తత్త్వమసి! నువ్వే ఆ శక్తివి – Shankaracharya Philosophy in Telugu | Margadarsi
Author Name:Margadarsi Telugu Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=BnQTz8C7CsQ
Transcript:
(00:01) హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ నిఖిల్ వెల్కమ్ టు మార్గదర్శి తెలుగు పాడ్కాస్ట్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి మనం ఎప్పుడూ దేనికోసమో ఒక దాని కోసం పరిగెత్తుతూనే ఉంటాం కదా అయినా మనకి ఏదో వెల్త్ గా అనిపిస్తది. అసలు ఈ లైఫ్ ఎందుకురా బాబు అని మనకి ఒక్కసారైనా అనిపించి ఉంటుంది కదా ఈ ప్రశ్నకి వేల సంవత్సరాల క్రితమే ఒక అద్భుతమైన సమాధానం ఇచ్చిన గొప్ప వ్యక్తి శంకరాచార్యులు.
(00:26) ఆయన గురించి ఆలోచిస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తది. కేవలం 32 ఏళ్ల వయసులోనే ఆయన భారతదేశం మొత్తం తిరిగి చాలా గొప్ప విషయాలు చెప్పారు. ఆయన చెప్పింది ఏదో ఒక మతం గురించి కాదు ఒక మంచి జీవితం ఎలా జీవించాలో చెప్పారు. ఆయన మాటలు వినడానికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కానీ వాటి లోపల అర్థం మాత్రం చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటది.
(00:51) ఈరోజు మనం ఆయన మాటల్లోని పవర్ ఏంటో అవి మన డైలీ లైఫ్ కి ఎలా యూస్ అవుతాయో నా పర్సనల్ పర్స్పెక్టివ్ లో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ సో చివరిదాకా చూడండి. ముందుగా ఫ్రెండ్స్ శంకరాచార్యులు చెప్పిన మొదటి లెసన్ గురించి మనం మాట్లాడుకుందాం. అదే మానవ జీవితం నశరమైంది. ఈ మాట వినడానికి కొంచెం కఠినంగా అనిపించవచ్చు.
(01:13) కానీ దాని ఉద్దేశం ఏంటంటే లైఫ్ అనేది ఒక తాత్కాలిక స్టేషన్ లాంటిది. మనం ఇక్కడ కొంతకాలం మాత్రమే ఉంటాం. మనలో చాలామంది చిన్నప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటాం కదా స్కూల్ అయిపోయాక కాలేజ్ కాలేజ్ అయిపోయాక జాబ్ జాబ్ వచ్చాక పెళ్లి పెళ్లి తర్వాత రిటైర్మెంట్ ఇలా మన లైఫ్ ని ఎప్పుడూ మనం భవిష్యత్తు కోసం ప్లాన్ చేస్తూనే ఉంటాం కదా కానీ శంకరాచార్యులు ఏమన్నారంటే భవిష్యత్తు అనేది నువ్వు ఊహించుకున్నది మాత్రమే లైఫ్ అంటే ఈ క్షణంలో ఉన్నది రేపటిలో లేదు.
(01:45) ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు కథలో పూర్తిగా లీనమైపోతాం కదా ఆ రెండున్నర గంటలు వేరే ప్రపంచంలో ఉన్నట్టు ఫీల్ అవుతాం. కానీ సినిమా అయిపోయాక అరే జస్ట్ ఇది సినిమానే కదా అని ఒక అవగాహన వస్తుంది. జీవితం కూడా అంతే ఫ్రెండ్స్ మనం ఈ పాత్రలో ఎంత మునిగిపోయినా ఏదో ఒక రోజు ఈ తెరపడిపోతుంది. ఈ నిజం మనకు తెలిస్తే మనం ప్రతి క్షణాన్ని మరింత విలువైనదిగా చూస్తాం.
(02:13) గతాన్ని చూసి బాధపడం అలాగే భవిష్యత్తు గురించి అతిగా టెన్షన్ పడం. ఇక శంకరాచార్యులు అడిగిన ప్రశ్న గురించి మనం మాట్లాడుకుంటే ఈ ప్రపంచంలో దేనికి నువ్వు ఎక్కువ విలువ ఇస్తున్నావు. ఆయన చెప్పారు నిత్యం ఇంకా అనిత్యం అనే రెండు వస్తువులు ఉన్నాయని అనిత్యం అంటే తాత్కాలికం మన శరీరం మనం సంపాదించిన డబ్బు మన కారు ఫోను పేరు హోదా ఇవన్నీ ఒకరోజు పోతాయి.
(02:41) మనం వాటిపై పెట్టే ప్రేమ శ్రద్ధ అన్ని తాత్కాలికమే ఇక నిత్యం అంటే శాశ్వతం మన ఆత్మ మనలోని స్వచ్ఛమైన జ్ఞానం మనలోని శాంతి సంతోషం ఇవి ఎప్పుడూ మనతోనే ఉంటాయి ఎవరు మన నుండి తీసుకోలేరు. దీన్ని అర్థం చేసుకుంటే మన టెన్షన్ సగానికి సగం తగ్గిపోతుంది. మన కొత్త ఫోన్ కిందపడి పగిలిపోతే మనం బాధపడతాం. ఎందుకంటే మనం దానికి బాగా అటాచ్ అయిపోయాం. కానీ మనలోనే ఉన్న ఆత్మకు ఎప్పుడూ ఏమీ కాదు మనం తాత్కాలికమైన వాటి కోసం ఎంతో సమయం శక్తి ఖర్చు చేస్తాం.
