కోచింగ్ సెంటర్ నిర్వాకం!ఎక్కడైనా సరే రక్షణ కోసం ఈ నంబర్స్ కి కాల్ చెయ్యండి!#Satyabhama
Author Name:Satyabhama
Youtube Channel Url:https://www.youtube.com/@satyabhama17
Youtube Video URL:https://www.youtube.com/watch?v=YAJ84zV34gY
Transcript:
(00:01) వయసులో ఉన్నారు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సుఖపడతారు రండి అందరం ఎంజాయ్ చేద్దాం మిమ్మల్ని నేను సుఖపెడతాను అని విద్యాబుద్ధుడు నేర్పాల్సిన ఒక కోచింగ్ సెంటర్ డైరెక్టరే ఆ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన యువతల పట్ల అత్యంత అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేదింపులు గురిచేయడం జరిగింది. విజయనగరంలో ఫినెక్స్ కోచింగ్ సెంటర్ ఆ డైరెక్టర్ శ్రీనివాసరావు అనే వ్యక్తి అక్కడ ఎంతో మంది ఆడపిల్లలు టెట్ డిఎస్స కోచింగ్ అనేసేసి జాయిన్ అయ్యారు.
(00:28) మొదటి విడతగా 50,000 ఫీసు కూడా పే చేశారన్నమాట. అక్కడ జాయిన్ అయ్యి వారం రోజులు గడవకముందే ఈ కీచకుడు ఈ ఉన్మాదపు చర్యలు మొదలుపెట్టాడు. ఆడపిల్లల్ని విడివిడిగా తన రూమ్ లోకి పిలవడం, అసభ్యంగా అశ్లీలంగా మాట్లాడటము ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ తాకకూడని చోట్ల అసభ్యంగా తాకడము, అలాగే లైంగికమైన చర్యకు సహకరించమని ఆడపిల్లల్ని వేధించడము, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు.
(00:56) ఆడపిల్లలు ఒకరినొకరు కలుసుకుంటే ఈ విషయాలన్నీ బయటికి వస్తాయేమో అని ఈ దుర్మార్గుడు అక్కడ జాయిన్ అయిన ఆడపిల్లల్ని కూడా సెపరేట్ సెపరేట్ గా ఉంచి ఎవరిని కలుసుకొనివ్వకుండా మాట్లాడనివ్వకుండా పరిచయం చేసుకొనివ్వకుండా మొదటి రోజు నుండే జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాడు అలాగే మీరు నాకు సహకరించకపోతే రేపు టెస్ట్ లో మార్కు లేపించండి అని తద్వారా మీకు వచ్చే జాబ్స్ రాకుండా పోతాయని ఈ విధంగా వాళ్ళని బెదిరించడము భయపెట్టడం కూడా జరిగింది దానితోటి ఆడపిల్లలు ఎటు చెప్పుకోలేక అంత ఫీస్ తల్లిదండ్రులు కష్టపడి పే చేస్తే వెనక్కి తిరిగి ఇళ్లకు వెళ్ళలేక పంటి బిగువున ఈ బాధను దిగమింగుకొని ఎవరికి
(01:33) చెప్పుకోవాలో ఏం చేయాలో తెలియని దిక్కు తోచిన స్థితిలో ఉన్నారు. ఇదిలా ఉండగా మొన్న ఈ మధ్యే ఇంకొక అమ్మాయిని ఇలాగే ఈ దుర్మార్గుడు కీచకుడు రూమ్లోకి పిలిచి అసభ్యంగా తాకుతూ అసభ్యంగా మాట్లాడుతూ లైంగిక కోరిక తీర్చాలి అని ఆ అమ్మాయిని వేధించడం జరిగింది. సదరు యువతి ఒప్పుకోలేదు. దాంతోటి వీడికి కోపం వచ్చి ఆ అమ్మాయి తలని గోడకేసి కొట్టడం జరిగింది.
(01:57) ఆ అమ్మాయి పంటి బిగున బాధను సహిస్తూ ఎవరికైనా చెబితే ఊరుకోను నీ పరువే పోతుంది నీ జీవితమే నాశనం అయిపోతుంది నీకు జాబ్ రాకుండా చేస్తాను నువ్వు ఎగ్జామ్స్ టెస్ట్ రాయనివ్వకుండా చేస్తాను బెదిరించడం తోటి ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక ఆ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడుతూ ఉంటే చూసిన ఇతర యువతులు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళడం జరిగింది.
(02:20) దానితోటి విషయం అంతా బయటకి వచ్చింది. మొత్తం అందరూ మాట్లాడుకున్నారు మా పట్ల కూడా ప్రతి రోజు ఈ దుర్మార్గుడు ఈ విధంగానే అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు ఎవరికైనా చెబితే ఒప్పుకోను అని బెదిరిస్తున్నాడు అని ఈ ఆడ పిల్లలందరూ ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకొని ఏమైతే అది అయిందని ధైర్యం చేసి పోలీసులకు కాల్చేయడం జరిగింది పోలీసులు అక్కడికి వచ్చేసరికి ఈ దుర్మార్గుడు ఎస్కేప్ అయిపోయి శ్రీనివాసరావు అనే సదరు డైరెక్టర్ పరారీలో ఉన్నాడు.
