డబ్బు మాయలో మానవత్వం – మనిషి మృగంగా మారుతున్న కథ! డబ్బు వెనుక దాగిన నగ్న సత్యం!
Author Name:Dr_Pasupathi_Raj_Gurejala
Youtube Channel Url:https://www.youtube.com/@Dr_Pasupathi_Raj_Gurejala
Youtube Video URL:https://www.youtube.com/watch?v=1tgAGzLMp-A
Transcript:
(00:00) ఈరోజు నేను మీతో చర్చించబోయే అంశము మీలో చాలా మందిని కోపం తెప్పించవచ్చు లేదా అసహనానికి గురి చేయవచ్చు లేదా ఇది ఏదో పెద్ద నీతి బోధన లాగా అనిపించవచ్చు కానీ ఇది ఒక నగ్న సత్యం ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటుంది ఒకరి మీద కోపంతోనో ఎవరినో తక్కువ చేయడానికో కాదు మనందరం ఎటు వెళ్తున్నామని ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి ఈ ప్రపంచం ఒక వింతైన మాయలో పడిపోయింది.
(00:27) పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునేదాకా డబ్బు డబ్బు డబ్బు ఇదే మంత్రం ఆ డబ్బు ఉంటేనే గౌరవం ఆ డబ్బు ఉంటేనే పదవి ఆ డబ్బు ఉంటేనే అహంకారం కానీ ఒకటి ఆలోచించండి మనం పుట్టినప్పుడు ఏం తెచ్చాం పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం మధ్యలో ఈ ఆరాటం ఎందుకు మనిషి సంపాదనలో పడి మృగం లాగా మారిపోతున్నాడు మానవత్వం అనే మాటకు అర్థమే లేకుండా పోయింది.
(00:51) ఈ వీడియోలో ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ ఆధారాలను జోడిస్తూ మనం చర్చించబోయే విషయాలు నువ్వు సంపాదిస్తున్న ఆ అక్రమ సంపాదన వెనుక ఉన్న అసలు చీకటి నిజాన్ని దాని పర్యవసానాలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి కాబట్టి సిద్ధంగా ఉండండి వివరంగా విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం లేడీస్ అండ్ జెంటిల్మెన్ యువర్ అటెన్షన్ ప్లీజ్ దిస్ ఇస్ డాక్టర్ పశుపతి రాజ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు అందరి కోసం కాదు ఎవరైతే నీతి ధర్మాన్ని తప్పి అక్రమ మార్గాల్లో సంపాదిస్తూ సమాజాన్ని వంచిస్తున్నారో ఆ
(01:29) నీకే నేను చెప్తున్నాను నీ అంతరాత్మ లోతుల్లో ఎక్కడో ఒక చోట ఇది తప్పు అని నీకు తెలుస్తూనే ఉంది. నీ మనస్సాక్షి నిన్ను రోజూ హెచ్చరిస్తూనే ఉంది. ఆ నిజాన్ని కప్పి పుచ్చుకోవాలని చూస్తున్న నీ అంతరాత్మకే ఈ ప్రశ్న. దీనిని వివరించడానికి మనుస్మృతిలోని ఒక శ్లోకం మనల్ని హెచ్చరిస్తుంది. అధర్మేన ఐదతే తావత్తతో భద్రాణి పశ్యతి తథః సపత్నాన్ జయతి సమూలస్తు వినశ్యతి అంటే అధర్మం వల్ల మనిషి మొదట అభివృద్ధి చెందుతాడు.
(01:59) శుభాలను చూస్తాడు. శత్రువులను జయిస్తాడు. కానీ చివరకు వాడు సమూలంగా వంశంతో సహా నాశనం అవుతాడు. ఉదాహరణ ఒక చెట్టుకు మొదట నీరు పోయకుండా విషం పోస్తే అది కాసేపు పచ్చగా ఉన్నట్టు అనిపించిన లోలోలోపల వేర్లు కుళ్ళిపోయి అకస్మాత్తుగా కూలిపోతుంది. అక్రమ సంపాదన కూడా అలాంటిదే ఈరోజు నేను మీతో మాట్లాడబోయే విషయాలు వినడానికి కొంచెం చేదుగా ఉండవచ్చు కానీ ఇవి పచ్చి నిజాలు.
(02:27) మనం ఒక వింతైన కాలంలో జీవిస్తున్నాం. దీన్నే కలికాలం అంటారో లేక మాయాలోకం అంటారో నాకు తెలియదు కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం మనిషి తన ఉనికిని తన మానవత్వాన్ని నెమ్మదిగా కోల్పోతున్నాడు. ఒక్కసారి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడండి. అందరూ పరిగెడుతున్నారు. ఎక్కడికి ఎందుకు ఎవరికోసం అని అడిగితే ఎవరి దగ్గర సమాధానం లేదు. కానీ అందరికీ డబ్బు కావాలి.
(02:53) డబ్బు సంపాదించడం తప్పు కాదు. కానీ ఆ డబ్బు మీద ఆశతో మనిషి తనలోని మానవత్వాన్ని పంపుకోవడం అతి పెద్ద నేరం. ఈ ప్రపంచం ఒక పెద్ద మాయలో పడిపోయింది. ఆ మాయ పేరు డబ్బు, పదవి, అధికారం ఈ మూడింటి కోసం మనిషి ఏ స్థాయికైనా దిగజారిపోతున్నాడు. విలువలు అమ్ముకుంటున్నాడు. బంధాలను తెంచుకుంటున్నాడు. చివరకు తన ఆత్మను కూడా తాకట్టు పెడుతున్నాడు.
(03:20) ఈ పరుగులో మనం ఏం సాధిస్తున్నామో తెలియదు కానీ ఏం కోల్పోతున్నామో మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. టెక్నాలజీ పెరుగుతోంది కానీ ఆ టెక్నాలజీ మనిషిని యంత్రంలా మారుస్తోంది. మనం సౌకర్యాలను కొంటున్నాం కానీ సుఖాన్ని కోల్పోతున్నాం. సంపద పెరిగే కొద్దీ సంతోషం తగ్గుతున్నాం. ఈ వింత లోకంలో మనం బతుకుతున్నాం. శ్రీమద్భాగవతం 12వ స్కంధంలో కలికాలం గురించి ఇలా ఉంది.
