వర్ణసంకరం గురించి అర్జునుడు మాటల్లో | Arjuna About Inter Caste Marriage | Bhagavad Gita Episode No.3
Author Name:Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
Youtube Channel Url:https://www.youtube.com/@hindudharmakshetram
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ciReLmrbloU
Transcript:
(00:00) ఓం సక్తుమివతిత ఉనాపునంతోయత్రీరామనసావాచమక్రత ఓం నమో గణపతయే వసుదేవ సుతందేవం కంస చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాశిష్టాయ నమో నమః శృతి స్మృతి పురాణ నామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం మొట్టమొదటి జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ మహాభారతాన్ని భగవద్గీతను అష్టాదశ పురాణాల్ని సమస్త వేద
(00:48) విభాగాన్ని ఈ విధంగా ఒకటేమి ఒకటి వేలాది వరాలను మనకు ఇచ్చినటువంటి మానవాళకి ఇచ్చినటువంటి వ్యాస మహర్షికి నమస్కరిస్తూ భగవద్గీత వ్యాఖ్యానం చేసి మనందరినీ కూడా అనుగ్రహించినటువంటి శంకర భగవత్పాదులకు నమస్కరిస్తూ భగవద్గీత ఉపన్యాసాన్ని ప్రారంభిస్తూన్నాను. ఇప్పటికే మనం భగవద్గీతలో రెండు భాగాలు చెప్పుకున్నాంఅండి మూడో భాగం ఇది దృష్టిలో పెట్టుకోండి మొదటి అధ్యాయమే నడుస్తోంది అర్జున విషాద యోగమే అర్జున విషాద యోగంలో రెండు భాగాలు చెప్పుకున్నాం ఒక భాగంలో 15 శ్లోకాలు ఒక భాగంలో 16 శ్లోకాలు ఇంకో భాగంలో 21 శ్లోకాలు ఇప్పుడు మూడో భాగంలోకి
(01:31) వచ్చాము ఏమిటి ఇక్కడ మనం చూసుకుంటే యద్యప్యేతే నపశ్యంతి లోభోపహత చేతసః కులక్షజ కృతం దోషం మిత్రద్రోహేచ పాతకం కథన్నజ్ఞేయజమస్మాభిపాపాదస్మాన్ నివర్తితుం కులక్షజ కృతం దోషం ప్రపస్యదభర్జనార్ధన అర్జునుడు తన యొక్క విషాదాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు తన యొక్క భావాలను ప్రకటిస్తూ ఉన్నాడు యుద్ధానికి సిద్ధపడిన తర్వాత ఇరు సైన్యాలు కూడా సిద్ధంగా ఉన్నప్పుడు మొట్టమొదటి రోజున కృష్ణ కృష్ణ పరమాత్మను ఉద్దేశించి అచ్యుత ఈ రథాన్ని తీసుకొని వెళ్లి కొంచెం రెండు సేనల మధ్య నిలబెట్టు అన్నాడు.
(02:15) కృష్ణ పరమాత్మ అలాగే చేశాడు అక్కడికి వెళ్ళిన తర్వాత శత్రు పక్షంలో ఉన్నటువంటి బంధువుల్ని మిత్రుల్ని లేకపోతే పెద్దవాళ్ళని పితామహుల్ని పితరుల్ని అందరిని చూసి ఇతను హతాశుడు అయిపోయాడు. ఇక్కడ నాకు ఎవ్వరూ కూడా శత్రువులు కనిపించడం లేదు మొత్తం నావాళ్లే కనిపిస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళను నేను చంపి సాధించేది ఏమిటి అని చెప్పేసి విపరీతమైనటువంటి నైరాస్యంలో కూరుకుపోయి మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఏమన్నాడు కొనసాగింపుగా యద్యప్యేతేనపస్యంతి లోభోపహత చేతసః కులక్షయ కృతం దోషం మిత్రద్రోహేచ పాతకం ఓ జనార్ధన అని సంబోధిస్తూన్నాడు జనార్ధనుడు అనిఅంటే కనుక
(02:58) జనులు చేసినటువంటి పాపాలను బట్టి శిక్షించేటటువంటి వాడు అని అర్థం పాపుల్ని రక్షించడు దృష్టిలో పెట్టుకోండి పాపుల్ని రక్షించేవాడు దేవుడు అవ్వడు పాపాలను బట్టి పాపుల్ని శిక్షించి వాళ్ళని సంస్కరించి వాళ్ళతో పుణ్యకర్మలు చేయించి వాళ్ళకు వరాలు ఇచ్చేటటువంటి వాడు దేవుడు అవుతాడు. అలాగా జనం యొక్క పాపాలను బట్టి వాళ్ళను శిక్షిస్తాడు కావున జనార్ధనుడు అని భగవంతుడు పిలువబడుతూ ఉన్నాడు ఓ జనార్ధన అని సంబోధించి చెబుతున్నాడు.
