*కర్పూర హారతి ఎలా తీసుకోవాలి?*
చాలా మంది మంగళ హారతిని రెండు చేతులద్వారా తీసుకుంటాము.
కానీ, ఆరతిని కుడి చేత్తో మాత్రమే తీసుకోవాలి... ఈ విషయాన్ని స్వయంగా వరాహస్వామివారే తన ధర్మపత్నికి తెలిపాడట.
ఆరతిని కుడి చేత్తో తీసుకుని.. మొదట తలపై
తీసుకుని, తరువాత హృదయ భాగంలో.
ఆ తరువాత నాభికి ఎడమభాగంలో స్పర్శించాలి.
ఈ విధంగా చేయడం వలన శిరస్సుపై ఉండే అమృతాన్ని హృదయానికి తీసుకువచ్చి, హృదయంలో ఉండే అగ్ని.. నాభి ఎడమభాగంలో ఉన్న మన పాపాలను కాల్చి వేస్తుంది. అపుడు మన దేహం శుద్ధి అవుతుందట.
ఆరతి తీసుకున్న ప్రతిసారీ ఈ అనుసంధానం ముఖ్యం.
No comments:
Post a Comment