ఇస్లామ్ రాక ముందు ఆఫ్గనిస్థాన్ ఎలా ఉండేదో తెలుసా | pre islamic history facts | trending bharat
Author Name:Trending Bharat Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@trendingbharath
Youtube Video URL:https://www.youtube.com/watch?v=QkhlbPEsk6A
Transcript:
(00:00) ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు [సంగీతం] ఈ పేరు చెప్తే తాలిబాన్లు అరాచక శక్తులు ఇవన్నీ గుర్తొస్తాయి కానీ ఇస్లామిక్ దండయాత్రలకు ముందు గాంధార రాజ్యం అని పిలిచే ఆఫ్ఘనిస్తాన్ ఒక సుసంపన్న హైందవ రాజ్యం భారత్ పై దురాక్రమణలు చేసేందుకు [సంగీతం] ఇస్లామిక్ మూకలకు ఆ తర్వాత కాలంలో ఆఫ్ఘనిస్తాన్ అడ్డాగా మారిపోయింది. మరి ఇస్లామిక్ దండయాత్రలకు ముందు గాంధార రాజ్యం చరిత్ర ఎంత గొప్పదో వివరంగా తెలుసుకుందాం.
(00:28) గాంధారం ఈ చరిత్ర ఇప్పటిది కాదు మహాభారత కాలం నుంచి ఉన్న చరిత్ర చంద్రవంశంలోని యయాతి వారసుల్లో యదువంశీకులు శ్రీకృష్ణుడి వంశమని కురువంశీకులు కురు వంశమని మనకు తెలుసు. ఆ యయాతి వారసుల్లో రెండోవాడు మూడోవాడు దుర్వసు దృహ్య వీరి వంశాలకు యయాతి రాజ్య బహిష్కరణ విధించాడు. వారిలో కొందరు ఇప్పటి ఆఫ్ఘానిస్తాన్ ప్రాంతంలో స్థిరపడ్డారు. అక్కడి నుంచి గ్రీస్ వరకు విస్తరించిన వారే శకులు యవ్వనులు.
(00:55) వీరిలో దృహ్య వంశంలో ఐదో తరం రాజు గాంధారుడు. ఆ గాంధారుడు అప్పటి భరతఖండ సరిహద్దుల్లో పాలించిన రాజ్యమే గాంధార రాజ్యంగా ప్రసిద్ధి చెందింది. [సంగీతం] అప్పటి గాంధార అనే పేరే ఇప్పటి గాంధహార్ పేరు కూడా పెద్దగా మారలేదు. ఈ గాంధార వంశంలోనే మహాభారత కాలానికి పాలిస్తున్న రాజు సుబల. అతని కుమారుడు శకుని కుమార్తె గాంధారి వీరిద్దరూ అందరికీ తెలిసినవారే గాంధార రాజ్యానికి యువరాణి కాబట్టి ఆమెకు గాంధారి అని పేరు వచ్చింది.
(01:24) యయాతి కాలం నుంచి వస్తున్న శత్రుత్వం వల్ల కురు వంశీకులకు గాంధార వంశీకులకు తరతరాల శత్రుత్వం ఉంది. భరత ఖండానికి ముఖద్వారం శత్రువుల సులువుగా చొరబడగల సున్నితమైన ప్రాంతం గాంధార [సంగీతం] రాజ్యం. అలాంటి రాజ్యం తమ ఆధీనంలోకి రావాలని భీష్ముడు అనుకున్నాడు. అప్పటికే అంధుడైన ధృతరాష్ట్రుడికి ఏ మహారాజు తన కుమార్తెను వివాహానికి ఇవ్వటం లేదు.
(01:47) అలాంటి పరిస్థితుల్లో తమ శత్రువుని తెలిసి అప్పటికి హస్తినాపురం వైభవంతో పోలిస్తే చిన్న రాజ్యమే అయిన గాంధారంతో భీష్ముడు వియ్యం కుదిర్చాడు. అలా ధృతరాష్ట్రుడి భార్యగా గాంధారి వచ్చింది. గాంధారి మహా పతివ్రత భర్త అంధుడని తెలిసి తాను అంధురాలిగా బతకాలనుకుంది. జీవితాంతం కళ్ళకు గంతలు కట్టుకొని భవిష్యత్తులో కూడా ఎవరూ చేయలేని త్యాగం చేసింది. ఆమె వల్లే గాంధార రాజ్యానికి గొప్ప ఖ్యాతి వచ్చింది.
