులతో కూడా పూజించకూడదు దృష్టిలో పెట్టుకోండి శివుడికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఏమిటి అనిఅంటే కనుక దద్యోదరం ముఖ్యమైనది ఆ తర్వాత పళ్ళు పరమాన్నం కూడా పెట్టవచ్చు ముద్గా అన్నం కూడా ఆయనకు ఇష్టమే ఇంకొక అంశం అండి భక్తుల పాలిట శివుడి అనుగ్రహం ఎలా ఉంటుంది అని శివుడు భోళాశంకరుడు అని పేరు మనం ఎంత పూజ చేస్తే ఆయన అంత అనుగ్రహాన్ని ఇస్తాడు
(13:15) అంతటి మహాత్ముడు బాణాసురుడు యొక్క తపస్సు మనందరికీ తెలుసు భాగవతంలో ఉంటుంది ఈ కథ బాణాసురుడు తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షం అవుతాడు ఏం వరం కావాలయ్యా అంటే నా రాజ్యానికి నువ్వే రక్షకుడిగా ఉండు అని చెప్పేసి అడుగుతాడు ఆయన అంటే కాపలాదారుడు అనే మాట మనం మాట్లాడకూడదు కానీ బాణాశరుడు యొక్క రాజ్యానికి సంపూర్ణమైనటువంటి రక్షణ శాఖ అధిపతిగా పరమశివుడు ఉండిపోయాడండి.
(13:42) ఆ విధంగా భక్తుడు కోసం కైలాసాన్ని విడిచిపెట్టి పార్వతీదేవిని విడిచిపెట్టి ఆయన బాణాసురుడి యొక్క నగరానికి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్నాడు భక్తుల పాలిట పరమశివుడు అనుగ్రహం అది ఇకపోతే శివలింగాన్ని పూజిస్తే ఎక్కువ ఫలితమా లేకపోతే శివ విగ్రహాన్ని పూజిస్తే ఎక్కువ ఫలితమా అంటే శివలింగాన్ని పూజిస్తేనే ఎక్కువ అనుగ్రహం వస్తుంది మనకి మహాభారతంలో అశ్వత్థామ ఉంటాడండి అశ్వత్థామ ఏం చేస్తాడు కురుక్షేత్రంలో ఆజ్ఞయాస్త్రం అని ఒక అస్త్రం వేస్తాడు.
(14:10) ఆజ్ఞయాస్త్రంలోరెండు లక్షల మంది సైనికులు మరణిస్తారు పాండవుల వైపు మొత్తం అంతా కూడా పొగ నల్లటి పొగ ఆవరించి ఉంటుంది. ఈ యొక్క మహా ఆస్త్రంలో అందరూ చనిపోయి ఉంటారు కృష్ణార్జునులతో సహా అని చెప్పేసి అశ్వత్థామ భావిస్తాడు వీళ్ళందరూ పండగ చేసుకుంటూ ఉంటారు. ఒక్క గడియలో చూస్తే మొత్తం పొగంతా పోతుందిరెండు లక్షల మంది చనిపోయి ఉంటారు కృష్ణార్జునులు మాత్రం రథం మీద అలాగే ఉంటారండి ఆశ్చర్యపోతాడు కంగు తింటాడు ఏమిటి ఇంత పెద్ద అస్త్రం వేసానా రెండు లక్షల మంది చనిపోయారా వీళ్ళిద్దరూ మాత్రం వాళ్ళకి ఏమి అవ్వకపోవడం ఏమిటి కనీసం చిన్న ఘాటైనా పడాలి కదా అని చెప్పేసి అనుకొని భావించి
