జ్ఞానం vs విజ్ఞానం – నిజమైన ముక్తికి మార్గమేంటి?#telugupodcast
Author Name:Margadarsi Telugu Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=21ObED5iE4M
Transcript:
(00:01) ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ఏదో తెలుసా అర్జున అదే జ్ఞానం అయితే ఆ జ్ఞానం ఒక్కటే సరిపోదు దానితో పాటు విజ్ఞానం కూడా కావాలి జ్ఞానం అంటే అర్థం చేసుకోవడం విజ్ఞానం అంటే అనుభవించడం ఫర్ ఎగ్జాంపుల్ నీకు తేనె తీయగా ఉంటుందని ఎవ్వరైనా చెప్తారు ఇదే జ్ఞానం కానీ నువ్వు తేనెను రుచి చూసాకే అసలైన అనుభవం వస్తుంది అదే విజ్ఞానం ఇప్పుడు నువ్వు నిజమైన జ్ఞానం విజ్ఞానం గురించి తెలుసుకోవాలనుకుంటే నా మాటలతో పూర్తిగా నిమగ్నం కావాలి అంతేకానీ మధ్యలో మరో దారి వెతుక్కుంటే అది నీ సత్యాన్ని మరింత దూరం [సంగీతం]
(00:46) చేస్తుంది అర్జున నేనే ఈ ప్రపంచాన్ని సృష్టించాను నాశనం చేస్తున్నాను మరలా తిరిగి సృష్టిస్తాను నాకు ఐశ్వర్యం ఎంత ఉన్నా నా స్వభావం మాత్రం మారదు ఒక పెద్ద చెట్టు నేలలో ఉన్న మూలాలపై ఎలా ఆధారపడి నిలబడుతుందో ఈ భూమి కూడా నాపై ఆధారపడి ఉంది నాలోనే అన్ని జీవరాశులు పుడతాయి నాలోనే సమాప్తం అవుతాయి కానీ నన్ను గమనించు నేనేమి ఆ బంధాలకు లోబడి లేను మేఘం ఆకాశాన్ని కప్పినట్టు నా మాయ ఈ ప్రపంచాన్ని కప్పేస్తుంది ఆ మాయను దాటి నన్ను ఎవరు సులభంగా చేరుకోలేరు కానీ ఎవరికైనా నాపై నమ్మకం ఉంటే నా చైతన్యాన్ని గ్రహిస్తే వాళ్ళ కోసం నేను స్వయంగా
(01:31) వెలుగుతాను ఎందుకు నిన్ను అసలు గుర్తించలేకపోతున్నారు దానికి కారణం నా మాయే అర్జున ఆ మాయ రెండు రూపాల్లో ఉంటుంది ఒకటి ఆసక్తి ఇది నిన్ను బంధిస్తుంది సుఖంలో ముంచేస్తుంది రెండు భయం ఇది నీలో నమ్మకాన్ని నాశనం చేస్తుంది ఈ మాయలో ఉన్నవాళ్ళు నిజాన్ని అర్థం చేసుకోలేరు కానీ నన్ను నమ్మి నా మీదే ఆధారపడేవారు ఈ మాయను దాట అర్జున శ్రీకృష్ణ ఎవరికి నిజమైన జ్ఞానం లభిస్తుంది నన్ను కొందరు కేవలం తమ స్వార్ధం కోసం నమ్ముతారు అర్జున కొంతమంది తమ సమస్యలకు పరిష్కారం కోసం నన్ను వేడుకుంటారు కానీ నన్ను నిజంగా అర్థం
(02:17) చేసుకొని నాలోనే లీనమయ్యే వాళ్లే అసలైన ముక్తిని పొందగలరు ఇక్కడ నిజమైన భక్తులు నాలుగు రకాలుగా ఉంటారు ఒకటి కష్టాల్లో నన్ను వేడుకునే వారు రెండు సంపద కోసం నన్ను ఆశ్రయించేవారు మూడు జ్ఞానం కోసం నన్ను అన్వేషించేవారు నాలుగు నన్నే సర్వంగా భావించి నన్ను ప్రేమించేవారు వీరిలో నన్ను పూర్తిగా అర్థం చేసుకున్న వారే నన్ను నిజంగా పొందగలరు శ్రీకృష్ణ ఎలా నిన్ను పొందగలరు నన్ను పొందాలంటే నాపై నమ్మకం పెట్టాలి అర్జున ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాపై నమ్మకంతో ఉండాలి ఇది ఊరికే రాదు దీని కోసం సాధన చేయాలి
(03:00) నా పేరును జపించు నా గురించి తెలుసుకునేందుకు ఇది మొదటి మెట్టు నా కథలను విను మనసును నా కొరకు తిప్పడానికి ఇది సహాయపడుతుంది నా మార్గంలో నడువు నిన్ను నిజమైన ధర్మాన్ని పాటించేలా చేస్తుంది ఈ ముగ్గురు నన్ను చేరుకుంటారు ఇక ఫైనల్ గా ఈ ప్రపంచం ఒక కల ఈ కలలో మునిగిపోయిన వాళ్ళు నిజమైన ఆనందాన్ని అనుభవించలేరు అర్జున నిజమైన ఆనందం నన్ను పూర్తిగా అర్థం చేసుకున్న వారికే లభిస్తుంది కాబట్టి నువ్వు భయపడొద్దు నన్ను ధ్యానించు నాలోనే లీనమైపో అప్పుడు నీవు నిజమైన ఆనందాన్ని పొందగలవు ఈ జ్ఞానం ఒక వజ్రం లాంటిది అర్జున ఇది నీ గుండె లోపల
(03:45) తలుక్కుమంటుంది దీనిని ఎవరికైనా చెప్పే ముందు వాళ్ళు దీన్ని గ్రహించగలరా అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో జ్ఞానం ఎవరికైతే దక్కుతుందో వారే నిజమైన విజేతలు ఇది జ్ఞాన విజ్ఞాన యోగం భగవద్గీత ఏడవ అధ్యాయం ఇది శ్రద్ధగా వినేవారికి ముక్తిని అందించగలదు [సంగీతం]
No comments:
Post a Comment