(03:32) ఈ దుర్యోధనాదులు దురాశాపరులు అందుకే వీళ్ళ బుర్ర చెడిపోయింది కనుకనే వంశనాశనం చేయటం దోషమని కానీ మిత్రులను నమ్మించి మోసం చేయటం పాపమని గాని వాళ్ళకు తెలియకుండా ఉన్నది. అంతమాత్రం చేత ఆ తప్పులే మనం చేయాలా అవి తప్పులని పాపాలని మనకు తెలుస్తోంది కదా తెలిసినాక ఆ తప్పుడు దారి నుండి ఎందుకు వెనక్కి రాకూడదు అని చెప్పేసి అర్జునుడు అంటూ ఉన్నాడు.
(04:02) దుర్యోధనాదులు ఇవన్నీ కూడా తప్పులని తెలియక చేశారు మనకి తెలుసు కదా మనం ఎందుకు చేయాలి అని అన్నా ఇక్కడ మనం చూసుకుంటే కనుక యుద్ధం చేయడం ఆ యుద్ధంలో బంధువులు మిత్రులు గురువులు లేకపోతే పితామహులు మొదలైనటువంటి వాళ్ళను చంపడము తప్పు పాపము అని అర్జునుడు భావిస్తూ ఉన్నాడు తర్వాత అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెబుతాడు నువ్వు తప్పు అని అనుకోకూడని దాన్ని తప్పు అనుకుంటూ ఉన్నావు అని చెప్పేసి మందలిస్తాడు దుర్యోధనుడికి ఏమి తెలియక కాదండి దుర్యోధనుడు చెబుతాడు ఒక సందర్భంలో నాకు ఏది ధర్మమో తెలుసు ఏది అధర్మమో కూడా తెలుసు అయినప్పటికీ కూడా నా యొక్క మనసు
(04:40) అధర్మం వైపే పయనిస్తూ ఉన్నది అని స్పష్టంగా చెబుతాడు ఆయన కావున దుర్యోధనుడు ఏమి తెలియక చేయటం లేదు తెలియక చేస్తున్నాడు అని అర్జునుడు భావిస్తూ ఉన్నాడు మోహం చేత ఇంకా చెబుతున్నాడు కులక్షయే ప్రణస్యంతి కులధర్మ సనాతనాః ధర్మే నష్టే కులం కృత్సనం అధర్మోభిభవత్ుత ఇన్నిసార్లు కులం కులం అని వస్తే ఏ కులం అండి అని చెప్పేసి అడిగారు.
(05:05) కులం అనేటటువంటి సంస్కృత శబ్దానికి అర్థం వంశం దృష్టిలో పెట్టుకోండి మనం నేడు పెట్టుకునేటటువంటి ఏ కులము కూడా వేదంలో లేదు నాలుగు వర్ణాలు మాత్రమే వేదంలో ఉంటాయి భగవద్గీతలో నాలుగు వర్ణాలు మాత్రం ఉంటాయి ఒక్క కులం ఉండదు ఇక్కడ కులం అంటే వంశం మాత్రమే అర్థం దృష్టిలో పెట్టుకోండి భగవద్గీతలో ఎక్కడ కులం వచ్చినా వంశమే ఆ విధంగా అర్జునుడు ఏమంటూన్నాడు అంటే ప్రతి వంశానికి కూడా కొన్ని అనుూచాన ఆచారాలు ఉంటాయి అంటే తరతరాలుగా గా వచ్చేటటువంటి ఆచారాలు ఉంటాయి.
