"లైక్స్ కోసం లజ్జను వదిలేస్తున్నారా? మగవాడు వేసిన వలలో చిక్కుకున్న 'ఆటబొమ్మలు'!"
Author Name:Dr_Pasupathi_Raj_Gurejala
Youtube Channel Url:https://www.youtube.com/@Dr_Pasupathi_Raj_Gurejala
Youtube Video URL:https://www.youtube.com/watch?v=uhu_As_1YHg
Transcript:
(00:00) నమస్కారం ఈ వీడియోను నేను ఒక సాధారణ యూట్యూబ్ కంటెంట్ లా చేయడం లేదు. ఇది ఒక ఆపరేషన్. సమాజానికి పట్టిన ఒక కుళ్ళిన వ్యవస్థను క్లీన్ చేసే ప్రయత్నం. ఈ వీడియో ప్రారంభించే ముందు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి. మనం ఒక నాగరిక సమాజంగా ముందుకు వెళ్తున్నామా లేక మన సంస్కృతిని మన మూలాలను మనమే గోతిలో తొక్కి సమాధి చేస్తున్నామా? గత వీడియోలో మనం మగవారి వల్ల జరుగుతున్న అధర్మ సంపాదన గురించి మాట్లాడుకున్నాం.
(00:29) లంచాలు అవినీతి మోసపూరితమైన వ్యాపారాలు అడ్డదారులు తొక్కి మగవాడు సంపాదిస్తున్న ఆ పాపపు సొమ్ము వల్ల కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయో ఆ ధనం ఎలా విషంగా మారుతుందో చాలా వివరంగా పచ్చిగా విశ్లేషించాం. ఆ వీడియో రిలీజ్ అయ్యాక కింద కామెంట్ సెక్షన్ చూస్తే నాకు ఒకటే అర్థమైంది. వేల సంఖ్యలో మహిళలు వచ్చి అవును మగవాళ్ళు ఇంతే వాళ్ళ వల్లే లోకం పాడైపోతుంది అని చప్పట్లు కొట్టారు.
(00:54) కానీ మిత్రులారా అక్కడే ఒక భయంకరమైన నిశ్శబ్దం దాగి ఉంది. నానేనికి ఒకవైపు మురికిని చూపిస్తే సరిపోదు. రెండో వైపు ఉన్న విషయాన్ని కూడా బయట పెట్టాలి. అదే నేటిమన అజెండా. ఈ సమాజ పతనంలో ఈ అధర్మపు అరాచకంలో స్త్రీ పాత్ర ఏమిటి? ఈ ప్రశ్న అడిగితే చాలా మందికి కోపం రావచ్చు. కానీ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నా బాధ్యత. మన దేశంలో స్త్రీని అమ్మ అంటాం. ఆదిశక్తి అంటాం.
(01:21) ఇంటికి మహాలక్ష్మి అంటాం. స్త్రీ అంటే ఒక గౌరవం. ఒక పవిత్రత. కానీ ఈరోజు మనం కళ్ళ ముందు చూస్తున్నది ఏమిటి? కేవలం ఆ కాగితం ముక్కల కోసం డబ్బు కోసం క్షణికమైన ఆడంబరం కోసం ఆ వ్యర్థమైన సోషల్ మీడియా ఫేమ్ కోసం కొందరు స్త్రీలు చేస్తున్న పనులు చూస్తుంటే మనం అసలు ఏ కాలంలో ఉన్నాం అనిపిస్తుంది. స్త్రీ ధర్మం తప్పితే ఏమవుతుందో మీకు తెలుసా? ఒక మగవాడు ధర్మం తప్పితే ఆ వ్యక్తి లేదా ఆ కుటుంబం దెబ్బ తింటుంది.
(01:51) కానీ ఒక స్త్రీ ధర్మం తప్పి అధర్మ సంపాదన వైపు వెళ్తే అది ఒక తరాన్నే ఒక మొత్తం సమాజాన్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే స్త్రీ ఈ సమాజానికి పునాది. ఇల్లు అనేది ఒక గుడి అయితే ఆ గుడికి ధర్మం అనే పునాది వేయాల్సింది స్త్రీ. ఆ పునాది కుళ్ళిపోతే పైన ఉన్న భవనం ఎన్ని రోజులు నిలబడుతుంది? ఈరోజు మనం చర్చించబోయేది కేవలం విమర్శ కాదు.
(02:14) ఇది ఒక లోతైన సామాజిక విశ్లేషణ. ఇది ఒక గట్టి హెచ్చరిక. నేటి కాలంలో స్త్రీ స్వేచ్ఛ అనే అందమైన ముసుగులో జరుగుతున్న అసలు వ్యాపారం ఏంటి? శరీర ప్రదర్శనే పెట్టుబడిగా మారుతున్న ఈ గడ్డు కాలంలో స్త్రీ తన అసలైన గౌరవాన్ని ఎలా బజారున పడేస్తోంది. ఈ వీడియో నిడివి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇక్కడ పైన పైన తడిమి వదిలేయడం లేదు. చాలా లోతులో మనం మూలాల్లోకి వెళ్ళబోతున్నాం.
