పూలు ఇచ్చిన గొల్లవాడిని శివుడు పల్లకిలో తీసుకెళ్లాడు 😢 | నిజమైన భక్తి అంటే ఇదే!”
Author Name:MrSomu Facts
Youtube Channel Url:https://www.youtube.com/@MrSomuFacts
Youtube Video URL:https://www.youtube.com/watch?v=6P7v2fEUuM0
Transcript:
(00:00) ఒక గ్రామంలో నిత్యం శివ పూజ చేసే శివభక్తుడు ఉండేవారు శివనామ స్మరణ చేయకుండా మంచి నీళ్లు కూడా ముట్టుకొని మహాభక్తుడు ఆయన కొద్దిగా వ్యవసాయ భూమి ఉంటే సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు నిత్య అనుష్టానపరుడు శివనామమే ఊపిరిగా బ్రతికే ఆ శివ భక్తుడు ఏ పని చేసినా ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ అంటూ శివనామ స్మరణ చేయడం వల్ల అది ఒక మహా తపస్సు అయింది.
(00:27) అతను రకరకాల పూలతో శివయ్యను అలంకారం చేసి మురిసిపోయేవాడు. శివుడికి పూలతో అర్చన చేస్తూ ఎంతో సంతోషించేవారు. ఆయన భక్తిని ఒక మేకను కాచే గొల్లవాడు గమనిస్తూ ఆయనలాగా పూజ చేయలేకపోయినా శివనామ స్మరణ చేయడం అలవాటు చేసుకున్నాడు గొల్లవాడు. ఆ శివ భక్తుడిలాగా మంత్రాలతో అనుష్టానం చేయలేను కనుక కనీసం ఆయన చేసే పూజలో అయినా ఏదో ఒక రూపంలో పాలు పంచుకోవాలని ఆశతో ఒకరోజు శివగానం చేస్తూ అనేక రకాల పూలను సేకరించి శివభక్తుని గుమ్మం ముందు నిల్చుని వివిధ రకాల పుష్పాలు వారికి చూపించి స్వామి నేను మీలాగా మంత్రాలతో కీర్తనలతో స్వామి వారికి పూజ చేయలేను మెప్పించలేను. నాకు అంతగా
(01:03) చదువు లేదు శివనామ స్మరణ తప్ప ఇంకా ఏమీ తెలియదు నాకు మీరు చేసే శివ పూజ నాకు చాలా బాగా నచ్చింది. ఈ పువ్వులను శివ పూజకు ఉపయోగిస్తే స్వామి కరుణించాడని సంతోషిస్తాను. మీరు అనుమతిస్తే ప్రతిరోజు మీ పూజకు పువ్వులను సేకరించి సేవ చేసుకుంటాను అని వేడుకున్నాడు ఆ గొల్లవాడు. మహాభక్తుడైన ఆయన గొల్లవాడిని గమనిస్తున్నాడు.
(01:26) ఆ గొల్లవాడిని మొహంలో అమాయకత్వం తప్ప అసూయ అహంకారం లేదు. చదువు లేకుండా మాటలో సంస్కారం ఉంది. పేదవాడు శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించాడు. పైగా శివనామ స్మరణతో పువ్వులు తెస్తాను అంటున్నాడు. నాకుఇస్తాను అంటున్నాడు. శివయ్యకే కదా అని చాలా సంతోషంగా అలాగే కానివ్వు అని ఒప్పుకున్నాడు ఆ శివ భక్తుడు. శివుడే వరం ఇచ్చినట్టుగా గొల్లవాడు పొంగిపోయాడు.
(01:49) ప్రతిరోజు శివనామ స్మరణ చేస్తూ పూలను తెచ్చిచ్చేవాడు. పూజ జరిగే సమయంలో కిటికీలో నుండి దొంగబడి చూసి శివనామ స్మరణతో పొంగిపోయేవాడు ఆ గొల్లవాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఇరువురికి కైవల్య ప్రాప్తి కలిగింది. శివభక్తుడి కోసం శివగణాలు వచ్చారు. ఆ గొల్లవాని కోసం శివుడు ఏకంగా పూల పల్లకిని పంపించారు. ఇది గమనించిన శివభక్తుడు ఆ గొల్లవాడిని తీసుకొని వెళ్ళడానికి ఆ పల్లకిని ఆ పూల పల్లకి వచ్చింది ఎందుకు అని అడిగారు.
