సంచలనం రేపుతున్న 6-7 డేటింగ్ ట్రెండ్ | What is '6–7 dating'? The Gen Z relationship trend | 99Tv
Author Name:99TV Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@99TVTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=3TMTfK2eBkU
Transcript:
(00:00) ప్రేమ, పెళ్లి, బంధం ఈ పదాలకు అర్థం ఒక్కో తరంలో ఒక్కోలా మారుతోంది. ఒకప్పుడు రాముడి లాంటివాడు కావాలని అమ్మాయిలు సీత లాంటి భార్య రావాలని అబ్బాయిలు కోరుకునేవారు. కానీ నేటి డిజిటల్ యుగంలో జన్జీ ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి.నూటికినూ మార్కులు పడే పర్ఫెక్ట్ పార్ట్నర్ కోసం వెతకడం పాత ఫ్యాషన్ అని వీరు తేల్చి చెబుతున్నారు.
(00:21) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యువతను ఊపేస్తున్న కొత్త మంత్రం 627 డేటింగ్ ట్రెండ్. అసలు ఏంటి ఈ వింత పేరు 10 కి 10 మార్కులు వద్దు అంటున్న ఈ తరం ఆరు ఏడు మార్కుల దగ్గరే ఎందుకు ఆగిపోతుంది ఈ కొత్త బంధాల వెనుక ఉన్న లాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం సాధారణంగా మనం మార్కెట్ కి వెళ్తే ఒక వస్తువు కొనేటప్పుడు 100% క్వాలిటీ ఉందో లేదో చూస్తాం కానీ మనుషుల విషయంలో కూడా అలాగే పర్ఫెక్షన్ కోరుకుంటేనే అసలు సమస్య మొదలవుతుంది.
(00:45) సరిగ్గా ఇక్కడే జెన్సి యువత ఒక ప్రాక్టికల్ నిర్ణయానికి వచ్చింది. ఎదుటి వ్యక్తిలో మనకు నచ్చే లక్షణాలు 10 కి కేవలం ఆరు లేదా ఏడు ఉంటే చాలు. వారితో జీవితాన్ని పంచుకోవచ్చు అని ఫిక్స్ అయిపోతున్నారు. దీనిని సోషల్ మీడియా భాషలో 6ట7 డేటింగ్ ట్రెండ్ అని పిలుస్తున్నారు. అంటే ఎదుటి వ్యక్తిలో ఉన్న 30 నుంచి 40% లోపాలను అంగీకరిస్తూ ఉన్నదానితో సర్దుకుపోవడమే ఈ ట్రెండ్ యొక్క అసలు ఉద్దేశం.
(01:10) సినిమాల్లో చూపించే హీరోలలాగా హీరోయిన్లలాగా జీవిత భాగస్వామి ఉండాలని కోరుకోవడం ఒక బ్రమ అని నేటి యువత గుర్తిస్తోంది. సోషల్ మీడియా పెట్టిన అంచనాల వల్ల చాలా మంది పర్ఫెక్ట్ తోడు కోసం ఏళ్ల తరపడి వెతికి చివరికి ఒంటరిగా మిగిలిపోతున్నారు. అందుకే అంచనాలు ఆకాశం నుంచి నేలకు దించుతున్నారు. ఎదుటి వ్యక్తి 100% మనకి నచ్చకపోయినా ఒక 60 నుండి 70% సెట్ అయితే చాలు.
(01:32) మిగిలింది ఇద్దరం కలిసి సర్దుబాటు చేసుకోవచ్చనే పరిణితి చెందిన ఆలోచన ఇది. ఇది బలహీనత కాదు. ఒక రకమైన క్లారిటీ అని నిపునులు కూడా విశ్లేషిస్తున్నారు. ఈ ట్రెండ్ వల్ల కలిగే అతి పెద్ద ప్రయోజనం ఒత్తిడి లేని బంధం. భాగస్వామి నుంచి అతిగా ఆశించినప్పుడు గొడవలు కూడా ఆటోమేటిక్ గా తగ్గుతాయి. నువ్వు ఇలాగే ఉండాలి అది చేయాలి అనే కఠినమైన రూల్స్ ఇక్కడ ఉండవు.
(01:52) నువ్వు నువ్వులా ఉండు నేను నేనులా ఉంటాను అన్న స్వేచ్ఛ ఇద్దరి మధ్య పెరుగుతుంది. అంచనాలు తగ్గితే ఆనందం పెరుగుతుందనే సూత్రాన్ని జెన్జీ ఇక్కడ పక్కాగా అమలు చేస్తోంది. దీనివల్ల బంధం మీద ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తోందని యువత భావిస్తోంది. గతంలో పెద్దలు చెప్పిన సర్దుకు పోవడం అనే మాటకు నేటి యువత పాటిస్తున్న ప్రాక్టికల్ థింకింగ్ కు చాలా దగ్గర సంబంధం ఉంది.
(02:14) అయితే అప్పట్లో అది ఒక సామాజిక ఒత్తిడి అయితే ఇప్పుడు అది వ్యక్తిగత ఇష్టంగా మారింది. పర్ఫెక్ట్ వ్యక్తి కోసం వెతుకుతూ కాలాన్ని వృధా చేసే కంటే సరిపోయే వ్యక్తిని ఎంచుకొని బంధాన్ని నిర్మించుకోవడమే మేలని మీరు నమ్ముతున్నారు. ప్రేమ అనేది 10కి 10 మార్కులు వేసి ఎంచుకునే ఎగ్జామ్ పేపర్ కాదు. అది ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయాణం అని ఈ ట్రెండ్ నిరూపిస్తోంది.
(02:34) మొత్తానికిసిక్స్ టుసెవెన్ డేటింగ్ ట్రెండ్ అనేది కేవలం ఒక ఫ్యాషన్ కాదు. ఆలోచనా విధానంలో వచ్చిన ఒక పెద్ద మార్పు. లోపాలను అంగీకరించడం ఎదుటి వ్యక్తిని గౌరవించడం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ తో పెద్ద పెద్ద బంధాలను కాపాడుకోవడం ఈ తరం ప్రత్యేకం. ఈ రియలిస్టిక్ అప్రోచ్ వల్ల భవిష్యత్తులో విడాకులు బంధాలు తెగిపోవటం వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉందని సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.
(02:57) చూశరుగా పర్ఫెక్షన్ కంటే అఫెక్షన్ ముఖ్యమని జెన్జీ చెబుతోంది. జీవితంలో కొంత నిజం కొంత అంగీకారం ఉంటేనే బంధం గట్టిగా నిలబడుతుంది. మరి ఈ 67 డేటింగ్ ట్రెండ్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.
No comments:
Post a Comment