*💯 *రోజులHFN St🌍ryతో*
♥️ *కథ-10* ♥️
_*చదవడానికి ముందు కళ్ళు మృదువుగా మూసుకోండి... చిరునవ్వుతో... మీ దృష్టిని మీ హృదయంలోకి తీసుకురండి... మరియు మీ హృదయంలో ఉన్న దివ్యకాంతిని అనుభూతి చెందండి... నెమ్మదిగా కళ్లు తెరిచి చదవడం కొనసాగించండి...*_
*బాతులు అరుస్తాయి, డేగలు ఎగురుతాయి ( Ducks quacks,Eagles soar)*
నేను విమానాశ్రయానికి వెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకున్నాను.
క్యాబ్ వచ్చి ఆగినప్పుడు, నేను గమనించిన మొదటి విషయం ఏమిటంటే, టాక్సీ కారు శుభ్రముగా పాలిష్ చేయబడింది.
క్యాబ్ డ్రైవర్ చక్కగా తెల్లటి చొక్కా, నలుపు రంగు టై మరియు నల్లటి స్లాక్స్ వేసుకొని, నా కోసం వెనుక తలుపు తెరవడానికి కారు దిగినాడు.
అతను నాకు లామినేటెడ్ కార్డ్‌ని అందజేసి, "నేను అనిరుధ్ మీ డ్రైవర్‌ని. నేను మీ బ్యాగ్‌లను ట్రంక్‌లో లోడ్ చేస్తున్నప్పుడు, మీరు నా మిషన్ స్టేట్‌మెంట్ చదవాలని కోరుకుంటున్నాను."
నేను చాలా ఆశ్చర్య పోయి,కార్డు తీసుకొని చదవడం ప్రారంభించాను.
అందులో ---
*అనిరుధ్ మిషన్ స్టేట్మెంట్:*
స్నేహపూర్వక వాతావరణంలో సాధ్యమైనంత త్వరగా, సురక్షితమైన, సులభమైన మార్గంలో నా కస్టమర్‌లను వారి గమ్యస్థానానికి చెరుస్తాను.
ఇది నన్ను కదిలించింది.
ముఖ్యంగా క్యాబ్ లోపలి భాగం బయటికి సరిపోలడం గమనించాను.
మచ్చలేని శుభ్రత!
అనిరుధ్ అడిగాడు, "మీకు ఒక కప్పు కాఫీ కావాలా? నా దగ్గర థర్మోఫ్లాస్క లో కాఫీ ఉంది."
నేను సరదాగా బదులిచ్చాను, 'లేదు, నేను కూల్ డ్రింక్స్ ఇష్టపడతాను'.
అనిరుధ్ నవ్వి, "ఏం పర్వాలేదు. నా దగ్గర రెగ్యులర్ మరియు డైట్ కోక్, లస్సీ, వాటర్ మరియు ఆరెంజ్ జ్యూస్ కూడా ఉన్నాయి."
"నేను లస్సీ తీసుకుంటాను" అని అన్నాను.
నాకు లస్సీ అందజేస్తూ, అనిరుధ్, 'మీకు ఏదైనా చదవాలనిపిస్తే, ఈరోజు నా దగ్గర టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్ మరియు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి' అని చెప్పాడు.
ట్రాఫిక్ తగ్గుముఖం పడుతుండగా, అనిరుధ్ నాకు మరో లామినేటెడ్ కార్డ్ ఇచ్చాడు, మీరు రేడియో వినాలనుకుంటే, ఏవి ప్లే చేయాలో చెప్పండి ,నేను ప్లే చేస్తాను. అని అన్నాడు
అది చాలదన్నట్లు అనిరుధ్ నాకు ఎయిర్ కండిషనింగ్ ఉందని చెప్పి టెంపరేచర్ నాకు సౌకర్యంగా ఉందా, అని అడిగాడు.
అప్పుడు అతను ఆ రోజు సమయానికి నా గమ్యస్థానానికి బేస్ట్ రూట్ గురించి నాకు సలహా ఇచ్చాడు. అక్కడ టూరిస్ట్ ప్లేసెస్ గురించి కూడా చాలా చక్కగా చెప్పినాడు.
నేను ఆశ్చర్యపోతూ, అనిరుద్ధ్ తో నువ్వు ఎప్పుడూ ఇలాగే కస్టమర్లకు సేవ చేశావా?” అని అడిగాను.