(14:49) బాధపడి నిచేష్టుడై నిరాశతో అస్త్రాలన్నీ అక్కడ పడేస్తాడు పడేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతూ ఉంటే వ్యాస మహర్షి కనిపిస్తాడు దర్శనం ఇస్తాడు వ్యాస మహర్షిని ఈ యొక్క ప్రశ్న వేస్తాడు ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అప్పుడు వ్యాస మహర్షి నరనారాయణులు అనేటటువంటి వాళ్ళద్దరు శ్రీకృష్ణ పరమాత్మ మరియు అర్జునులు వాళ్ళ యొక్క పూర్వ జన్మ అదంతా కూడా మహాభారతంలో ఉంటుంది మనం గత వీడియోలో చెప్పుకున్నాం ఆ కథంతా చెప్పి అంత మాత్రమే కాదయ్యా పూర్వ జన్మలలో నువ్వు పరమశివుని విగ్రహం రూపంలో పూజించావు వాళ్ళద్దరూ కూడా లింగాకారంలో పూజించారు అందు అందుకని నీకంటే వాళ్ళే
(15:27) ఎక్కువ బలవంతులు అని చెప్పేస్తాడు. ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు శివలింగాన్నే అర్చించాలి అదే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. శివుని అవతారాలు ఏమిటేమిటి అనేది మరొక రహస్యం అండి మీకు తెలిసినవి చాలా ఉన్నాయి ఏవో నాకు తెలిసినవి కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. దుర్వాస మహర్షి శివుడి అవతారం అండి అత్రి మహర్షి అనసూయ దంపతులకు జన్మిస్తాడు.
(15:49) దుర్వాసుడు, చంద్రుడు, దత్తాత్రేయుడు ముగ్గురు అన్నదమ్ములు. ఆ విధంగా దుర్వాస మహర్షి శివాంశ సంభూతుడు అదేవిధంగా శంకరాచార్యుల వారు శివాంశ సంభూతులు ఆంజనేయ స్వామి శివాంశ సంభూతుడు నందీశ్వరుడు వీరభద్రుడు వీళ్ళందరూ కూడా శివాంశ సంభూతులే ఇక చివరగా పదవ రహస్యం అండి వేదంలో శివుడు గురించే ఉంది అని అంటే గనుక చాలామంది అంటారు వేదంలో అసలు శివుడి గురించి లేదండి వేదైవం కాదు శివుడు అని అంటూ ఉంటారు చాలా తప్పు చాలా అబద్ధం కృష్ణ యజుర్వేదంలో సంహితలోనే మీరు చూసుకు కుంటే రుద్రాధ్యాయము అని ఉంటుంది మొత్తం శివుడి గురించేనండి ఆ రుద్రాధ్యాయంలో నీలగ్రీవాశతి కంఠాహ అని
(16:28) అద్భుతమైనటువంటి వాక్యాలన్నీ ఉంటాయి అందులోనే వ్యుప్తకేశాయచ అని ఒక నామం ఉంటుంది వ్యుప్తకేశ అంటే అసలు జుట్టు లేనివాడు గుండు ఎవరు అని అంటే కనుక యతి రూపంలో సన్యాసి రూపంలో వచ్చినటువంటి శివుడు అని ఆయనే శంకరాచార్యులు దృష్టిలో పెట్టుకోండి అదేమిటంటే వేదాలు ఎప్పుడో వచ్చేసాయి ఈ మధ్యన వచ్చినటువంటి శంకరుల గురించి వేదంలో ఎలా ఉంటుంది అని అంటే ప్రతి కల్పంలోనూ కూడా శంకరులు అవతరిస్తూనే ఉంటారు.
(16:57) అలా చూసుకున్నప్పుడు వేదంలో ఎల్లప్పుడూ అవతరించేటటువంటి శంకరుల గురించి ఉన్నది యుక్తకేశాయచ అనేటటువంటిది శంకరాచార్యుల వారికి అన్వయిస్తుంది. ఈ విధంగా ఈ మహాశివరాత్రి సందర్భంగా పరమశివుడు గురించి కొన్ని అంశాలు అంటే పదే పదే రహస్యాలు మీకు చెప్పగలిగాను అని భావిస్తున్నాను. శివుడికి సంబంధించి ఇంకేమైనా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పక తెలియజేయండి స్వస్తి
No comments:
Post a Comment