(02:43) సరే పోలీసులు వచ్చేసి ఆ పిల్లలందరినీ కూడా కోచింగ్ సెంటర్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఏం జరిగిందో వాళ్ళ దగ్గర నుండి తెలుసుకోవడం జరిగింది. సరే ఇలాంటి కీచకడు ఎంత పరారై పారిపోయిన దొరుకుతాడు అనుకోండి పోలీసులకి దొరక్కుండా ఏమి ఉండడు. ఆడపిల్లలు ప్రత్యేకంగా తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కోచింగ్ సెంటర్స్ అలాగే ఈ విద్యా సంస్థలు ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఆడపిల్లల్ని లైంగికంగా వేధిస్తున్నారు ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అసభ్యంగా మాట్లాడుతున్నారు.
(03:14) ఈ విషయాలలో కాస్త అవగాహన కలిగి ఉండడము యువతలకు ఆడపిల్లలకు తల్లిదండ్రులకి అందరికీ కూడా మంచిది ఇలాంటివి ఏమైనా స్కూల్లో జరిగినా కాలేజీలో జరిగినా వర్క్ చేసే చోట జరిగినా సరే బయటికి చెప్పుకుంటే పరువు పోతుంది ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అనే ఆలోచన మొదట ఆడపిల్లలు మానేయాలి ఫస్ట్ ఆడపిల్లలు ఈ ఆలోచన మానేయాలి. అవతల ఇలాంటి కీచకులకు ఉన్న బలం అదే మనం ఏమి చేసినా పరువు గురించి దడిచి వీళ్ళు బయటకి చెప్పుకోలేరు అనేది వీళ్ళకు ప్రధానమైన బలం ఆ బలము మనమే సిగ్గుపడి మొహమాటపడి కలిగిస్తున్నాము ఇది ఆడపిల్లలు యువతలు గుర్తుపెట్టుకోవాలి ఏదైనా సరే అసభ్యమైన ప్రవర్తన మీ పట్ల
(03:50) ఎవరైనా అలా ప్రవర్తించారు అని మీకు అనిపిస్తే వెంటనే ఏమాత్రం సిగ్గుపడకుండా మొహమాట పడకుండా మీ తల్లిదండ్రులు లేదంటే మీ వాళ్ళు ఎవరైతే ఉంటారో అన్నదమ్ములు భర్త మీ వాళ్ళకు వెంటనే చెప్పేయండి ఏమా ఏ మాత్రం ఆలస్యం చేయొద్దు ఇలాంటివి సిగ్గుపడే విషయాలు కాదు సిగ్గుపడడము మొహమాట పడటం అంటే మనం ఏదైనా తప్పు చేస్తుంటే చేయకూడని పనులు చేస్తుంటే దానికి సిగ్గుపడాలి భయపడాలి గాని ఇలాంటి విషయాలు ధైర్యం చేసి తెగేసి చెప్పి చెప్పుతోటి అవతలి వాడిని 10 మంది ముందుకు లాక్కొచ్చి కొట్టించగలగాలి యువతలు.
(04:19) ఆ పరిస్థితి సమాజంలో ఉందంటే ఎవ్వడు యువతలతోటి అసభ్యంగా ప్రవర్తించడానికి సాహసం చెయ్యడు. ఆ విధంగానే మనం ధైర్యంగా ఉండే ఇలాంటి విషయాలు కట్టడి చేయాలి గుర్తుపెట్టుకోండి. ఇంకా ముఖ్యంగా యువతలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మహిళలు ముఖ్యంగా 181 ఈ నెంబర్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఇది మహిళల పట్ల హింస లైంగిక వేధింపులు లాంటివి ఏమైనా సరే జరిగినప్పుడు వెంటనే మీకు హెల్ప్ చేయడం కోసం ఉన్న ఫ్రీ హెల్ప్ లైన్ మహిళాసలకి 181 కి ఫోన్ చేస్తే పరిస్థితి చెప్పి మీరు ఎక్కడ ఉన్నారో లైవ్ లొకేషన్ గాని పెట్టారంటే వాళ్ళు వచ్చేసి మహిళా పోలీసులతో వచ్చి మిమ్మల్ని కాపాడతారు.