అనిరుధ్ రియర్ వ్యూ ( rear view) అద్దంలో నుంచి నవ్వుతూ కనిపించినాడు.
"లేదు, ఎల్లప్పుడూ కాదు. నిజానికి, ఇది గత రెండేళ్లలో మాత్రమే. నా మొదటి ఐదేళ్లు డ్రైవింగ్ చేస్తూ, మిగిలిన క్యాబ్‌లందరిలాగే నేను ఎక్కువ సమయం ఫిర్యాదు చేస్తూ గడిపాను.
అప్పుడు, నేను ఒక రోజు *పవర్ ఆఫ్ చాయిస్(POWER OF* *CHOICE)* గురించి విన్నాను.
పవర్ ఆఫ్ ఛాయిస్ ఏమిటంటే మీరు బాతు లేదా డేగ కావచ్చు.
మీరు ఉదయాన్నే లేచి,ఈరోజు బాగుండదు అంటే నిజగానే బాగుండదు.
ఫిర్యాదు చేయడం ఆపు!"
కొంత సేపటికి తరువాత మాట్లాడడం కొనసాగించాడు.
*'బాతులా ఉండకు.
ఒక డేగగా ఉండండి.
బాతులు అరుస్తాయి (quacks) మరియు ఫిర్యాదు చేస్తాయి.
డేగాలుఎగురుతాయి.'*
"అది నాకు బాగా తగిలింది" అన్నాడు అనిరుధ్.
"ఇది నా గురించే. నేను ఎప్పుడూ, అరుస్తూ,ఫిర్యాదు చేస్తూ ఉండేవాడిని, కాబట్టి నేను నా వైఖరిని మార్చుకుని డేగగా మారాలని నిర్ణయించుకున్నాను. నేను ఇతర క్యాబ్‌లు మరియు డ్రైవర్ల వైపు చూసినపుడు, క్యాబ్‌లు మురికిగా ఉన్నాయి, డ్రైవర్లు కస్టమర్లుతో స్నేహపూర్వకంగా లేరు.
నా కస్టమర్‌లు బాగా స్పందించాలంటే నేను కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించుకున్నాను."
"ఈ పవర్ ఆఫ్ ఛాయిస్ మీకు బాగా పని చేసిందనుకుంటా?" అన్నాను.
" ఖచ్చితంగా పని చేసింది," అనిరుధ్ నవ్వుతూ బదులిచ్చాడు.
"డేగగా నా మొదటి సంవత్సరం, నేను మునుపటి సంవత్సరం కంటే నా ఆదాయాన్ని రెట్టింపు చేసాను. ఈ సంవత్సరం నేను బహుశా దానిని నాలుగు రెట్లు పెంచుతాను. నా కస్టమర్‌లు నా సెల్ ఫోన్‌లో అపాయింట్‌మెంట్‌ల కోసం నాకు కాల్ చేస్తారు లేదా సందేశం ( message) పెడుతారు."
అనిరుధ్ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు,
"అతను బాతులాగా అరవడం మానేసి, డేగలా ఎగరడం ప్రారంభించాలని"
_మనం నీటిలో పడి మరణించము, ఈత రాకపోతేనే మరణిస్తాం.
మనల్ని మరియు మన సామర్థ్యాలను వేరే విధంగా మార్చుకోవడం ద్వారా, మనం మన ఆలోచన కంటే ఉన్నతంగా ఎగరగలము, డేగలాగా .ఈ ఎంపిక మనదే._
*"కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి మరియు అర్థం చేసుకోవడానికి యువతకు సువర్ణావకాశం ఉంది, మరియు ఈ సామర్థ్యాన్ని తెలివిగా ఉపయోగించినట్లయితే, అది ప్రపంచాన్ని జయించటానికి వారికి సహాయపడుతుంది."*
♾️
*"ధ్యానాన్ని అభ్యసించడం వల్ల అవగాహన ఏర్పడుతుంది. అప్పుడు మనం మన ప్రవర్తనా విధానాలను మార్చుకోవచ్చు మరియు ఈ అవగాహనను ఉపయోగించి ధోరణులను మెరుగుపర్చడానికి ప్రయత్నించవచ్చు మరియు స్వీయ-అధ్యయన ప్రక్రియ ద్వారా మన జీవనశైలిని రూపొందించుకోవచ్చు."*
*దాజీ*
హృదయపూర్వక ధ్యానం 💌
HFN Story team
x
Sunday, February 15, 2026
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment