Wednesday, April 22, 2026

If I am the truth, who is sufferer || అద్వైత సత్యం

If I am the truth, who is sufferer || అద్వైత సత్యం

Author Name:Peaceful life

Youtube Channel Url:https://www.youtube.com/@jyothisrinivas02

Youtube Video URL:https://www.youtube.com/watch?v=sl72wJFiJ0g



Transcript:
(00:01) ఓం గం గణపతయే నమః ఓం శ్రీ గురుభ్యోం నమః శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఒకనాటి శుభ ఉదయాన తన శిష్యులతో సంభాషిస్తున్న సమయంలో వారి వద్దకు ఒక సాధకుడు వచ్చాడు. అతని ముఖంలోని గంధరగోళం అతని మనసులోని వేదనను తెలియజేస్తుంది. అతను శ్రీ శంకరాచార్యుల వారికి నమస్కరించి అతని సన్నిధిలో కూర్చున్నాడు. శ్రీ శంకరాచార్యుల వారు ఆ సాధకుని వైపు చూసి ఏమిటి నాయనా ఎందుకు అంతలా ఆందోళన చెందుతున్నావు అని అడిగాడు.
(00:38) అందుకు ఆ సాధకుడు గురుదేవా ఆత్మ దివ్యమైనది అని అంటారు కదా అలాగే దేవుడు మనలోనే ఉన్నాడు అని అంటారు. మరి మనమందరం చైతన్య స్వరూపులం అని చెబుతారు కదా మరి చిన్న చిన్న విషయాలకు దుఃఖిస్తూ అసూయ పడుతూ భయపడుతూ ఉంటాను. ఒకవేళ నేను చైతన్య స్వరూపమే అయితే ఎందుకు ఇంత అల్పుడిగా ప్రవర్తిస్తున్నాను అన్న ఈ ప్రశ్నే నన్ను ఆందోళనకు గురి చేస్తుంది గురువుగారు అని అంటాడు.
(01:15) అందుకు శ్రీ శంకరాచార్యుల వారు మృదువుగా ఇలా అంటాడు. నీవు అడుగుతున్న ఈ ప్రశ్న ఒక మనిషి ఎప్పుడో ఒకప్పుడు అడగవలసిన ప్రశ్న. ఎప్పుడైతే ఈ ప్రశ్న మొదలవుతుందో అప్పుడే అతనికి జ్ఞాన దృష్టి మొదలవుతుంది. మెలకవుతో ఉన్నవారికే తప్పిపోయాను అనిపిస్తుంది. అలాగే గాఢ నిద్రలో ఉన్నవాడు తాను తప్పిపోయినట్టు ఎప్పుడూ గ్రహించడు. అలాగే సత్యానికి దగ్గర అవుతున్న కొద్దీ ఇన్ని రోజులు నేను సత్యానికి దూరమైనట్టు గ్రహిస్తాడు.
(01:56) నేను అనంతమైన చైతన్యం అయితే ఈ బాధపడేవాడు ఎవడు అని అడిగావు కదా విచారించి చూస్తే ఆ బాధపడేవాడి ఉనికి లేదు అని గ్రహిస్తావు మనలోని అజ్ఞానమే మనల్ని చైతన్యానికి భిన్నంగా చూపుతుంది. నీవు చూస్తున్నదంతా మాయ. మన అజ్ఞానం కారణంగా ఈ మాయనే మనము నిజము అని గ్రహిస్తున్నాము. ఒకసారి ఊహించు నీవు కలలో ఉన్నప్పుడు ఆ కలలో జరిగే సన్నివేశాలన్నీ నిజమనే అనిపిస్తాయి.
(02:41) అలాగే ప్రేమలో పడితే ఆనందం అనుభవంలోకి వస్తుంది. ఎవరైనా వెంటపడితే భయంతో చెమటలు పడతాయి అలాగే శ్వాస యొక్క వేగం కూడా మారుతుంది. అయితే మెలకువ రాగానే అవన్నీ నిజం కాదని కేవలం అది ఒక స్వప్నం అని గ్రహిస్తాడు. అలాగే నీవు చెప్పే ఈ దుఃఖ స్వరూపము కలలోని ఒక పాత్ర లాంటిదే అది స్పందిస్తుంది బాధపడుతుంది కోరికలు కలుగుతాయి కానీ అది నీవు కాదు అది కేవలం మన పాత సంస్కారాల సమాహారం మాత్రమే కలను గమనించినది
(03:26) మెలకువలో ఉన్నప్పుడు సుఖ దుఃఖాలను గమనించేది ఒక్క ఒక్కడే ఆ సాక్షికి బాధ లేదు సంతోషము లేదు అతడు సుఖ దుఃఖాలకు అతీతుడు అదే మన దివ్య స్వరూపం అందుకు సాధకుడు గురుదేవా మరి ఈ అసత్య స్వరూపము సత్య స్వరూపము కంటే బలంగా నిజమని ఎందుకు అనిపిస్తుంది అని అడుగుతాడు. అందుకు శ్రీ శంకరాచార్యుల వారు ఎందుకంటే నీవు అజ్ఞానం వల్ల ఈ శరీరంతో మమేకమై ప్రతి భయాన్ని ప్రతి దుఃఖాన్ని ప్రతి సంతోషాన్ని
