Saturday, March 14, 2026

Logic Vs Faith - Adi Shankaracharya Philosophy In Telugu | Margadarsi Telugu Podcast

Logic Vs Faith - Adi Shankaracharya Philosophy In Telugu | Margadarsi Telugu Podcast

Author Name:Margadarsi Telugu Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=-PXvUk--6iA



Transcript:
(00:02) హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ నిఖిల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక రియల్ లైఫ్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. ఇది మన అందరి జీవితంలో రోజు ఫేస్ చేసే సంఘర్షణే మన మనసు ఎప్పుడూ రెండు వైపులా లాగుతూ ఉంటుంది కదా ఒకవైపు బుద్ధి అంటుంది లాజికల్ గా ఆలోచించు ఎమోషనల్ అవ్వకు సరిగ్గా ప్లాన్ చేయమని మరోవైపు హృదయం అంటుంది రిలాక్స్ అవ్వు అంతా మంచే జరుగుతుంది.
(00:29) దీన్ని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము ఈ రెండింటి మధ్య మనం నలిగిపోతాం కదా శంకరాచార్యులు వేల సంవత్సరాల క్రితమే ఈ సమస్యను చూశారు. ఆయన ఈ రెండింటిని వేరువేరుగా చూడలేదు. వాటి మధ్య ఒక అద్భుతమైన బ్రిడ్జ్ ను ఎలా నిర్మించాలో చూపించారు. ముందుగా భారతీయ తత్వశాస్త్రంలో ఎప్పుడూ ఒక గొడవ ఉండేది. ఆ రీజిషనల్ సైడ్ చూద్దాం సైన్స్ అంటుంది నాకు ప్రూఫ్ కావాలి.
(00:56) వీళ్ళు దేవుడిని అదృష్టాన్ని నమ్మేవారు కాదు. నా కృషి నా తర్కం తప్ప వేరేదిఏది నిజం కాదంటారు. ఈ ఆలోచన మనకు పరిశోధనా శక్తిని ఇస్తుంది. కానీ ఒక్కోసారి జీవితం చేదుగా అనిపించినప్పుడు మనల్ని ఒంటరిని చేసేస్తుంది. ఇక ఫేత్ సైడ్ చూస్తే వీళ్ళంతా కర్మ దైవ సంకల్పం అంటారు. వీరు ప్రశాంతంగా ఉంటారు. కానీ ఒక్కోసారి దీన్ని దేవుడికే వదిలేద్దామని చెప్పి కష్టపడటం మానేస్తారు. ఇక్కడ మనశశాంతి దొరుకుతుంది.
(01:25) కానీ తెలివైన నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏందంటే ఈ రెండు టీమ్స్ ఎప్పుడు ఒకదానితో మరొకటి మీరు పనికిరారు అని కొట్టుకుంటారు. అందుకే మనిషి ఎప్పుడూ అసంపూర్ణుడిగా మిగిలిపోతాడు. ఇక్కడే శంకరాచార్యుల ఎంట్రీ జరిగింది. శంకరాచార్యులు చాలా సింపుల్ గా కానీ లోతుగా ఈ రెండింటిని కలిపారు. ఆయన అద్వైతం గురించి చెప్పినప్పుడు మొదట తర్కాన్ని ఉపయోగించారు.
(01:53) ఆయన అన్నారు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడండి. ప్రతిదీ మారుతోంది కదా మీ శరీరం మీ ఉద్యోగం మీ ఆలోచనలు అన్నీ తాత్కాలికమే. శాశ్వతం కాని దాన్ని పట్టుకొని ఎందుకు బాధపడతారు? ఈ మార్పు చెందేదాన్ని మిత్య అని తెలుసుకోండి. ఇది ప్యూర్ లాజిక్ ఏది శాశ్వతం ఏది కాదు అని వివేకంతో తెలుసుకోవడం ఈ లాజిక్ మనల్ని మన అజ్ఞానం నుండి బయటకు నడిపిస్తుంది. ఒకసారి బుద్ధికి క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు ఫేత్ అవసరం.
(02:23) భజగోవిందం లాంటివి ఎందుకు రాశారని అడిగితే దానికి సమాధానంగా ఎందుకంటే తెలుసుకోవడం వేరు జీవించడం వేరు అని చాలా అద్భుతమైన సమాధానం ఇచ్చారు. తర్కంతో నేను బ్రహ్మము అని తెలుసుకోవచ్చు. కానీ అహంకారాన్ని భయాన్ని వదిలేయాలంటే హృదయం లొంగిపోవాలి. ఆ లొంగుబాటే భక్తి మరియు ఫేత్ ఇక్కడ తేడాను గమనించండి. లాజిక్ మనకు నిజమఏంటో చెబుతుంది. ఫేత్ ఆ నిజాన్ని ఎలా అనుభవించాలో నేర్పుతుంది.
(02:54) మన జీవితంలో ఈ బ్యాలెన్స్ ఎంత అవసరమో ఒకసారి చూద్దాం. మీరు ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు అనుకోండి ముందుగా లాజిక్ సైడ్ చూస్తే మీరు మార్కెట్ రీసెర్చ్ చేస్తారు. లాభ నష్టాలు చూసుకుంటారు. పక్కా ప్లాన్ వేస్తారు. ఇది శంకరాచార్యులు చెప్పిన విచారణ. ఇక రెండవ సైడ్ చూస్తే ఫెయిత్ ప్లాన్ వేసిన తర్వాత కూడా కొన్నిసార్లు అనుకోని సమస్యలు వస్తాయి కదా అప్పుడు నేను నావంతు కృషి చేశాను మిగిలింది కాలం నిర్ణయిస్తుందని ఒక ప్రశాంతతో ఉంటారు.
(03:25) ఇది శంకరాచార్యుల భక్తి సైడ్ ఈ రెండు లేకపోతే ఏమవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ లాజిక్ మాత్రమే ఉంటే చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేరు. ఓడిపోతారు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఫేత్ మాత్రమే ఉంటే ప్లాన్ లేకుండా అదృష్టం పై మాత్రమే ఆధారపడి వైఫల్యాలను చవి చూస్తారు. శంకరాచార్యులు చూపించింది తర్కాన్ని మీ ఆయుధంగా వాడండి. విశ్వాసాన్ని మీ కవచంగా వాడండి.
(03:52) జ్ఞానం మనకు శక్తినిస్తుంది. భక్తి మనకు రక్షణనిస్తుంది. ఇది చాలా ప్రాక్టికల్ ఫిలాసఫీ. సో ఫ్రెండ్స్ ఈ 1000 సబ్స్క్రైబర్స్ స్పెషల్ గా ఎందుకో నాకు ఈ వీడియోను మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. శంకరాచార్యుల నుంచి మనం తీసుకునే అత్యంత ముఖ్యమైన పాఠం ఇదే మీరు తార్కిక నిర్ణయాలు తీసుకోండి కానీ వాటి వెనుక మీ హృదయం యొక్క విశ్వాసం ఉండాలి.
(04:18) ఈ రెండింటి కలయకే మన జీవితాన్ని క్లియర్ గా మరియు స్టేబుల్ గా ఉంచుతుంది. ఎప్పుడైనా కష్టంగా అనిపిస్తే ఈ బ్రిడ్జ్ ను గుర్తు తెచ్చుకోండి. మీ బుద్ధి ఏం చెబుతుంది మీ హృదయం ఏం కోరుకుంటుంది ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ దొరికితే మీకు ప్రశాంతత లభిస్తుంది. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఫిలాసఫీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ జై హింద్

No comments:

Post a Comment