(02:16) అతడు మహాశివ భక్తుడు శివనామస్మరణతో ప్రతినిత్యం నామస్మరణ చేస్తూ ఒక మహా శివ భక్తుడు చేసేటువంటి శివ పూజకు భక్తిగా పూలను సమర్పించేవాడు. ఆ గొల్లవాని భక్తికి మెచ్చి అతను ఒక భక్తుడికి మంచి మనసుతో సహాయం చేయడం వల్ల తన కర్మల నుండి విముక్తి కలిగి ఆ శివయ్యే పూల పల్లకిని పంపారు అని వివరించారు. ఆ శివ భక్తుడికి ఆశ్చర్యంతో పాటు నిస్వార్థమైన సేవకు దక్కిన ఫలితాన్ని చూసి ఎంతో ఆనందపడ్డారు.
(02:41) శివగణాలతో వెళ్ళిన శివభక్తుని కన్నా ముందే పుష్ప పల్లకిలో ఆ గొల్లవాడు శివుని సన్నిధిని చేరుకున్నాడు. తోడు తోడటన్న తోడనే ఉన్నాడు లేడు లేడటన్న లేనే లేడు కాదు కాదటన్న కానే కాడు విశ్వదాభిరామ వినురవేమ భగవంతుని విషయంలో నమ్మేవారు కొందరు నమ్మని వారు కొందరు అటు ఇటుగా కొందరు ఉంటారు భగవంతుడు కూడా అలానే ఉంటాడు. పరమేశ్వరుడు ఉన్నాడు అని పూర్తిగా నమ్మి సంపూర్ణమైన భక్తి విశ్వాసములతో ఎవరైతే ఆయనను సేవిస్తూ ఉంటారో అటువంటి వారు ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు శివ పరమేశ్వర నీవే నాకు దిక్కు అని పిలిస్తే తప్పకుండా ఆ పరమేశ్వరుడు ఆదుకుంటాడు.
(03:18) అదేవిధంగా లేదు అన్న వారికి లేనట్టుగా ఉంటాడు ఈశ్వరుడు కాదు అన్నవారికి కానట్టుగానే ఉంటాడు పరమేశ్వరుడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది కూడా ఇదే కదా నన్ను ఎవరెవరు ఏ విధంగా తలిస్తే వారిని నేను అదే విధంగానే అనుగ్రహిస్తున్నాను అని చెప్పాడు శ్రీకృష్ణుడు వస్త్రం పుష్పం గంధం అన్నం పాత్ర అనేవి ఇవి సమర్పించడం అనేవి పంచోపచారాలు ఒక సాలిపెరుగు దేవుడికి ఉపచారం చేయాలనుకుంది.
(03:46) బూజు పోగులతో శివుడికి పందిళ్లు వేసింది. ఒక పాము శివలింగానికి రాళ్లను సమర్పించింది. ఏనుగు ఆకులను సమర్పించింది. వాటి దృష్టిలో అవన్నీ దైవోపచారాలే లోకం దృష్టిలో అవి అపచారాలు శివుడు మాత్రం వాటిని ఉపచారాలుగా సంతోషంగా స్వీకరించి వాటికి కైలాసం ఇచ్చాడు. తిన్నాడనే ఆటవికుడు మాంస ఖండాలను శివుడికి సమర్పించాడు తినమని అది చూసిన పూజారి ఇలాంటి పూజను ఎలా స్వీకరిస్తున్నావు శివయ్య అని నిలదీశడు శివుడిని శివుడు తిన్నడి భక్తిని పూజారికి చూపించాలనుకున్నాడు తన కంటి నుంచి రక్తదారలు కార్చాడు తిన్నడు కలత చెంది తన కన్ను పెరికి దేవుడి కంటికి అమర్చాడు.
(04:20) సాక్షాత్తు శ్రీకాళహస్తీశ్వరుడే ఈ పరీక్ష ద్వారా లోకానికి నిజమైన భక్తి ఎలా ఉంటుందో నిరూపించాడు. ఇలాంటి ఉపచారంతో శివుని ఆరాధించిన తిన్నడు భక్త కన్నప్పగా ప్రసిద్ధి చెందాడు. మనకు లభించే ప్రతిదీ పరమాత్మ ప్రసాదమే భగవద అనుగ్రహం వల్లనే మనకు రావలసింది వస్తుంది అని గుర్తుపెట్టుకోండి లభించిన దానితో తృప్తి పడేవారు ధన్యులు తమ కృతజ్ఞతను భక్తి రూపంలో పరమాత్మకు వెల్లడించుకుంటారు.