(05:39) అవి ఆ వంశంలో ఉన్నటువంటి వృద్ధుల మీద ఆధారపడి ఉంటాయి. వంశంలో పెద్దవాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళ మీద ఆధారపడి నడుస్తూ ఉంటాయి. వంశంలోని ప్రధాన పురుషులందరూ కూడా యుద్ధంలో చనిపోతే ఆ వంశం ఇంచుమించు నాశనం అయపోయినట్టే లెక్క. అలా వంశనాశనం అయిపోతే వంశ ధర్మాలన్నీ కూడా భ్రష్టం అయిపోతాయి. ధర్మం భ్రష్టమైపోతే కనుక వంశంలోని జనం తటస్థంగా ఉండరు ఆ వంశంలోని ప్రజలను అధర్మం ఆక్రమించి తీరుతుంది.
(06:10) అర్జునుడి యొక్క భయంలో తప్పులేదు అర్జునుడి యొక్క భయంలో తప్పులేదు అతని విశ్లేషణ అతని వైపు నుండి కూడా బాగానే ఉంది కానీ ఇది సకాలం కాదు అకాలం ఇది సకారణం కాదు అకారణం ఇది మాత్రమే కృష్ణ పరమాత్మ తప్పుపడతాడు. ఇక్కడ యుద్ధంలో భాగంగా యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళను యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు అర్జునుడికి ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కూడా అధర్మపరులు అధర్మంతో చేరిన వాళ్ళు కూడా అధర్మపరులే కృష్ణుడు అదే మాట అంటాడు చివర్లో కర్ణుడు మరణించే సమయానికి ఏమంటాడంటే కర్ణుని ఉద్దేశించి నువ్వు చేసినటువంటి పాపాలు ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటికీ మించినటువంటి పాపం ఏమిటో
(06:52) తెలుసునా నువ్వు అధర్మ పరుల చెంత చేరావు కావున నువ్వు నశించాల్సిందే అని కృష్ణ కృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పేసాడు ఏ విధంగా అయితే ఇనుమును చేరినటువంటి నిప్పుకు సమ్మెట పోటు తప్పదో అంతే కదండీ ఇనుమును వంచడానికి ఏం చేస్తారు అంటే గనుక ఇనుమును బాగా కాలుస్తారు కాల్చి కొడుతూ ఉంటారు అప్పుడు అది వంగుతుంది లేకపోతే వంగదు అక్కడ కొడుతున్నది ఇనుమును మాత్రమే అగ్నిని కాదు అగ్నిని కొట్టాలి అనే ఉద్దేశం కూడా ఆ కర్మ చేసేవాడికి ఉండదు పాపం కానీ ఇనుముతో చేరినటువంటి అగ్నికి కి ఆ పోటు తప్పదు అదేవిధంగా అధర్మ పరులతో చేరినటువంటి నీకు ఈ యొక్క నాశనం అనేది
(07:34) తప్పదు ఈ శిక్ష అనేది తప్పదు అని స్పష్టంగా చెప్పేస్తూ ఉన్నాడు. ఆ విధంగా కౌరవుల పక్షాన మనం చూస్తే కనుక ద్రోణాచార్యుడో భీష్ముడో వాళ్ళలో చాలా మటుకు ధర్మం ఉన్నప్పటికీ కూడా ఒక 10 15 శాతం 20 శాతం వాళ్ళు అధర్మం వైపు ఉన్నట్టు కనిపించినప్పటికీ కూడా వాళ్ళ ముఖ్యమైనటువంటి తప్పు ఇదే అధర్మం వైపు ఉండడము ఏ మొహమాటమో పడకుండా వాళ్ళు ధర్మం వైపుకు వచ్చేసి ఉంటే వేరేగా ఉండేది.