(02:38) ముందుగా మనం చూడాల్సింది వేదాలు మరియు శాస్త్రాల సాక్ష్యం. మన మహర్షులు మన ధర్మశాస్త్రాలు వేల ఏళ్ల క్రితమే ఈ కలికాలం గురించి ముఖ్యంగా ధర్మం తప్పిన స్త్రీల వల్ల కలిగే వినాశనం గురించి హెచ్చరించాయి. మనుస్మృతిలో కానీ చాణక్య నీతిలో కానీ స్త్రీ శక్తి గురించి ఎంత గొప్పగా చెప్పారో అదే స్త్రీ అధర్మ మార్గంలో వెళ్తే అది ఎంతటి ప్రళయానికి దారి తీస్తుందో కూడా అంతే స్పష్టంగా చెప్పారు.
(03:06) శ్లోకాలతో సహా వాటి అర్థాలను వివరిస్తూ నేను మీకు విశ్లేషిస్తాను. రెండో కోణం ఆధునిక సైన్స్ ముఖ్యంగా ఎవల్యూషనరీ సైకాలజీ మానవ పరిణామ క్రమంలో స్త్రీ ప్రవర్తన ఎలా మారింది కేవలం వనరుల కోసం మనీ మరియు రిసోర్సెస్ స్త్రీ ఎంతటి సాహసానికైనా ఎంతటి దిగజారుడు తనానికైనా ఎందుకు సిద్ధపడుతుంది అనే విషయాన్ని శాస్త్రీయంగా నిరూపిస్తాను. మూడో పాయింట్ నేటి సోషల్ మీడియా మాయాజాలంఇస్గ రీల్స్ఫేస్బక్ వీడియోలు వీటిని చూస్తుంటే స్వేచ్ఛ అంటే బట్టలు విప్పడమే అనే భ్రమలో కొందరు బతుకుతున్నారు.
(03:42) మా శరీరం మా ఇష్టం మా బట్టలతో మీకేం పని మీ మగవాళ్ళ చూపు మార్చుకోండి అనే ఒక వితండవాదాన్ని తెరపైకి తెచ్చారు. ఈ వాదనలో ఎంతటి కుట్ర ఉందో మగవాడి సహజ సిద్ధమైన బలహీనతను అలుసుగా చేసుకుని ఆ స్త్రీలు చేస్తున్న అధర్మం ఏంటో నేను మీకు పచ్చిగా చూపిస్తాను స్త్రీ అందం అనేది ఒక పవిత్రమైన శక్తి దాన్ని అంగడిలో పెట్టి లైక్స్ కోసం వ్యూస్ కోసం తద్వారా వచ్చే డబ్బు కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం ఏ ధర్మం అనిపిస్తుంది? ఇంకా లోతుగా వెళ్తే హనీ ట్రాప్స్ అలిమోని భరణం పేరుతో జరిగే లీగల్ రాబరీ ప్రేమ అనే పేరుతో జరిగే బ్లాక్ మెయిలింగ్ ఇవన్నీ కేవలం డబ్బు కోసమే కదా ఒక మగవాడు తన
(04:23) జీవితాంతం రక్తం చెమటగా మార్చి సంపాదించిన సొమ్మును కేవలం కొన్ని నెలల కాపురంతో లేదా ఒక చిన్న వల వేసి లాగేయడం ఎంతటి పాపం ఇటువంటి అధర్మ సంపాదన వల్ల సమాజం ఏమైపోతుంది? ఆ ఇంట్లో పెరిగే పిల్లలు ఏమవుతారు? ఇదంతా తెలిసి కూడా తల్లిదండ్రులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు కూతురు సంపాదిస్తోంది కదా అని సంపాదన ఎక్కడి నుండి వస్తుందో చూడకుండా సంబరపడే తల్లిదండ్రులే నేడు ఈ పతనానికి అసలు కారణం మిత్రులారా నేను చెప్పే ప్రతి మాట ఒక ఈటెలా మీ గుండెల్లో గుచ్చుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి ఆపరేషన్ చేసేటప్పుడు సర్జన్ వాడే కత్తి నొప్పి పెడుతుంది. కానీ
(05:03) అది లోపల ఉన్న కుళ్ళిన భాగాన్ని తీసివేసి ప్రాణాన్ని కాపాడుతుంది. ఈ వీడియో కూడా అంతే. మీరు ఒకవేళ నిజాయితీగా ఆలోచించే మనుషులైతే మీ సంస్కృతి మీద మీకు గౌరవం ఉంటే మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల భవిష్యత్తు మీద మీకు శ్రద్ధ ఉంటే ఈ వీడియోను అస్సలు వదలకండి. మనం ఈ ప్రయాణంలో ప్రతి ఒక్క పాయింట్ ను విశ్లేషిస్తాం. ఇది ఎవరినో వ్యక్తిగతంగా కించపరచడానికి చేస్తున్న ప్రయత్నం కాదు.