(02:12) గాంధార యువరాజు శకుని తరతరాలుగా ఉన్న శత్రుత్వంతోనే హస్తినాపురానికి సోదరితో అడుగుపెట్టాడు. మేనల్లుడైన దుర్యోధనని ఉసిగొలిపి ఒక మహా యుద్ధానికి కారణం అవ్వడం మనకు తెలిసిన మహాభారతం అంటే మహాభారత యుద్ధానికి మొదటి అడుగు పడిన ప్రాంతం గాంధార దేశం. హస్తినాపురం సామంత రాజ్యం అవ్వడం వల్ల గాంధారం సుసంపన్నంగా వెలిగిన రాజ్యం అంతటి అద్భుతమైన చరిత్ర కలిగిన ప్రాంతం గాంధారం.
(02:39) మహాభారత యుద్ధం తర్వాత శకునితో సహా అతని కుమారుడు ఉలూక ఇతర బంధువులు అందరూ చనిపోయారు. కానీ శకుని చిన్న కుమారుడు మాత్రం గాంధారంలోనే ఉన్నాడు. అతని పేరు కూడా శకుని తండ్రి పేరైన సుబల. అతనే భారత కాలం తర్వాత గాంధార రాజ్యాన్ని యుధిష్టర సామంతుడిగా పాలించాడు. శకుని వంశీకులు గాంధారాన్ని చాలా కాలం పాలించారు. ఆ తర్వాత కాలంలో స్థానిక రాజులు గాంధారాన్ని పాలించారని ప్రాచీన చరిత్ర గ్రంథాలు చెబుతున్నాయి.
(03:05) యవ్వనులు, శకులు వీరందరు తీవ్రంగా దురాక్రమణలు చేసిన రాజ్యం గాంధారం. అయినా మన చక్రవర్తులు వారందరినీ తరిమేశారు. చుట్టూ ఎత్తైన పర్వతాలతో దుర్భేద్యంగా ఉండే రాజ్యం గాంధారం ఇస్లామిక్ దురాక్రమణకు ముందు వరకు గాంధారం లేదా నేటి ఆఫ్ఘనిస్తాన్ భరత ఖండంలో అంతర్భాగం వైదిక సంస్కృతితో వైభవంగా వెలిగిన ప్రాంతం. గాంధార రాజ్యానికి అప్పట్లో రాజధాని పురుషపురం. అదే నేటి పెషావర్.
(03:32) శ్రీరాముడి సోదరుడు భరతుడు తన కుమారుడైన తక్ష పేరు మీద నిర్మించిన తక్షశిల కూడా ఈ ప్రాంతంలోనే ప్రఖ్యాత విశ్వవిద్యాలయంగా వర్ధిల్లింది. ఒకప్పుడు వేద విద్యలతో అద్భుత జ్ఞానంతో ఎందరో మేధావులతో ప్రకృతి సౌందర్యంతో నాటి గాంధారం వర్ధిల్లింది. అంతటి గొప్ప చరిత్ర ఉన్న గాంధారం ఉగ్ర మూకల అడ్డాగా మారడానికి కారణం ఇస్లామిక్ దురాక్రమణాలు.
(03:56) ఆనాటి గాంధార రాజ్యం వైభవానికి చెప్పేందుకు వేరే ఆధారాలు ఏవి అవసరం లేదు. వేదంలోనే గాంధారం ప్రస్తావన ఉంది. అప్పటికి ఆ ప్రాంతం పేరు కుభానగరి. ఋగ్వేదంలో 10వ మండలంలో 75వ సూక్తంలో ఒక ప్రసిద్ధ మంత్ర సూక్తం ఉంది. ఆ సూక్తాన్ని చాలామంది వినే ఉంటారు. ఈ సూక్తంలో అన్ని నదుల పేర్లు ఉంటాయి. ఆ మంత్రం ఏమిటంటే ఇమమే గంగే యమునే సరస్వతి సతుద్రి స్తోమం సచతా పురుష్ణయ అసిజ్ఞ మరుద్వృదే వితస్తయ అర్జీకియే సుణహ్వా సుషోమయ తృష్ణమయ ప్రథమం యాతనే సజోహు సుసత్వా రసయ స్వేత్య త్యా తం సింధో కుభయ గోమతీం కృమం మేహాత్వ సరధం యాభిరీయసే ఇది ఆ సూక్తం ఈ సూక్తంలో చెప్పిన నదుల పేర్లు వరుసుగా చూద్దాం.