(03:43) వ్యత్తమేవ కలలోణం జన్మాచార గుణోదయః ధర్మన్యాయ వ్యవస్థాయం కారణం బలమేవహి అంటే కలియుగంలో ఒక మనిషి పుట్టుక ఆచారం గుణాలు అన్నీ అతని దగ్గర ఉన్న డబ్బు బట్టే నిర్ణయించబడతాయి. ధర్మం న్యాయం అనేవి కేవలం బలం అధికారం ఉన్నవారి చేతుల్లోనే ఉంటాయి. ఉదాహరణ ఈ రోజుల్లో మనిషి గుణం కంటే అతని బ్యాంకు బ్యాలెన్స్ కే గౌరవం దక్కుతోంది.
(04:11) నీతిగా బతికే వాడి కంటే అడ్డదారిలో సంపాదించిన వాడికే సమాజంలో పెద్ద పీట వేస్తున్నారు. ఇదే అసలైన మాయా లోకం. మృగంగా మారుతున్న మనిషి మనిషికి. జంతువుకు మధ్య ఉన్న అసలు తేడా ఏంటి? జంతువు ఆకలి వేస్తే వేటాడుతుంది. కడుపు నిండగానే వదిలేస్తుంది. దానికి రేపటి గురించి చింత లేదు. దాచుకోవాలనే దురాశ లేదు కానీ మనిషి తనకు కావలసిన దానికంటే వంద రెట్లు ఉన్నా ఇంకా కావాలని పక్కవాడి నోటికాడ ముద్దను లాక్కుంటున్నాడు.
(04:39) ఇది మృగత్వం కాదా ఒక పులి కడుపు నిండా ఉంటే పక్కనే జింక వెళ్తున్న దాని జోలికి వెళ్ళదు. కానీ మనిషి తన దగ్గర వేల కోట్లు ఉన్నా సాటి మనిషి దగ్గర ఉన్న 10 రూపాయల కోసం కూడా ప్రాకులాడుతున్నాడు. ఇదా మనం చెప్పుకునే మానవత్వం మహాత్మా గాంధీ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ద వరల్డ్ హస్ ఎనఫ్ ఫర్ ఎవరీవన్స్ నీడ్ బట్ నాట్ ఎవరీవన్స్ గ్రీడ్ అంటే ఈ ప్రకృతిలో మన అందరి అవసరాలకు సరిపడా సంపద ఉంది.
(05:07) కానీ ఒక్క మనిషి దురాశను తీర్చడానికి ఈ ప్రపంచం మొత్తం సరిపోదు. నేడు మనిషి తన మేధస్సును విజ్ఞానం కోసం కాకుండా ఎదుటి వాడిని ఎలా తొక్కాలి, వాడి ఆస్తిని ఎలా లాక్కోవాలి? అనే కుట్రల కోసం వాడుతున్నాడు. దయ, జాలి, కరుణ, సహనం వంటి మానవత్వపు విలువలు ఇప్పుడు కేవలం డిక్షనరీ పదాలుగా మిగిలిపోయాయి. జంతువులకు ఉండే కనీస కృతజ్ఞత కూడా నేటి మనిషిలో మృగ్యం అయిపోతోంది.
(05:33) అభివృద్ధి పేరుతో మనం సృష్టించుకున్న ఈ టెక్నాలజీ మనిషిని మృగంగా మారుస్తుంటే ఆ టెక్నాలజీ మనకు అవసరమా? ఆదిమానవుడు సౌకర్యాలు లేకపోయినా ఎంతో స్వేచ్ఛగా ధర్మంగా బతికాడేమో అనిపిస్తుంది. నిజమైన అభివృద్ధి అంటే భావనాలు. ఆస్తులు పెంచుకోవడం కాదు మానవత్వాన్ని కాపాడుకోవడం ఆధునికత పేరుతో మనం కోల్పోతున్న బంధాలు వెలకట్టలేనివి. ఈ ఉరుకుల పరుగుల యాంత్రిక ప్రపంచంలో ముసుగులు వేసుకుని బతుకుతున్నాం కానీ నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుంది ఒక్కసారి ఆలోచించండి.
(06:03) నీతిశాస్త్రం ప్రకారం ఆహార నిద్ర భయ మైధునం చ సామాన్యమేతత్ పశుభిర్ణరాణం ధర్మో ఈ తేషామధికో విశేషో ధర్మేణ ఈనాః పశుభి సమానాః అంటే ఆహారం నిద్ర భయం సంతానం అనేవి మనుషులకు జంతువులకు సమానం కేవలం ధర్మం మాత్రమే మనిషిని జంతువు కంటే గొప్పవాడిగా చేస్తుంది. ధర్మం లేని మనిషి పశువుతో సమానం ఉదాహరణ పులి కడుపు నిండా ఉంటే పక్కనే జింక వెళ్తున్న చంపదు కానీ మనిషి తన దగ్గర వేల కోట్లు ఉన్న ఇంకొకడి దగ్గర ఉన్న 10 రూపాయల కోసం కుట్రలు చేస్తున్నాడు.
(06:43) ఇది జంతువు కంటే హీనమైన స్థితి. భయపడుతున్న మనుషులు మరియు వ్యాపార ధోరణి. మీరు గమనించారా ఈ రోజుల్లో మనిషిని చూసి మనిషే భయపడే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు మనుషులు కలిస్తే ప్రేమలు ఆత్మీయతలు ఉండేవి. ఇప్పుడు మనుషులు కలిస్తే వీడి వల్ల నాకేం లాభం అనే వ్యాపార ధోరణి కనిపిస్తోంది. బంధుత్వాలు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ చూసే ఏర్పడుతున్నాయి. నీ దగ్గర డబ్బు ఉంటేనే నీకు విలువ నీ దగ్గర అధికారం ఉంటేనే నీకు మర్యాద.