(05:29) వ్యవస్థను మేల్కొల్పే ప్రయత్నం. నేటి కాలంలో స్త్రీ స్వతంత్రత అంటే పురుషుడితో సమానంగా సంపాదించడం కాదు. పురుషుడి కంటే గొప్పగా ధర్మాన్ని పాటించడం అని చెప్పే కాలం రావాలి. కానీ దానికి విరుద్ధంగా జరుగుతున్న ఈ అధర్మపు వేడుకను మనం ఇప్పుడే ఆపకపోతే రాబోయే తరాలకు మనం ఒక దిక్కుమాలిన చరిత్రను మిగిలిస్తాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గ్లామర్ ఈ ఆడంబరం ఈ విలాసాలు ఇవన్నీ తాత్కాలికం.
(05:56) అధర్మంగా సంపాదించే రూపాయి కూడా రేపు నీ కుటుంబంలో ఒక పెద్ద చిచ్చు పెడుతుంది. దేవుడి ఇచ్చిన శరీరాన్ని ప్రదర్శనకు పెట్టి మగవాడిని కామవసంలోకి నెట్టి దాని ద్వారా వచ్చే వ్యూస్ తో వ్యాపారం చేయడం అనేది వ్యభిచారం కంటే దారుణం. దీన్ని నేను ఎందుకు ఇంత కఠినంగా చెబుతున్నానో మీకు ముందు ముందు అర్థమవుతుంది. సిద్ధంగా ఉండండి.
(06:18) ఎందుకంటే నానేనికి ఉన్న రెండో వైపుని నేడు మనం తిప్పి చూడబోతున్నాం. స్త్రీ స్వేచ్ఛ పేరుతో జరుగుతున్న ఈ భారీ స్కాం ను బయట పెట్టడానికి నేను రెడీ మీరు కూడా సిద్ధమే కదా అధర్మాన్ని అధర్మం అని చెప్పే ధైర్యం మనకు ఉండాలి. ఆ ధైర్యంతోనే ఈ విశ్లేషణను ముందుకు తీసుకెళ్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం లేడీస్ అండ్ జెంటిల్మెన్ యువర్ అటెన్షన్ ప్లీజ్ దిస్ ఇస్ డాక్టర్ పశుపతి రాజ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్.
(06:46) ఇప్పుడు మనం అసలు మ్యాటర్ లోకి వెళ్దాం. ఈ రోజు సమాజంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ప్రతి స్మార్ట్ ఫోన్ లో సోషల్ మీడియా ఉంది. Facebook, Instagram, యూట్యూబ్ ఇవన్నీ చూస్తుంటే ఒక విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా మన సోదరీమణులు మహిళలు ఏమనుకుంటున్నారంటే మేము సోషల్ మీడియాలో ఫేమస్ అవుతున్నాం.
(07:08) మాకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. మేము మగవాళ్ళని మించిపోయాము. మేము స్వతంత్రులం అని ఒక గొప్ప భ్రమలో బతుకుతున్నారు. కానీ తెరవెనుక జరుగుతున్న అసలు వ్యాపారం ఏంటో మీకు తెలుసా? ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారంస్ అన్నింటిని కనిపెట్టింది ఎవరు? వీటిని వెనక ఉండి నడిపించేది ఎవరు? సిలికాన్ వ్యాలీలో కూర్చుని అల్గారిథమ్స్ రాసేది ఎవరు? మగవాళ్లే మార్క్ జుకర్బర్గ్ దగ్గర నుండి ఎలన్ మస్క్ వరకు ఈ డిజిటల్ సామ్రాజ్యాలను నిర్మించిన మగవాళ్ళు ఈ అల్గరిథమ్స్ ని ఎలా డిజైన్ చేశారో ఒక్కసారి ఆలోచించండి.
(07:39) వారు ఈ యాప్స్ ని స్వేచ్ఛ కోసం తయారు చేయలేదు. వ్యాపారం కోసం తయారు చేశారు. మరి ఆ వ్యాపారానికి పెట్టుబడి ఏంటో తెలుసా మీ అందం మీ ప్రదర్శన మీ వ్యక్తిగత జీవితం సోషల్ మీడియా అల్గరిథమ్స్ ఎలా పనిచేస్తాయో సైంటిఫిక్ గా విశ్లేషిద్దాం. మీరు ఒక మంచి విజ్ఞానదాయకమైన వీడియో పెడితే అది 100 మందికి రీచ్ అవుతుంది. కానీ అదే మీరు సగం బట్టలు వేసుకుని వికారమైన యాంగిల్స్ లో కెమెరాలు పెట్టి ఒక డాన్స్ వీడియో పెడితే అది లక్షల మందికి రీచ్ అవుతుంది.