(04:13) అనుభవిస్తున్నది నేనే అని అనుకుంటూ నీ అసత్య స్వరూపాన్ని పెంచి పోషిస్తున్నది నీవే నీవు అనుకునే నీ ఆరాటాలు నీ అలవాట్లు నీ ప్రతిస్పందనలు ఇవన్నీ నీవు కాదు అవి అన్నీ ఆ ఆకాశంలోని మేఘాల వంటివి మేఘాలు ఉన్నా తొలగిపోయినా ఆకాశము అలాగే ఉంటుంది. కానీ మనందరము మేఘాలను మాత్రమే పట్టుకొని నిశ్చలమైన ఆకాశాన్ని మర్చిపోయాము. నేను భయపడుతున్నాను నేను దుఃఖిస్తున్నాను నేను
(04:59) సంతోషిస్తున్నాను అని అనుకోకుండా వాటిని కేవలం సాక్షి భావనతో గమనించు అప్పుడు నీవు సుఖ దుఃఖాలు అనే భావనలు మేఘాలగా వస్తుంటాయి పోతుంటాయి కానీ నేను ఆకాశం లాగా ఎప్పటికీ నిలిచి ఉండే చైతన్యాన్ని అని గ్రహిస్తాడు. అదే అద్వైత సత్యం అది చెబుతున్నది ఏమిటంటే నీవు అనుభవించే దానికి భిన్నంగా లేవు అని గ్రహిస్తావు. నీవే సాక్షివి మరియు బ్రహ్మానివి ఆలోచనలను రానివ్వు అలాగే పోనివ్వు వాటితో
(05:46) పోరాడం కేవలం గమనించడం వాటికి సాక్షిగా నిలవడం మాత్రమే చేస్తూ మెల్లగా మేఘాలు పలచబడటం ప్రారంభిస్తాయి. ఆకాశం కనిపించడం మొదలవుతుంది. నీవు దుఃఖాన్ని తొలగించలేవు కానీ ఆ దుఃఖిస్తున్నది నేనే అన్న బ్రమను మాత్రం తొలగించగలం. ఒక శిల్పి విగ్రహాన్ని తయారు చేస్తున్నప్పుడు కొత్తగా ఏమి సృష్టించడు కేవలం అతనికి అవసరం లేని రాయిని మాత్రమే తొలగిస్తాడు.
(06:28) అలాగే మన స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి అనవసరమైన వాటిని అంటి పెట్టుకోకూడదు అని చెబుతూ శ్రీ శంకరాచార్యుల వారు ఒక చిన్న రాయిని చూపిస్తూ ఈ రాయిని చూడు ఇది కేవలం ఉంది. ఇది నేను విలువైనదాన్న కాదా అని అడగదు. ఇది తన గుర్తింపుతో బాధపడదు ఎందుకంటే దానికి తాను ఉన్నానన్న గుర్తింపు లేదు కానీ మనిషికి తాను ఉన్నానన్న గుర్తింపు ఉంది.
(07:12) ఆ గుర్తిస్తున్నదే చైతన్యం చైతన్యం అనే వరం మనుషులకు మాత్రమే ఉంది. కానీ వారు దానిని వారి అనుభవాలలో మాత్రమే బంధిస్తున్నారు. అనుభవంను వదిలివాసి చైతన్యాన్ని మాత్రమే పట్టుకో నీవు ఎప్పుడైనా దుఃఖంగా ఉన్నప్పుడు నేను దుఃఖంగా ఉన్నాను అని అనకు దానికి బదులు నా లోపల దుఃఖం అనే ఒక అల వచ్చి వెళ్ళింది అని అనుకుంటే వెంటనే నీవు అజ్ఞానపు నేను నుండి సాక్షిభూతమైన నేనుకు మారిపోతావు నీ లోపల కోటి సూర్యుల తేజస్సుకు సమానమైన ప్రకాశం ఉంది కానీ నీవు అజ్ఞానంతో
(08:03) ఆశలు భయాలు పోలికలు అనే మేఘాలను కప్పుకున్నావు ఎప్పుడైతే ఈ మేఘాలను తొలగిస్తావో అప్పుడు నీ అసలు స్వరూపము నీకు గోచరిస్తుంది. ప్రపంచంలో అన్ని ఉన్నా సహజంగా జరుగుతున్నాయి. నదులు ప్రవహించడం ఋతువులు మారడం కానీ మనిషి అహంకారం మాత్రమే సహజంగా ఉండకుండా మొత్తం విశ్వాన్ని నియంత్రించాలని ప్రయత్నిస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రయత్నాన్ని వదిలేసి అంతర్ముఖలం అవుతామో అప్పుడు మనలోని
(08:49) దివ్యత్వం సాక్షాత్కరిస్తుంది. ఈ ఆత్మ సాక్షాత్కారం కోసము మీరు ఏమి చేయవలసిన అవసరం లేదు మన ఆలోచనలను గమనిస్తూ వాటికి సాక్షిగా ఉండటం అలవాటు చేసుకుంటే చాలు అని చెబుతూ శ్రీ శంకరాచార్యుల వారు ఇలా అంటారు. నీ లోపల ఉన్న దుఃఖితుడు కేవలం నీ మనసు యొక్క సృష్టి నీ నిజ స్వరూపం బాధలకు సుఖ సంతోషాలకు అతీతమైనది అది అంతం లేనిది మరియు శాశ్వతమైనది మరియు పరమశాంతి
(09:36) అంటూ ముగిస్తాడు. తన ప్రశ్నకు సమాధానం దొరకడంతో సాధకుడు ఎంతో భక్తితో శ్రీ శంకరాచార్యుల వారికి నమస్కరించి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. జై శ్రీరామ్.

No comments:

Post a Comment