(04:42) తిరిగి ఏదైనా ఆ భగవంతుడికి సమర్పించుకుంటారు. ఆ ప్రయత్నంలో భగవంతుడు తమకు ఇచ్చిన దానిలోనే కొంత గిల్లి దాన్ని తీసి మళ్ళీ దాన్నే ఆ పరమాత్మకు భక్తులు సమర్పించుకుంటారు. అలా సమర్పించుకున్న దాన్ని కూడా గొప్పగా ప్రకటించుకోవాలని కొందరు తాపత్రయ పడుతూ ఉంటారు. నిజానికి మన ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులకు ఎన్నో సేవలు చేస్తుంటారు.
(05:02) నేను మా నాన్నగారికి మా తల్లిదండ్రులకు బట్టలు పెట్టాను నేను అంత చేశాను ఇంత చేశాను అని తల్లిదండ్రులకు రకరకాల సేవలు చేశానని గొప్పలు చెప్పుకుంటారు. నేను మా తల్లిదండ్రులకు ఎన్నో ఖర్చులు పెట్టాను అని గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఇస్తున్నది ఆ తల్లిదండ్రులు సంపాదించిన సొమ్ములో నుంచే తల్లిదండ్రులు ఇచ్చిన వాటిలో కొంచెం గిల్లి దాన్ని తమకు తిరిగి ఇస్తే ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు.
(05:22) తమ బిడ్డలు ఆయురారోగ్యాలతో దీర్ఘాయుషుతో వర్దిల్లాలని పదే పదే దీవిస్తారు తల్లిదండ్రులు. అలాంటిది ఈ జగత్తుకు ఈశ్వరుడే తల్లి తండ్రి సామాన్య మానవులకే ఇంత పుత్ర వాత్సల్యం ఉంటే ఇక సాక్షాత్తు సర్వేశ్వరుడికి ఎంత వాత్సల్యం ఉంటుంది భక్తుల మీద ఈ వీడియో ఇక్కడితో ముగిసిందని అనిపించినా అసలు భావం ఇప్పుడే మొదలవుతుంది మిత్రులారా ఆ పుష్ప పల్లకిలో ఎగిరిపోయిన గొల్లవాడి కళ్ళలో ఆనంద భాష్వాలు వచ్చాయి.
(05:48) శివగణాల మధ్య నిలబడ్డ ఆ మహాభక్తుని హృదయంలో ఒక లోతైన ప్రశ్న మొదలైంది. నేను చేసిన పూజలన్నింటికంటే అతని సాధారణ సేవ ఎందుకు గొప్పదైంది అని అప్పుడు మనసులో ఒక స్వరం వినిపించింది ఆ మహాభక్తుడికి పూజలో వైభవం కాదు భక్తిలో నిజాయితి ముఖ్యం. మంత్రాల గోష కాదు హృదయం నుంచి వచ్చే ఒక్క ఓం నమఃశివాయ అనే మంత్రం చాలు. ఆ గొల్లవాడు ఇచ్చింది పూలు మాత్రమే కాదు తన అహంకారాన్ని వదిలిపెట్టి తన మనసును శివుడికి సమర్పించాడు.
(06:19) అందుకే శివుడు అతన్ని తన దగ్గరికి పిలిచాడు. మనం ఒక్కసారి ఆలోచించాలి ఇక్కడ మన పూజల్లో మనం ఎంత శ్రద్ధగా ఉంటున్నాం మన ప్రార్థనలో ఎంత నిజమైన ప్రేమ భక్తిని చూపిస్తున్నాం. మన భక్తిలో ఎంత నిస్వార్థం ఉంది శివుడు ఎప్పుడూ దూరంగా ఉండడు మిత్రులారా మన హృదయంలో నిజంగా పిలిస్తే ఆయనే ముందుకు వచ్చి మన చేతిని పట్టుకుంటాడు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నాదొక చిన్న విన్నపం భక్తి అంటే పెద్ద పెద్దగా పూజలు చేయడం కాదు భక్తి అంటే చిన్న మనసుతో పెద్ద ప్రేమను ఆ భగవంతుడిపై చూపించడం.
(06:50) ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే ఒక్కసారి ఓం నమఃశివాయ అని మనస్ఫూర్తిగా జపించండి. మీ యొక్క అనుభూతిని కామెంట్ లో పంచుకోండి. ఇలాంటి మరిన్ని భక్తి కథల కోసం ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శివుని యొక్క కృప మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమఃశివాయ హర హర మహాదేవ శంభో శంకర
No comments:
Post a Comment