(08:07) ఎందుకు? ఎందుకంటే ఆ అల్గారిథమ్స్ అలా ప్రోగ్రాం్ చేయబడ్డాయి. మగవాడి బలహీనతను విజువల్ లస్ట్ క్యాష్ చేసుకోవడానికి. మీ శరీరాన్ని ఒక ప్రొడక్ట్ గా మార్చడానికి ఆ అల్గారిథమ్స్ నిరంతరం పని చేస్తుంటాయి. మీరు వ్యూస్ పెరుగుతున్నాయి కదా అని మురిసిపోతున్నారు కానీ నిజానికి మీరు ఆ మగవాడు వేసిన ఒక డిజిటల్ వలలో చిక్కుకున్న ఆటబొమ్మలు డిజిటల్ పపెట్స్ మాత్రమే ఇక్కడ మనం డోపమైన్ అనే కెమికల్ గురించి మాట్లాడుకోవాలి.
(08:37) మీరు ఒక రీల్ పెట్టినప్పుడు వచ్చే ప్రతి లైక్ ప్రతి పాజిటివ్ కామెంట్ మీ మెదడులో డోపమైన్ ను విడుదల చేస్తుంది. ఇది ఒక డ్రగ్ లాంటిది. ఈ కిక్కు కోసం మీరు ఇంకా ఇంకా దిగజారడానికి సిద్ధపడతారు. మొదట మొహమాటంగా మొదలై తర్వాత తెగింపుగా మారి చివరికి అధర్మమే ధర్మంగా కనిపిస్తుంది. ఒక ఆడది తన గౌరవాన్ని తానే కాపాడుకోవాలి. కానీ ఇక్కడ లైక్స్ కోసం గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు.
(09:04) ఆ యాప్స్ ఇచ్చే చిల్లర డబ్బు కోసం మీరు మీ ఆత్మగౌరవాన్ని సంస్కారాన్ని వేలం పెడుతున్నారు. ఆ యాప్ యజమాని మీ అందాన్ని అడ్డు పెట్టుకొని కోట్లు సంపాదిస్తుంటే మీరు మాత్రం సమాజంలో మీ గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు. చాలా మంది స్త్రీలు ఇది మా స్వేచ్ఛ అని వాదిస్తారు. స్వేచ్ఛ అంటే ఏంటి? నీ ఆలోచనల్లో స్వతంత్రత ఉండటం స్వేచ్ఛ. నీ తెలివి తేటలతో సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకోవడం స్వేచ్ఛ కానీ అందాన్ని అంగడిలో పెట్టి అపరిచితుల లైక్స్ కోసం ప్రాకులాడటం స్వేచ్ఛ ఎలా అవుతుంది? ఇది స్వేచ్ఛ కాదు ఇది ఒక రకమైన డిజిటల్ బానిసత్వం మగవాడు డిజైన్ చేసిన సాఫ్ట్వేర్ చెప్పినట్లు మీరు డాన్సులు వేస్తున్నారు.
(09:43) వాడు ఏది చూపిస్తే ఎక్కువ డబ్బులు ఇస్తానంటాడో మీరు సరిగ్గా అదే చూపిస్తున్నారు. మరి ఇక్కడ స్వతంత్రత ఎక్కడ ఉంది? మీరు కేవలం వాడి వ్యాపారంలో ఒక భాగస్వామి మాత్రమే ఇంకా దారుణం ఏంటంటే ఈ ఫేమ్ కోసం పవిత్రమైన బంధాలను కూడా బజారున పడేస్తున్నారు. భర్తతో గొడవలు పిల్లల ప్రైవసీ ఇంటి గుట్టు అన్ని వ్యూస్ కోసం వాడేస్తున్నారు.
(10:06) డబ్బు వస్తుంది కదా అని ఆడంబరమైన జీవితం గడపవచ్చు కదా అని ధర్మాన్ని గాలికి వదిలేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఈ సోషల్ మీడియా ఒకవేళ రేపు బంద్ అయితే మీ దగ్గర మిగిలేది ఏంటి? మీరు సంపాదించిన ఆ డబ్బేనా కాదు సమాజం మిమ్మల్ని చూసే ఆ చీదరింపు చూపు మాత్రమే మిగులుతుంది. ఈ ఈజీ మనీ అనేది ఒక విషవలయం కష్టపడకుండా డబ్బు సంపాదించడం అలవాటైన తర్వాత మనిషికి విలువలు అనేవి గుర్తే ఉండవు.