(07:09) ఈ అల్పమైన గౌరవం కోసం మనం మన ఆత్మగౌరవాన్ని మన ధర్మాన్ని తాకట్టు పెడుతున్నాం. ఒకరినొకరు నమ్మలేని స్థితిలో ఉన్నాం. స్నేహం వెనుక స్వార్థం, ప్రేమ వెనుక ప్రయోజనం, సహాయం వెనుక ప్రతిఫలం ఇది నేటి సమాజ స్థితి. ఒకప్పుడు ఇరుగు పొరుగువారు ఒక కుటుంబంలా ఉండేవారు. నేడు పక్క ఇంట్లో మనిషి చనిపోయినా పట్టించుకోనంత బిజీగా మనం మారిపోయాం. టెక్నాలజీ పెరిగింది.
(07:35) జనరేషన్ మారింది అని మనం గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ ఈ టెక్నాలజీ వల్ల మనిషి మరింత సోమరిగా మరింత స్వార్ధపరుడిగా మారుతున్నాడు. ఫోన్లలో ఉన్న బంధాలు పెరిగాయి కానీ పక్కన ఉన్న మనిషి బాధను పంచుకునే మనసు చనిపోయింది. ఈ మాయ మనల్ని బంధాల నుండి విడదీస్తోంది. డబ్బుకి బానిసల్ని చేస్తోంది. బంధాలు ఇప్పుడు కేవలం గివ్ అండ్ టేక్ పాలసీ మీద నడుస్తున్నాయి.
(08:00) ఆత్మీయతలు కేవలం ఫోటోలకు సోషల్ మీడియా పోస్టులకే పరిమితమవుతున్నాయి. భర్తృహరి సుభాషితం దీనిని ఇలా వర్ణిస్తుంది. యస్యాస్తి విత్తం స నరః కులీనః స పండితః స శృతవాన్ గుణజ్ఞః స ఏవవక్త స చ దర్శనీయః సర్వే గుణాః కాంచనమాస్త్రయంతి అంటే ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో వాడే కులీనుడు పండితుడు విజ్ఞాని వక్త అని లోకం భావిస్తుంది. అన్ని గుణాలు బంగారాన్ని డబ్బునే ఆశ్రయించి ఉంటాయి.
(08:32) ఉదాహరణ మనం సోషల్ మీడియాలో వేల మందికి లైక్లు కొడతాం కానీ పక్క ఇంట్లో మనిషి కష్టాల్లో ఉంటే తలుపు తీసి పలకరించడానికి కూడా మనకు సమయం లేదు. బంధాలు గివ్ అండ్ టేక్ వ్యాపారంగా మారిపోయాయి. బ్రాండ్ పేరుతో దోపిడి సామాన్యుడి ఆవేదన. ఇందాక మనం అక్రమ సంపాదన గురించి మాట్లాడుకున్నాం కదా దానికి ఒక గుండెను పిండేసే ఉదాహరణ చెబుతాను.
(08:56) ఈరోజు మనం ఒక సినిమా హాల్ కో లేక ఒక మాల్కో వెళ్తాం. అక్కడ ఒక పాప్కార్న్ ధర₹500 బయట 10 రూపాయలకు దొరికే నీళ్ల బాటిల్ అక్కడ 60 రూపాయలు వ్యాపారం పేరుతో దోపిడి చేయడం మహాపాపం ఒక కోటీశ్వరుడు వెళ్తే వాడు 500 కాదు కదా 5000 అయినా పెడతాడు. కానీ ఒక సామాన్య మధ్య తరగతి తండ్రి తన పిల్లల ముఖంలో సంతోషం చూడాలని కష్టపడి సంపాదించిన డబ్బుతో సినిమాకి వెళితే అక్కడున్న రేట్లు చూసి ఆ తండ్రి గుండె ఆగిపోతుంది.
(09:28) అవును డబ్బు లేనివాడు ఎందుకు వచ్చాడు అని ప్రశ్నించేవారు ఉండవచ్చు. కానీ వ్యాపార సంస్థలు కేవలం డబ్బున్న వారికే పరిమితం అని బోర్డు పెట్టలేదు కదా సామాన్యుడికి ఆ వస్తువులు అవసరం ఉండకపోవచ్చు. కానీ తన బిడ్డకు ఆ సంతోషాన్ని ఇవ్వాలనే తపన ఉంటుంది. నువ్వు కట్టే ఈ బ్రాండెడ్ సామ్రాజ్యాలు ఆ సామాన్యుడి మనోభావాలను తండ్రి కన్నీళ్ళను కాలరాచి కడుతున్నది కాదా తన దగ్గర ఉన్నది తక్కువ డబ్బని తెలిసి కూడా తన బిడ్డ ఏడుస్తుంటే చూడలేక తన రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన ఆ డబ్బంతటినీ ఆ ఒక్క పాప్కార్న్ డబ్బా మీద పోస్తాడు. బిడ్డ సంతోషం కోసం వాడు లోపల
(10:03) ఏడుస్తూ ఆ డబ్బులు కడతాడు. ఒక సామాన్యుడి ఆవేదన మీద ఒక తండ్రి కన్నీళ్ళ మీద మీరు కట్టే ఈ బ్రాండెడ్ సామ్రాజ్యాలు ఎంతకాలం నిలుస్తాయి నువ్వు నీ గ్రాండ్నెస్ కోసం కట్టే ఏసీ గదుల ఖర్చు కోసం సామాన్యుడి రక్తాన్ని పిండటం ఏ రకమైన ధర్మం ఈరోజు హాస్పిటల్స్ నుండి స్కూళ్ల దాకా బ్రాండ్ పేరుతో సామాన్యుడిని పీల్చి పిప్పి చేస్తున్నారు.
(10:27) ఇది అక్రమ సంపాదన కాదా రూపాయి వస్తువుని 10 రూపాయలకు అమ్మడం వ్యాపారం. ఇక్కడ తొమ్మిది రూపాయలు లాభం కనిపిస్తున్న అందులో వ్యాపారి కష్టం రవాణా ఖర్చులు పన్నులు మరియు ఆ వస్తువును భద్రపరిచినందుకు అయ్యే వ్యయం ఉంటాయి. ధర్మం ఒక వ్యక్తి తన శ్రమకు తగిన ప్రతిఫలం ఆశించడం ధర్మబద్ధమైన వ్యాపారం సమాజం అభివృద్ధి చెందాలంటే వ్యాపారికి లాభం అవసరం.