(08:02) ఆ మొహమాటమో లేకపోతే ఏదో ఒక కృతజ్ఞత చూపాలనో రకరకాల ఉద్దేశాలతో వాళ్ళు అటే ఉండిపోయారు అదే వాళ్ళు చేసినటువంటి తప్పు కావున అలాంటి వాళ్ళందరినీ కూడా యుద్ధంలో ధర్మబద్ధంగా వేదం విధించిన విధంగా చంపడం తప్పు కాదు కాబట్టి అలాంటి సందర్భంలో వచ్చి నిలబడినటువంటి అర్జునుడు ఇలా మాట్లాడడం సరి అయినది కాదు అని కృష్ణ పరమాత్మ తరువాత చెబుతాడు ఇప్పుడు కాదు ఇవన్నీ ఆలోచి చంచవలసింది అని అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసువార్ష్నేయ జాయతే వర్ణ సంకరః వంశంలోకి కనుక ఇందాక చెప్పినట్టు అధర్మం ప్రవేశిస్తే ముందుగా స్త్రీలు చెడిపోతారు అన్నాడు వారు
(08:48) చెడిపోతే వెంటనే వర్ణ సంకరం ఏర్పడుతుంది అన్నాడు ఇదంతా కూడా యుద్ధం తరువాత వచ్చేటటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి అని ముందే ఊహిస్తున్నాడండి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇదంతా కూడా అర్జునుడు చూస్తూ ఉన్నది. ఏమంటాడు యుద్ధంలో చనిపోయే వాళ్ళందరూ కూడా పురుషులే ఉంటారు మహాభారత యుద్ధంలో పాల్గొని చనిపోయిన వాళ్ళంతా పురుషులే ఉంటారు స్త్రీలు ఎవరూ కూడా యుద్ధం చేయడానికి రారు ఆ వచ్చినటువంటి వాళ్ళలో మహాభారత యుద్ధంలో పాల్గొన్న వాళ్ళలో స్త్రీలు ఎవ్వరూ లేరండి శిఖండి మాత్రం కొంత విచిత్రమైనటువంటి పరిస్థితి కారణ జన్ముడు పక్కన పెట్టేసేయండి కానీ మహాభారత
(09:28) యుద్ధంలో స్త్రీలు ఎవ్వరూ లేరు ఉన్నవాళ్ళందరూ పురుషులే ఎవ్వరు మరణించినా కూడా వాళ్ళ భార్యలు వితంతువులు అయిపోతారు కదా తద్వారా అనేక ఇబ్బందులు భవిష్యత్తులో ఉంటాయి కదా అని చెప్పేసి అర్జునుడు చెబుతాడండి. మనం చూసుకుంటే యుద్ధంలో పాల్గొనే వాళ్ళలో యుక్త వయస్కులు ఎక్కువ ఉంటారున్నమాటండి భార్యలు ఉన్నటువంటి యుక్త వయస్కులైన భర్తలు మరణిస్తే లక్షలాదిగా అలాంటి సమాజంలో పరిస్థితులు ఎలా ఉంటాయి అర్జునుడు ఊహించడంలో తప్పేం లేదు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆయన ఊహించి చెప్పాడు.
(10:00) కృష్ణ పరమాత్మ అయినా ఇది తప్పదు అని చెబుతాడు ఆ విధంగా వంశంలోకి అధర్మం ప్రవేశిస్తే కనుక ముందుగా స్త్రీలు చెడిపోతారు వారు చెడిపోతే వెంటనే మరణ సంకరం ఏర్పడుతుంది అన్నాడు ఇక్కడ మనం చూడవలసింది ఏమిటంటేనండి స్త్రీలను తక్కువ చేయలేదు స్త్రీలను రక్షించుకోవాలి అని చెబుతూ ఉన్నాడు. భర్త లేకపోతే కనుక స్త్రీలు ఒంటరిగా ఉండవలసి వస్తే కనుక ఆ స్త్రీ పిల్లల్నో కుటుంబాన్నో రక్షించుకోవడం కోసం ఎవరినైనా ఆశ్రయించవలసి వస్తే ఈ విధంగా తప్పుల మీద తప్పులు జరుగుతాయి అని అర్జునుడు భయపడ్డాడు అంతకుమించి ఇంకేం లేదు స్త్రీని మనం రక్షించుకోవాలి కదా అన్నాడు నేటి
(10:40) రోజుల్లో కూడా మనం గట్టిగా ఆలోచించవలసింది ఇదేనండి సనాతన ధర్మంలో హిందువుల్లో స్త్రీలను రక్షించుకోవాలి లవ్ జిహాద్ పేరిట హిందూ అమ్మాయిలు ఇతర మతాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళకు అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి పరిణామాలు తెలియటం లేదు నా అబ్దుల్ మంచివాడు నా రెహ్మాన్ మంచివాడు అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు.