(10:35) మీరు చేసే ప్రతి వీడియో మీరు పెట్టే ప్రతి ఫోటో రేపు మీ పిల్లలు చూస్తారు. మీ కుటుంబం చూస్తుంది. ఆ సమయంలో ఇది నా స్వేచ్ఛ అని మీరు చెప్పగలరా? మగవాడి బుద్ధి మారాలి అని చెప్పే ముందు ఆ మగవాడు వేసిన వలలో మీరు ఎందుకు పడుతున్నారో ప్రశ్నించుకోండి మీరు ఆ వల నుండి బయటకు రానంత కాలం మగవాడు మిమ్మల్ని ఒక వస్తువుగానే చూస్తాడు ఒక బొమ్మలాగే వాడుకుంటాడు ఇది మీరు తెలుసుకోవాల్సిన పచ్చి నిజం సోషల్ మీడియా అనేది మీకు బలాన్ని ఇవ్వడం లేదు మీలోని పవిత్రతను దోచుకొని మిమ్మల్ని ఒక మార్కెట్ వస్తువుగా మారుస్తోంది.
(11:08) కేవలం ఆ కాగితం ముక్కలైనటువంటి డబ్బు కోసం మీ వ్యక్తిత్వాన్ని చంపేసుకోకండి. ఈ సోషల్ మీడియా మాయాజాలం కేవలం స్క్రీన్ మీదే ఉండదు. అది మన నిజ జీవితాల్ని మన ఇంట్లో ఉన్న ఆడపిల్లల మనస్తత్వాల్ని మార్చేస్తోంది. దీని వల్ల సమాజానికి జరుగుతున్న నష్టం వెలకట్టలేనిది. ధర్మం తప్పిన సంపాదన ఏ రోజు సుఖాన్ని ఇవ్వదు. మీరు అనుకుంటున్న ఆ ఆడంబరం వెనుక ఒక భయంకరమైన శూన్యం ఉంది.
(11:32) ఆ శూన్యంకి వెళ్లే ముందు ఒక్కసారి ఆగి ఆలోచించండి. ఇది మన సంస్కృతికి తగిలిన ఒక పెద్ద క్యాన్సర్ వంటిది. ఈ సోషల్ మీడియా అల్గారిథమ్స్ వెనుక మరో చీకటి కోణం ఉంది. అదే అటెన్షన్ ఎకానమీ ఇక్కడ మీ సమయం మీ శరీరం మీ పరువు అన్నీ కేవలం ఒక డేటా పాయింట్స్ మాత్రమే మీరు ఎంత నెగిటివిటీని ప్రోత్సహిస్తే ఎంత అసభ్యతను ప్రదర్శిస్తే మీకు అంత ఎక్కువ ప్రచారం లభిస్తుంది.
(11:57) ఈ ప్రచారం మిమ్మల్ని తాత్కాలికంగా ఆకాశానికి ఎత్తవచ్చు కానీ అది మిమ్మల్ని నైతికంగా పాతాళానికి నెట్టేస్తుంది. మేము మోడరన్ గా ఉంటున్నాం అని చెప్పుకునే స్త్రీలు నిజానికి తమ సంప్రదాయాల సంఖెళ్లను పెంచుకుంటున్నాం అనుకుంటూ మగవాడు తయారు చేసిన డిజిటల్ సంఖ్యలను తగిలించుకుంటున్నారు. ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఏ రీల్ చేయాలి ఏ డ్రెస్ వేసుకోవాలి ఎలా ఎక్స్పోజ్ చేస్తే వ్యూస్ వస్తాయి అని ఆలోచించే స్త్రీ తన మెదడుకు పని చెప్పడం మానేసింది.
(12:29) ఆమె కేవలం ఇతరుల కోరికలకు ప్రతిరూపంగా మారిపోయింది. తన ఆత్మగౌరవాన్ని తానే చంపుకొని వేల మంది అపరిచితుల కామపు చూపుల ముందు నిలబడటమే విజయం అనుకునే దౌర్భాగ్య స్థితికి చేరుకుంది. ఈ అధర్మం రేపు మీ సమాజాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తుందో ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి. డబ్బు కోసం దేనికైనా తెగించే మనస్తత్వం స్త్రీలో మొదలైతే ఆ సమాజంలో నీతి అనే పదానికి అర్థమే ఉండదు.
(12:53) కాబట్టి సోషల్ మీడియా మాయలో పడకండి. మీకున్న స్వేచ్ఛను మగవాడి వ్యాపారానికి పెట్టుబడిగా మార్చకండి. సంపాదన ముఖ్యం కాదని నేను చెప్పను. కానీ ఆ సంపాదనలో ధర్మం ఉండాలి. గౌరవం ఉండాలి. మీ మానాన్ని బజారున పెట్టి సంపాదించే కోట్లు కూడా మీ ఆత్మశాంతిని మిగల్చవు. ఈ అల్గారిథమ్స్ మనిషిని యంత్రంలా మారుస్తున్నాయి. స్త్రీని వస్తువుగా మారుస్తున్నాయి.
