Saturday, March 14, 2026

గురువు అంటే ఎవరు? | Autobiography of a Yogi Book summary | Margadarsi Telugu Philosophical Podcast

గురువు అంటే ఎవరు? | Autobiography of a Yogi Book summary | Margadarsi Telugu Philosophical Podcast

Author Name:Margadarsi Telugu Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=shvo8gnKkJI



Transcript:
(00:00) మన జీవితంలో ఒక టైం వస్తుంది. అప్పుడు మనకు తెలిసిపోతుంది జీవితం అంటే కేవలం గోల్స్ సక్సెస్ ఫేమ్ కాదు అది మనలోని మీనింగ్ కోసం చేసే అన్వేషణ ఆ అన్వేషణలో మనం ఎదుర్కొనే మొదటి ప్రశ్న నేను ఎవరు? ఇదే ప్రశ్నతో పరమహంస యోగానంద తన యాత్రను మొదలు పెట్టాడు. ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగిలో ఆయన మనకు చెబుతాడు గురువు అనేది దేవుడికి ప్రతిరూపం కాదు గురువు అనేది నీలో ఉన్న దేవుని గుర్తు చేసే అర్థం గురువు అంటే ఎవరో ఇప్పుడు మనం చూద్దాం.
(00:39) మనందరికీ చిన్నప్పటి నుంచి గురువు అంటే పూజించాల్సినవాడు అని నేర్పిస్తారు. కానీ యోగానంద చెప్పింది ఏంటంటే గురువును పూజించమని కాదు ఆలోచించమని చెబుతాడు. గురువు దారి చూపుతాడు కానీ నడవడం మాత్రం నీవంతే నేను నా దృష్టిలో చెప్పాలంటే గురువు అనేది బాహ్యంగా ఉన్న వ్యక్తి కాదు అతను మనలో ఉన్న అవేర్నెస్ కి నిదర్శనం ఏదైనా పరిస్థితిలో నేను ఎవరు అని మనలో పుట్టే ఆ ప్రశ్నే మన నిజమైన గురువు చాలామంది దేవుని వెతుక్కుంటూ కొండలపైకి వెళ్తారు. ఆశ్రమాల్లో ఉండిపోతారు.
(01:16) కానీ తాము ఎవరనే విషయం మాత్రం తెలుసుకోరు. కానీ నిజమైన గురువు నిన్ను బయటకి పంపడు నీ లోపలికి తీసుకెళ్తాడు. ఇప్పుడు మనం మనసు శరీరం చైతన్యాల మధ్య సంబంధం ఏంటో తెలుసుకుందాం. ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగిలో యోగానంద ఇలా చెబుతాడు. మనసు అనే యంత్రం శరీరాన్ని నడిపిస్తుంది. కానీ మనసును ఎవరు నడుపుతారు? మన ఆత్మ. సైన్స్ చెబుతుంది థాట్ ప్రొడ్యూసెస్ ఎనర్జీ యోగా చెబుతుంది ఎనర్జీ ప్రొడ్యూసెస్ థాట్ ఇక్కడ నిజం ఏంటంటే రెండు సత్యమే ఎనర్జీ థాట్ కాన్షియస్నెస్ ఇవన్నీ ఒకే ప్రవాహం యొక్క వేరు వేరు రూపాలు నేను మార్గదర్శి దృష్టిలో చెప్పాలంటే మనిషి ఒక వాకింగ్
(02:03) టెంపుల్ ప్రతి శ్వాస ఒక ప్రార్థన ప్రతి ఆలోచన ఒక ఆరాధన మన చైతన్యం శరీరంతో కాదు మన అవగాహనతో బంధించబడి ఉంది. దానిని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనకు బయట ఉన్న దేవుడు అన్నది మన లోపల ఉన్న సత్యం రూపంలో కనబడుతుంది. యోగానంద చెబుతాడు మాయ అంటే బాహ్య ప్రపంచం కాదు మన పర్స్పెక్షన్స్ అంటే మనం చూసేది వాస్తవం కాదు మన ఇంటర్ప్రిటేషన్ నేను నా పర్స్పెక్టివ్ లో చెప్పాలంటే మనిషి మాయలో జీవించడం లేదు మాయనే సృష్టిస్తున్నాడు.
(02:37) మన థాట్ డిజైర్ ఫియర్ ఇవే మన మాయలు నీకు ఈగో ఎక్కువైతే నీ ప్రపంచం కూడా చిన్నది అవుతుంది. నీలో అవేర్నెస్ పెరిగితే నీ ప్రపంచం అనంతం అవుతుంది. మాయను తొలగించడం అంటే బ్లైండ్ ఫేత్ కాదు క్లియర్ పర్సెప్షన్ అంటే విషయాలను వాటి అసలు రూపంలో చూడగలగడం. సత్యం అనేది బోధన కాదు అనుభవం యోగానంద చివరిగా చెబుతాడు సత్యం చదివి తెలుసుకోలేను అనుభవించి మాత్రమే తెలుసుకోగలం.
(03:12) ఇదే నాకు ఈ పుస్తకం ఇచ్చిన గొప్ప బోధన. నేను కూడా రియలైజేషన్ చేసుకున్నది ఇదే సత్యం ఎక్కడో హిమాలయాల్లో లేదు. అది మన ప్రతి థాట్ లో ఉంది. నువ్వు నిజాయితీగా నీ మనసును అబ్సర్వ్ చేస్తే అది నీకు గురువులా మారుతుంది. ఇక ఫైనల్ గా మన జీవితంలో ప్రతి దశలో మనకు ఒక గురువు వస్తాడు. కానీ ఆ గురువు మనకు బయట నుండి రాడు. అతను మనలో ఉన్న అవేర్నెస్ రూపంలో మేల్కొంటాడు.
(03:40) ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి నాకు నేర్పిన ఫిలాసఫీ ఏంటంటే గురువు అనేది డివోషన్ కాదు ఒక డైరెక్షన్ అతను మనలోని నిద్రపోయిన చైతన్యాన్ని లేపే శబ్దం మనం బాహ్యంగా ఉన్న దేవుని వెతకడం మానేసి మనలో ఉన్న దైవత్వాన్ని చూడడం మొదలు పెడితేనే మన జీవితం ఇట్సెల్ఫ్ ఒక ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి అవుతుంది. ఇక ఫైనల్ గా నేను మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే గురువు అంటే నిన్ను మార్చేవాడు కాదు నిన్ను నీకు పరిచయం చేసేవాడు ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని మాతో కామెంట్ బాక్స్ లో పంచుకోండి దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్ జై హింద్

No comments:

Post a Comment