Saturday, March 14, 2026

కోపం | Anger Control Tips in Telugu | Margadarsi Telugu Podcast by Nikhil

కోపం | Anger Control Tips in Telugu | Margadarsi Telugu Podcast by Nikhil

Author Name:Margadarsi Telugu Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=nfC9hwWfQqw



Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ నిఖిల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మనందరం ఎప్పుడో ఒకప్పుడు ఫేస్ చేసిందే. ఇది మనల్ని బయటకు హర్ట్ చేయకపోయినా లోపల నుండి మనల్ని కాల్చేస్తుంది. అదే కోపం. మీరు గమనించారా ఆఫీస్ లో మీ అంచనాలు తప్పినప్పుడు ఇంట్లో పిల్లలు మీ మాట విననప్పుడు లేదా ట్రాఫిక్ లో ఎవరో మిమ్మల్ని ఓవర్టేక్ చేసినప్పుడు మనలో ఒక్కసారిగా ఒక మంట లేస్తుంది కదా అది ఎందుకు వస్తుంది? మనకు కోపం ఎందుకు రావాలి ఇది కేవలం నలుగురిలో మనకు ఉండే మూడ్ స్వింగ్స్ మాత్రమేనా లేక దీని వెనక ఇంకేదైనా పెద్ద విషయం దాగి ఉందా ముందుగా
(00:39) కోపం అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. చాలా ఏళ్ల క్రితం నేను కూడా ఈ కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలని తెగ ఆలోచించేవాడిని అప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఒక మాట చెప్పాడు. అది నా లైఫ్ ని మార్చేసింది. వాడు అన్నాడు కోపం ఇతరుల మీద కాదు నువ్వు ఆ పరిస్థితిని కంట్రోల్ చేయలేకపోతున్నావు అన్న ఫ్రస్ట్రేషన్ మీద వస్తుంది.
(01:02) అది ఎంతో నిజం కాదు నిజం చెప్పండి మనకు కోపం ఎప్పుడు వస్తుంది మన మాట నడవకపోతే మనం అనుకున్నట్టుగా జరగకపోతే అంటే కోపం అనేది బయట ప్రపంచం వల్ల రావడం లేదు. మన లోపల ఉన్న నేను అనే ఈగో వల్ల నా మాటే నెగ్గాలి నా కంట్రోల్ లోనే అన్ని ఉండాలి అనే ఆలోచన దెబ్బ తీస్తున్నప్పుడు అది ఎక్స్ప్లాయిడ్ అవుతుంది. ఆ ఎక్స్ప్లోషన్ే కోపం ఈగో కి కంట్రోల్ చాలా ఇష్టం.
(01:31) అది ఎప్పుడైతే దెబ్బ తింటుందో అది వెంటనే రియాక్ట్ అవుతుంది. సరే ఇప్పుడు మనం స్పిరిచువల్ సైడ్ చూద్దాం. మన ఉపనిషత్తుల్లో ఒక పాత మాట ఉంది. క్రోధి భవతి సమ్మోహత్ అంటే కోపం వల్ల మన బుద్ధి మబ్బుగా మారుతుంది. ఒకసారి ఆలోచించండి మీరు కోపంగా ఉన్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోగలరా లేదు కదు కోపం మన దృష్టిని బ్లాక్ చేస్తుంది. అప్పుడు మనకు ఎదుటి వాళ్ళు తప్పుగానే కనిపిస్తారు.
(01:59) మనం మాత్రం నేను కరెక్ట్ అనుకుంటాం. స్పిరిచువల్ గా చూస్తే కోపం అనేది జస్ట్ ఎనర్జీ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంది కదా ఆ గ్యాస్ ఫైర్ ని మనం ఆహారం వండడానికి టీ పెట్టడానికి ఉపయోగిస్తే అది మనకు సాయం చేస్తుంది. కానీ దాన్ని కింద పడేస్తే అది రూమ్ అంతా అంటుకొని అంతా నాశనం చేస్తుంది. కోపం కూడా ఇంతే దాన్ని ఎలా వాడుకుంటామ అనేది మన చేతుల్లోనే ఉంది.
(02:28) ఇక ప్రాక్టికల్ గా నేను నమ్మేది ఒక్కటే కోపాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించకండి ఎందుకంటే దాన్ని కంట్రోల్ చేయాలని చూస్తే అది లోపల అణచివేయబడి ఇంకాస్త విషంగా మారుతుంది. బదులుగా దాన్ని సాక్షిగా చూడండి. కోపం వస్తే మీ లోపల ఏదో వేడిగా అనిపిస్తుంది కదా అప్పుడు మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది కదా ఆ ఫీలింగ్ ని గమనించండి.
(02:53) మనసులో ఇలా అనుకోండి ఓకే ఈ ఎమోషన్ వచ్చింది. ఇది నా ప్రతిస్పందన మాత్రమే ఇది నేను కాదు దీన్నే స్పిరిచువల్ మాస్టర్స్ విట్నెసింగ్ అంటారు. కంట్రోల్ చేస్తే అది విషం అవుతుంది. విట్నెస్ చేస్తే అది జ్ఞానం అవుతుంది. కోపం మనకు ఒక టీచర్ లాంటిది. అది చెబుతుంది చూడు నువ్వు దేనికి ఎక్కువ అటాచ్ అయ్యావో అది దెబ్బ తింది.
(03:16) సరే ఇప్పుడు ప్రాక్టికల్ లైఫ్ లో మనం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. మీకు తెలుసు కోపం వచ్చినప్పుడు మన నోరు చాలా ఫాస్ట్ గా పని చేస్తుంది. ఆ మాటల తర్వాత మనకు రియలైజ్ అయ్యి బాధపడతాం. సో ఒక చిన్న ఛాలెంజ్ తీసుకోండి. కోపం వచ్చిన వెంటనే ఒక డీప్ బ్రీత్ తీసుకోండి కేవలం ఒక ఐదు సెకండ్లు ఆ ఐదు సెకండ్లలో మనసులో ఒక ప్రశ్న అడగండి. ఇప్పుడు నేను చేయబోయే మాట చేయబోయే పని వల్ల నేను రియల్ గా హ్యాపీగా ఫీల్ అవుతానా లేక తర్వాత రిగ్రెట్ అవుతానా? చాలాసార్లు ఈ ఒక్క చిన్న పాస్ మన రియాక్షన్ ని రెస్పాన్స్ గా మారుస్తుంది.
(03:51) అది మనల్ని బలపరుస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే కోపం అనేది మీ శత్రువు కాదు అది మీ లోపల ఉన్న అసమతుల్యాన్ని చూపించే ఒక సందేశం దాన్ని అనచకుండా అర్థం చేసుకోండి. దాని శక్తిని మీ ఎదుగుదలకు ఉపయోగించుకోండి. అప్పుడు కోపం మిమ్మల్ని కాల్చదు. అది మీకు బుద్ధిని ఇస్తుంది. సో ఫైనల్ గా ఫ్రెండ్స్ మీ లోపల మంట పుట్టినప్పుడు దాన్ని ఆర్పడానికి ప్రయత్నించకండి ఆ వెలుగులో దారిని చూడండి.
(04:19) తర్వాతసారి కోపం వచ్చినప్పుడు దాన్ని ఫీల్ చేయండి. కానీ దాని వెనుకున్న పాఠాన్ని చదవండి. ఇదే మన నిజమైన స్పిరిచువల్ జర్నీ ఈ ఎపిసోడ్ ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. దిస్ ఈస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్ జై హింద్

No comments:

Post a Comment