(11:05) హిందువులు ఖచ్చితంగా అమ్మాయిలని కాపాడుకోవాలి. తల్లిదండ్రులు అర్జెంట్ గా చేయవలసిన పని ఇదే మీ అమ్మాయిలని కాపాడుకోండి. హిందువులకే ఇచ్చి పెళ్లి చేయండి. వర్ణ సంకరం కూడా చేయకండి వర్ణ ధర్మాలు పాటించండి అప్పుడు మాత్రమే ధర్మం నిలబడుతుంది అని భగవద్గీతలో మనకు అర్థంవుతున్నదండి భగవద్గీతలో అర్జునుడి భయాలు ఒకఇంతవరకు నిజమే ఒక అమ్మాయి కనుక మన ధర్మం నుండి అలా పాషండ మతంలోకి వెళ్ళిపోతాయి కనుక ధర్మంలో ఒక పాలు తగ్గిపోయినట్టు లెక్క ఒక కుటుంబానికి ఒక ఇంటికి యజమాని ఎవరండి అమ్మాయి కదా స్త్రీ కదా ఇటుకలతో కట్టేస్తే ఇల్లు కాదు ఇల్లాలు ఉంటేనే ఇల్లు ఇల్లు అన్నారు ఎంత పెద్ద
(11:46) విల్లా కట్టండి ఎంత పెద్ద భవనం కట్టండి ఉండేది అందరూ మగవాళ్ళ అయితే దాన్ని ఇల్లు అంటారా అండి ఇల్లాలు ఉంటేనే ఇల్లు అంటారు. కావున ఇల్లాలిని కాపాడుకోవాలి ఇల్లాళ్ళను కాపాడుకోవాలి. పాషండమతాల్లోకి వెళ్ళకుండా మనం చూసుకోవాలి. ఆ విధంగా ఇంకా ఇంకా అర్జునుడు తన భయాలను చెబుతూ సంకరో నరకాయైవ కులగనాం కులస్యచ పతంతి పితరోయేషాం లుప్త పిండోదక క్రియాహ నాతో చాలామంది అడుగుతూ ఉంటారు ఏవండీ మా ఇంట్లో కొంచెం ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారండి ఫలానా వాళ్ళు అది పర్వాలేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు దాని గురించి ఇక్కడ చెబుతున్నాడు వర్ణ సంకర వివాహము అనేది ధర్మశాస్త్రం ప్రకారం
(12:29) తప్పు దృష్టిలో పెట్టుకోండి వర్ణ సంకరం అంటూ ఏర్పడితే కనుక దానికి కారకులైనటువంటి వంశనాశకులు ఎవరున్నారో వాళ్ళు వాళ్ళ వంశాలు కూడా నరకంపాలే అయిపోతారు ఎందుకంటే ఈ వంశాలలో పితృ దేవతలకు పిండాలు పెట్టేవాళ్ళు ఉదక తెల తర్పణాదులు చేసేవాళ్ళు లేకుండా పోతారు. వర్ణ సంకరం కనుక జరిగితే ఆ తర్వాత వాళ్ళకు పుట్టే పిల్లలు కానీ వాళ్ళు కానీ చేసేటటువంటి పితృ కార్యక్రమాలు చెల్లవు అని మనకు ధర్మశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి.
(13:02) అందువల్ల చాలామంది పెద్దవాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు జరగకుండా కానీ ఇంకో తప్పు కూడా చేస్తారు ఏమిటో తెలుసునండి చిన్నప్పటి నుండి పెళ్లి వయసు వచ్చేంతవరకు పెద్దగా ఏమి ధర్మాలు చెప్పరు పెద్దగా ఏ నియమాలు బోధించరు సరిగ్గా పెళ్లి వచ్చేసరికి మా కులమే మా శాఖే అని చెప్పేసి పేచి పెడతారు ఎవరిది తప్పు కావున చిన్నప్పటి నుండి చెప్పాలి హిందూ ధర్మం అంటే ఏమిటో చెప్పాలి వైదిక ధర్మం అంటే ఏమిటో చెప్పాలి వర్ణం అంటే ఏమిటో చెప్పాలి వర్ణ వ్యవస్థ అంటే ఏమిటో చెప్పాలి వరణశంకర వివాహం కనుక చేసుకుంటే తరువాత పుట్టేటటువంటి పిల్లలు వీళ్ళతో సహా ఈ
(13:38) అబ్బాయితో సహా వాళ్ళతో సహా వాళ్ళు పెట్టేటటువంటి పితృ కార్యక్రమాలు చెల్లవు దాని వల్ల ఏమవుతాయి అని కూడా మళ్ళీ చెబుతూ ఉన్నాడు కనుక పరంపరగా ఆ వంశంలోని జీవులంతా కూడా నరకానికే వెళ్ళిపోతారు. అలా వెనుకటి తరాల పితృ దేవతలు అంతా నరకం పాలే కనుక అయితే వారి వంశంలో పుట్టబోయే జీవులకు ఆశీస్సులు ఇస్తూ వారి మంచి చెడ్డలను ఊర్ద్వ లోకాల నుంచి పర్యవేక్షించగల పుణ్యవంతులైన పితృ దేవతల అనే వాళ్లే మిగలకుండా పోతారు దానివల్ల ఆ వంశాలలో ఉత్తరోత్తరా జన్మించబోయేవారు మరింత పాపాత్ములు అవుతారు.
