మాటల యుద్ధం – మనం నిజం కోసం వాదిస్తున్నామా? లేక మన గర్వం కోసమా? | కురుక్షేత్రం Day 2 | Nikhil
Author Name:Margadarsi Telugu Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=MisTguenhFY
Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ నిఖిల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నిన్న మనం అర్జునుడి భయం గురించి అంటే ఒక పెద్ద ఛాలెంజ్ ముందు మనకు వచ్చే టెన్షన్ కన్ఫ్యూజన్ గురించి మాట్లాడుకున్నాం కదా ఈరోజు మనం యుద్ధం మొదలవ్వకముందే ఏం జరిగిందో తెలుసుకుందాం. అదేంటంటే లాస్ట్ మినిట్ శాంతి ప్రయత్నం శాంతి కోసం కృష్ణుడు కౌరవుల సభకు వెళ్ళిన రోజు కానీ ఆ రోజు ఏం జరిగిందంటే మనిషి గర్వం సత్యం కంటే చాలా పవర్ఫుల్ అని తేలిపోయింది.
(00:32) సరే జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్ హస్తినాపుర సభ కృష్ణుడు మధ్యలో నిలబడి ఉన్నాడు. చుట్టూ దుర్యోధనుడు అతని అనుచరులు కృష్ణుడు చాలా సింపుల్ గా స్ట్రెయిట్ గా అడిగాడు. దుర్యోధన రాజ్యమంతా వద్దు పాండవులకు జస్ట్ ఐదు ఊర్లు ఇస్తే సరిపోతుంది. మీరంతా కలిసి బ్రతకండి. దానికి దుర్యోధనుడు నవ్వుతూ సూది మొన మోపినంత భూమి కూడా ఇవ్వను కృష్ణ ఆ నవ్వు ఆ మాటే యుద్ధానికి తొలి శబ్దం అది రాజు మాట్లాడిన మాట కాదు ఫ్రెండ్స్ అది అతని అహంకారం మాట్లాడిన శబ్దం నిజమే అక్కడ ఎవరూ కత్తి తీసుకోలేదు.
(01:09) కానీ వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట బాణంలా గుచ్చుకుంది. దుర్యోధనుడు తన మొండి పంతాన్ని కృష్ణుడు సత్యాన్ని పట్టుకున్నారు. కానీ చివరికి గెలిచింది మాత్రం గర్వమే మీరు గమనిస్తే ఇది మన లైఫ్ లో రోజు జరుగుతుంది. మనం ప్రతి డిస్కషన్ లో నిజం తెలుసుకోవడానికి మాట్లాడుతున్నామా లేక నేను కరెక్ట్ అని మన ఈగోని కాపాడుకోవడానికి ఫ్రెండ్స్ మనం బాగా వాదించేస్తాం.
(01:38) కానీ నిజాయితీగా చెప్పాలంటే బాధించేటప్పుడు మన గోల్ నిజం కావడం చాలా తక్కువ. మనకు నేను కరెక్ట్ అనిపించుకోవడమే ఎక్కువ కావాలి. దీన్ని మన మనసు నన్ను నేను రక్షించుకోవాలనే ట్రిక్ లాగా వాడుతుంది. సైకాలజీలో దీన్నే ఈగో డిఫెన్స్ అంటారు. మన భయం తప్పు చేశమేమో అని కాదు నేను ఓడిపోయాను నా మాట చెల్లదు అనే ఫీలింగ్ మన ఈగోని చాలా హర్ట్ చేస్తుంది.
(02:04) దుర్యోధనుడు చేసింది అదే రాజ్యం కంటే కూడా తన గెలుపే అతనికి ముఖ్యం. ఎందుకంటే అతని మనసులో నేనే ప్రపంచానికి సెంటర్ అనే నమ్మకం ఫిక్స్ అయిపోయింది. మన డిస్కషన్ లో కూడా ఇదే రిపీట్ అవుతుంది. మన మాటల్లో నిజం కంటే మన గుర్తింపు ఉంటుంది. ఎవరైనా మన మాట కాదంటే వాళ్ళు మనల్ని అటాక్ చేసినట్టు ఫీల్ అవుతాం. అదే మనలోని దుర్యోధనుడు. నేను తప్పు చేయడం ఇంపాసిబుల్ అనే మనలోని గర్వం.
(02:31) ఫ్రెండ్స్ గర్వం అంటే మనం ఎవరో మర్చిపోవడం. అది మన నిజమైన ఆత్మ మీద పడిన చీకటి లాంటిది. ఈ చీకటి మనకు ఎప్పుడూ కరెక్ట్ దారి చూపించకుండా బ్రమలను మాత్రమే ఇస్తుంది. దుర్యోధనుడు ఆ చీకట్లోనే బ్రతికాడు. అతను బయటికి మాత్రమే రాజు కానీ లోపల తన ఈగోకి బానిస. ఎవరైనా మనకు మన తప్పును చెబితే దాన్ని ఒప్పుకోవడం కన్నా సమర్థించుకోవడం ఈజీ అనిపిస్తుంది.
(02:58) కానీ అక్కడే నిజం చచ్చిపోతుంది. కృష్ణుడు సభలో అరిచి మాట్లాడలేదు. చాలా క్లియర్ గా మాట్లాడాడు. ఆయన మాటల్లో పవర్ ఉంది కానీ అహంకారం లేదు. దుర్యోధనుడి మాటల్లో అహంకారం ఉంది కానీ అసలు పవర్ లేదు. ఇదే ధర్మం మరియు గర్వం మధ్య బార్డర్ లైన్ ఫ్రెండ్స్ మన వాదనల్లో మనం దుర్యోధనుడిలా గెలిచినా చివరికి కోల్పోయేది మనశశాంతి మరియు మంచి రిలేషన్షిప్స్ ప్రతిసారి వాదించే ముందు మనల్ని మనమే ఒక ప్రశ్న వేసుకుందాం.
(03:31) నేను మాట్లాడుతున్నది నిజం కోసమా లేక నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడం కోసమా నిజం పట్ల ప్రేమ ఉంటే మనం వింటాం. గర్వం పట్ల ప్రేమ ఉంటే మనం అరుస్తాం. కురుక్షేత్రం మనకు చెబుతుంది నిజం కోసం పోరాడే వాడికి మౌనం కూడా ఆయుధమే గర్వం కోసం పోరాడే వాడికి మాటలే ఆస్తి ప్రతి బంధంలో ప్రతి చోట వినిపించే వాదనలు ఎక్కువ. అర్థం చేసుకునేవి తక్కువ. ఎందుకంటే మనం డిస్కషన్స్ చేయడం లేదు.
(03:59) కేవలం ఈగో ఫైట్స్ చేస్తున్నాం. కానీ గీతలో ఒక మాట ఉంది. నిజం ఎప్పుడూ నిశబ్దంలోనే పుడుతుంది. ఫ్రెండ్స్ మాటలు మన వెపన్ కాకూడదు. మన సంభాషణకు మార్గం కావాలి. మనం గెలవడానికి మాట్లాడితే అవి పాయిజన్ అవుతాయి. మనం అర్థం చేసుకోవడానికి మాట్లాడితే అవి దారిని చూపుతాయి. ఫ్రెండ్స్ ఈ మాటల యుద్ధం మన నిజం కోసం వాదిస్తున్నామా లేక మన గర్వాన్ని కాపాడుకుంటున్నామా? ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ దిస్ ఈజ్ నిఖిల్ సైనింగ్ ఆఫ్ జై హింద్
No comments:
Post a Comment