(10:52) కానీ రూపాయి వస్తువు 100 రూపాయలకు అమ్మడం అధర్మం దోపిడి వస్తువు విలువ కంటే 100 రెట్లు ఎక్కువ వసూలు చేయడం కేవలం లాభం కాదు అది అత్యాసే ముఖ్యంగా ఆహారం మందులు వంటి అత్యవసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచి అమ్మడాన్ని శాస్త్రాలు తీవ్రంగా ఖండిస్తాయి. దీన్ని అవకాశవాదం అంటారు. అవతలి వాడి అవసరాన్ని ఆసరాగా చేసుకుని దోచుకోవడం అధర్మం. దీనిపై మహాభారతంలో ఒక సందేశం ఉంది.
(11:23) పీడ్యమానః పరో ధర్మంన కరోతి యదా నరః తస్య పీడాకరం పాపం సర్వం తం ప్రతిగచ్ఛతి అంటే ఒక సామాన్యుడిని బాధించి అతని కన్నీళ్ళ మీద ఎవరైతే ఆనందాన్ని వెతుక్కుంటారో ఆ బాధే శాపంగా మారి వారిని దహిస్తుంది. ఉదాహరణ మాల్స్ లో 500 రూపాయల పాప్కార్న్ కొనే శక్తి లేక ఏడుస్తున్న బిడ్డను చూసి బాధపడే తండ్రి గుండె కోత ఆ వ్యాపారికి అక్రమ లాభం కావచ్చు కానీ అది ఆ తండ్రి ఆశీసులను మాత్రం ఇవ్వదు అక్రమ సంపాదన ఒక తీపి విషం సంపాదన మనిషికి అవసరమే కానీ అది ధర్మమైన సంపాదన కావాలి.
(11:59) ఈరోజు సమాజంలో లంచాలు తీసుకోవడం, కల్తీ చేయడం, అబద్ధాలు చెప్పి వ్యాపారాలు చేయడం ఇవన్నీ ఒక ఫ్యాషన్ అయిపోయాయి. ప్రతివాడు చేస్తున్నాడు కదా నేను చేస్తే తప్పేంటి అనే సమర్థన మనల్ని పతనానికి తీసుకెళ్తోంది. భగవద్గీత చెబుతుంది. అధర్మం మొదట అభివృద్ధిలా కనిపిస్తుంది. సుఖాలు ఇస్తుంది. విజయంలా అనిపిస్తుంది. కానీ చివరికి అది సంపూర్ణ వినాశనానికే దారి తీస్తుంది.
(12:27) అక్రమ సంపాదన ఒక తీపి విషం లాంటిది. తాగేటప్పుడు రుచిగా ఉంటుంది. కానీ ప్రాణాలను తీస్తుంది. ఆ డబ్బు మీ పిల్లలకు రాజభోగాలు ఇవ్వచ్చు. కానీ మనశశాంతిని ఇవ్వదు. లగ్జరీ లైఫ్ అంటే ఏంటి? ఏసీ గదిలో నిద్ర లేకుండా తల బాదుకోవడమే లగ్జరీనా లేక రూపాయి లేకపోయినా ప్రశాంతంగా గాలి పీలుస్తూ నిద్రపోవడమే లగ్జరీనా ఆలోచించండి. మనుషులు ఏమనుకుంటున్నారు అంటే నేను ఎవరిని మోసం చేసినా పర్లేదు. నాకు డబ్బు వస్తే చాలు.
(12:54) నా జీవితం లగ్జరీగా ఉంటే చాలు. కానీ ఈ అశాశ్వతమైన సంపద కోసం శాశ్వతమైన వ్యక్తిత్వాన్ని ఎలా కోల్పోతున్నావ్? తప్పుడు మార్గంలో వచ్చే డబ్బు రోగాలను అశాంతిని కూడా తనతో పాటు తెస్తుంది. ఒకరిని ఏడిపించి నువ్వు నవ్వాలనుకోవడం ప్రకృతి నియమానికి విరుద్ధం. మనం పోగేసే ప్రతి అక్రమ రూపాయి రేపు మన ఇంట్లోనే ఒక కన్నీటి చుక్కగా మారుతుంది.
(13:17) భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. విషయేంద్రియ సంయోగాద్యత్త దగ్రేల్ మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం అంటే కోరికల వల్ల వచ్చే సుఖం మొదట అమృతంలా అనిపించిన చివరికి విషంలా మారుతుంది. ఉదాహరణ అక్రమంగా సంపాదించిన డబ్బుతో కోట్లు పెట్టి పరుపులు కొనొచ్చు. కానీ ప్రశాంతమైన నిద్రను కొనలేం. ఆ డబ్బు రోగాలను అశాంతిని కూడా తనతో పాటు తెస్తుంది.
(13:45) ధర్మం అంటే ఏమిటి? వేదాల సందేశం. ఈ వీడియోలో పదే పదే వినిపించే పదం ధర్మం ధర్మం అంటే మతం కాదు ధర్మం అంటే న్యాయం ఎదుటివాడికి కీడు చేయకుండా బతకడం ధర్మం నీ కష్టార్జితాన్ని మాత్రమే నువ్వు అనుభవించడం ధర్మం వేదాలు చెబుతున్నాయి ధర్మో రక్షతి రక్షితః నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది.
(14:12) కానీ ఈరోజు మనం ధర్మాన్ని రోడ్డు మీద పడేసాం. అక్రమ సంపాదనకు అలవాటు పడిపోయాం. వేదాల్లో అపరిగ్రహం అనే పదం ఉంది అంటే అవసరానికి మించి ఏదీ స్వీకరించకూడదు. ఈ సృష్టిలో గాలి, నీరు ఆహారం అందరికీ సమానంగా ఉన్నాయి. కానీ మనిషి వాటిని తన అదుపులోకి తీసుకోవాలని చూస్తున్నాడు. అమృతం కూడా అతిగా తాగితే విషమవుతుంది. అలాగే సంపాదన కూడా ఒక హద్దు దాటితే అది మన వ్యక్తిత్వాన్నే విషపూరితం చేస్తుంది. ప్రకృతిని చూడండి.