(04:42) ఇందులో గంగా యమునా సరస్వతి మనకు తెలిసిన నదులే సతుద్రి ఇప్పటి సట్లెజ్ నది పరుష్ని ఇప్పటి రావి నది అసిక్ని ఇప్పటి చీనాబ్ నది మరుద్వృధ ఇది చీనాబ్కి ఉపనది వితస్త అంటే ఇప్పటి జీలం నది అర్జీకియ అంటే ఇప్పటి విపాస నది సుషోమ అంటే ఇప్పటి సోహాన్ నది సింధు నది అందరికీ తెలిసిందే తృష్ణమ ఇప్పటి తీస్తా నది అని చెప్తుంటారు.
(05:10) ఈ సూక్తంలో చివరి రెండు లైన్లలో చెప్పిన నదులు సుసర్తు రస స్వేత్య ఈ మూడు సింధూ నది ఉపనదులే ఇక కుభ గోమతి కృము ఈ నదులన్నీ భరతఖండంలో ఒకే రథం మీద ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తున్నాయని [సంగీతం] ఈ నదీమ తల్లులు తమను కరుణించాలని ఈ మంత్రసూక్తం అర్థం. ఈ నదుల్లో చివర చెప్పిన కుభా నదే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న కాబూల్ నది.
(05:36) కుభ అనే పదమే కాబూల్ అయింది. వేదకాలానికి గాంధారం పేరు కపిస. అక్కడి గొప్ప నదుల్లో ఒకటి కుభ. ఆ పక్కనే ఉన్న నగరం కుభా నగరి అదే ఇప్పటి కాబుల్ ఆనాడు కుభా నది కూడా భరతఖండంలో భాగమని చెప్పేందుకు తిరుగులేని సాక్ష్యం ఈ ఋగ్వేద సూక్తం. హిందూకుష్ పర్వత శ్రేణుల నుంచి ప్రవహించే కాబూల్ నదీ తీర ప్రాంతంలో నివసించే ప్రజలే కాబోలీలుగా ప్రసిద్ధి చెందారు.
(06:01) ఇస్లామిక్ దురాక్రమణలు అత్యంత క్రూరంగా మతమార్పిడులు, దోపిడీలు, అకృత్యాలు వీటివల్ల ఒకప్పటి గాంధారంలో వైదిక సంస్కృతి అనేది ఆడవాళ్ళు కూడా లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. హైందవంతో పాటు అక్కడ వైభవంగా విస్తరించిన బౌద్ధాన్ని కూడా అక్కడ దురాక్రమణదారులు మిగలనీయలేదు. ఒకప్పుడు గాంధారం నుంచి అరబ్ వరకు మేలు రకం గుర్రాలు దొరికేవి. అప్పట్లో అది పెద్ద వ్యాపారం అందుకే గాంధారాన్ని అశ్వగణస్థానం అనేవారు అదే ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ అయింది.
(06:28) అరబ్ అనే పదానికి మూలం కూడా అశ్వం నుంచే వచ్చింది. కుషానుల కాలంలో గాంధారంలో బౌద్ధం విస్తరించింది. కుషానుల పతనం అయ్యాక మూడవ శతాబ్దం నుంచి తొమ్మిదవ శతాబ్దం వరకు గాంధారాన్ని పాలించిన వీరులు షాహీ వంశస్తులు చాలామంది ఈ షాహీ వంశస్తులు ముస్లిం రాజులు అని అనుకుంటారు కానీ అది పొరపాటు షాహీ అంటే రాయల్ అని అర్థం షాహీ అంటే రాజు అని అర్థం ఇది పర్షియన్ పదం అప్పట్లో కొంత కాలం పాటు గాంధారం పర్షియా సరిహద్దు రాజ్యాలను పర్షియన్ టర్క్కులు పాలించేవాళ్ళు వీరిని టర్క్ షాహీలు అనేవారు వీరు అప్పటి తుర్కిస్తాన్కి చెందిన వాళ్ళు అదే ఇప్పటి టర్క్ కి భాషలపై
(07:04) ఆయా ప్రాంతాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని మనకు తెలిసిందే. అలాగే టిబెట్ సరిహద్దుల్లో పాలించే రాజులు టిబెట్ షాహియా రాజులు. వీరు టిబెట్ మూలవాసులు గొప్ప వీరులు కూడా అలా అక్కడి రాజులకు షాహీ అనే పేరు ప్రఖ్యాతి చెందింది. అందువల్ల అప్పటి గాంధారంలో భాగమైన కపిస, జాబుల్, కాబుల్ రాజ్యాలను పాలించే హిందూ రాజులను హిందూ షాహీలు అనేవారు.
