Saturday, March 14, 2026

ఆనందం అంటే ఏమిటి? | Life-Changing Philosophy | The Silence Behind Happiness | Margadarsi Podcast

ఆనందం అంటే ఏమిటి? | Life-Changing Philosophy | The Silence Behind Happiness | Margadarsi Podcast

Author Name:Margadarsi Telugu Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=mlbFqnRNGXM



Transcript:
(00:01) హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ నిఖిల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ మనిషిగా మనందరిని రాత్రనక పగలనక పరుగులు పెట్టిస్తుంది. మన ప్రతి ప్రయత్నం యొక్క చివరి లక్ష్యం ఏంటి ఆనందమే కదా సో నిజాయతీగా చెప్పండి మనమందరం ఆనందంగా ఉండాలని కోరుకుంటాం కదా మనమంతా ఆనందాన్ని వెతుకుతాం.
(00:24) కానీ దాన్ని ఎక్కడ వెతుకుతామో అక్కడే కోల్పోతాం. ఇలా ఎందుకు జరుగుతుంది? ఒక్కసారి ఆలోచించండి మనకి ఆనందం అంటే ఏంటి? ఆఫీస్ లో ఊయించని ప్రమోషన్ రావడమా లక్కీగా లాటరీ తగలడం లేదా సోషల్ మీడియాలో మన పోస్ట్ కి లక్ష లైకులు రావడం అవును ఇవి మనకు కొంత తృప్తిని ఇస్తాయి. వాటిని మనం ప్లెజర్ లేదా సుఖం అంటాం. కానీ ఈ ప్లెజర్ కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది.
(00:50) అది కండిషనల్ ఒక వస్తువు ఒక వ్యక్తి లేదా ఒక సంఘటన మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఆ సంఘటన మారితే సుఖం మాయమవుతుంది. అది కేవలం ఒక రియాక్షన్ కానీ ఉపనిషత్తులు చెబుతున్న నిజమైన ఆనందం అది రియాక్షన్ కాదు అది స్టేట్ ఆఫ్ బీయింగ్ అది నీ స్వభావం. తైతీర్య ఉపనిషత్తుల్లో దీని గురించి ఒక అద్భుతమైన వాక్యం ఉంది. ఆనందో బ్రహ్మేతి వ్యాజనాత్ అంటే ఆనందమే బ్రహ్మం దీని అర్థం ఏంటంటే బ్రహ్మం అనేది ఎక్కడో దేవుడి రూపంలో కూర్చొని లేదు బ్రహ్మం అంటే బ్లిస్ లేదా ఆనంద స్వరూపం అని మనకు తెలిసినట్టుగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఈ మూడు వేరు వేరు కాదు ఒకే శక్తికి ఉన్న మూడు ముఖాలు
(01:36) సత్యం అంటే మన ఉనికి యొక్క నిజం జ్ఞానం అంటే ఆ నిజం పట్ల మనకు కలిగే అవగాహన ఆనందం అంటే ఆ నిజంలో జీవించడం ఆ సత్యాన్ని జ్ఞానాన్ని అనుభవించడం మనం ఆనందాన్ని ఎప్పుడూ బయట ఉన్న వస్తువుల్లో వెతుకుతాం. కానీ ప్రతి వస్తువుకి ఒక లిమిటేషన్ ఉంటుంది. అందుకే ఆ వస్తువు పోయినప్పుడు లేదా పాతబడినప్పుడు మన ఆనందం కూడా పోతుంది.
(02:01) ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంచి పాట వింటున్నారు గొప్పగా ఫీల్ అవుతున్నారు. కానీ ఆ పాటనే 100 సార్లు వింటే ఫీల్ తగ్గిపోతుంది కదా ఎందుకంటే మీ అటెన్షన్ బయటకి పాయింట్ అయింది. ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి అంటే నువ్వు అనుభవిస్తున్న ఆ బ్లిస్ అనేది ఆ వస్తువు వల్ల కాదు. నీ మనసు ఆగిన ఒక్క క్షణంలో వచ్చే నీ అంతర్గత ప్రతిబింబం వల్ల అదే ఆ మిస్టీరియస్ మౌనం అందుకే వాళ్ళు ఆనందం అనేది వస్తువు కాదు స్వరూపం అంటున్నారు.