(04:56) అలాగే490 ఇది కూడా మహిళలను రక్షించే ఒక ప్లాట్ఫామ్ కాల్ చేసి పరిస్థితి ఇది అనేసి కంప్లైంట్ ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటారు పోలీసులు ఇలాగే 1091 అది కూడా మీరు పోలీసులని సంప్రదించడానికి సహాయపడుతుంది అంతకంటే కూడా ముఖ్యంగా ఆడపిల్లలు చేయాల్సిన పని ఏంటో తెలుసా మీరు ఏ ప్రాంతంలో నివాసం ఉంటుంటే అక్కడ ప్రాంతీయ పోలీస్ స్టేషన్ నెంబర్ మీ దగ్గర ఉంచుకోవాలి ఆ ప్రాంతపు ఎస్ఐ గారో సిఐ గారో ఉంటారు వాళ్ళ నెంబర్లు మీ దగ్గర పెట్టుకోవాలి పని పనికి మాలిన వాళ్ళు ఫ్రెండ్స్ అక్కడ పరిచయమైన వాళ్ళు ఇక్కడ పరిచయమైన వాళ్ళు ట్రైన్లో పరిచయమైన వాళ్ళు అందరి నెంబర్లు పెట్టుకుంటారు కదా
(05:32) ఆడపిల్లలకి ముందు తెలుసుకోవాల్సిన విషయం ముందు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీ మొబైల్ లో మీరు ఏ ప్రాంతంలో నివాసం ఉంటున్నారో మీ ఇల్లు గాని హాస్టల్ గాని విద్యా సంస్థ గాని మీరు రెగ్యులర్ గా ఏ ప్రాంతంలో వర్క్ చేస్తారో ఆ ప్రాంతీయ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి నెంబరు మీ దగ్గర ఉంచుకోవాలి Google లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది లేదంటే ప్రాంతీయ పోలీస్ స్టేషన్ లో అక్కడ బోర్డు మీద నెంబర్స్ రాసి ఉంటాయి చక్కగా తీసుకొని ఫోన్ లో సేవ్ చేసుకోండి కుదిరితే మేము ఫలానా చోట చదువుకోవడానికి వచ్చాం లేదంటే వర్క్ చేయడానికి వచ్చాము సేఫ్టీ కోసం తీసుకుంటున్నామ అని ఒక మాట అక్కడున్న
(06:00) పోలీసులు కానిస్టేబుల్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళకి చెప్పి రండి ఆ విధంగా చేయడం వలన మనలో ఆత్మవిశ్వాసం వినుస్తుంది వాళ్ళక కూడా మనం పరిచయం అవుతాం పోలీసులు ఏమి దుర్మార్గులు కాదండి వాళ్ళు కఠినంగా ఉంటారు అంటే నేరస్తులని అదుపు చేయడం కోసం దండోపాయం వాడాలి కాబట్టి వాళ్ళు కఠినంగా ఉంటారు ఏదో సినిమాల్లో చూపించినట్టు దుర్మార్గంగా ఏమి ఉండరు కాబట్టి ఆడపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు మహిళలు ఎవరైనా సరే స్కూల్ కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి ఫోన్లు ఎవరు వాడుతున్నారో వాళ్ళ ఫోన్లో ముఖ్యంగా ఈ ప్రాంతీయ పోలీస్ స్టేషన్ మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఈ ప్రాంతీయ పోలీస్
(06:28) స్టేషన్ పోలీస్ అధికారుల నెంబర్ మీ సెల్ లో సేవ్ చేసుకొని పెట్టుకోండి ఏ మాత్రం ఈ విధమైన ఇబ్బందులు వచ్చినా కూడా వెంటనే కాల్ చేసి ఇది జరిగిందని చెప్పండి కచ్చితంగా వాళ్ళు స్పందిస్తారు సేఫ్టీగా ఉంటుంది ఆ విధంగా ఒకసారి గాని చేస్తారంటే ఎవ్వరూ జీవితంలో మన జోలికి రాకుండా ఉంటారు. ఎవరైనా సరే మహిళల పట్ల యువతల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే అసభ్యకరంగా మాట్లాడితే అది దాచిపెట్టుకునే విషయం కాదు సిగ్గు పడే విషయం కాదు తల్లిదండ్రులు అలాగే మీ వాళ్ళు ఎవరైతే ఆత్మీయులు ఉంటారో పెద్దలు వాళ్ళతోటి చర్చించండి నాతోటి ఫలానా వ్యక్తిని అసభ్యంగా మాట్లాడాడు
(06:59) వాళ్ళ ఇంట్లో వాళ్లే అయినా బంధువులైన రక్త సంబంధీకులు అయినా బయట వాళ్ళయినా టీచర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా అత్తగారి ఇంట్లో వాళ్ళయినా ఎవ్వరైనా సరే పరువు పోతుందని దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు దాచిపెట్టుకొని మహిళలు వాళ్ళల్లో వాళ్లే మదన పడాల్సిన అవసరం లేదు ధైర్యంగా మనం అడుగు ముందుకు వేసామంటే సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి.
(07:19) ధైర్యే సాహసే లక్ష్మి అని చెప్పారు మనకు శాస్త్రాల్లో ఒక మనిషి తాను ప్రశాంతంగా బ్రతకాలన్నా ఎదుటివాడిని ప్రశాంతంగా ఉండనివ్వాలన్న ధైర్య సాహసాలు చాలా అవసరం కాబట్టి అది లక్ష్మీ గుణం అనేసేసి మనకు శాస్త్రాల్లో చెప్పబడింది కాబట్టి ధైర్య సాహసాలతోటి ప్రవర్తించాలి ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు బాధపడకూడదు మొహమాటం వంత కంటే కూకూడదు ఆడపిల్లలు మహిళలు యువతలు అందరూ కూడా ధైర్యంగా ఉండేలాంటి సవాలను ఎదుర్కోవాలని కోరుకుంటున్నాను జైహింద్
No comments:
Post a Comment