క్రోధక్షేత్రం | Anger | కోపం – మనసులోనీ యుద్ధం | Margadarsi Telugu Podcast by Nikhil
Author Name:Margadarsi Telugu Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=RPEWTUvLpxo
Transcript:
(00:01) హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ నిఖిల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకునే విషయం కోపం కురుక్షేత్రం అంటే కేవలం యుద్ధభూమి మాత్రమే కాదు అది మన ఆలోచనలకు మన ఎమోషన్స్ కు జరిగే యుద్ధానికి ఒక ఉదాహరణ ఒక పెద్ద మలుపులో అర్జునుడు తన తండ్రి లాంటి భీష్ముడిపై బాణం వేయాల్సి వచ్చింది.
(00:26) అదొక బలవంతపు మనసు బాధ పెట్టిన నిర్ణయం ఆ ఒక్క సంఘటన యుద్ధం మొత్తాన్ని మార్చేసింది. ఆ క్షణం నుంచి యుద్ధభూమి మొత్తం కోపంతో ఉద్రేగంతో రగిలిపోయింది. కౌరవుల సైన్యం ముఖ్యంగా దుర్యోధనుడు ఆగ్రహంతో కళ్ళు మూసుకుపోయాడు. అతని కళ్ళలో నిప్పులు అతను ఒకే ఒక మాట అన్నాడు. అదే అతని ఫైనల్ డెసిజన్ ఇక ఈ క్షణం నుంచి నాకు ప్రతీకారం తప్ప ఇంకేమీ కనిపించదు.
(00:57) ఫ్రెండ్స్ నిజమైన ప్రమాదం అక్కడే మొదలైంది. అప్పటివరకు యుద్ధం ధర్మం కోసం జరిగింది. కానీ ఇప్పుడు అది పూర్తిగా భావోద్వేగాలు నడిపే యుద్ధంగా మారింది. నిజమైన యుద్ధం ఎప్పుడూ లోపలే మొదలవుతుంది. పాండవులు గెలిచారేమో అనుకున్న క్షణం యుద్ధం మరింత ప్రమాదకరంగా తయారైింది. ఎందుకంటే ఇప్పుడు పోరాడుతోంది మనుషులు కాదు వారిలోని కోపమే వారికి బలమిచ్చి పోరాడుతోంది.
(01:24) ఫ్రెండ్స్ ఇక్కడ అసలు విషయం ఏంటంటే మీరు గమనించండి కోపం అనేది రెండో యుద్ధం మొదటి యుద్ధం ప్రపంచంతో బయట జరుగుతోంది. రెండో యుద్ధం మన మనసులో జరుగుతోంది. దుర్యోధనుడు బయట యుద్ధంలో గెలవాలని చూశాడు. కానీ రెండో యుద్ధం అంటే తనలోని ఈర్ష కోపం అసహనం దాంట్లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. ఫ్రెండ్స్ మన లైఫ్ లో కూడా ఇదే జరుగుతుంది కదా మనల్ని ఎవరైనా హర్ట్ చేస్తే మనం వెంటనే రివెంజ్ తీసుకోవాలనుకుంటాం.
(01:54) ఆ కోపం మెల్లగా మన స్పష్టమైన ఆలోచనను దూరం చేస్తుంది. మనం తీసుకునే నిర్ణయాలు తప్పైపోతాయి. మనం గెలవాలనుకున్న యుద్ధం మనలోని శాంతిని చంపేస్తుంది. కోపంతో కళ్ళు మూసుకుపోయిన దుర్యోధనుడికి గెలుపు కాదు నాశనం మాత్రమే కావాలి. తను గెలవాలనే కాదు ఎవ్వరూ ఉండకూడదనే భయంకరమైన ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం సైకలాజికల్ పర్స్పెక్టివ్ తీసుకుంటే మనకు నాలుగు స్టెప్పులు కనిపిస్తాయి.
(02:25) అందులో మొదటిది హట్ మనం బాధపడదాం. రెండవది బ్లేమ్ ఇంకొకరిని దానికి కారణం చేస్తాం. రివెంజ్ వాళ్ళను పనిష్ చేయాలని చూస్తాం. ఇక ఫైనల్ గా డిస్ట్రక్షన్ చివరికి మనమే మన మనశశాంతిని పోగొట్టుకుంటాం. ఈ నాలుగు స్టెప్పులు ఎవరికీ విక్టరీ ఇవ్వవు. అవి మన ఈగోని తృప్తి పరుస్తాయి కానీ మన ఆత్మను మాత్రం ఖాళీ చేస్తాయి.
(02:55) ఆ సమయంలో కృష్ణుడు ఒక శాంతమైన కానీ చాలా గొప్ప మాట చెప్పాడు. అది ఎప్పటికీ నిజం క్రోధం మనలోకి వచ్చినప్పుడు మనం యుద్ధభూమిలో లేము అర్జున మనం మంటల్లో ఉన్నామని గుర్తుంచుకో ఇది ఎంత నిజమో కదా మనకు కోపం వచ్చినప్పుడు మనం దాన్ని సమర్ధించుకుంటాం. నాకు కోప్పడే హక్కు ఉంది అంటాం. కానీ ఆ కోపం మన మంచి బుద్ధిని కాల్చేస్తుంది. దానితో మనం మనకే యుద్ధం ప్రకటిస్తాం.
(03:24) అది మన మనసులో యుద్ధం. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా కోపం లోపలికి వస్తే మంచి బుద్ధి బయటకి పోతుంది. కోపం నిజాయితీని కప్పేస్తుంది. అది మొదట్లో సరైనదిగా అనిపించినా చివరికి మాత్రం మన చూపు కోల్పోవడంలా మిగిలిపోతుంది. అందుకే కృష్ణుడు చెప్పింది కోపం కలిస్తే నిజం దూరమవుతుంది. ఈ రోజుకి కూడా ఇది మనఅందరికీ ఒక ముఖ్యమైన నిజం ట్రాఫిక్ లో గొడవల్లో బంధాల్లో ఎక్కడైనా కోపం కంట్రోల్ తప్పితే మన విలువ మన శాంతి అంతా పోతాయి.
(04:02) ఆ యుద్ధం చివర్లో కృష్ణుడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అతను చెప్పిన ఈ పాఠం మనకు లైఫ్ లో దారి చూపిస్తుంది. కోపం అంటే ప్రతీకారం కాదు అది నిజమఏంటో పూర్తిగా మర్చిపోవడం. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్
No comments:
Post a Comment