(13:18) ఈ నిజం తెలుసుకున్న రోజే మీరు నిజంగా స్వతంత్రులు అవుతారు. అంతవరకు మీరు మగవాడి వలలో చిక్కుకున్న కేవలం ఒక డిజిటల్ ఆట బొమ్మలు మాత్రమే. ఇప్పుడు మనం ఈ రోజుల్లో అత్యంత చర్చనీయాంశమైన వివాదాస్పదమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే డ్రెస్సింగ్ మరియు మగవాడి చూపు. ఈ పాయింట్ దగ్గరకు రాగానే సోషల్ మీడియాలో ఉండే కొందరు స్త్రీలు చాలా ఘాటుగా ఒక వాదన వినిపిస్తారు.
(13:49) అదేంటంటే నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలో అది నా ఇష్టం. నా శరీరం నా ఇష్టం. నా బట్టలు చూసి నువ్వు ఆకర్షితుడివి అవుతున్నావ అంటే తప్పు నీ చూపులో ఉంది. నీ బుద్ధిలో ఉంది. నీ చూపు మార్చుకో అంతే కానీ నన్ను బట్టలు మార్చుకోమని అడగకు. ఈ మాట వినడానికి చాలా మోడ్రన్ గా చాలా లాజికల్ గా అనిపించవచ్చు. కానీ దీని వెనుక ఎంతటి అజ్ఞానం ఎంతటి వితండవాదం ఉందో ఇప్పుడు శాస్త్రీయంగా ధార్మికంగా విశ్లేషిద్దాం ముందుగా మనం సృష్టి నియమాన్ని అర్థం చేసుకోవాలి దీన్ని సైన్స్ భాషలో బయోలాజికల్ రియాలిటీ అంటారు.
(14:23) ప్రకృతిలో ప్రతి జీవికి కొన్ని సహజ సిద్ధమైన ప్రేరణలు ఉంటాయి. పువ్వు తన రంగు తో సువాసన తో తుమ్మెదను ఆకర్షించడం అనేది పువ్వు చేసే తప్పు కాదు. తుమ్మెద చేసే తప్పు అంతకంటే కాదు అది ప్రకృతి సిద్ధంగా ఆకర్షణ కోసం డిజైన్ చేయబడింది. అలాగే మానవ పరిణామ క్రమంలో మగవాడి మెదడు విజువల్ స్టిములీ దృశ్య ప్రేరణకు అత్యంత వేగంగా స్పందించేలా తయారయింది.
(14:48) ఇది లక్షల సంవత్సరాల నుంచి వస్తున్న DNA ప్రోగ్రామింగ్ ఒక అందమైన స్త్రీని చూసినప్పుడు మగవాడిలో ఆకర్షణ కలగడం అనేది వాడు కావాలని చేసుకునేది కాదు అది వాడి శరీరంలోని హార్మోన్ల వ్యవస్థ చేసే పని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మగవాడు తన ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. అది వాడి బాధ్యత వాడి ధర్మం అందులో సందేహం లేదు కానీ మీరు అతనికి నిరంతరం ఆ ప్రేరణను అందిస్తూ ఆ ట్రిగ్గర్ ను నొక్కుతూ నువ్వు స్పందించకూడదు అనడం ఎంతవరకు సమంజసం ఉదాహరణకు ఒక తాళం లేని బీరువాను కోట్లాది రూపాయల నగలతో నింపి నడి రోడ్డు మీద పెట్టి దొంగ మనసు మారాలి. వాడు
(15:25) దాన్ని చూడకూడదు. ముట్టుకోకూడదు అని బోర్డు పెడితే అది ఎంత మూర్ఖత్వమో అరకొర బట్టలు వేసి శరీర భాగాలను ప్రదర్శిస్తూ మగవాడి చూపు మారాలి అనడం కూడా అంతే మూర్ఖత్వం. ఇంకా లోతుగా వెళ్తే ఈ రోజుల్లో ఎక్స్పోజింగ్ అంటే కేవలం బట్టలు విప్పడమే అని చాలా మంది భ్రమపడుతున్నారు. కానీ అసలు వికారం ఎక్కడ ఉందో తెలుసా? స్కిన్ టైట్ డ్రెస్సులు వేసి కెమెరాను ఒక వికారమైన యాంగిల్ లో పెట్టి శరీరంలోని ప్రైవేట్ భాగాలను హైలైట్ చేస్తూ డాన్సులు చేయడం మీరు చర్మం చూపించకపోవచ్చు కానీ మీరు చూపిస్తున్న ఆ వక్రతలు కర్వ్స్ మగవాడిలో కామాన్ని రెచ్చగొట్టడానికి అని మీకు
(16:04) తెలియదా కచ్చితంగా తెలుసు మీకు తెలియకుండానే మీరు మగవాడి బలహీనతను మార్కెట్ చేస్తున్నారు. ఎందుకు ఎందుకంటే ఆ కామపు చూపులే మీకు వ్యూస్ తెస్తాయి. ఆ వ్యూస్ లే మీకు డబ్బు తెస్తాయి. అంటే ఇక్కడ మీరు అమ్ముకుంటున్నది మీ స్వేచ్ఛను కాదు మగవాడిలోని పశు ప్రవృత్తిని మన ధర్మశాస్త్రాలు స్త్రీని లజ్జ మోడెస్టీకు ప్రతిరూపంగా చెప్పాయి.