(14:42) చెట్టు పండ్లను ఇస్తుంది. కానీ తను తినదు. నది నీటిని ఇస్తుంది. కానీ తను తాగదు. ప్రకృతిలో ఏది తన కోసం దాచుకోదు. కానీ మనిషి ఒక్కడే తన ఏడు తరాల కోసం దాచుకోవాలని చూసి అశాంతిని కొని తెచ్చుకుంటున్నాడు. ఒక మనిషి తన అవసరానికి మించి సంపాదిస్తున్నాడంటే వాడు కచ్చితంగా ఎవరో ఒకరి హక్కును కాలరాస్తున్నాడని అర్థం.
(15:05) ప్రకృతి మనకు ఇచ్చే పాఠం త్యాగం కానీ మనం నేర్చుకున్నది దోపిడి. వేదాల్లో అపరిగ్రహం గురించి యోగ సూత్రాలు ఇలా చెబుతున్నాయి. అపరిగ్రహ స్థైర్యే జన్మ కథంత సంబోధః అంటే అవసరానికి మించి దేనిని ఆశించకుండా ఉండటమే అపరిగ్రహం ఇది సిద్ధిస్తేనే మనిషికి జీవితం మీద అవగాహన కలుగుతుంది. ఉదాహరణ ప్రకృతిని చూడండి చెట్టు పండ్లను ఇస్తుంది. కానీ తను తినదు మనిషి మాత్రం తన ఏడు తరాల కోసం దాచుకోవాలని చూసి అశాంతిని కొని తెచ్చుకుంటున్నాడు.
(15:35) బంధాల మాయ అక్రమ సంపాదనకు పునాది ఎక్కడ మనిషి ఎప్పుడు దారి తప్పుతాడు ఎప్పుడు అబద్ధం ఆడతాడు ఎప్పుడు తన నీతిని అమ్ముకుంటాడు దీనికి సమాధానం వెతికితే ఒక వింతైన నిజం బయట పడుతుంది. ఒక మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు వాడికి పెద్దగా కోరికలు ఉండవు. తన కడుపు నిండితే చాలు పడుకోవడానికి ఒక చిన్న చోటు ఉంటే చాలు అనుకుంటాడు.
(15:57) వాడికి ఆస్తుల మీద వ్యామోహం ఉండదు. మేడల మీద కోరిక ఉండదు. కానీ ఎప్పుడైతే వాడి జీవితంలోకి ఒక బంధం వస్తుందో ఎప్పుడైతే ఒక భార్య ఒక బిడ్డ అనే నాది అనే స్వార్థం మొదలవుతుందో అక్కడే అక్రమ సంపాదనకు బీజం పడుతుంది. పురాణ సుప్పి శ్లోకంలో మన శాస్త్రాలు ఒక అద్భుతమైన మాట చెబుతున్నాయి. పుత్రషణ, విత్తైషణ, లోకైషణ అంటే మనిషిని ఈ లోకంలో బంధించేవి మూడు బలమైన కోరికలు.
(16:24) ఒకటి సంతానం రెండు ధనం మూడు లోకంలో పేరు ప్రతిష్టలు ఒకప్పుడు కేవలం అవసరానికి సంపాదించే మనిషి పెళ్లయ్యాక భార్య మెడలో నగలు చూడాలని తన పిల్లలు అందరికంటే ధనవంతులుగా ఉండాలని ధర్మాన్ని పక్కన పెడతాడు. నా భార్య అడిగింది కదా లేదనలేను అని లంచం తీసుకుంటాడు. నా పిల్లలకి ఆస్తులు ఇవ్వాలి కదా అని పక్కవాడిని మోసం చేస్తాడు.
(16:49) ఇక్కడ అతను చేస్తున్నది పాపం అని వాడికి తెలుసు కానీ ప్రేమ అనే ముసుగు వేసి దాన్ని సమర్ధించుకుంటాడు. ఆధునిక సైన్స్ దీని గురించి ఏం చెబుతుందంటే మనిషికి సంపాదన అనేది ఒక వ్యసనం అడిక్షన్ లాంటిది. మెదడులో డోపమైన్ అనే రసాయనం ఉంటుంది. మనం ఏదైనా కొత్త వస్తువు కొన్నప్పుడు లేదా డబ్బు సంపాదించినప్పుడు ఇది విడుదలయ్యి మనకు ఒక కిక్ ఇస్తుంది. కానీ ఇక్కడే ఒక చిక్కు ఉంది.
(17:13) ఒకసారి లంచం తీసుకున్నప్పుడు లేదా అక్రమంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆనందం మళ్ళీ కలగాలంటే అంతకంటే ఎక్కువ మొత్తం సంపాదించాలి. దీనివల్ల మనిషి ఒక హెడానిక్ ట్రెడ్మెల్ మీద పరిగెడుతుంటాడు. అంటే ఎంత సంపాదించినా వాడు తృప్తి చెందడు. ఆఖరికి తన కుటుంబాన్ని కూడా ఒక వ్యాపార వస్తువుగా చూసే స్థాయికి చేరుతాడు. సమాజంలో కనిపిస్తున్న వికృతం ఉదాహరణలు ఒక్కసారి ఆలోచించండి మీరు అక్రమంగా తెచ్చిన ఆ డబ్బు మీ పిల్లలకి సుఖాన్ని ఇస్తుందా ఒక తండ్రి పగలు రాత్రి కష్టపడి లేదా అక్రమంగా సంపాదించి తన కొడుక్కి కావాల్సినవన్నీ కొనిస్తాడు. కొడుకు అడగకముందే ఖరీదైన బైక్
(17:51) ఫోన్ చేతిలో పెడతాడు. ఫలితం ఏమవుతుందో తెలుసా ఆ పిల్లాడికి కష్టం విలువ తెలియదు. మా నాన్న దగ్గర డబ్బు ఉంది కదా అనే అహంకారం పెరుగుతుంది. ఆ అహంకారం వాడిని వ్యసనాల వైపు నడిపిస్తుంది. చివరికి ఏమవుతుంది? ఏ కొడుకు కోసమైతే నువ్వు ధర్మాన్ని తప్పావో అదే కొడుకు నిన్ను ముసలితనంలో ఒక భారంగా చూస్తాడు. ఎందుకంటే నువ్వు వాడికి డబ్బు ఇవ్వడం నేర్పావు కానీ ధర్మం నేర్పలేదు.