(02:31) దీనికి మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ని చూద్దాం. గాఢ నిద్రలో మనల్ని ఎవ్వరూ ఎంటర్టైన్ చేయరు. మనకి ఏ కలలు రావు ఏ వస్తువు ఉండదు. అయినా లేచిన తర్వాత మనం ఏమంటాం? వా బాగా నిద్రపోయాను అంటాం. అంటే బ్లిస్ అనేది అనుభవించాం కానీ మనకి దాని గురించి తెలియదు. ఉపనిషత్తులు చెబుతాయి ఆ బ్లిస్ అనేది బయట నుంచి రాలేదు.
(02:55) అది కేవలం నిన్ను తాకిన నీ స్వరూపం నుంచి అందుకే నిజమైన ఆనందానికి రీజన్ ఉండదు. కారణం ఉన్న ఆనందం ఎప్పుడూ తాత్కాలికమే. ఏ కారణం లేకపోయినా నీ లోపల ఉండే పీస్ అదే ఉపనిషత్తుల ఆనందం. ఈ రోజుల్లో ప్రపంచంలో హ్యాపీనెస్ ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద బిజినెస్. డోపమైన్ హాక్ మోటివేషనల్ టాస్క్స్ ఫిక్స్ సక్సెస్ ఫార్ములాలు ఇవన్నీ ప్లెజర్ షార్ట్ కట్స్ కానీ మనుషులు మాత్రం లోపల ఇంకా ఏదో ఖాళీగా ఉన్నట్టే ఫీల్ అవుతున్నారు.
(03:28) ఎందుకంటే మనం ఆనందాన్ని ఒక కెమికల్ గా చూడకూడదు. కాన్షస్నెస్ గా చూడాలి. మన మనసు కామయినప్పుడు మన ఈగో కాసేపు తగ్గిపోయినప్పుడు ఆనందం సహజంగా ఫ్లో అవుతుంది. దిస్ ఇస్ నాట్ సంథింగ్ యు డు ఇట్స్ వాట్ రిమైన్స్ వెన్ యు స్టాప్ డూయింగ్ ఆనందం అంటే స్వేచ్ఛ ఉపనిషత్తులు చెబుతున్న ఆనందం అది ఉద్రిక్తత కాదు. అది కేవలం డిస్టర్బెన్స్ నుంచి స్వేచ్ఛ. ప్లెజర్ అంటే మూమెంట్ ఆనందం అంటే స్టిల్నెస్ ప్లెజర్ మిమ్మల్ని అలిసిపోయేలా చేస్తుంది.
(04:00) బ్లిస్ మిమ్మల్ని విస్తరింపజేస్తుంది. ఒక్కసారి మనం నిజంగా మౌనంగా ఉంటే ఆ మౌనంలో ఒక ఫుల్నెస్ ఉంటుంది. అదే అసలైన ఆనందం. ఎందుకంటే ఆ సైలెన్స్ లోనే బ్రహ్మం నిశ్వసిస్తుంది. ఫైనల్ గా ఫ్రెండ్స్ సత్యం తెలుసుకున్నప్పుడు జ్ఞానం మొదలవుతుంది. జ్ఞానం పూర్తిగా అనుభవంలోకి వచ్చినప్పుడు బ్లిస్ వస్తుంది. అదే ఉపనిషత్తుల చక్రం సత్యం టు జ్ఞానం జ్ఞానం టు ఆనందం ఇదే ఈ ఉపనిషత్తుల యొక్క ఫార్ములా.
(04:27) ఆనందం అనేది మనం బయట ఎక్కడో వెతకాల్సిన వస్తువు కాదు. దాన్ని అనుభవించే నేనే ఆ బ్లిస్ సోర్స్ ఆనందో బ్రహ్మేతి వ్యాజన నువ్వు దాన్ని వెతకడం ఆపిన క్షణం దానిగా మారిపోతావు. సో ఫ్రెండ్స్ ఆనందం అనేది ఎప్పుడూ భవిష్యత్తులో ఉండదు. అది కేవలం వర్తమానంలో విచ్చుకుంటుంది. నువ్వు కంప్లీట్ అనిపించే ప్రతి నిశ్చలమైన క్షణం అది బ్రహ్మాన్ గ్లిమ్స్ మన జర్నీ ఇప్పుడే మొదలైంది.
(04:53) ఎందుకంటే బ్లిస్ ఇస్ నాట్ ఏ డెస్టినేషన్ ఇట్స్ యువర్ నేచర్ రిమెంబరింగ్ ఇట్సెల్ఫ్ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ దిస్ ఈజ్ నిఖిల్ సైనింగ్ ఆఫ్ జై హింద్

No comments:

Post a Comment