(16:29) లజ్జ అంటే భయం కాదు అది ఒక ఆభరణం. ఒక వజ్రాన్ని మనం ఎలాగైతే పది పొరల పెట్టెలో దాచి పెట్టుకుంటామో. స్త్రీ తన అందాన్ని అంత పవిత్రంగా దాచుకోవాలి. ఎందుకంటే బహిరంగంగా ఉండే ప్రతిదీ వస్తువు అవుతుంది. రహస్యంగా ఉండేదే విలువైనది అవుతుంది. మీరు మీ అందాన్ని సోషల్ మీడియాలో ప్రదర్శనకు పెట్టిన క్షణమే, మీరు ఒక వ్యక్తి హోదా నుండి ఒక వస్తువు హోదాకు పడిపోతున్నారు.
(16:51) అప్పుడు మగవాడు మిమ్మల్ని గౌరవంతో చూడాలి అంటే అది ఎలా సాధ్యం మీరు అతనికి ఒక వస్తువును చూపిస్తూ గౌరవం కావాలని కోరడం ఒక పెద్ద విరోధాభాసం. ఆధునిక సైకాలజీ ప్రకారం దీన్ని సెక్షువల్ ఆబ్జెక్టిఫికేషన్ అంటారు. విచిత్రం ఏంటంటే ఈ రోజుల్లో స్త్రీలే తమను తాము ఆబ్జెక్టిఫై చేసుకుంటున్నారు. మమ్మల్ని వస్తువుల చూడకండి అని ధర్ణాలు చేసే కొందరు మహిళలే Instagram లో వ్యూస్ కోసం తమ శరీరాన్ని వస్తువులా ప్రదర్శిస్తున్నారు.
(17:18) ఈ ద్వంద్వ నీతి డబుల్ స్టాండర్డ్స్ వల్లే సమాజం గందరగోళంలో పడిపోతోంది. మీరు వేసే బట్టలు మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలి. కానీ అవి కేవలం మీ శరీర అవయవాలనే చూపిస్తున్నాయంటే మీరు అక్కడ మీ తెలివితేటలను మీ సంస్కారాన్ని చంపేసుకున్నట్లే మళ్ళీ ఆ వాదనకు వద్దాం చూపు మార్చుకో సరే మగవాడు చూపు మార్చుకున్నాడు అనుకుందాం. అప్పుడు మీకు వ్యూస్ వస్తాయా మీ వీడియోలు వైరల్ అవుతాయా మీకు బ్రాండ్ ఎండార్స్మెంట్లు వస్తాయా రావు ఎందుకంటే మీ కంటెంట్ లో విషయం లేదు కేవలం ప్రదర్శన మాత్రమే ఉంది.
(17:54) అంటే లోలోపల మీకు కూడా ఆ మగవాడి చూపు మారకూడదనే ఉంది. వాడు మిమ్మల్ని అదే చూపుతో చూడాలి. అప్పుడే మీ బ్యాంక్ అకౌంట్ నిండుతుంది. ఈ అధర్మపు వ్యాపారాన్ని స్వేచ్ఛ అనే రంగు కాగితంతో కప్పి ఉంచడం ఆపండి. ఇది పచ్చిగా చెప్పాలంటే ఎదుటివాడి మానసిక దౌర్బల్యం మీద మీరు చేస్తున్న వ్యాపారం ఒక్కసారి ఆలోచించండి ఒక తల్లి తన బిడ్డ ముందు ఒక కూతురు తన తండ్రి ముందు వేసుకోలేని బట్టలు సమాజం ముందు ఎలా వేసుకోగలుగుతున్నారు సమాజం నా కుటుంబం కాదు కదా అని మీరు అనొచ్చు కానీ ఈ సమాజంలోనే కదా మీరు బతకాల్సింది ఈ సమాజం నుండే కదా మీరు గౌరవాన్ని ఆశించేది గౌరవం అనేది అడిగితే వచ్చేది కాదు అది మీరు ప్రవర్తించే తీరును
(18:33) బట్టి ఎదుటివాడి మనసులో పుట్టేది శరీర ప్రదర్శ ద్వారా మీరు కేవలం అటెన్షన్ మాత్రమే పొందగలరు. కానీ రెస్పెక్ట్ ను ఎప్పటికీ పొందలేరు. అటెన్షన్ అనేది ఈరోజు ఉంటుంది. రేపు పోతుంది. కానీ రెస్పెక్ట్ అనేది మీ జీవితాంతం మీతో ఉంటుంది. ఈ ఈజీ మనీ కల్చర్ లో పడి అందాన్ని పెట్టుబడిగా మార్చుకుంటున్న సోదరీ మనులారా ఒక్కటి గుర్తుపెట్టుకోండి.