(03:14) కానీ శాశ్వతమైన ఆనందం జ్ఞానం కోసం పెద్దగా ప్రయత్నించాం. ఈ చిన్న తేడాను అర్థం చేసుకుంటే చాలు మన జీవితంలో ఎంతో ప్రశాంతత వస్తుంది. ఇక శంకరాచార్యులు చెప్పిన చాలా ముఖ్యమైన మాట తత్వమసి అంటే నువ్వే ఈ పరమాత్మ. ఇది వినడానికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కానీ దాని అర్థం చాలా సులభం. ఆయన చెప్పింది నువ్వు బయట వెతుకుతున్న ఆ శక్తి నీ లోపలే ఉంది.
(03:39) మనం ఎప్పుడూ నేను చిన్నవాడిని నావల్ల ఏమి కాదు అని అనుకుంటూ ఉంటాం కదా కానీ ఆయన చెప్పింది నువ్వు ఒంటరివి కాదు నువ్వు ఈ పెద్ద విశ్వంలో ఒక బాగానివి నీలో కూడా అదే శక్తి ఉంది. ఈ మాట మనకు ఒక్కసారి అర్థమైతే మనం ఎవరిని చూసి చిన్నబుచ్చుకోం ఎవరిని చూసి గర్వపడం ఎందుకంటే మనందరిలో ఉన్నది ఒక్కటే ఫర్ ఎగ్జాంపుల్ సముద్రంలో నుంచి ఒక ఆల బయటకు వస్తుంది.
(04:07) ఆ ఆల అనుకుంటుంది నేను వేరు అని కానీ నిజం ఏంటంటే ఆ ఆల సముద్రంలో ఒక భాగం మాత్రమే సముద్రం లేకపోతే ఆల లేదు. మనం కూడా అంతే మనం వేరు వేరు వ్యక్తులుగా కనిపించినా మనలో ఉన్నది ఒకే శక్తి ఇదే అద్వైతం ఇది మనకు తెలిస్తే ద్వేషం అసూయ భయం వంటివి చాలా వరకు తగ్గిపోతాయి. ఇక శంకరాచార్యులు భజగోవిందం అనే రచనలో అద్భుతంగా ఒక మాట చెప్పారు. ఓ మూర్ఖుడా డబ్బు యవ్వనం బంధువులు ఇవన్నీ ఒక్క క్షణంలో పోతాయి.
(04:38) ఈ మాట మన ఈతరం వాళ్ళకు చాలా అవసరం. మనం కొత్త ఫోను కొత్త కారు పెద్ద ఇల్లు ఇలా భౌతికమైన వస్తువులపై ఎక్కువగా ఆధారపడిపోయాం. అవి కొన్నప్పుడు ఒక్క క్షణం ఆనందం వస్తుంది. కానీ అది ఎప్పుడూ ఉండదు. కొత్తది వస్తే పాతది పోతుంది. మళ్ళీ అదే నిరాశ నీకు మిగులుతుంది. నిజమైన శాంతి అనేది మనలో నుంచే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంచి పుస్తకం చదివినప్పుడు ఒక పాత పాట విన్నప్పుడు మీకు ఇష్టమైన వారితో మనసువిప్పి మాట్లాడినప్పుడు ఆ క్షణంలో మీకు కలిగే ఆనందం డబ్బుతో రాదు.
(05:10) అదే శాశ్వతమైన ఆనందం. శంకరాచార్యులు ఈ ఆనందం వైపు మన దృష్టిని మల్లించమని చెప్పారు. ఇక చివరిగా చాలామందికి శంకరాచార్యులు అంటే సన్యాసం అంతా వదిలేయాలనే మాటలు గుర్తుకొస్తాయి. కానీ అది నిజం కాదు ఆయన చెప్పింది వేటిపై మోజు పెంచుకోవద్దు. అంటే వాటిపై అద్దిగా ప్రేమ పెట్టుకోవద్దు. మనం చేసే పనిని మన దగ్గర ఉన్న వస్తువులను ఎంజాయ్ చేయాలి.
(05:37) కానీ అవి మనల్ని కంట్రోల్ చేయకూడదు. మీరు ఒక మంచి ఉద్యోగం చేయండి డబ్బు సంపాదించండి. కానీ ఆ ఉద్యోగం లేకపోతే మీ జీవితం ఖాళీగా ఉందని ఫీల్ అవ్వకూడదు. అదే డిటాచ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీ తాగుతారు. టీ తాగడం ఆనందంగా ఉంటుంది. కానీ టీ లేకపోతే నేను లేనని అనుకోవద్దు. అదే డిటాచ్మెంట్ జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయండి. కానీ దానికి బానిసలుగా మారకండి.
(06:03) ఫైనల్ గా ఫ్రెండ్స్ శంకరాచార్యులు చెప్పిన ఈ చిన్న చిన్న విషయాలు మన జీవితాన్ని మార్చేస్తాయి. ఈ జీవితం ఎప్పుడూ ఉండదు కానీ దాన్ని ఎలా జీవించాలనేది మన చేతుల్లోనే ఉంది. తాత్కాలికమైన వాటిపై దృష్టి పెట్టడం మానేసి శాశ్వతమైన ఆనందం వైపు చూస్తే అదే నిజమైన జీవితం. మనం ఇప్పటివరకు విన్న ఈ విషయాలు కేవలం పుస్తకాల్లోని మాటలు కాదు.
(06:26) అవి మన జీవితాన్ని మార్చేస్తాయి. ఈ రోజు నుంచి ఈ చిన్న చిన్న సూత్రాలను మీ జీవితంలో పాటించడానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. మన తర్వాత ఎపిసోడ్ లో మరో మంచి విషయం గురించి మాట్లాడుకుందాం. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. తెలివితో జీవించండి. బాయ్ ఫ్రెండ్స్ జైహింద్
No comments:
Post a Comment