జ్ఞానం vs అజ్ఞానం: నిజమైన యుద్ధం మనలోనే జరుగుతోంది | Upanishads Philosophy | Margadarsi Podcast
Author Name:Margadarsi Telugu Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=4_Cy_JIRhWA
Transcript:
(00:01) హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ నిఖిల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన ఈ ఉపనిషత్తుల జర్నీలో ఈరోజు మనం మన జీవితంలో అత్యంత కీలకంగా కానీ ఎప్పుడూ చర్చించని ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. బయట ప్రపంచంలో మనకు శత్రువులు లేరు. అసలు యుద్ధం మన లోపలే జరుగుతోంది. మీలోని జ్ఞానం మరియు అజ్ఞానం మధ్య నిశబ్ద యుద్ధం. ముందుగా మనం బంధనం అంటే ఏంటో చూద్దాం.
(00:23) ఒకసారి ఆలోచించండి మనమంతా ఎప్పుడూ ఫ్రీడమ గురించి మాట్లాడుకుంటాం. మరి మనల్ని బంధిస్తుంది ఏంటి? ఈ చెరసాల గోడలా కాదు కదా ఉపనిషత్తులు చెబుతాయి అజ్ఞానమే మన బంధనం భయం బాధ అసూయ పోలిక ఇవన్నీ అజ్ఞానం అనే తల్లికి పుట్టిన పిల్లలు మనం నిన్నటి జ్ఞాపకాలను రేపటి టెన్షన్స్ ను పట్టుకొని తిరుగుతున్నామ అంటే మనం ఏదో ముఖ్యమైన సత్యాన్ని మర్చిపోయామని అర్థం.
(00:49) ఈ అజ్ఞానం నుంచి బయట పడటమే జ్ఞానం జ్ఞానమే విముక్తి మన జీవితంలో ప్రతి నిర్ణయం ప్రతి ఆలోచన ఈ రెండు శక్తుల మధ్య జరిగే ఘర్షణే మొదటిది అహంకారి వాయిస్ ఇది చాలా గట్టిగా నిశ్చయంగా అరుస్తుంది. నువ్వు ఈ ప్రపంచంలో ఒక చిన్న భాగం మాత్రమే నీకు ఇంకా చాలా కావాలి. నువ్వు పూర్తి కాలేదు. అతనిలా ఉండు లేదా ఆమెలా ఉండు. ఇలా నీ జీవితాన్ని వేరే వాళ్ళతో పోల్చుకో నీకున్న స్థానం పోతే నువ్వు శూన్యం ఈ వాయిస్ మనల్ని భయంతో పరుగులు పెట్టేలా చేస్తుంది.
(01:20) ఇక రెండవది సత్యం యొక్క వాయిస్ ఇది చాలా మృదువుగా నిశబ్దంగా ఉంటుంది. దీన్ని వినడానికి మౌనం కావాలి. నువ్వే ఆ సమస్తం నువ్వు పరిపూర్ణుడివి నీకు ఏమీ అక్కర్లేదు. ప్రతిదీ తాత్కాలికమే నీ స్వరూపం మాత్రం శాశ్వతం. మనం ప్రతిరోజు ఏ వాయిస్ కు శక్తిని ఇస్తున్నాం. అదే మన యుద్ధం యొక్క ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ఇప్పుడు మనం అజ్ఞానం యొక్క నిర్వచనాన్ని చూద్దాం.
(01:44) సాధారణంగా అజ్ఞానం అంటే చదువు లేకపోవడం అనుకుంటాం కానీ ఉపనిషత్తుల దృష్టికోణం చాలా లోతైంది. జ్ఞానం అనేది సమాచారం కాదు జ్ఞానం అనేది పరివర్తన అజ్ఞానం అంటే మీ నిజమైన నేను అనేది ఏంటో తెలియకపోవడం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బంగారపు ఆభరణం తాను కేవలం ఒక రింగ్ లేదా నెక్లెస్ మాత్రమే అనుకొని బాధపడుతుంది.
(02:09) కానీ జ్ఞానం ఏం చెబుతుందంటే నువ్వు ఆ ఆభరణం మాత్రమే కాదు దాని స్వరూపానివి దాని మూలానివి ఆభరణం మారినా బంగారం మారదు. మనమంతా అదే బంగారం కానీ రూపాలను పట్టుకొని నేను ఈ రూపమే అనుకుంటున్నాం. ఇదే అజ్ఞానం తమసోమా జో దీర్ఘమయ అంధకారం నుంచి వెలుగుకు నడిపించు ఈ ప్రార్థన యొక్క అసలు శక్తిని ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. చీకట్లో తాడు కనిపించింది.
(02:34) మన మనసు దాన్ని వెంటనే పాముగా మార్చేసింది. అక్కడ మనకు భయం పుట్టింది. ఆందోళన పెరిగింది. మనం పారిపోయాం. అజ్ఞానం పామును చూపిస్తుంది భయంతో కూడిన రియాక్షన్ ఇస్తుంది. కానీ వెలుగు పడగానే భయం ఎక్కడికి పోయింది సో భయం పాముతో పాటు మాయమైపోయింది. ఎందుకంటే అసలు పాము ఉనికిలోనే లేదు అదేవిధంగా మన జీవితంలో ఉండే చాలా బాధలు, సమస్యలు, భయాలు అన్నీ భ్రమలు మాత్రమే.
(02:59) జ్ఞానం అనేది భయపడకుండా వెలుగును వెలిగించే చర్య లాంటివి. ఫైనల్ గా ఫ్రెండ్స్ ఉపనిషత్తులు చెబుతున్నాయి యుద్ధాన్ని గెలవాలంటే శత్రువును నాశనం చేయాల్సిన అవసరం లేదు. శత్రువు యొక్క ఉనికిని ఒక బ్రమ అని తెలుసుకుంటే చాలు జ్ఞానం అనేది పుస్తకాల్లో లేదు జ్ఞానం అనేది మెడిటేషన్ లోనూ లేదు జ్ఞానం అంటే సీయింగ్ థింగ్స్ యస్ దే ఆర్ బ్రమల పొరలను తొలగించి ఉన్నది ఉన్నట్లుగా చూడటం మరి మనం ఏ వైపు ఉన్నాం బ్రమల పొరల్లో జీవించాలా లేక ఆ సత్యాన్ని అనుభవించాలా ఇదే మనలో జరుగుతున్న యుద్ధం యొక్క సత్యం ఈ యుద్ధాన్ని గెలవడానికి కావాల్సిన శక్తి అంతా మీలోనే ఉంది. ఇక
(03:37) చివరగా మీ దారిని చూపించే ఆ శక్తివంతమైన మంత్రం అసత్యం నుంచి సత్యానికి అంధకారం నుంచి వెలుగుకి మరణం నుంచి అమృతానికి ఫైనల్ గా ఫ్రెండ్స్ మనమంతా వెలుగు వైపు నడవాలి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ దిస్ ఈజ్ నిఖిల్ సైనింగ్ ఆఫ్ జై హింద్ ఉమ్
No comments:
Post a Comment