వాస్తు వేదం నుండి ఉధ్భవించింది. వేదాంగాలలో ఒకటైన జ్యోతిష్యం నుండి వాస్తు జన్మించింది. వాస్తుశాస్త్రం ను 18 మంది మహర్షులు అందించినట్లుగా మత్స్త్యపురాణం తెలియజేస్తుంది. ఈ శ్లోకాన్ని గమనించండి.
“భృగు అత్రి వశిష్ట శ్చ్హ విశ్వకర్మా మయ స్తధా
నారదో నిగ్నాజీశ్చైవ విశాలాక్ష: పురందర:
బ్రహ్మకుమారో నందీశ సౌనాకో గర్గ ఏవచ
వాసుదేవో నిరుదశ్చ్హ తధా శుక్రో బృహస్పతి:
ఆష్ట దశైతే విఖ్యాత వాస్తు శాస్త్రపదేశకా;”
"మత్స్థ్యపురాణం"
వాస్తు నవీనమైనది కాదు. పై శ్లోకం ఈ విషయాన్నే స్పష్టం చేస్తుంది.వాస్తు, వేదాంగమైన జ్యోతిష్యం లోని సంహిత విభాగానికి చెందుతుంది. సమరాంగణ సూత్రధారము, మయమతము, విశ్వకర్మప్రకాశిక, వసిష్ట సంహిత, నారదసంహిత,,పద్మపురాణం, అపరాజిత పృచ్చ,మొదలైన గ్రంధాలలో వాస్తు ఉదహరింపబడినది. మహాభారతములో మయసభ వర్ణనలో ఇంకా రామాయణం లో లంకా పట్టణ వర్ణనలో వాస్తు అంశాలు ఇమిడిఉన్నాయి.. సింధులోయ నాగరికత లో పట్టణాలు, గృహనిర్మాణాలు వాస్తు సూత్రాలకు అనుగుణంగా ఉన్నాయని పండితుల విశ్వాసం. ఈ అంశాలను పరిశీలిస్తే వాస్తు అత్యంత ప్రాచీనమైన శాస్త్రం అని తెలుస్తుంది....నామనసిద్ధాంతి
ప్రకృతి పరిస్థితులకు అనుగుణంగా వాస్తు రూపొందించబడింది. మనదేశం లో ఉన్న వాతావరణాన్ని దృష్టిలోఉంచుకొని మన మహర్షులు వాస్తును మనకు అందించారు. ఇది మూఢనమ్మకం కాదు. ఇందులో ఎంతో విజ్ఞానం ఇమిడిఉంది. మనదేశం భూమిపై తూర్పు భాగంలో ఉంది. దక్షిణ,నైరుతి,పడమర గుండా ప్రపంచ గాలులు మనదేశానికి వీస్తాయి. ఈ దక్షిణ, నైరుతి ,పడమర గాలులు తూర్పు, ఉత్తర, మరియు ఈశాన్యం వైపుకు వీస్తాయి. ఈ గాలి వీచే అంశాన్ని దృష్టి లో ఉంచుకొని ముఖ్యమైన కొన్ని వాస్తు విషయాలు రూపొందించబడ్డాయి. నీరు ఉండవలసిన స్థానాలు, వాస్తులోని ఎత్తుపల్లాల నియమాలు ఈ గాలి వీచే పద్దతి పైనే సూచించబడ్డాయి.. నీరు ఈశాన్యం,తూర్పు మరియు ఉత్తరం దిశలలో ఉండాలని వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది. అందుకే మనం బావులు, బోర్లు నీటి ట్యాంకులు అన్నీ ఈ దిశలందే ఉంచుతున్నాము. ఈ నీటిని దక్షిణ, పడమర మరియు నైరుతి ప్రాంతాలందు ఉంచితే తీవ్ర నష్టాలు వస్తాయని వాస్తు తెలుపుతుంది. ఈ నియమమం లో అంతర్లీనంగా వైజ్ఞానిక అంశం ఇమిడిఉంది. మనదేశంలో గాలి దక్షిణం,నైరుతి,పడమర నుండి తూర్పు, ఉత్తర, ఈశాన్యం వైపుకు వీస్తుంది..నిల్వ ఉన్న నీరు సూక్ష్మజీవులకు ఆవాసంగా మారుతుంది. నీరు గృహానికి దక్షిణ,నైరుతి, పడమర దిశలల్లో ఉంటే ఈ నీటి పై నుండి గాలి వీస్తుంది. అప్పుడు ఈ గాలితో పాటు నిల్వ నీటి పై ఉండే సూక్ష్మజీవులు తూర్పు ఉత్తరంగా ప్రయాణించి ఇంట్లోకి చేరతాయి. దీని వలన అనేక ఆరోగ్య సమస్యలు గృహంలో ఉండేవారికి కలుగుతాయి.తద్వారా కుటుంబం రోగగ్రస్తం అవుతుంది. అందుకే ఈ దిశలందు నీటిని ఉంచకుండా తూర్పు,ఉత్తర, ఈశాన్యాలలో ఉంచమని వాస్తు చెపుతుంది. ఈ దిశలందు నీటిని ఉంచినట్లైతే విషక్రిములు ఇంట్లోకి రాకుండా బయటకు పోతాయి. అందుకే ఇంటికి దూరంగా ఈ దిశలందు నీటిని ఉంచాలి. నిల్వ నీటిపై నుండి గాలి గృహం వెలుపలికి పోయే విధంగా వాస్తు సూత్రాలను రూపొందించారు. నీరు తూర్పు,ఉత్తర,ఈశాన్యమూలందు ఉంటే ఇంట్లో ఉండేవారికి నష్టం రాదు. ఎందుకంటే వీచే గాలి నిల్వ నీటి పై నుండి ఇంటి వెలుపలికి వెళ్లిపోగలదు.
వాస్తుప్రకారం దక్షిణం.పడమర దిశలు, తూర్పు,ఉత్తర దిశలకన్నా ఎత్తులోఉండాలి. . అన్ని రకాల నిర్మాణాలలో తూర్పు,ఉత్తరం దిశలను పల్లంగా ఉంచాలని వాస్తు తెలుపుతుంది. దీనిలో కూడా శాస్రీయత ఉంది. పడమర. దక్షిణ దిశలలో నీరు ఉంటే ఆరోగ్యానికి చేటు. ఇక్కడ వర్షపు నీరు ,వాడుక నీరు నిల్వ ఉండకుండా తూర్పు,ఉత్తర దిశలను పల్లంగా ఉంచాలని వాస్తు తెలుపుతుంది. దక్షిణం,పడమర లను తూర్పు,ఉత్తరాలకన్నా మెరకలొ ఉంచితే ఉపయోగించిన నీరు, వర్షపునీరు దక్షిణ పడమరలలో ఉండకుండా తూర్పు,ఉత్తరాలవైపు వెళతాయి.అక్కడి నుండి గృహం వెలుపలకు పంపితే ఎటువంటి నష్టం ఉండదు. అందుకనే ఇంట్లోని వాడుక నీటిని తూర్పు,ఉత్తర, ఈశాన్యాల గుండా వెలుపలికి పంపమని వాస్తు నిర్దేశిస్తుంది.దక్షిణ,నైరుతి,పడమర దిశలలో నీరు నిలవ ఉండకుండా చేసేందుకు మహర్షులు ఈ నియమాన్ని ఏర్పరిచారు. పూర్వకాలం లో డ్రైనేజ్ వ్యవస్థ అంతగా ఉండేది కాdu. ✍️Naamanasiddanthi *?.
No comments:
Post a Comment