నువ్వూ నేనూ ఒక్కటే! | Advaita Vedanta in Telugu | Life Changing Philosophy #advaitavedanta #advaita
Author Name:Margadarsi Telugu Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=QBxA9PWaRr4
Transcript:
(00:01) హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ నిఖిల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గాను మరియు మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేయగల శక్తి ఉన్న టాపిక్ అదే అద్వైతం ఫ్రెండ్స్ మన లైఫ్ లో మనం నిత్యం ఎదుర్కునే సమస్య ఏంటంటే మనం ప్రతిదాన్ని డివైడ్ చేస్తాం. ఇది నాది ఇది నాది అది వాళ్ళది నేను సక్సెస్ అయ్యాను వాడు ఫెయిల్ అయ్యాడు.
(00:30) నేను వేరు ఈ ప్రపంచం వేరని ఈ డ్యూయాలిటీ ఎప్పుడూ మనల్ని ఒక టెన్షన్ లో ఒక కన్ఫ్యూజన్ లో ఉంచుతుంది. అద్వైతం ఏం చెబుతుందంటే ఈ డివిజన్ ఈ తేడా కేవలం మీ మైండ్ లో మాత్రమే ఉంది. అసలు నిజం ఏంటంటే ఉన్నది ఒక్కటే అదే అద్వైతం. అద్వైతం అనే పదానికి అర్థం ఎంత సింపులో దాని ఇంపాక్ట్ అంత పెద్దది. ఆ అంటే లేదు ద్వైతం అంటే రెండవది రెండవది లేదు అంటే ఇక్కడ రెండు ఎలిమెంట్స్ లేవు అంతా ఒకే మూలం నుంచి వచ్చిందని అర్థం మనకు ఈ విషయాన్ని క్లియర్ గా చెప్పింది శంకరాచార్యుల వారు ఆయన ఇచ్చిన ఆ సూత్రం ఒకసారి గుర్తు చేసుకుందాం.
(01:12) బ్రహ్మం సత్యం జగత్ మిత్య జీవో బ్రహ్మైవ నాపరః చూడండి ఆయన ఎంత క్లియర్ గా చెప్పారు. ఒకే ఒక్క నిజం ఉంది అదే బ్రహ్మం మనం చూస్తున్న ఈ ప్రపంచం మన అనుభవాలన్నీ మాయ లాంటివి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనలోని ఆత్మ ఆ బ్రహ్మం వేరు వేరు కాదు. నువ్వు నేను ఈ ప్రపంచము. అన్నీ ఆ సత్యం యొక్క రూపాలే. కానీ మనక ఎందుకు వేరుగా అనిపిస్తుంది మీరు అనుకోవచ్చు సరే అంతా ఒక్కటే అయితే నా కడుపులో నొప్పి వస్తే పక్కింటి వాడికి ఎందుకు నొప్పి రావడం లేదు ఇక్కడే మాయ అనే కాన్సెప్ట్ ఎంటర్ అవుతుంది.
(01:50) దీన్ని సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. జస్ట్ ఇమాజిన్ ఒక బల్బు ఉంది. ఆ బల్బులో కరెంటు ఉంది. ఆ కరెంట్ కారణంగానే అది వెలుగుతోంది. ఇప్పుడు మనం ఆ కరెంటును బ్రహ్మం అనుకుందాం. అది అఖండమైంది అనంతమైంది. ఆ కరెంట్ వందలాది బల్బుల్లో ఉంది. ప్రతి బల్బు వేరు వేరుగా ఉండొచ్చు దాని పవర్ కూడా వేరుగా ఉండొచ్చు.
(02:15) దాని రంగు వేరుగా ఉండొచ్చు. కానీ ప్రతి బల్బును వెలిగిస్తున్న ఎనర్జీ మాత్రం ఒక్కటే కదా ఆ కరెంటు కు డివిజన్ లేదు కదా అలాగే మన శరీరాలు మనసులు వేరు. కానీ మనల్ని బ్రతికిస్తున్న చైతన్యం మాత్రం ఆ బ్రహ్మం నుండి వచ్చిందే. ఈ జ్ఞానం మన లైఫ్ ని ఎలా మారుస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్ అద్వైతం గురించి తెలుసుకోవడం వల్ల మన లైఫ్ లో మనకు కలిగే అత్యంత పెద్ద లాభం ఏంటంటే మనకు భయం పోతుంది.
(02:43) ఎలా అంటారా ఒక చిన్న ఎగ్జాంపుల్ ని ఇప్పుడు చూద్దాం. మీరు ఒక గదిలో ఒంటరిగా ఉన్నారు. కానీ మీకు హటాత్తుగా ఎవరో వెనక నుంచి వచ్చి మిమ్మల్ని కొడతారేమో అని భయం వేస్తుంది. ఎందుకంటే మీరు వేరు కొట్టే వ్యక్తి వేరని మీరు అనుకుంటున్నారు కాబట్టి కానీ ఒకవేళ మీరు రియలైజ్ అయ్యి వెనక నుంచి కొట్టబోయేది కూడా మీరేనని ఫీల్ అయితే అప్పుడు మీరు భయపడతారా? లేదు కదా ఎందుకంటే మీ చేయి మిమ్మల్నే కొట్టుకోదు కదా అలాగే మీరు ఈ విశ్వం నుంచి వేరు కాదు మీరు కూడా ఈ విశ్వంలో భాగమే ఇది మీకు అర్థమైతే మరణభయం పోతుంది.
(03:22) ఎందుకంటే ఆత్మకు చావు లేదనే విషయం మీకు తెలుస్తుంది. ఒంటరితనం పోతుంది. ఎందుకంటే మీరు ఎప్పుడూ ఆ చైతన్యంతో కనెక్ట్ అయి ఉంటారు. అలాగే ద్వేషం పోతుంది. ఎందుకంటే మీరు ఇతరులకు హాని చేయాలంటే మీకు మీరే హాని చేసుకున్నట్లుగా ఫీల్ అవుతారు. ఫైనల్ గా ఫ్రెండ్స్ అద్వైతం కేవలం ఒక సంస్కృత పదం కాదు ఇది మన జీవన సత్యం మీరు ఒక చిన్న పరిమితమైన శరీరం కాదు మీరు ఒక అనంతమైన చైతన్యం యొక్క భాగం ఈ అవగాహనే మనల్ని అన్ని బంధాల నుంచి విముక్తి చేస్తుంది.
(03:55) ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్
No comments:
Post a Comment