(18:17) అధర్మంగా వచ్చిన డబ్బు రోగం లాగా వస్తుంది. శోకం లాగా మిగులుతుంది. భగవద్గీత శ్లోకంలో అత్యాస గురించి శ్రీకృష్ణ పరమాత్మ 16వ అధ్యాయంలో దైవాసుర సంపద్వి విభాగ యోగం ఇలా అంటారు. ఇదమధ్యమయ లబ్దమిం ప్రాప్స్ే మనోరథం ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనం అంటే ఈరోజు నేను ఇది సంపాదించాను. రేపు ఆ కోరిక తీర్చుకుంటాను. నా దగ్గర ఇప్పుడు ఇంత ధనం ఉంది. రేపు ఇంకా వస్తుంది.
(18:45) ఇలా ఆలోచించేవాడు ఆసురి ప్రవృత్తి రాక్షస స్వభావం కలవాడు. ఇప్పుడు మన సమాజంలో అందరూ ఇలాగే తయారయ్యారు. నాకోసం కాదు నా పిల్లల కోసం అని చెప్పి రాక్షసుల్లా మారుతున్నారు. బంధాలు మరియు మౌనం. ఒకసారి నిశశబ్దంగా ఆలోచించండి. మీకు నిజంగా ఎంత డబ్బు కావాలి. ఒక చిన్న గది మూడు పూటల భోజనం చాలు కానీ మనిషి జన్మించిందంటే అభివృద్ధి తప్పనిసరి కదా.
(19:11) సమాజంలో అభివృద్ధి ఉండాలి కానీ పక్కవాడిని తొక్కేసి విలువలను దిగజార్చి సాధించే అభివృద్ధి మనకు అవసరమా కోట్లు సంపాదించి మనశశాంతిని కోల్పోవడం నిజమైన అభివృద్ధి కాదు మనం పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తిపాస్తులు కాదు న్యాయంగా ధర్మంగా ఎలా బతకాలి తోటి మనుషులతో ప్రకృతితో ఎలా మెలగాలి అనే గొప్ప వారసత్వం పదవి వస్తుంది వెళుతుంది అధికారం శాశ్వతం కాదు హిట్లర్ నుండి రాజుల దాకా ఎవ్వరూ ఏది పట్టుకుపోలేదు కానీ వాళ్ళు మిగిల్చ ధర్మం లేదా అధర్మం మాత్రం చరిత్రలో మిగిలిపోయింది.
(19:45) ఈరోజు నువ్వు నీ అధికారాన్ని వాడుకొని ఒక పేదవాడిని ఇబ్బంది పెడితే అది నీ కర్మ అకౌంట్ లో రాసి పెట్టబడుతుంది. ప్రకృతికి లంచం ఇవ్వలేవు. ఒక సుభాషితం దీనిని స్పష్టం చేస్తుంది. వృతా శరీరముత్సుజ్య కాష్టలోష్ట సమం క్షితౌ విముఖ బాంధవ యాంతి ధర్మస్త మనుగచ్చతి అర్థం శరీరం మరణించిన తర్వాత బంధువులు మిత్రులు స్మసానం వరకు వచ్చి వెనక్కి తిరిగిపోతారు.
(20:12) కానీ నువ్వు చేసిన ధర్మం మాత్రమే నీ వెంట వస్తుంది. నీ బంధువులు మిత్రులు నీ డబ్బు కోసం నీతో ఉండవచ్చు. కానీ నీ దుఃఖంలో నీ వెంట ఉండేది నీ మంచితనం మాత్రమే నువ్వు నీ పిల్లలకి 10 కోట్లు ఇస్తే వాళ్ళు దాన్ని 10 రోజుల్లో తగలేయగలరు. కానీ నువ్వు వాళ్ళకి ధర్మం నేర్పిస్తే వాడు రూపాయి లేకపోయినా రాజసంతో బతుకుతాడు.
(20:35) గుర్తుంచుకో నీ భార్య కోరికలు నీ పిల్లల అవసరాలు నీ బాధ్యత. కానీ అవి నీ పాపానికి సాకులు కాకూడదు. అక్రమంగా సంపాదించి భార్య మెడలో వేసిన హారం. ఆమె మెడను అలంకరించదు. నీ వంశానికి ఉరితాడుగా మారుతుంది. అవసరానికి మించి ఆశపడకు బాధ్యత పేరుతో బంది అవ్వకు నీవు ఒక్కడివే వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉన్నావు. ఇన్ని బంధాలు వచ్చాక కూడా ప్రశాంతంగా ఉండటమే అసలైన యోగము ఆలోచించండి.
(20:59) మానవత్వపు విలువలు మరియు నేటి అవసరం మనం ఒక వింతైన మాయలో ఉన్నాం. మనకు ఏది అవసరమో దాని మీద శ్రద్ధ లేదు. ఏది అశాశ్వతమో దానికోసం ప్రాకులాడుతున్నాం. ఒకప్పుడు మనిషి అంటే దయకు మారుపేరు. ఈరోజు మనిషి అంటే స్వార్థానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎదుటివాడు ఆపదలో ఉంటే ఫోన్ తీసి వీడియో తీసే స్థాయికి దిగజారిపోయాం కానీ చేయి అందించి కాపాడే ఆలోచన రావడం లేదు ఇది మాయ కాదా సమాజం దృష్టిలో నువ్వు గొప్పవాడివి కావచ్చు నీ దగ్గర వేల కోట్లు ఉండొచ్చు కానీ నీ నీడ ముందు నువ్వు నేరస్తుడివి కాదా నీ అంతరాత్మను నువ్వు ప్రశ్నించుకున్నప్పుడు నీకు సమాధానం దొరుకుతుందా మనం సౌకర్యాల వెనుక
(21:39) పరుగెత్తుతూ సంస్కారాన్ని సమాధి చేస్తున్నాం విద్యావంతులమని చెప్పుకుంటున్నాం కానీ విజ్ఞతను కోల్పోతున్నాం. చదువుకున్న అహంకారం మనిషిని మనిషిగా చూడనివ్వడం లేదు. ఈ ప్రపంచం ఒక పెద్ద రంగస్థలం. ఇక్కడ అందరం పాత్రధారులమే కానీ మనం పోషించే పాత్ర ధర్మబద్ధంగా ఉందా లేదా అన్నదే ముఖ్యం. తప్పును సరిదిద్దుకోవడానికి ఇంకా సమయం మించిపోలేదు.
