*మీరు ఈ విషయాన్ని చాలా గట్టిగా పట్టుకోవాలి సుమా!*
♦ మనిషి జీవితంలో శ్రేయోమార్గం, ప్రేయోమార్గం అని రెండు ఉంటాయి. అవి రెండు మనిషిని చెప్పు చేతల్లో పెట్టుకుని వేరు వేరు మార్గాలకు చేరవేస్తాయి. శ్రేయోమార్గం జీవితాన్ని ఉద్దరిస్తే, ప్రేయోమార్గం జీవితాన్ని కష్టాలవైపు నెట్టేస్తుంది!
~ కఠోపనిషద్
• • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • •
♦ “ప్రేయో మార్గం, శ్రేయో మార్గం”
మనుష్య జీవితంలో రెండు మార్గాలు ఉన్నాయి.
1) ప్రేయో మార్గం 2) శ్రేయో మార్గం
మనస్సుకు నచ్చినది ప్రేయో మార్గం.
బుద్ధికి నచ్చినది శ్రేయో మార్గం.
ఆత్మజ్ఞానం లేని వారికి బుద్ధి ఉండదు.
ఆత్మానుభవం వున్న వారికి మనస్సు ఉండదు; బుద్ధి ఉంటుంది.
ఆకలి లేకపోయినా తినవచ్చు. కాని తినాలి అంటుంది మనస్సు; అకలి ఉన్నప్పుడే తినాలి అంటుంది బుద్ధి.
కామక్రీడల్లో బలాత్కారం చేయవచ్చంటుంది మనస్సు;
ఇరు ప్రక్కలా పూర్తి ఇచ్చ ఉన్నప్పుడే కామక్రీడ సలపాలి అని చెప్పేది బుద్ధి.
మనస్సు చెప్పేది ప్రేయో మార్గం;
బుద్ధి చెప్పేది శ్రేయో మార్గం;
మనస్సు దుఃఖం, బుద్ధి అనందం.
మనస్సు అసత్యం; బుద్ధి శాశ్వతం.
మనస్సు అశాశ్వతం; బుద్ధి శాశ్వతం.
మనస్సు పరిపరివిధాలు; బుద్ధి ఏక విధానం.
ధ్యానం మనస్సును కట్టడి చేస్తుంది.
ధ్యానం విద్యే యోగ విద్య.
ప్రేయో మార్గంలో వుండేవాడే, మనస్సుకు లోబడి ఉండేవాడే మానవుడు:
శ్రేయో మార్గంలో ఉండేవాడే, బుద్ధికి లోబడి ఉండేవాడే బుద్ధుడు.
ప్రతి మనిషి మనస్సు నుండి బుద్ధి దగ్గరకు ప్రమోషన్ తెచ్చుకోవాలి.
ఇది ఒకరిచ్చే ప్రమోషన్ కాదు, ఎవరికి వారే సాధించుకోవాలి.
నిత్య ధ్యాన సాధన ద్వారా నలభై రోజుల్లో ఈ ప్రమోషన్ వస్తుంది –
… ఇదే పై లోకాల్లో ఉన్న అందరి బుద్ధుళ్ళ అందరి బుద్ధి జీవుల సందేశం.
No comments:
Post a Comment