(14:21) ఎంత చక్కగా చెబుతున్నాడో చూడండి అర్జునుడు చెప్పినవి నిజాలే దృష్టిలో పెట్టుకోండి అర్జునుడు చెబుతున్నవి సత్యాలు కాకపోతే ఇది సందర్భం కాదు అంటాడు కృష్ణ పరమాత్మ ఇవన్నీ కూడా ధర్మపన్నాలు వల్లించవలసింది ఇప్పుడు కాదు నువ్వు ఇవన్నీ కూడా ఈ సందర్భానికి వర్తించవు అని చెబుతున్నాడు ఆయన దోషైరేతై కులఘనాం వర్ణ సంకర కారకైహి ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాస్ట శాశ్వతాః వంశ వినాశనకర్తలు చేసే తప్పుడు పనులు అన్నీ కూడా వర్ణ సాంకర్యానికే దారి తీస్తాయి.
(14:53) అలాంటి దురాత్ముల దుశ్చర్యల వల్ల ఎప్పటి నుంచో వస్తున్నటువంటి జాతి ధర్మాలు వంశ ధర్మాలు కూడా కూకటి వేళ్ళతో సహా కూలిపోతాయి అని చెబుతూ ఉన్నాడండి. కులధర్మాలు అనిఅంటే వంశ ధర్మాలు వంశ ధర్మాలు అనేవి చాలా గొప్పవండి ఇంట్లో ఒక ఆచారం ఉంటుంది పరంపరగా వచ్చేది అది పోతే కనుక చాలా కష్టం అందువల్ల ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మనం మన ఆచారాలు ఏమిటి అని తెలుసుకుని రాసుకుని నిక్షిప్తం చేసుకుంటూ ఉండాలి.
(15:24) అంతేకానీ పెద్దవాళ్ళని పనికి రాని వాళ్ళలాగా మూల కూర్చోబెట్టకూడదు. ఖచ్చితంగా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరున్నారు 70 ఏళ్ల వాళ్ళు 80 ఏళ్ల వాళ్ళు 90 ఏళ్ల వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్లి మనకు మాత్రమే ఉన్నటువంటి ఆచారాలు ఏమిటి ఇవన్నీ కూడా రాసుకుని తెలుసుకుంటూ ఉండాలి కాపాడుకుంటూ ఉండాలి అదే చెబుతూ ఉన్నారు వంశ ధర్మాలు చాలా ముఖ్యమైనవి కదా అని చెప్పేసి ఆ తర్వాత ఉత్సన్న కుల ధర్మాణం మనుష్యాణం జనార్ధన నరకే నియతం వాసః భవతిత్యనుశుశ్రమ ఓ జనార్ధన వంశ ధర్మాలు నశించిపోయినటువంటి వంశ లలో జన్మించినటువంటి మనుషులకు శాశ్వత నరక నివాసం తప్పదు అని ధర్మశాస్త్రవేత్తలు
(16:04) చెప్పగా వింటూ ఉన్నాము. వంశ ధర్మాలు అంత ముఖ్యం వాటిని కాపాడుకోవాలి వంశ ధర్మాలు నశించిపోయిన తర్వాత ఆ వంశాల్లో పుట్టినటువంటి వాళ్లకు నరకవాసం వచ్చేస్తుంది. కావున కాపాడుకుంటూ ఉండాలి. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితాభయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజన ముద్యతాః అయ్యయ్యో ఎంత పని చేస్తున్నాం మనం రాజ్య సుఖాల మీది దురాశతో మనం మనవాళ్ళనే చంపుకోవడానికి సిద్ధమయ్యాం అవురా ఎంత పాపానికి ఉడిగట్టాము అని అంటున్నాడండి యదిమామ ప్రతీకాశం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుహ తన్మే క్షేమతరంభవేతు నేను ఆయుధాలు వదిలేస్తాను అంతేకాక నన్ను