(22:05) ఇప్పటికైనా మేల్కొంటే మన మానవత్వాన్ని మనం కాపాడుకోవచ్చు. సంపద శాశ్వతం కాదు. కానీ నువ్వు పంచిన ప్రేమ చూపిన దయ సమాజంలో చిరంజీవిగా మిగిలిపోతాయి. చనిపోయిన తర్వాత మనుషులు నిన్ను నీ బ్యాంకు బ్యాలెన్స్ తో గుర్తుపెట్టుకోరు. నువ్వు వారి జీవితాల్లో నింపిన వెలుగుతో గుర్తుపెట్టుకుంటారు. మనం నిర్మించుకున్న ఈ కృత్రిమ సామ్రాజ్యాల కంటే ఒక చిన్న సహాయం చేసే మనసు ఎంతో విలువైనది.
(22:29) భగవద్గీతలోని ఈ శ్లోకం మన బాధ్యతను గుర్తు చేస్తుంది. యద్యదాచరతి శ్రేష్టస్తత్త దేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అర్థం పెద్దలు ప్రభావితం చేసే వ్యక్తులు ఏది చేస్తే సామాన్య ప్రజలు దాన్నే అనుసరిస్తారు. వారు దేనిని ప్రమాణంగా తీసుకుంటే లోకం కూడా అదే దారిలో వెళ్తుంది. ఉదాహరణ సమాజంలో మనం ఒక మార్పును కోరుకుంటే ఆ మార్పు మన దగ్గరే మొదలవ్వాలి.
(22:57) సంపద శాశ్వతం కాదు కానీ నువ్వు పంచిన ప్రేమ శాశ్వతం వేదాల సాక్షిగా సంపాదన నియమం అసలు సంపాదన అంటే ఏమిటి కేవలం అంకెలను పోగేయడమేనా కాదు మన వేదాలు ఉపనిషత్తులు వేల ఏళ్ల క్రితమే సంపాదనకు ఒక పవిత్రమైన హద్దును నిర్ణయించాయి. కానీ ఈరోజు మనం ఆ హద్దులను చరిపేసి అగాధమైన ఆశలోకి పడిపోయాము. ఉపనిషత్ సూక్తి శ్లోకంలో ఈషావాస్య ఉపనిషత్తులోని మొదటి శ్లోకం మన సంపాదన తీరును శాసిస్తుంది.
(23:26) ఈషా వాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీద మా గృధా కస్య స్విద్ధనం అంటే ఈ జగత్తులో ఉన్నదంతా ఈశ్వరుడిదే ఆయన ఇచ్చిన దానిని త్యాగ భావంతో అనుభవించు అంతే తప్ప ఎదుటివాడి ధనం మీద కన్ను వేయకు ఆశపడకు కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం మనకు భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి చెందడం లేదు న్యాయంగా కష్టపడి సంపాదించే రూపాయి చాలడం లేదు పక్కవాడి వాడి ఆస్తి మీద వాడి ఎదుగుదల మీద కన్ను వేస్తున్నాం.
(23:57) అది ఎలాగైనా సరే మన జేబులోకి రావాలని కుట్రలు పందుతున్నాం. ఆధునిక ఎకనామిక్స్ మరియు సైకాలజీలో జీరో సం థింకింగ్ అనే పదం ఉంది. అంటే పక్కవాడు బాగుపడితే నేను నష్టపోతున్నాను అనే ఒక భ్రమ. దీని వల్ల మనిషిలో అసూయ పెరుగుతుంది. శాస్త్రవేత్తల ప్రకారం నిరంతరం ఇతరుల ధనం పై ఆశపడే వారిలో కార్టిసోల్ స్ట్రెస్ హార్మోన్ విపరీతంగా పెరుగుతుంది.
(24:22) ఇది మెదడులోని విచక్షణను చంపేసి కేవలం స్వార్థం వైపు మాత్రమే నడిపిస్తుంది. దశమ భాగం నియమం. ద 10% రూల్ వేదాల్లో చెప్పబడిన ధర్మం ప్రకారం నువ్వు 10 రూపాయలు సంపాదిస్తే అందులో కనీసం ఒక భాగం దశమ భాగం సమాజానికి ఉపయోగపడాలి. కానీ ఇప్పుడు 10 రూపాయలు సంపాదిస్తే పక్క వాడి దగ్గర ఉన్న 10 కూడా ఎలా లాక్కోవాలి అని ఆలోచిస్తున్నాం. ఇదే కలికాలం అంటే ధర్మం అంటే తీసుకోవడం మాత్రమే కాదు ఇవ్వడం కూడా అని మర్చిపోయాం.
(24:51) సేవ అంటే ఏమిటి? నీ బాధ్యతను సేవ అని బ్రమపడకు. చాలా మంది ఒక గొప్ప మాట చెబుతుంటారు. నేను సంపాదిస్తున్నాను. నా భార్యను మహారాణిలా చూసుకుంటున్నాను. నా పిల్లలను విదేశాల్లో చదివిస్తున్నాను. నేను ఎంతో గొప్ప సేవ చేస్తున్నాను అని. ఒక్క నిమిషం ఆగండి మీ భార్యను పిల్లలను మీరు పోషించుకోవడం సేవ కాదు అది మీ బాధ్యత.