(07:27) షాహీ అన్న పేరు అలా స్థిరపడిపోయింది. ఈ హిందూ షాహీలు అప్పటి గాంధార ప్రాంతవాసులు. ఒకప్పుడు మౌర్యులు సుంగులు సమ్రాట్ విక్రమాదిత్యకు సామంతులుగా ఉన్న స్థానిక రాజులే ఆ తర్వాత గాంధార రాజ్యానికి స్వతంత్ర రాజులయ్యారు. వీరే హిందూ షాహీలు. ఈ హిందూ షాహీ రాజుల గురించి 630లో భారత పర్యటనకు వచ్చిన చైనా యాత్రికుడు యున్ షాంగ్ ఆ తర్వాత వచ్చిన అల్ బెరూని కూడా తమ గ్రంథాల్లో రాశారు.
(07:52) షాహీ అనే పదానికి చరిత్ర పాఠ్య పుస్తకాల్లో వివరంగా అర్థం చెప్పకుండా షాహీ అంటే ఇస్లామిక్ రాజులే గుర్తొచ్చేలా మన చరిత్ర పాఠాలు రాశారు. ఇప్పటికీ షాహీ అనే పేరు వస్తే ఇస్లామిక్ సుల్తానులనే దాదాపు అందరూ అనుకుంటారు. ఇప్పుడు మనం [సంగీతం] చెప్పుకుంటున్న గాంధార హిందూ శాహీలు అంటే హిందూ రాజులంతా వైదిక ధర్మాన్ని అనుసరించిన వారే.
(08:13) అలాగే అక్కడి బౌద్ధులను చాలా ఆదరంగా చూసేవారు. ఎంతలా అంటే అప్పటి గాంధారంలో ముఖ్య పట్టణమైన భామియాన్లో భారీ బుద్ధ విగ్రహాలను చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఈ విగ్రహాలు నిర్మించినది హిందూ షాహీలు పాలించిన ఆరో శతాబ్దంలోనే ఎవరి ధర్మాన్ని వారు స్వేచ్ఛగా పాటిస్తూ జీవిస్తున్న సమయంలోనే ఇస్లామిక్ దురాక్రమణలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేశయి.
(08:36) ఆ ప్రాంతాన్ని మతోన్మాద రాజ్యంగా మార్చాయి. మూడవ శతాబ్దం నుంచి తొమ్మిదవ శతాబ్దం వరకు గాంధారంలో చాలా ప్రాంతాలను పాలించినది హిందూ శాహీలు అంటే హిందూ రాజవంశాలు కుభా నది తీరాన వెలిసిన మహానగరమే కుభా నగరి అదే ఆ తర్వాత కాబూల్ అయింది. లోఘార్, కపిస జాబాల, కాంభోజ, లాల్పుర, దేహపుర ఇవి అప్పటి గాంధారంలో ప్రఖ్యాత హిందూ రాజ్యాలు. వీటిలో అతి పెద్ద రాజ్యాలు కపిస, జాబాల్.
(09:02) కపిస రాజ్యం 1000 కిలోమీటర్ల పరిధిలో ఉండేదని చైనా యాత్రికుడు యున్ సాంగ్ తన గ్రంథాల్లో రాశాడు. హిందూ కుష్ నుంచి కాశ్మీర్ సరిహద్దు వరకు ఉన్న రాజ్యమంతా కపిస రాజ్యమేనని యున్ సాంగ్ రాశాడు. ఆ తర్వాత ఇస్లామిక్ దండయాత్రలో విఖ్యాత కపిస రాజ్యం అనే పేరే చరిత్రలో కనబడకుండా నాశనమైంది. గాంధార హిందూ శాహీ రాజులు గొప్ప శివభక్తులు.
(09:25) వారు మూడు నుంచి తొమ్మిది శతాబ్దాల మధ్యలో నిర్మించిన పెద్ద పెద్ద శివాలయాల సిధిలాలు ఇప్పటికీ ఆఫ్ఘానిస్తాన్ లో దొరుకుతూనే ఉన్నాయి. ఆనాటి హిందూ శాహీల గురించి ఒక్క పేజీ కూడా మన చరిత్ర పుస్తకాల్లో ఉండదు. ఇస్లాం మతం పుట్టిన వందేళ్లలోనే స్పెయిన్ సహా ఆ చుట్టుపక్కల పెద్ద పెద్ద దేశాలన్నిటినీ నెలల్లో దురాక్రమణ చేసి ఖలీఫా సైన్యాలు ఆ దేశాలను మతరాజ్యాలుగా మార్చేసాయి.