(16:51) కొట్టే వారి మీద తిరగబడను అలాంటి స్థితిలో ఉన్న నన్ను రకరకాల ఆయుధాలను ధరించినటువంటి కౌరవులు ఈ యుద్ధరంగంలో చంపేసినా కూడా అది నాకు ఇష్టమే అదే నాకు ఉత్తమ క్షేమము అని అన్నాడండి ఇక్కడ మనం మరొక అంశాన్ని గమనించాలి. అర్జునుడు యుద్ధరంగాన్ని విడిచిపెట్టి పారిపోతాను అని చెప్పటం లేదు. అది దోషం క్షత్రియులకు మహా దోషం అది అలా చెప్పటం లేదు యుద్ధ రంగంలోనే ఉంటాను కానీ యుద్ధం చేయను నిలబడి ఉంటాను లేకపోతే కూర్చున ఉంటాను ఎవ్వరు నన్ను ఏం చేసినా కొట్టినా చంపినా కూడా పట్టించుకోను అని చెబుతూ ఉన్నాడు ఒక రకంగా ధర్మాన్ని పాటిస్తున్నట్లు తాను భావిస్తున్నాడు కానీ
(17:32) కాదు తర్వాత అధ్యాయాల్లో తెలుస్తుంది మనకి సంజయ ఉవాచా ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్త ఉపావిషత్ విసర్జ్యసశరంచాపం శోక సంవిగ్నమానసః ఓ ధృతరాష్ట్ర ఆ యుద్ధరంగంలో అర్జునుడు ఇలా పలికి ధనుర్బాణాలు పక్కన పడేసి దుఃఖంతో మనసంతా కల్లోలమైపోగా నిర్వీర్యుడై నీరస పడిపోయి రథంలో కాళ్ళు పెట్టుకునే చోట చతికిల పడిపోయాడు ఇది అర్జునుని యొక్క పరిస్థితి అండి తరువాతి అధ్యాయంలో చూస్తే కృష్ణుడు మామూలుగా వడ్డించడు అసలు ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమిటి గత అవమానాలు ఏమిటి వీళ్ళ అధర్మాలు ఏమిటి
(18:17) మీ ధర్మాలు ఏమిటి ధర్మరాజు ఏమిటి ధర్మ యుద్ధం ఏమిటి ఇవేమి పట్టించుకోకుండా కుటుంబ భావోద్వేగాలకు నువ్వు బానిసవైపోతావా అని చెప్పేసి కృష్ణ పరమాత్మకు చాలా కోపం వస్తుంది ధర్మాగ్రహం పరమాత్మకు ఆగ్రహము అంటే మనలాంటిది కాదు కదా ధర్మాగ్రహం ఆ ధర్మాగ్రహంతో కృష్ణ పరమాత్మ ఏం మాట్లాడబోతూ ఉన్నాడు రెండవ అధ్యాయంలో లో మనకు కనిపిస్తుంది ఇది శ్రీ మహాభారతే శత సాహస్రియాం సంహితాయాం వయ్యాసిక్యాం భీష్మ పర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగోనామ ప్రథమోధ్యాయః
(19:05) ఇది భగవద్గీత మొట్టమొదటి అధ్యాయం మూడవ భాగం ఉపన్యాసం అండి తదుపరి రి భాగంలో రెండవ అధ్యాయం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ద్వితీయ అధ్యాయం సాంఖ్య యోగం అండి చాలా ముఖ్యమైనది భగవద్గీత 18 అధ్యాయాల్లోనూ కూడా సాంఖ్య యోగం అతి ముఖ్యమైనది అని పెద్దలు చెబుతున్నారు తప్పక వినండి ఈ యొక్క భాగం మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి స్వస్తి
No comments:
Post a Comment