ఇది సుధామూర్తి గారి తండ్రి గొప్పతనం #trendingshorts #viralshort
Author Name:Nithyaarchana
Youtube Channel Url:https://www.youtube.com/@Nithyaarchana
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Smu3pOdhFio
Transcript:
(00:00) మనుషుల్లో దేవుడు అంటే ఎవరో కాదు ఆయనే ఆ అర్ధరాత్రి పడుకుని పది నిమిషాలు అయినా కాలేదు ఓ యువకుడు వచ్చి తలుపు తట్టాడు. సార్ ఒక నిండు గర్భిణి ప్రసవం తో చాలా బాధపడుతుంది. ఆమెను మీరే రక్షించాలి దయచేసి రండి సార్ అని వేడుకున్నాడు. 70 ఏళ్ల క్రిందటి రోజుల్లో మహారాష్ట్రలో ఓ మారుమూల గ్రామంలో డాక్టర్ ఆయన. ఆ యువకుడితో పాటు వెళ్ళాడు.
(00:20) ఆ యువతికి 19, 20 ఏళ్ళు ఉంటాయేమో ప్రసవం చాలా కష్టమైంది. కొన్ని గంటల పాటు వైద్యం చేశాడు ఆయన. తెల్లవారుతుండగా డాక్టర్ చెయ్యి పట్టుకొని ఆమె ఇలా అడిగింది దీనంగా. డాక్టర్ గారు నన్ను బ్రతికించకండి చంపేయండి నేను పేదదాన్ని భర్త వదిలేసాడు పుట్టబోయే ఈ బిడ్డను కూడా నేను సాకలేను అంటూ బోరున విలిపించింది ఆయన కదిలిపోయాడు అమ్మ మేము ఉన్నది బ్రతికించడానికే చంపడానికి కాదు ప్రసవం జరిగింది ఆడపిల్ల పుట్టింది ఆనందించాలో బాధపడాలో ఆ యువతికి తెలియలేదు ఆయన అన్నాడు అమ్మాయి నువ్వు భయపడొద్దు నీ దగ్గర ఫీజ్ ఏమీ నేను తీసుకోను నేనే నీకు ₹1 రూపాయలు ఇస్తున్నా దగ్గరలో ఉన్న పూణేకి
(00:53) వెళ్లి అక్కడ నర్సింగ్ కాలేజీలో గుమస్తాను కలు నా పేరు చెప్పు అన్నాడు ఆ తర్వాత ఆమె ఆమె పూడేలోని నర్సింగ్ కాలేజ్ కి వెళ్ళింది. ఆయన పేరు చెప్పింది. డాక్టర్ గారు పంపించారు అనగానే ఆమెను నర్సింగ్ కాలేజీలో చేర్చుకొని ఒక ఎనిమిది నెలల పాటు ట్రైనింగ్ ఇప్పించారు. ఆ తర్వాత ఉద్యోగం కూడా ఇచ్చారు. 25 ఏళ్ళు గడిచిపోయాయి. ఆ డాక్టర్ సీనియర్ ప్రొఫెసర్ అయ్యాడు.
(01:12) ఒక యూనివర్సిటీ వాళ్ళు విద్యార్థులకు పట్టాలు బంగారు పథకాలు ప్రదానం చేస్తుంటే ఆ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా వెళ్ళాడు. అది పూర్తయింది. చంద్ర అనే యువతి వచ్చి ఆయనను తమ ఇంటికి రావాల్సిందిగా పట్టుబట్టింది. స్వతహాగా సున్నిత మనస్కుడు ఆయన. ఆమె మాట కాదనలేక వెళ్ళాడు. అక్కడ నడి వయసులో ఉన్న ఒక ఆవిడ ఆయనకు టీ ఇస్తూ తమది ఒక పల్లె అని తమ ఇంటికి సంబంధించిన వివరాలు చెప్తుండగా ఆయన ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి.
(01:36) ఇంతలో హటాత్తుగా ఆమె ఆ యువతి ఆయన కాళ్ళకు నమస్కారం చేశారు. ఏంటమ్మా ఇది అని డాక్టర్ అడిగితే 25 ఏళ్ల క్రితం ఒక అర్ధరాత్రి డాక్టర్ గారు మీరే నన్ను కాపాడారు. అదిగో అప్పుడు పుట్టిన అమ్మాయే ఈ అమ్మాయి. మీరే మా దేవుడు. మీ పేరునే ఆమెకు చంద్ర అని పెట్టాను. త్వరలో మేము పేదల కోసం ఒక ఆసుపత్రిని కట్టబోతున్నాం. దానికి కూడా మీ పేరే చంద్ర అని పెట్టుకుంటున్నాం అని చెప్పారు.
(02:00) అది విన్నాక ఈసారి కన్నీళ్లు పెట్టడం డాక్టర్ వంత అయింది. ఆ డాక్టర్ ఎవరో కాదు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి భార్య అయిన సుధామూర్తి గారి తండ్రి గారు డాక్టర్ రామచంద్ర కులకర్ణి గారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.
No comments:
Post a Comment