నేను ఎవరు? | Ramana Maharshi Philosophy Explained in Telugu | Margadarsi Telugu Podcast By Nikhil
Author Name:Margadarsi Telugu Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=DflOoEIB8iQ
Transcript:
(00:01) హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మిఖిల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ జీవితంంతా మనం ఏదో వెతుకుతూనే గడుపుతున్నాం. సంతోషం కోసం ప్రేమ కోసం అర్థం కోసం కానీ ఎవరైనా మనల్ని సడన్ గా వచ్చి నువ్వు ఎవరు అని అడిగితే దానికి మనం నిజంగా సమాధానం చెప్పగలమా? చాలామంది చెబుతారు నేను ఈ పేరుతో పిలవబడతాను. కొందరు చెబుతారు నేను ఈ ప్రొఫెషన్ చేస్తున్నాను కానీ రమణ మహర్షి చెబుతారు అవి నీ పుట్టుక తర్వాత నీకు తగిలిన గుర్తులు మాత్రమే అవి నువ్వు కాదు ఇక్కడ రమణ మహర్షి ఫిలాసఫీ అంతా ఒకే ప్రశ్న మీద నిలబడి ఉంది. భూ ఆమై
(00:48) మనసులో ఎప్పుడో నిశబ్దంగా పుట్టే ఈ ప్రశ్న సరైన విధంగా అడిగితే మన ఎంటైర్ జీవితాన్నే మార్చేస్తుంది. ఆయన చెబుతారు ప్రపంచం ఆలోచనలు మనసు ఇవన్నీ నేను అనే భావన మీదే ఆధారపడి ఉన్నాయి. ప్రతి ఎమోషన్ ప్రతి డిజైర్ ప్రతి ఫియర్ నేను అనే మూలం నుంచే వస్తాయి. అందుకే నేను ఎవరు అని తెలుసుకుంటే ఆ మూలాన్ని అర్థం చేసుకుంటే బయటి ప్రశ్నలన్నీ వాటంతటవే కరిగిపోతాయి.
(01:28) ఒకసారి ఆలోచించండి మన మనసులో ఎన్ని ఆలోచనలు తిరుగుతాయో నేను సక్సెస్ కావాలి నేను తప్పు చేశాను నేను సంతోషంగా లేను. కానీ ఈ నేను ఎవరు? ఈ మాట చెబుతున్న వ్యక్తి ఎవరు? రమణ మహర్షి చెబుతారు ఆత్మ విచారణ అంటే మెడిటేషన్ కాదు మంత్ర కాదు ఇది శ్రద్ధతో గమనించడం మనకు ఒక ఆలోచన వస్తే ఈ ఆలోచన ఎవరికి వస్తుంది అని మనకు మనమే అడగాలి.
(02:03) దానికి సమాధానంగా నాకు అప్పుడు వెంటనే మనం అడగాలి అయితే ఆ నేను ఎవరు ఇలా ఒక్కో ఆలోచన వెనక్కి వెనక్కి వెళ్ళినప్పుడు మనసు చివరికి దాని మూలానికి చేరుతుంది. ఆ మూలం ప్యూర్ అవేర్నెస్ అదే మన నిజమైన స్వరూపం. రమణ మహర్షి జీవితం కూడా ఈ ప్రశ్నతోనే మారిపోయింది. 16 ఏళ్ల వయసులో ఆయనకు ఆకస్మికంగా మరణ భయం వచ్చింది.
(02:39) అప్పుడు ఆయన ఆ భయాన్ని ఎదుర్కొన్నారు. ఈ శరీరం చనిపోతే నేను ఎక్కడికి పోతాను అని లోపల అడిగారు. ఆ ప్రశ్నను లోతుగా గమనిస్తూ చివరికి ఆయన ఒక క్లారిటీ కి వచ్చారు. శరీరం చనిపోతుంది కానీ నేను మాత్రమే మిగిలిపోతాను. అది తాత్వికంగా కాదు అనుభవంగా తెలిసింది. ఆ క్షణం నుంచే ఆయన మౌనమయ్యారు. ఆ మౌనం ఆయన జ్ఞానమయింది. మనము అలానే మన జీవితంలో చూసుకుంటే మనలో ఎప్పుడూ ఒక నేను అనే భావం ఉంటుంది.
(03:19) అది ఇన్సల్ట్ అయినా ప్రైజ్ అయినా ఎల్లప్పుడూ రియాక్ట్ అవుతుంది. అది ఈగో కాదు అది సెల్ఫ్ కాదు అది కేవలం బ్రహ్మ మాత్రమే మనలో ఉండే ఆ సాక్షి మాత్రమే నిజం అది ఎప్పుడూ మారదు. రమణ మహర్షి చెబుతారు నువ్వు నీ మనసుని ఆపాలనుకుంటే ఆపలేవు కానీ నువ్వు నీ మనసును గమనిస్తే అది దానంతట అదే ఆగిపోతుంది. మనసు యుద్ధం చేయాల్సిన శత్రువు కాదు అది మనకు చూపించే అర్థం.
(03:55) ఆ అద్దంలో మనం మన నిజమైన ముఖాన్ని చూడాలి. ఈ ప్రశ్న నేను ఎవరు అనే ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వకండి. అది ప్రశ్నగానే ఉండనివ్వండి. ఎందుకంటే ఆ ప్రశ్నలోనే అసలైన జ్ఞానం దాగి ఉంది. ఎప్పుడు ఆ ప్రశ్నను మనసు ఆలోచించకుండా మనం అనుభవిస్తామో అప్పుడు మనలో ఒక తీపి నిశబ్దం పుడుతుంది. అది రమణ మహర్షి చెప్పిన సెల్ఫ్ రియలైజేషన్ ఆ స్థితిలో మాటలు అవసరం ఉండవు.
(04:28) అక్కడ మౌనం మాట్లాడుతుంది. ఆ మౌనం సత్యం చెబుతుంది. ఆ మౌనం శాంతి ఇస్తుంది. ఫ్రెండ్స్ రమణ మహర్షి ఒకసారి అన్నారు టు నో హూ యు ఆర్ స్టాప్ బీయింగ్ వాట్ యు ఆర్ నాట్ అంటే మనం కాదు అనుకునే దానిని విడిచిపెట్టడం మన నిజమైన స్వరూపాన్ని కనుగొనడమే జ్ఞానం. అందుకే ఈరోజు నుంచి మొదలు పెట్టండి. బయట కాకుండా మీ లోపల చూడడం మనలోని ప్రశాంతమైన నేనును గమనించండి ఆ గమనంలోనే మీ ఆత్మ ఉంది. ఆ ఆత్మలోనే మీ సత్యం ఉంది.
(05:08) ఆ సత్యంలోనే మీరు ఉన్నారు. ఫ్రెండ్స్ చివరిగా నేను ఎవరు అని ప్రశ్నించడం అంటే బయట ప్రపంచం నుండి లోపలికి అడుగు వేయడం లాంటిది. అది జ్ఞానయాత్ర. ప్రారంభం మనతోనే ముగింపు కూడా మనలోనే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో మాతో పంచుకోండి. దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్ జై హింద్
No comments:
Post a Comment