(25:16) మీ సంతానాన్ని మీరు కాపాడుకోవడంలో గొప్పేముంది. ఆ పని ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణి చేస్తుంది. నీతి శ్లోకం పశువులకు మనుషులకు తేడా అంటే ఆహారం తినడం, నిద్ర పోవడం, భయం కలగడం, సంతానాన్ని కనడం ఇవి పశువులకు మనుషులకు సమానమే. మనిషిని పశువు నుండి వేరు చేసేది ఒక్క ధర్మం మాత్రమే. ఆ ధర్మం లేని మనిషి పశువుతో సమానం. ఒక కుక్క కూడా తన పిల్లలకి ఆహారం తెచ్చిపెడుతుంది.
(25:41) తన గుంపును కాపాడుకుంటుంది. నువ్వు కూడా కేవలం నీ కుటుంబం కోసమే బతుకుతుంటే నీకు ఆ పశువుకు తేడా ఏంటి? అసలైన సేవ, ఆత్మ సంతృప్తి. అసలైన సేవ ఎక్కడ ఉందంటే నీకు ఎటువంటి సంబంధం లేని ఒక అనాధ పిల్లాడి ఆకలి తీర్చినప్పుడు ఉంటుంది. రోడ్డు మీద ఎండలో మాడిపోతున్న ఒక ముసలి ప్రాణానికి నీ చేత్తో ఒక్క ముద్ద పెట్టినప్పుడు కలిగే ఆ తృప్తి ఉంది.
(26:06) అది కోట్లు సంపాదించినా దొరకదు. సైకాలజీలో హెల్పర్స్ హై అనే ఒక అద్భుతమైన స్థితి ఉంది. మనం ప్రతిఫలం ఆశించకుండా ఎవరికైనా సాయం చేసినప్పుడు మన మెదడులో ఎండార్ఫిన్స్ మరియు ఆక్సిటోసిన్ విడుదలవుతాయి. ఇది మనిషికి అత్యున్నతమైన ఆనందాన్ని మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంటే సేవ అనేది నువ్వు ఎదుటివాడికి చేసే ఉపకారం కాదు అది నీ ఆత్మను నువ్వు శుద్ధి చేసుకునే ప్రక్రియ.
(26:30) మీరు ధర్మంగా ఉండి మీ అవసరానికి తగినట్లుగా సంపాదించుకుంటే మీరు ఎవరికీ ప్రత్యేకంగా సేవ చేయనక్కర్లేదు. ఎందుకంటే ధర్మబద్ధంగా జీవించడమే ఈ సమాజానికి నువ్వు చేసే అతి పెద్ద సేవ. నీ స్వార్థం కోసం నువ్వు ప్రకృతిని నాశనం చేయకుండా పక్కవాడిని మోసం చేయకుండా ఉంటే చాలు. ఈ ప్రపంచం బాగుపడుతుంది. సంపాదనను బాధ్యతగా చేయి. సేవను తృప్తి కోసం చేయి అంతే తప్ప బాధ్యతను సేవ అని భ్రమపడకు మేల్కో ముగింపుగా నా విశ్లేషణలో నేను చెప్పేది ఒక్కటే చివరగా ఒక్క మాట గుర్తుంచుకో సంపాదన అనేది అవసరం కానీ అది నీ వ్యక్తిత్వాన్ని, నీ ధర్మాన్ని, నీ అంతరాత్మను బలి ఇచ్చి వచ్చేది కాకూడదు. అక్రమంగా నిర్మించుకున్న
(27:11) సామ్రాజ్యాలు ఎప్పుడైనా కూలిపోవాల్సిందే. కానీ ధర్మం మీద నిలబడ్డ మనిషికి ఓటమి ఉండదు. నీ అంతరాత్మ చెప్పే మాట విను ఇప్పటికైనా దారి మార్చుకో ఎందుకంటే చివరకు మిగిలేది నీ సంపాదన కాదు నువ్వు బతికిన విధానం మాత్రమే. ఈ వీడియోలో మనం చెప్పుకున్న విషయాలు నీలో చిన్న మార్పు అయినా తెచ్చాయంటే అదే ఈ సమాజానికి మనం ఇచ్చే గొప్ప బహుమతి.
(27:35) కాబట్టి మిత్రులారా ఈ మాయా ప్రపంచంలో మీరు ఒక మృగం లాగా మారకండి. సంపాదించండి. కానీ ఆ సంపాదన వెనుక ఒకరి కన్నీళ్లు ఉండకూడదు ఎదగండి కానీ ఎదుటివాడిని తొక్కి కాదు ఈ ప్రపంచం ఒక నాటక రంగం మనకు ఇచ్చిన పాత్రను ధర్మంగా పోషించడమే మన బాధ్యత ముందు ముందు మనం మాట్లాడుకోబోయే అంశాలు ఇంకా తీవ్రమైనవి ఇప్పటివరకు మనం పురుషుల యొక్క అధర్మ సంపాదన గురించి దాని వల్ల కుటుంబం పై సమాజంపై పడే దుష్ప్రభావాల గురించి చర్చించాము అయితే ఈ నాణానికి మరొక కోణం కూడా ఉంది.
(28:11) నా రాబోయే వీడియోలో ఆడవారు అధర్మ సంపాదనకు ఎందుకు ప్రభావితమవుతున్నారు వారి వల్ల కుటుంబ వ్యవస్థలో ఎలాంటి వికృత దృశ్యాలు చోటు చేసుకుంటున్నాయి సమాజంపై దాని తీవ్రమైన పరిణామాలు ఏమిటి అనే విషయాలను మరియు వేదాలు చెప్పిన లోతైన రహస్యాలను వివరంగా విశ్లేషించబోతున్నాను. అంతవరకు ఒక్క ప్రశ్న మీతోనే పెట్టుకోండి. మీరు సంపాదిస్తున్నది మీ సుఖం కోసమా లేక మీ వినాశనం కోసమా మేల్కోండి.
(28:36) మన ధర్మాన్ని మనమే కాపాడుకుందాం. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ రెగ్యులర్ గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లైతే ప్లీజ్ లైక్ అండ్ షేర్.
(29:04) రెగ్యులర్ గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నా YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్ ని నొక్కినట్లయితే నేను ఎప్పుడు నా కొత్త వీడియోని అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ కి వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థాంక్యూ ఆల్.
No comments:
Post a Comment