(09:47) కానీ గాంధారాన్ని ఆక్రమించేందుకు మాత్రం ఇస్లామిక్ మూకలకు రెండు శతాబ్దాలు అంటే 200 ఏళ్లకు పైగా పట్టింది. ఈ 200 ఏళ్లలో జరిగిన ప్రతి దురాక్రమణను అక్కడి రాజులు తుక్కు తుక్కు కింద కొట్టారు. వేల మంది సైన్యంతో వచ్చిన దొంగ దెబ్బ తీసినా కూడా గాంధారంలో ఇస్లామిక్ ముక్కలు అడుగు పెట్టలేకపోయారు. అంతలా మన హిందూ శాహీలు గాంధారాన్ని కాపాడారు.
(10:09) వారు ఆనాడు గాంధారాన్నే కాదు యావత్ భరత ఖండాన్ని 200 ఏళ్ల పాటు ఇస్లామిక్ దురాక్రమణల నుంచి కాపాడారు. ఇంత ఘన విజయాలు ఆధునిక చరిత్రకారుల అజ్ఞాన అంధకారానికి కనిపించలేదు. భారత వాయువ్య సరిహద్దుకి అత్యంత కీలకమైన ప్రాంతాలు సింధూ, కపిస, జాబాల రాజ్యాలు. వీటిని దాటి వస్తే ఇక నేరుగా భరత ఖండంలోకి వచ్చేసినట్టే. ప్రస్తుతం ఆఫ్ఘానిస్తాన్ లో ఉన్న జాబూలిస్తాన్ ఒకప్పటి పేరు జాబాల.
(10:34) ఒకప్పుడు యజ్ఞ యాగాలతో ఋషి ఆశ్రమాలతో ప్రఖ్యాత చెందిన ప్రాంతం. పాణిని తన ప్రఖ్యాత అష్టాధ్యాయి గ్రంథాన్ని రచించినది ఈ కుభా నది తీరంలోనే 643 ప్రాంతంలో ఇస్లామిక్ అరబ్బులు పర్షియాను ఆక్రమించారు. అప్పటికే అక్కడ ఉన్న టర్క్ షాహీలను ఇస్లామిక్ సైన్యాలు ఓడించాయి. పర్షియా సరిహద్దు గాంధారం అలా ఇస్లామిక్ రాజ్యం గాంధార రాజ్యమైన ఇప్పటి ఆఫ్ఘాన్ సరిహద్దుల వరకు వచ్చింది.
(11:00) అపరమిత సంపదలు ఉన్న భారత్ ని ఆక్రమించి ఇక్కడ సంస్కృతిని హైందవాన్ని నాశనం చేయడమే ఆనాటి ఇస్లామిక్ దురాక్రమణదారుల ప్రధాన లక్ష్యం. గాంధారాన్ని ఆక్రమిస్తే మిగిలిన భరతఖండంలోకి రావడం సులువు కాబట్టి ఖలీఫాల దుర్మార్గపు చూపులు గాంధార రాజ్యంపై పడ్డాయి. కానీ దాదాపు 200 ఏళ్ల పాటు ఇస్లామిక్ సైన్యాలు గాంధారంలో అడుగు కూడా పెట్టలేకపోయాయి.
(11:22) మన కపిస, జాబుల్, కాబుల్ వీరుల దాటికి ఇస్లామిక్ సైన్యాలు వణకాయి. భారత్లో అడుగు పెట్టాలంటే ఖైబర్, బోలాన్ కనుమల నుంచే రావాలి. కానీ ఆ దారుల్లో అడుగడుగున కాపుకాసి 200 ఏళ్ల పాటు భరత ఖండాన్ని కాపాడిన ధర్మవీరులు ఆనాటి గాంధార హిందూ షాహీ రాజులు మరి రెండు శతాబ్దాల పాటు గాంధారాన్ని కాపుకాసిన ఆ ధర్మవీరులు ఎవరు వారిలో మహావీరుడు రణబలి ఎవరు గాంధారంపై ఇస్లామిక్ దురాక్రమణలకు కారణాలు ఏంటి ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాం. జైహింద్.
(11:55) ఓం
No comments:
Post a Comment