1010a1;162f1;
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀ఆ.స.377.
నేటి….
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*శ్రీరామచంద్రమిషన్ లో గురువర్యులు శ్రీరామచంద్ర(బాబూజీ) తమ శిష్యులు (అభ్యాసీలకు) ఎలాంటి ప్రేమ ఉండాలో తెలుపుతూ గురునానక్ కథ ఒకటి చెప్పారు….*
*శ్రీ గురు నానక్ కు ఐదారేళ్ల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు మరణించారు. అతని అక్క బావ అతన్ని చేరదీశారు. కొన్నేళ్ళు పెంచిన తరువాత ధాన్యం తూచే దుకాణంలో అతడిని ఉద్యోగానికి ఉంచారు.*
*అక్కడ తూచి లెక్క పెట్ట వలసి వచ్చినప్పుడు ఒకటి, రెండు, మూడు.... ఇలా పన్నెండు దాకా చెప్పి 13 వచ్చేసరికి 'తేరా' 'తేరా' అంటూ ఆ తర్వాత ఎన్ని సార్లైనా ఆపదమే పలికే వాడట.*
*ఆ యజమాని ఇతనికి తరువాతి సంఖ్యలు రావేమోనని భావించి, అదే గురునానక్ బావగారితో చెప్పాడు.*
*ఇంటిలోని వారందరూ గురునానక్ కు అన్ని సంఖ్యలూ వచ్చు అనే చెప్పారు.*
*లోపల నిద్రిస్తున్న గురునానక్ ను లేపి అడగ్గా, గురునానక్ సమాధానంగా “నాకు వచ్చు, 'తేరా'తర్వాత చాలా సంఖ్యలు ఉన్నాయి. కానీ 'తేరా' (నీవాడిని) అని అనగానే 'వారి' అంటే ఆ భగవంతుని ధ్యాసలో పడి పోతున్నాను. 'వారి' వాడిని అయిపోతున్నాను. ఇంకా ఏమీ గుర్తు ఉండదు". అని చెప్పాడు.* *ప్రేమంటే ఇదే అని బాబూజీ చెప్పారు.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
ఇలాంటి మంచి విషయాలకోసం…
“భగవంతుని విషయాలు గ్రూప్”లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 8712184465. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏```
No comments:
Post a Comment