(18:58) యవ్వనం అనేది శాశ్వతం కాదు. ఈరోజు మీ శరీరం సహకరిస్తోంది కాబట్టి వ్యూస్ వస్తున్నాయి. రేపు వయసు మళ్లాక ఆ అందం వాడిపోయాక ఈ సోషల్ మీడియా ప్రపంచం మిమ్మల్ని గుర్తు కూడా పెట్టుకోదు. అప్పుడు మీకు మిగిలేది ఏంటి మీరు సంపాదించిన ఆ డబ్బ ఆ డబ్బుతో మీరు పోగొట్టుకున్న పరువును తిరిగి కొనగలరా అధర్మంగా తన శరీరాన్ని ఎరగా వేసి సంపాదించిన ఏ సొమ్ము కూడా ఆత్మ తృప్తిని ఇవ్వదు.
(19:22) అది మీ ఇంట్లో ప్రశాంతతను హరిస్తుంది. కాబట్టి నా ఇష్టం అని అహంకారాన్ని పక్కన పెట్టి సృష్టి ధర్మాన్ని గౌరవించండి. ప్రకృతిలో ప్రతి దానికి ఒక హద్దు ఉంది. ఆ హద్దులను దాటిన నది అయినా ఆ హద్దులను దాటిన స్త్రీ అయినా వినాశనానికే దారి తీస్తారు. మీ బట్టలు మీ గౌరవానికి చిహ్నాలుగా ఉండాలి కానీ ఎదుటివాడి కామానికి ట్రిగ్గర్స్ లా ఉండకూడదు.
(19:44) ఇది మీరు తెలుసుకోవాల్సిన పరమ సత్యం ఈ ప్రదర్శన బుద్ధి వెనుక ఉన్న ధనాసను వదిలి ధర్మబద్ధమైన మార్గంలో మీ ప్రతిభను నిరూపించుకోండి. అప్పుడే మీరు నిజమైన ఆదిశక్తి అవుతారు. ఇప్పటివరకు మనం సామాజిక పోకడల గురించి మాట్లాడుకున్నాం. కానీ నా రాబోయే తర్వాత వీడియోలో మనం మన మూలాల్లోకి అంటే మన ధర్మశాస్త్రాలు వేదాలు, పురాణాలు, ఈ అధర్మ సంపాదనకు డబ్బు కోసం చేసే తెగింపుకు మన పతనం గురించి వేల ఏళ్ల క్రితమే ఏం చెప్పాయో చూద్దాం.
(20:17) అలాగే హనీ ట్రాప్స్ విడాకుల వ్యాపారం మరియు సమాజ పతనానికి పునాది అయిన తల్లిదండ్రుల వైఫల్యం అనే అంశాలపై మరింత లోతుగా విశ్లేషిద్దాం. చివరిగా మళ్ళీ చెప్తున్నాను. ఈ వీడియోలో నేను చేసిన విశ్లేషణ కేవలం సమాజంలో పెరుగుతున్న అధర్మ సంపాదన మరియు మారుతున్న విలువలను ఎత్తిచూపడానికే అంతేకానీ ఎవరిని వ్యక్తిగతంగా తక్కువ చేయాలని లేదా ఒక జెండర్ కు సపోర్ట్ చేస్తూ మరొకరిని విమర్శించాలని నా ఉద్దేశం కాదు.
(20:47) ప్రస్తుత కాలంలో స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా ఇద్దరిలోనూ కొన్ని పొరపాట్లు ఉన్నాయి. కాబట్టి నేను లేడీస్ గురించి మాట్లాడినప్పుడు కేవలం ఒక వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని భావించవద్దు. ఇది మన చుట్టూ ఉన్న వాస్తవ పరిస్థితులపై చేసిన ఒక నిష్పక్షపాత విశ్లేషణ మాత్రమే కాబట్టి నా మాటలు ఎవరి మనోభావాలనైనా దెబ్బతీస్తే దయచేసి వాటిని కేవలం ఒక సామాజిక దృక్పదంతో మాత్రమే చూడవలసిందిగా కోరుతున్నాను.
(21:16) మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ రెగ్యులర్ గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ రెగ్యులర్ గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నా YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
(21:44) అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్ ని నొక్కినట్లయితే నేను ఎప్పుడు నా కొత్త వీడియోని అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ కి వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థాంక్యూ ఆల్.
No comments:
Post a Comment